Tuesday, 31 July 2018

భాస్కర శతకం

                                 భాస్కర శతకం 

1.శ్రీ గల భాగ్య శాలి గడు 

               జేరగ వత్తురు తారు దారెదూ 

రాగమన ప్రయాసమున 

                   కాదట నోర్చియు నైన నిల్వ ను 

ద్యోగము చేసి రత్ననిల 

                     యుండని కాదె సమస్త వాహినుల్ 

సాగరు జేరు టెల్ల ముని 

                     సన్నుత మద్గుణమూర్తి  భాస్కరా!

ఓ భాస్కరా!నదులన్నియు  రత్నాకరుడను నాశతో సముద్రుని జేరు విధాన కల్గిన కష్టాలను సహించి ,నివసించుటకు యత్నించి తమంత తామేప్రేమతో భగవంతుని వద్దకు చేరుదురు.


2.ఉ||అంగన నమ్మరాదు తనయంకెకు రానిమహాబలాఢ్యు వే 

భంగుల మాయలొడ్డి చెఱుపం దలపట్టు వివేకి యైన సా 

రంగధరుo బదంబులు గరంబులు గోయగ జేసె దొల్లి చి 

త్రాంగి యనేకముల్  నుడువరాణికుయుక్తులుపన్ని భాస్కరా!   

పూర్వము చిత్రాంగి బుద్దిమంతుడగు సారంగధరునిపై చెప్పుటకు వీలుగాని చెడు పన్నాగములను పన్ని ,యాతని కాళ్ళు,చేతులు నరికించిన విధముగస్త్రీలు తమకు స్వాధీనము కాని బలవంతుని గూడ ననేక మాయలు పన్ని పాడుచేయుటకు  నాలోచింతురు.కావున స్త్రీ లను  నమ్మకూడదు.


3.అక్కరపాటు వచ్చు సమయంబున జుట్టములొక్కరొక్కరి 

న్మక్కుననుద్ధరించుటలు మైత్రికి జూడగ యుక్తమేసుమీ 

యొక్కట నీటిలో  మెరక నోడల బండ్లను బండ్లనోడలున్ 

దక్క క వచ్చుచుండుట నిదానము గాదె తలప భాస్కరా!


ఒకానొక సమయాన నీటిలో బడవలమీద బండ్లను,మెరక భూమి యందు బండ్లమీద పడవలును ,వచ్చుచుండుట ప్తత్యక్షము.అట్లే తగిన యవసరము వచ్చు కాలమున 

బంధువులొకరినొకరు కాపాడు కొనుట స్నేహమునకు మంచిది. 

4.అడిగినయట్టి యాచకుల యాశలెరుంగక లోభవర్తియై 

కడిపిన ధర్మదేవత యొకానొకయప్పుడు నీదు వానికె 

య్యెడలనదెట్లు పాలుతమకిచ్చునె యెచ్చట నైనలేగలన్ 

  గుడువగ నీనిచో గెరలి గోవులు తన్నును గాక భాస్కరా!


మనుజుడు దూడలను త్రాగనీయకుండా పాలు పిండుకొన దలచినచో ,ఆవులు కోపించి తన్నుచు పాలీయవు.అట్లే మానవుడు లోభియై యడిగినయాచకుల కోరికల దీర్పక పొమ్మని పంపినచో ,వానికెచ్చటను ధర్మ దేవత సంపదనీయదు. 

5.అతిగుణహీన లోభికి బదార్ధము గల్గిన లేకయుండినన్ 

మితముగ గాని కల్మిగల మీదట నైన భుజింపడింపుగా

సతమనినమ్ముదేహమునుసంపదనేఱులునిండిపాఱినన్

గతుకగ జూచు గుక్క తనకట్టడ మీఱక యెoదు  భాస్కరా!

   ఏఱులు జలములతో నింపి ప్రవహిన్చుచున్నను,కుక్క తన యలవాటు తప్పక నాలుకతోనే త్రాగునుకాని ;బాగుగా త్రాగదు .అట్లనే లోభి గూడ తనకు సంపద యున్నను ,లేకున్నను మితముగానే తినును.శరీరము సంపద శాశ్వతమనుకొని సంపద యున్నప్పుడై నను బాగుగా భుజింపడు.  

6.అదను దలంచికూర్చినప్రజనాదరమొప్పవిభుండుకోరినన్
గదిసిపదార్థమిత్తురటకానకవేగమేకొట్టితెండనన్
మొదటికిమోసమౌబొదుగుమూలముగోసినబాలుగల్గునే
పిదికినగాకభూమిబశుబృందమునెవ్వరికైనభాస్కరా!
      **ఆవులను మచ్చికతోబిదికినపాలువచ్చునుగాని
పొదుగునుకోసినపాలురావుగానిమొదటికిమోసమగును.అట్లే
రాజు సమయముజూచిప్రజలనుగౌరవించి యడిగిన ధనమిత్తురు.
కానివేగమేబాథించితెమ్మన్నచోయివ్వకవిడిచిపోవుదురు.

