Saturday, 16 November 2019

మారుతిశతకము4

                మారుతిశతకము4
48.పర్వతభేదనున్ పతితపావనభక్తుని బంధమోక్షదున్
పర్వనిశాకరాభయశు పావని రామకధావిధేయునిన్
సర్వరుజప్రకోపహరు శంభుకళాంశజు ఫల్గుణప్రియున్
గర్వవిహీనభావు వెనుకాడక కొల్తు నెడంద మారుతిన్.
49.సన్నుత లోకపూజ్యు కపిసంతతిపుంగవు వజ్రకాయువి
దృన్నుతరామభక్తు కపివల్లభుబంటు జితాహితోత్కరున్
పన్నగభూషణాభనుతభాసురతత్త్వకళాప్రపూర్ణుని
త్యోన్నతసత్యగోచరుపరోత్కరభీకరు గొల్తు మారుతిన్
50.పావనవాయు వంశనుతవార్ధిసుధాకరుప్రాంశుబీజుది
నావను రామభక్తుని నఖాయధుపుచ్ఛహతాసురున్ చిరం
జీవివిమత్సరున్ వినుతశీలు మహాబలు కాంచనాభుసు
గ్రీవునిమంత్రిసత్తముని కీశకులాధిపు గొల్తు మారుతిన్.
51.భీకరవజ్రదంష్ట్రు పరవీరభయంకరు శంభుతేజు న
స్తోకపరాక్రమాభ్యుదయశోభితబాహుయుగున్ మహాబలున్
లోకసమర్చితున్ సకలరోగహరున్ కపికుంజరున్ పరా
నీకమదాపహారి హరి నే భజియింతు కపీశు మారుతిన్.
52.. మేటి వనాట కోటి విభు మేరు సమానసుధీరు వీరు వృ
క్షాట చయే O ద్రు సద్గుణ సమంచిత మర్కట సింహు స్తుత్యభూ
జాటకులావతంసు మహిమాత్ము కపీశు ప్లవంగ రాజు నా
రాటము లేని భక్తి మదిరంజిల నమ్రత గొల్తు మారుతిన్
53.పారావారగభీరు దీప్తివలయప్రాకారు శూరున్ మరు
ద్వారా గార నివాసదేవగణసత్కారాన్వితున్ వానరున్
ధారావాహిక రామనామకలితోద్ధామప్రభాకారు సీ
తారామాభినుతావనీజచరునిన్ ధ్యానింతునమ్మారుతిన్ఱఘ
54.నిరేజోద్భవముఖ్యదేవగణవాణిస్తుత్యసామీరి దు
ర్వారాఖర్వపరాక్రమోజ్జ్వలితసద్భాహుద్వయున్ వాయుజున్
స్మే రోద్భాసితసుందరాస్యు వినుత శ్రీరామ భక్తాగ్రణిన్
మేరూర్వీధరధీరు గొల్తు నెదలో మేకొంచునమ్మారుతిన్.
55.నోరారన్ రఘురామమూర్తిన్ నుతచిన్మూర్తిన్ జితార్తిన్ శుభున్
సారాచారుభజించునక్కపివరున్ సర్వస్తుతాశోత్కరున్
ఘోరాఘప్రకరంబుబాపనెదసంకోచంబులేకెప్పుడున్
ఆరాధింతును భక్తిభావకలితున్ అమ్మాన్యు నమ్మారుతిన్.
56. రౌశీభూత నుతోన్నతాభ్యుద యపారావారపద్మారి త
త్కా శీక్షేత్ర వరాంశ సంభవు పరంధామున్ నుతోద్దాము వా
రాశి ప్రావృతమేదినీ శ్వరవరారాద్యున్  శుభున్  రామభూ
మీశో ద్భాసిత హృత్సరోజు కొలుస్తూ న్నింపార నమ్మారుతిన్ .
57. విపదబ్ధిన్ గడపంగతత్కపి ననిర్వేదాత్ము భక్తోత్తమున్
కపిశార్దూలుని దీర్ఘబాహుశుభునిన్  కారుణ్యమూర్తిన్ హరిన్
విపులప్రాభవవైభవున్ సుగుణసంవేద్యున్ ప్లవంగప్రభున్
అపిధానేతరభక్తితత్పరతనే నర్చించెదన్  మారుతిన్
58.ఫాఫసమౌహకాననవిభాగహుతాశవుసర్వదేవతా
తాపనివారణాభ్యుదయధామగదాధరు ముష్టిఘాతసం
తాపితరాక్షసాధిపవితాను సుతానిలసూను పావనున్
స్థాపితధధర్మజివనులసన్మతిగొల్తుసతంబుమారుతిన్.
