Wednesday, 5 February 2020

మారుతీ శతకం5

                                                        మారుతీ శతకం5
69.ఈశు కుజేషు తత్త్రిభువనేశు యశోజితతన్నిశేషు దే
    వేశగురుస్తుతైకసుమతీశు వినిర్జితరాక్షసేశు స
    ర్వేశు కృపాగుణైక జలధీశు నుతైక జయేశు రామభూ
    మీశు హృదిన్ భజించెద కపీశు భజింతు సతంబు మారుతిన్ .
70.త్యాగవిభాగభోగు శమితామితతద్భవరోగు సత్కళో
    ద్యోగినుతాశు గున్నఖిలయోగి కులార్చితయోగు నమ్మహా
     భాగు యశః ప్రభావితశుభావహ మంజుల దిగ్విభాగు స
    ర్వాగమరాగు గొల్చు వినుతాశుగపుత్త్రు భజింతు మారుతిన్.
71.శాంతునుతోన్నతాభ్యుదయసారమనోజ్ఞకళోత్కరాలయ
స్వాంతుదిగంతీీీర్తివిభవప్రభవోజ్జ్వలసాగరాత్మజా
కాంతుతనూజితేద్ధరతికాంతుయశోవిజితైకతన్నిశా
కాంతుమహీలతాంగిసుతకాంతవిధేయుభజింతుమారుతిన్.
72.అగణితవైభవున్ సురుచిరాంబుజమిత్రకులైకసంభవున్
నిగమవిశేషవర్ణితవినిశ్చయభావు ప్రసిద్ధరాఘవున్
జగదధినాయకాభినుతసత్కులసంభవునాదిదేవునిన్
నగవరధీరుగొల్చుదిననాధనుతాప్తునిగొల్తుమారుతిన్.
73.రాముసుతావనీలలాముజితాభిలరాక్షసాధిప
స్తోము గుణాభిరాము నుతసుందరరూపజితైకకాముత
ద్భీమముఖామరేశనుతవిశ్రుతవైభవధాము తత్పరం
ధాముసదాభజించెడిసదాగతిసూనుభజింతు మారుతిన్.
74.దశదిగధీశమౌళిమణిధామసమర్చితదిప్యకీర్తికిన్
శశిధరవందితాభ్యుదయసారమనోజ్ఞపవిత్రశీలికిన్
దశముఖముఖ్యరాక్షసవితాననిహంతకురామమూర్తికిన్
వశమయిభక్తికరగువాయుతనూజుభజింతుమారుతిన్
75.భద్రగీరీశురాణి నుతవాణిరమాగిరిజాభదివ్యసా
ముద్రికలక్షణాభ్యుదభూషితసన్నుతసుందరాంగనన్
భద్రగతిన్గగనంగప్రతిభ వాంకితదేవతాళిన
ఛ్చిద్ర మనోజ్ఞ భక్తి నుతిచేయు హరిన్  భజియింతు మారుతిన్
76.కమలాక్షున్ సుజనావనాభ్యుదయ రక్షాదీక్షు నధ్యక్షు న
య్యమముఖ్యా ఖిల దేవసంఘనుత విద్యానాథకక్షున్ నుతా
ర్యమము ఖ్యాఖిల లోకకుక్షు నుతసంరక్షున్ దిలీపాన్వయున్
మమతన్ గొల్చెడి వాయుజున్ దలఁతునే మాన్యున్ సదా మారుతిన్ .
77.ఘోరాఘాoబుజమత్తనాగవిభునిన్ కోదండరామున్ సదా
చారకారు జితారివీరు కరుణాస్వాంతున్  ప్రశాంతోజ్జ్వలా
కారున్ భూపరుభూమిజావరుని తత్కకుత్సవంశో ద్భవున్
శ్రీ రంజిల్ల సతంబు గొల్చు కపి నేసేవింతునమ్మారుతిన్ .
78.దినకరచంద్రనేత్రు నుతదేవనుతోన్నతసచ్చరిత్రు త
ద్ఘననిభగాత్రు  సన్ముని నికాయవిధేయ పవిత్రపాత్రు త
జ్జనకసుతాకళత్రు నుత సాధుజనోత్కర మిత్రు తత్తపో
ధనమునిచంద్రు ఛాత్రుని సదాగతిపుత్త్రు నుతింతు మారుతిన్ .
79.రణజయ ఘోమనిగ్రహ నిరస్తసమస్త కఠోరదోషు  స
ద్గుణ మణిభూషు సద్వినతకుంజరపోషుతన్నబో
మణికులభూషణున్ గొలుచు మాన్యకపీంద్రు భజింతు మారుతిన్ .