7.అనఘునికైనజేకుఱుననర్హునిగూడిచరించినంతలో
మనమెరియంగనప్పుడవమానముకీడుధరిత్రియందునే
యనువుననైనదప్పవుయథార్ధము!తానదియెట్టులన్నచో
నినుమునుగూర్చియగ్నినలయింపదెసమ్మెటపెట్టుభాస్కరా!
      * *ఇనుముతోచేరుటవలననిప్పునకుసుత్తిదెబ్బలబాధకల్గునట్లు
చెడ్డవానితోస్నేహముచేసిన మంచివారికైన మనస్సుమండునట్లు
అవమానము ,కీడును తప్పక కల్గును.
8.అలఘుగుణప్రసిద్థుడగునట్టి ఘనుండొకడిష్టుడైతనున్
వలచియొకించుకేమిడినవానికిమిక్కిలిమేలుచేయగా
తెలిసికుచేలుడొక్కకొణిదెండటుకుల్ దనకిచ్చినన్ మహి
ఫలదుడు కృష్ణుడత్యధికభాగ్యములాతనికీడెభాస్కరా!
           **శ్రీ కృష్ణునకు కుచేలుడు భక్తితో జేరెడటుకులీయగాఆ కు
చేలునకుగొప్పసంపదలిచ్చెను.అట్లేప్రఖ్యాతిగలగుణవంతుడుతనకుస్నేహితుడైనవాడుతనమీదిప్రేమచేతనకేమిచ్చిననువానికధికఫలమునేయిచ్చును.
9.అవనివిభుండు నేరుపరియైచరించినగొల్చువారలె
ట్లవగుణులైైైననేమిబనులన్నియుజేకుఱువారిచేతనే
ప్రవిమలనీతిశాలియగురామునికార్యము మర్కటంబులే
తవిలియొనర్పవే?జలధిదాటిసురారులద్రుంచి భాస్కరా!
         *శ్రీ రామునికార్యమునుకోతులేపూనుకొనిసముద్రమునుదాటి
రాక్షసులనుచంపిరి.అట్లేరాజునేర్పరియైనచోసేవకులల్పులైననుపనులునెఱవేరును.
10.ఆదరమింతలేక నరుడాత్మబలోన్నతి మంచివారికిన్
భేదము చేయుటం దనదుపేర్మికిగీడగుమూలమెట్లమ
ర్యాదహిరణ్యకశిపన్ దనుజుండుగుణాఢ్యుడైప్ర
హ్లాదునకెగ్గుచేవిప్రళయంబునుబొందడెమున్నుభాస్కరా!
         -*పూర్వముచెడువృత్తిచే హిరణ్యకశిపుడు గుణవంతుడు
ప్రహ్లాదునకపకారముచేసినశించెను.అట్లేమనుజుడుతనగొప్పబలముచే ప్రేమనుచూపక మంచివానినిబాధించిన తప్పకనశించును.
11.,ఆరయనెంతనేరుపరియైచరియించినవానిదాపునన్
గౌరవమొప్పగూర్చునుపకారిమనుష్యుడులేక
కూఱదెట్లు?హత్తుగడగూడునెచూడబదాఱువన్నెబం
గారములోననైన వెలిగారముగూడకయున్నభాస్కరా!
    .    *మేలిమిబంగారములోనైననువెలిగారముకలియకున్నచో
అతుకు అంటుకొనదు.అట్లేమానవుడెంతనేర్పరియైననువానిదగ్గఱ
ఉపకారము చేయువాడు లేనిచో మంచి కలుగదు.

12.ఈక్షితినర్ధకాంక్షమదినెప్పుడపాయకలోకులెల్లసం
రక్షకుడైనసతత్ప్రభునిరాకలగోరుదురెందుజంద్రికా
పేక్షజెలంగి చంద్రుడదయించువిధధంబునకైచకోరపుం
బక్షులుచూడవేయెదురపారముదంబునుబూనిభాస్కరా!
       **చకోరపక్షులువెన్నెలయందలియాసక్తిచే మిగులసంతసముతోచంద్రునికైయెదురు చూచుచుండునట్లేమనుజులుధనాశచేతమ్ముకాపాడునట్టిరాజు
రాకకైయెదురుచూచుచుందురు.
















1 comment:

  1. చాలా మంచి పేజీ అందించారు .. చాలా చాలా ధన్యవాదాలు

    ReplyDelete