మారుతిశతకము2
16.ఖండితశత్రుదండు రిపుకంధరగండకకాండుసన్నుతా
ఖండలకీర్తితాభ్యుదయకౌతుకభాండు యుధిప్రచండును
ద్దండునుతప్రభావలయ ధామనుతేషుకళాప్రచండు మా
ర్తాండకులోద్భవున్ గొలుచుథన్యునినే భజియింతు మారుతిన్.
17..సదయకళావిలాసు సురసంచయసన్నుతరామదేవభూ
మిదయితలగ్నహృద్విభవమేథురశక్తిసమేతకీశు దు
ర్మదరిపుసంఘసంహననరామ వినాశపరాసు కపీశుగొల్చెదన్
ముదమున పారిజాత తరుమూలనివాసు సుదాసుమారు తిన్
18.కన్మొనలందుతన్మయతకన్పడగొల్చెదభక్తవత్సలున్
సన్మునిసేవితాంఘ్రియుగసారసు సర్వకళావిలాసు న
మ్మన్మథకోటిగెల్చునసమానవిలాసయశోనివాసునిన్
జన్మతరింపగోరి విలసచ్చరితాలయు గొల్తు మారుతిన్.
19.సారాచారవిచారకోవిదునుతసాంత్వున్ హనూమంతు త
త్పారావారగభీరుసత్కపివరున్ ప్రామాణ్య వేదప్రభా
సారాలంకృతశీలునే గొలుతు విశ్వాసంబుతో నిత్యమున్
ధారావాహిక రామనామ జపవిజ్ఞానాత్మునిన్ మారుతిన్.
20.దేవాధీశనుతోన్నతాభ్యుదయసందేశాత్మసంకాశు త
న్నివారంపచసన్మునీంద్రసుతతన్నీరేజనేత్రోత్సవ
శ్రీ వాల్లభ్యమనోజ్ఞహృత్సరసిజున్ శ్రీరామకైంకర్యస
ద్భావాధీనమహాకపీంద్రు మదిలోభావింతు నే మారుతిన్.
21.శ్రీ వాణీగిరిజానుతోన్నతసుచారిత్రాంశసద్వేమ స
ద్భావాలంకృతభామ రామవిభుసత్పాదాబ్జసంసేవగీ
తావాణీమయకీర్తనాభ్యుదయసంధానప్రవీణున్ హరిన్
కైవారంబునుచేయ నేనెడదలో కాంక్షింతు నమ్మారుతిన్.
22.గీర్వాణప్రభుమౌళిమండితపదున్ కీశేశసంఘోత్తమున్
పర్వేందుద్యుతితుల్యకీర్తిధను సద్భావాభిరామున్ కపిన్
దూర్వాంకూరవిభూషణాదివిబుధస్తోమాభివంద్యానఘున్
సర్వారాధ్యగుణాభిరాముగొలుతున్ సామీరినిన్ మారుతిన్.
23.సర్వాంగీకృతసచ్చరిత్రకలితున్ సంస్తవ్యలీలావిభున్
దుర్వారాధికదివ్యశక్తియుతు సంతోషప్రభాభూషితున్
గర్వాంధాసురకంజమత్తకరి సత్కార్యైకతేజోనిధిన్
నిర్వాణప్రదు వాయుసూను గొలుతున్ నిత్యంబునేమారుతిన్.
24.ఉర్వీశాగ్రణి రామచంద్రుమదినత్యుత్సాహమేపారత
త్సర్వాకాశవిహారదేవతలుమెచ్చన్నాత్మలో సర్వదా
సర్వంబున్ రఘురామమూర్తిగనె యాశ్చర్యంబుగాజూచు అ
దర్వీహస్తవిభూణాంశు గొలుతున్ ధన్యాత్మునమ్మారుతిన్.
25.సారవిహీనమైనభవసాగరతీరము చేరగోరున
వ్యారికి శక్తి యుక్తులనపారముగా నిడుభద్రరూపు న
క్కారణజన్ముషడ్గుణవికారవిదూరు హరిప్రవీరు న
మ్మేరుసమానధీరుని సమీరకుమారు నుతింతు మారుతిన్.
26.వానరు వేదపారగుప్లవంగకులాగ్రణి విశ్వపావనున్
పీన విశాలవక్షుఁ జిత వీరసురారి సమూహు జానకీ
జానివిధేయ సద్గుణ లసద్రుచి వేల్లితదేహుస్తుత్యస
మ్మానవిమానయాను హనుమాను భజింతునెడంద మారుతిన్ ..
27.వాసవ ముఖ్యదేవగణవందిత దివ్యకళా విలాసవి
న్యాసు కుజేశ పాద యుగళాబ్జవిలగ్న మనోబ్జసత్ప్రభా
భాసురరామదాసు నుతభక్తినివాసు జితాసురేశుని
ర్వాసితషడ్రి పూత్కరు కరంబు భజింతు నెడoద మారుతిన్ .
28.హనుమంతున్ మతిమంతు భక్తవరునూహాతీతవీరాగ్రణిన్
వినుతప్రాభవకాంతుమాన్యునెదలో విస్ఫూర్తిమంతున్ శుభున్
జననభ్రాంతివిహీనుధీకలితు నిస్స్వార్ధున్ మహాకాయు స
ద్గుణవంతు బలవంతుగొల్తు కపిసందోహాగ్రణిన్ మారుతిన్
29.బంధురపాపశోషణు కృపాగుణభూషణు శతృవాహినీ
బంధవిదారణున్ హరికబంధ విరాధ విరోధిబంధు ని

ర్బంధితలోకబాంధవునరాతికులాంబుజగంధసింధుగ
ర్వాంధతమఃపతంగుని సమంచిత భక్తి భజింతు మారుతిన్.
30.ఘనప్రవాహ ప్రముఖాఖిలామరవరౌఘస్తుత్యతేజోఖనిన్
మనసారన్ భజియింతువీతభయు సమ్మానాత్మునమ్మారుతిన్
30.ఘనప్రవాహ ప్రముఖాఖిలామరవరౌఘస్తుత్యతేజోఖనిన్
తనుమథ్యామణిభూమిజాభినుతసద్ధర్మార్ధవిద్యానిధిన్
హనుమంతున్ నఖదారితారి రఘురామాధీనహృత్పంకజున్మనసారన్ భజియింతువీతభయు సమ్మానాత్మునమ్మారుతిన్
No comments:
Post a Comment