ముఖ్యమైనవి
దైవప్రార్ధన :-వివిధకవులరచనలలో క్రిందివిధముగా కనబడుచున్నది.
మాధవశతకమున :-
ఈవేతండ్రివిచెల్లివీవేచెలివీవేప్రాణమిత్రుండ
వున్
నీవే నాకిక సద్గురుండవయిన న్నీవే సహాయుండవున్
నీవే యాపదలందు రక్షకుడవున్నీవే సుమీ
భ్రాతవున్
నీవే గావున నిన్ను భక్తిగొలుతు న్నిక్కంబుగన్
మాధవా
రఘుతిలక శతకమున :
(దిట్టకవి రామచంద్రకవి)
నేమమున నిన్నె కొల్చితి
పామరుడను గరుణ చేసి పాలింపవె యిం
కేమరనీయడుగుందెలి
తామర రఘుతిలక విటలతటనటదలకా
(కందపద్యములోనున్నది)
కరుణిoపవలయు నేనీ
వరసుతుడను నెనరు గూర్పవలె దండ్రివినీ
వరయు నను గన్నతల్లియె
ధరణిజ రఘుతిలక విట తట నటదలకా
నాయెడల నీకు దయరా
దాయె గదా పరమనియమతాపస నిచయ
శ్రేయో భూయో జయసం
ధాయక రఘుతిలక విట తట నటదలకా
సులభశైలిలో,చిన్నచిన్న పదాలు కలయికతో నుండి అర్ధవంతముగానుండుట
కనబడుచున్నది.
సులభశైలిలో,చిన్నచిన్న పదాలు కలయికతో నుండి అర్ధవంతముగానుండుట
కనబడుచున్నది.
No comments:
Post a Comment