80.సన్నుతరామచంద్రుగుణసాంద్రు మహీశకులేంద్రచంద్రు న
ప్పన్నగ భూషణాద్యమరవర్ణితదేవ సఖేంద్రు సన్నుతా
త్యున్నతకీర్తిచంద్రు సుగుణోజ్జ్వలదాసచకోరచంద్రుదీ
ప్త్యున్నతరాఘవేంద్రుని గను భక్తునిగొల్తు మారుతిన్
81.హరు నుతార్యహృద్గృహవిహారు జితాసురవీరుస్తుత్యస
త్కారు పరోపకారగుణకంజదివాకరు దివ్యసత్ ప్రభా
కారు దశావతారు భవకర్మవిదారు సుదారలోకసం
చారు నుతించునట్టికపిసత్తముగొల్తు నె డం ద మారుతిన్.
82.సన్నుత సృష్టికర్త విలస త్ప్రతిభాన్విత కార్యకర్తగ
ర్వోన్నతదానవేశ్వరమదోద్ధతిహర్తను తద్ధరాత్మజా
త్యోన్నతభావచిత్రితరసోజ్జ్వల కావ్య వితాన భర్త వి
ద్వన్నుతరాము గొల్చు కపివర్యు నుతింతు నెడంద మారుతిన్.
83.ఘననిభనీలుసద్వినుతకాంచనచేలుదయాలవాలు స
జ్జనగుణలోలుసద్విబుధసన్నుతశీలు జితారిజాలు స
న్మునివినుతాజిబాలు పరిపోషితదివ్యకళాలవాలు న
య్యినకులనాధు గొల్చు సుగణేశు కపీశు భజింతు మారుతిన్.
84.ఆర్తి హరించి తఛ్ఛుభసమంచితసన్నుతసౌఖ్యమిచ్చు స
ద్వర్తన కాలవాలమగు పంక్తిరధాత్మజు దివ్యనామసం
కీర్తనభాగ్యమబ్బెనని కేలుమొగిడ్చి సతంబు రాముభూ
భర్తను హృద్గతిన్నిలుపు వానరు భక్తి భజింతు మారుతిన్.
85.క్ష్మావరు దేవతావరనికాయసమర్చిత కార్యశూరు స
ద్భావసమన్వితాభ్యుదయధామవిహారు వికారదూరు సీ
తావనితామనోహరు నితాంతసుఖైకవినోదహారునిన్
చేవదలిర్ప గొల్చుకపిశేఖరు గొల్తు నెడంద మారుతిన్.
86.పుణ్యుననణ్యు మాన్యు నుతభూపవరేణ్యు మునీంద్రవల్లభా
గణ్యమహంబుగల్గుగుణగణ్యుని భానుకులాగ్రగణ్యునిన్
వాణ్యధినాయకాదిసురవల్లభసంచయసన్నుతార్యసా
ద్గుణ్యునుతించు తత్ల్పవగకోటివరేణ్యు భజింతు మారుతిన్.
87.భక్తసురద్రుమున్ పతిత పావననాము గుణాభిరాము వి
ధ్యుక్తనుతైకధర్మమహిమోజ్జ్వలసత్పథగాము రామునిన్
ముక్తికళా బ్దిసోము నుతమోదమయైకవినోదధాము శ్రు
త్యుక్తవిధానగొల్చుకపినూర్జితశక్తి భజింతు  మారుతిన్.
88.భద్రుని కీర్తిపారగుని భక్తజనైకవశంవదున్ సుర
చ్చిద్రవిదారణానుభవసింధుసుధాకరు రామచంద్రునిన్
భద్రగిరీంద్ర సద్భవనవాసు భవాఘనిరాసునిన్ దయా
ముద్రితశీలుగొల్చు కపిముఖ్యుని నే భజియింతు మారుతిన్.
89.జలదశ్యాముని కీర్తికాముదళితక్షామున్ సుధాధాము చి
ద్వలయ ప్రాభవదాము నున్నతగుణోధ్ధామున్  రుచిస్తోము భూ
వలయాధీశ లలాము రాము దగ సంభావించు  వాతాత్మజున్
విలసద్భక్తి  భజింతు వాయుసుతునే వీరాగ్రణిన్ మారుతిన్
90.ఓంకారోద్భవచిత్కాళా మయుని  శ్రుత్యు ద్భూతశక్త్యాత్ము నే
ణాలంకాలంకృత దేవజాతనుతభద్రాధీశునిన్  శేషప
ర్యం కా సీనువినీల కాయు జలదశ్యామున్  నితాంతం ఔద్న్
కైంకర్యంబొనరించు వాయుసుతునికైమోడ్తు శ్రీ మారుతిన్ .

No comments:

Post a Comment