పద్యాలు
అన్నా విన్నపమైన గైకొనవు డాయన్ రావు నీమూర్తినా
కన్నుల్చల్లగజూపవెన్నిదినముల్గై వారముల్చేసినన్
నిన్నేలాగున నమ్మవచ్చు నకటా!నిష్కారణంబూరకే
నన్నీలాగున బాములన్బరచుటే నాయంబు సీతాపతీ .
సాహేబు రాణా రామన్న కవి కృత సీతాపతీ శతకములోనిపద్యము .
భగవంతుని ప్రార్ధించుట తేలికపదాలతో స్పష్టమైన అర్ధముతోనుండినది.
పుణ్య పురుషుడు ఉత్తమగతిని బొందువిధము ---
తనువు మనంబు ప్రాణములు దద్దయు నింద్రియ జాలమైక్యము
న్దనరగ జేసి భక్తిగొని తావక పాదసరోజ చింతనం
బున గడు మోదమొందు ఘనపుణ్యుడొనర్చి న సర్వ
ధర్మముల్
బొనరగనీకొసంగుచునుబొందు భవద్గతిరాజశేఖరా!
ఈ పద్యము సత్యవోలు సోమసుందర కవి కృత శ్రీరాజశేఖర శతకములోనిది.
నీవే సిద్ధివి నీవె బుద్ధివనుచు న్నిర్వ్యాజ భక్తిక్రియా
ప్రావీణ్యంబునసతతంబు నిను సంప్రార్ధించు ధీరుల్సమ
స్తావన్యుత్తమ సిద్ధి బుద్ధి కలనావాప్తి న్రమావశ్యయో
షావశ్యాదికలీలలన్వెలయరే జ్ఞానప్రసూనాo బికా !
పై పద్యము జ్ఞాన ప్రసూనాంబికా శతకములోనిది.
భక్తుడు శ్రీకృష్ణుని ప్రార్ధించినతీరు ను రుక్మిణీపతి శతకములోని క్రింది పద్యమును జూడుడు.
పిలిచినా బల్కవేమిటనుబేదల పాలిటి దైవరాయనిన్
గొలచెదనింకనైన నను గూరిమి నేలుమునేలవేనియున్
బలుచాదనంబు నీకు నిదె పాల్పడకుండునే లోకమందునన్
బలుచలమేలనాపయిని పంకజలోచన రుక్మిణీపతి!

No comments:
Post a Comment