Wednesday, 11 July 2018

మనోనిగ్రహసాధనలు-మాత్సర్యం

                           మనోనిగ్రహ సాధనలు-

                                                        మాత్సర్యం 

ఈర్ష్యాసూయద్వేషాలకు మరోపేరు మాత్సర్యం.మన పెంకుటింటికి ప్రక్కన మూడంతస్తుల పెద్ద భవనంలో నున్నవ్యక్తులనుజూచియీర్ష్యపడడంమహాపాపము.ఎడమ ప్రక్క పూరి గుడిసె లో నున్నవారిని జూచి వారిలేమిని ద్వేషించడం మహాపాపము.మానవుని మాత్సర్యమెప్పుడు అతని మనుగడకు ముప్పు  తెస్తుంది.కేవలము  ఈ ఈర్ష్యా ర్ష్యా సూయలవలన నె గదా నూర్గురు సోదరులను,ఏకైక సోదరిని, కన్నకొడుకును,తల్లిదండ్రులను,యావత్తు సామ్రాజ్యాన్ని,ప్రాణాన్నిపోగొట్టుకోవడమేగాక,దుర్యోధనుడను పేరుదెచ్చుకొన్నాడు-సుయోధనచక్రవర్తి .

ఈ అసూయకే ఆహుతి యైన కైకేయి తనభర్తను పోగొట్టుకొంది.కన్నకొడుకు ప్రేమకు దూరమైనది.పైగా లోకనింద పాలైనది.

ఈ యీర్ష్య ఆవరింపబడిన శిశుపాలుడు నిండు సభలో శిరస్సు తెగి కళేబరముతో క్రిందికి పడినాడు.బ్రహ్మద్వేష ము గలహిరణ్యకశిపుడు ఘోరమరణంపాలైనాడు.పూర్వ ప్రబంధాలను పరికించిన మాత్సర్య ప్రతిఫలాలు కన్పట్టును.

ఈ ఈర్ష్యాసూయద్వేషాలా వరింపబడిన వ్యక్తి నిరంతరమూ ఆందోళన,అశాంతి చెందవలసి ఉంటుంది.దీనికి యుపశాంతి భగవద్గీతలో నిట్లు చెప్పబడినది.సాంఖ్య యోగమున ---

రాగద్వేష వియుసుక్తై 

విషయానిన్రియైశ్చరన్,

ఆత్మ వశ్యైర్విదేయాత్మా 

ప్రసాదమధిగచ్ఛతి ------అనగా ఈర్ష్యాసూయద్వేషములకతీతుడు,  అందరిని సమంగా జూచు వాడు ,మాత్సర్యములేనివాడు,మనస్సును తన వాదీనములో నుంచుకొనువాడు,మనోనైర్మల్యము గలవాడును,శాంతిని బొందగలడని యర్ధము. ఇది సామాన్యులకర్దమయ్యేల బైబిలులో సాలోమోను రాజు మహోన్నత సామెతలద్వారా ఇట్లు చెప్పుచున్నాడు.

సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము,మత్సరము ఎముకలకు కుళ్ళు.ప్రియ ఆత్మస్వరూపా!కేవలం శారీరిక డాంబికఆధునికాడంబర ప్రదర్శనకై ఉవ్విళ్ళూరుతూ --నీకన్నా గొప్పవారితో నిన్ను ఊహించుకొనినీ లేమికి నిన్ను నీవు కించ బరచుకింటూ ఎందుకు మరణాన్ని ఆహ్వానిస్తున్నావు ?  ---అనగా మీరు శరీరేచ్చానుసారముగా ప్రవర్తించినయెడల నిశ్చియముగా మరణము కొని తెచ్చుకొందురనియర్ధము.కానీ ..ఆత్మచేత ...శారీరక వాంఛలనుచంపినయెడల దేవుని పరిశుద్ధా త్మలో జివిం చెదరు.బైబిలులో పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక ఎని  మిదవ   అధ్యాయం,పదమూడవ వచనంలో అమూల్యరత్నమీయుపదేశము.మానవాత్మకు మహా అపకారియైన మాత్సర్యమును జయించడానికి ఇది సులువైన మార్గము.-

    ప్రభువు ప్రేమమయ సృష్టి లో నీవు ఉన్నతుడవని భావిస్తూ నీవీ మెరుగు పరిస్ధితులలో నున్నందుకు ...నిత్యం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు...!మాత్సర్యము నీకు ఆమడ దూరములో నుండున్.

మనస్సు నీది.మార్గము నీవే యేర్పరుచుకోగలవు .నీ ఆత్మను సంరక్షించుకోవలసిన బాధ్యతా నీదే...ఈ క్షణము నుండినీసాధనప్రారంభించు.త్వరపడుము.సమయమాసన్నమైనది.నీ సాధన సఫలమగుగాక! 

No comments:

Post a Comment