కర్మ-పునర్జన్మ
రాధాస్వ ఆమీ
కర్మ -పునర్జన్మ
మనకి కష్టాలు ఎదురై నప్పుడు మనకి మూడు లాభాలు కల్గును.
1.మొదటిది :-మనము గతజన్మల్లో చేసుకొన్న కర్మ ఋణం తీరిపోతున్నది.
2.రెండవది:-వాటిని ఎదిరిస్తున్నప్పుడు మనలో అంతర్గతంగా ఉన్న శక్తులు వెలికి వస్తాయి.సాధనవలన మరింతగా ప్రకాశిస్తాయి.
3.మూడవది:-ఈశక్తులమన వర్తమానంలోనూ గొప్ప సత్కర్మచేసే అవకాశం మనకిస్తాయి.
ఈ పనే పాండవులు చేశారు.మనమెందుకుచేయకూడదు.మహర్షులు ,యోగులు కర్మలనుండి ఎలా తప్పించుకోవాలి అని ఎప్పుడుఆలోచించలేదు.కర్మక్షాళనం కోసం పరితపించారు.వరనుసరించినపద్ధతినేమనమనుసరించవచ్చునుగదా.
మనం గతజన్మ లలో చేసుకొన్న పాపరాశి కొండంత ఉంటుంది.దీనిని చాలా నెమ్మదిగాను,వాటినుండి ఎలా తప్పించుకోవాలా యని ఆలోచిస్తూ ఉంటే ఈ కర్మ భారం వచ్చేజన్మలకు వాయిదాపడి ఇంకా జన్మలు పెరిగిపోతాయి.మనం మనకర్మభారాన్ని కొద్ది జన్మల్లోవదిలించు కోవాలంటే మనం శ్రీకృష్ణుడు చెప్పినమార్గమున నుసరించవలయును .
యస్య సర్వే సమారంభాః
కామ సంకల్ప వర్ణితాః
జ్ఙానాగ్ని దగ్ధ కర్మాణం
తమాహుః పండితమ్ బుధాః (భగవద్గీత జ్ఙానయోగం ..19శ్లో )
ర్వరి సమస్త కర్మలు కోరిక సంకల్పము లేకుండా ఉంటాయో ,వారికర్మలు జ్నానమనే అగ్ని చేత దహించబడతాయి.
యధేయాంసి సమిద్ధో అగ్ని
ర్భస్మాత్కురుతే అర్జున
జ్ఙా నాగ్నిస్సర్వ కర్మాణి
భస్మాత్కతరుతే తధా . జ్ఙాన యోగము 37శ్లో .
అర్జునా !బాగా ప్రజ్వలింప చేయబడిన అగ్ని కట్టెలని ఏ విధంగా బూడిద చేయకలుగుతుందో ,మనం సంపాదించిన జ్ఞానం మన సర్వకర్మలని బూడిద చేయకల్గుతుంది ......దీనిలో పరమార్ధమేమనగా జ్ఞానం మనలో అగ్నిలా జ్వలిస్తే మన కర్మలు మనల్ని బాధించవు.మనం గతంలో ఎవరినో మానసికంగా హింసిస్తే ఇప్పుడు వారు తిరిగి ఆ కర్మ మనకి ప్రసాదించడానికి వచ్చారు.మనం ఈ కర్మ రహస్యాన్ని ..జ్ఞానాన్ని పొందితే మానపెదవులపైని చిరునవ్వే ఉంటుంది.కర్మలు వస్తాయి.మనలని చుట్టుముడుతాయి.అవి మనపైనఏ ప్రభావం చూపవు. జ్ఞానంచేత ఆ కర్మ దగ్ధమైనది.
No comments:
Post a Comment