--4--
86.కస్తురి చూడ్కికి మోదము
విస్తరముగ గూర్ప దిచ్చు విరివిగ దావుల్
వాస్తవపు గార్య శూరుని
మోస్తరిదే చేసి కీర్తి పొందును దులసీ!
87.బిరుదు గల ఘనుని గని పెర
నరులెంతయు నోర్వలేక నవ్విన లోటా?
కరినిన్ గనుగొని కుక్కలు
మొఱిగినచో దాని పరువు పోవునె?తులసీ!
88 . బెదురింత లేక సుజనుల
నదరించుచు ధనము దోచునధికారి కెటున్
మది చెడి తిరిగెడు కుక్కకు
గదిరెడి గతి తుదకొకప్డు గలుగను దులసీ!
89.కవియై వ్రాసెడు వ్రాతలు
నవరస భావములు నీతిన్యాయము దెలుపున్
చవి లేని కవితలల్లుచు
జెవులను బాధించు చొరవ చెల్లదు తులసీ!
90.కొనలేము జనుల ధనమిడి
కనికరమాప్యాయనంబు కనబడ వారిన్
మనసార నాదుకొనుచో
బెనవేయుదు రతని జనులు ప్రేముడి దులసీ!
91 .ధనమొకడే కాజాలదు
మనుజుని సుఖ కారణంబు ,మానిని సుతులున్
వినయాన్వితులై యాతని
కనుకూలత జూప నదియె నాకము తులసీ!
92 .తన విహిత ధర్మములనెపు
డొనరించుచు ఫలముduttam కొరకుండియు దీనా
వనమునకే తనువనుకొని
వినియోగమొనర్చు జనుడె విజ్ఞుడు తులసీ!
93.తన సుతుడె తప్పు జేసిన
వెనుకాడక యొకడు శిక్ష విధియుంచుచు స
జ్జనులం గాచునొ సతమా
మనుజేశ్వరు డుత్తము౦డు మాన్యుడు తులసీ!
94. మట్టియు మణి యని తలపక
చుట్టంబని శత్రువనక సుఖదుఃఖంబుల్
పట్టించుకొనక భ్రాంతుల
నెట్టినవాడౌనుయోగి నిక్కము తులసీ!
95.ఎక్కగ వచ్చును మేరువు
స్రుక్కక చేరంగ వచ్చు సూర్యుని ,జుక్కల్
లెక్కగొనవచ్చు ,వశమే
చిక్కించు కొనగ స్త్రీల చిత్తము తులసీ!
96.పిల్లల గన్ననె సరియా?
తల్లియు నా తండ్రి వారి దగు శిక్షణ రా
జిల్లగ విద్యాబుద్ధులు
మెల్లగ నేర్పింప రేని మేలొకొ ?తులసీ!
97.నీతియు ధర్మము నెఱపుచు
బ్రీతిగ బలహీన జనుల బ్రేమించుచునే
జాతికి హానిం గూర్చెడి
పాతకుల నణంచు ప్రభువె ప్రభువగు తులసీ!
98.ఆపద లొద వెడు నదమన
నాపగ లేరెంత దక్షులైనను విధి,నా
తాపసులే తా రెఱుగని
శాపంబులు గనరె ?మీర జాలిరె? తులసీ!
99.ధనువును విడచిన బాణము
తనువును విడిపోవు నుసురు తరమగు నొక్కో
వెనుకకు ద్రిప్పగ,విరిగిన
మనసటులే యతుక లేము మహిలో తులసీ!
100.పాతివ్రత్యము తొలి మన
క్ష్మాతలి కొక వన్నె తెచ్చె గానీ యిక స్త్రీ
స్వాతంత్ర్య మె పెరిగిన నా
నీతికి విడువంగ వచ్చు నీరము తులసీ!
101.కలవారలిడుదు రెప్పుడు
కలవారల కాదరంబు కడలు కొనంగన్
బాలు బాధలు పడు పేదల
దలపరు కసరుదురు విసుగుదలతో దులసీ!
102.లలితా కళారాధనతో
నెలతలు విద్యలను నేర్చి నిర్మల చరితన్
గులదీపికలై జాతికి
గల కీరితి నిల్ప మేలు గాదే?తులసీ!
103 పరులపయి నింద మోపుచు ,
మరచియు తన సొంత పనులు మాన్యుల తోడన్
పరుసము లాడెడు నరుడొక
ధరణీశుండైన ముప్పు తప్పదు తులసీ!
104.క్రూరులతోడను స్నేహము
వైరంబును గూడ బూన వల దేమన్నన్
ఆరని నిప్పుల సంగతి
యారిన బొగ్గునకునైన హానియె తులసీ!
105.బలవంతుడు దుర్బలుడని,
కలవాడు దరిద్రుడనియు , ఘన విద్వాంసుం
డలతి జడుండని,భేదము
కలుగునొకో మృత్యువునకు గాదిలి తులసీ!
106.వరలు సుఖము తగు బుద్ధిన్
గురుబుద్ది విశేష ఫలము గూర్పగ జాలున్
పరబుద్ది నష్టకరమౌ
తరుణీ జనబుద్ది ప్రళయదంబగు దులసీ!
107. కోరును లోకము దాతనె
కోరునొకో యీవి లేని కొటీశ్వరునేన్
వారిదము రాకకై ప్రజ
కోరును సూ వార్ధి రాక గోరునె తులసీ!
108.వే గుణములు గల పెద్దల
లోగూడ నెదేని గలుగు లోపంబదియే
లాగున రత్నాకరమౌ
సాగరమున నుప్పు నీరు చాడ్పున దులసీ!
&&&&&&&&&&
No comments:
Post a Comment