59.స్ఫూర్తి నొసంగిజీవనవీభూతికి తద్భవమోహవార్థికిన్
స్ఫూర్తి నడంచిమోక్షణము పొందుగగూర్చెడి రామనామసం
కీర్తనమెప్పుడున్ వీడువకేభజియించెడి వీరుజానకి
భర్తకుప్రాణమైనకపివరేణ్యునిభజింతుమారుతిన్
60.కంజదళాయతాక్షపదకంజములన్ వెనుకంజలేకహృ
త్కంజమునందునిల్పికలకాలముసన్నుతభక్తితత్త్వమున్
పుంజుకొనంగగొల్చునుతపుణ్యుప్రభంజనసూనునే నెదన్
రంజిలుభక్తిభావమలరన్ నిరతంబుభజింతు మారుతిన్.
61.సన్నుతఫల్గుణప్రియుని సర్వసురస్తుతదివ్యసత్కళా
భ్యున్నతునిర్జితాబ్దిమహిమోన్నథభంగసమన్వితున్ స్తుతా
త్యున్నతకామరూపువిజితోద్ధతభీమరిపూత్కరాన్వితున్
విన్నదనంబుపోవమదివేడ్కభజింతుసతంబుమారుతిన్.
62దౌత్య సమార్జితాధిక సుధామ యసుందరసద్యశోధనున్ 
   మత్యమరేశ సద్గురు నుమావరదేవకుమారుతాధ్ధరా 
పత్య నుతాంతరాత్ము పరిపక్వ విభూతికళా నుభూతిసాం 
గత్యసుశోభితున్ గరళకంఠనుతున్ భజియింతు మారుతిన్ .
63.మాకికనీవు ముఖ్యుడవు మాన్యగుణుండవు సర్వదేవతా 
నీకనుతోన్నతాభ్యుదయనేతవు దాతవు రామదూతవ 
న్నక్కకులాభిమానివి వినమ్రుడ వంచు నుతించియిచ్చు మై 
నాకసపర్యగొన్నకపినందను భక్తి భజియింతు మారుతిన్ .
64.అధ్వరమోదితాఖిల సురార్చితభక్త వితానవర్యు  పా 
ర్ధధ్వజు నాశుగాత్మజు ధృతస్తుత రామపదాంబుజున్ నిశీ 
ధాధ్వగసంఘకంజగజు  నారవితేజు  నుతైకజానకి 
సాధ్వి కృపార్జితా భ్యుదయు సత్కపిసింహు భజింతు మారుతిన్ .
  65. .దశరధ బాలు సద్వినుత ధర్మమయై క మనోజ్ఞశీలున
ద్దశ ముఖ కాలు సద్విభవ ధామ సమేత సువర్ణ చేలు నా
శశిధరసన్నుతైక గుణజాలు సుభక్త జనానుకూలు  న
వ్విశ దధ రేశపాలు నెడవేఁడు మహాత్ముగొల్తు మారుతిన్
66.మానితసత్యభామ మణిమండల భూమ నుతేషు దేవస
మ్మానితసద్గుణా భ్యుదయమండితమంజుల వేషు భక్తసం
తానకళా భిలాషు వినుతప్ర ధితాఖిలలోకపోషు న
ద్దానవసంఘశోషు నెడద న్  గను పూజ్యుని గొల్తు మారుతిన్ .
67.శూలిముఖామరేశనుతసుందరదివ్యతనూవిలాసునిన్
లాలితహాసు సద్గుణవిలాసు ప్రసిద్ధకళావిభాసు సం
పాలితదాసుభద్రగిరీవాసుకుజేశునుతావనీశు ను
ద్వేలముదంబుతో కొలుచువీరుని నే భజియింతు మారుతిన్.
68.భండనభీముసూర్యకులవారిధిసోముగుణాభిరాము ను
ద్దండపరాక్రమాభ్యుదయధామునుతోన్నతనాము సన్నుతా
ఖండలముఖ్యదేవహితకాముపూ
దండలపూజచేయుగుణధామునిసత్కపి గొల్తు మారుతిన్.