మనోనిగ్రహసాధనలు
మోహము
ఇది కామమునకు దగ్గర చుట్టము.ఒక కాముకుడు ఇట్లు చెప్పుచున్నాడు.
శ్లో||ఇహ హి మధురగీతం ,నృత్తమే తద్రసోయం ,
స్ఫు రతి పరిమళోసౌ,స్పర్శ ఏషస్తానమ్ ,
ఇతి హతపరమా ర్ధైరింద్రియై ర్భ్రామ్యమాణః
స్వహితకరణధూర్తై:పంచభిర్వఞ్చితోస్మి.
స్త్రీలోలత్వముచే పరమార్ధము తెలియక చెడినవాడను.ఈ పంచేంద్రియాలు నన్ను ఎలామోసపుచ్చినాయో చెబుతున్నాను.ఈ లలన చనుమొనలరాపిడిచే నాచర్మము,దీనిపెదాల తీపిరుచిచేనా నాలుక,ఈమె మాటలమాధుర్యానికి నా చెవి ఈ మె వగలు,హొయలు నాకళ్ళను ,దీనిశరీరసువాసనలు నానాసిక నన్ను స్త్రీలకు బానిసగా మార్చినవి. ఇదీ మోహానికి ఒక ఉదాహరణ.
కాన సామాన్య మానవులు ఈ భ్రమనుండి బయటబడలేరు.స్త్రీమోహము,ధనార్జన తృష్ణ ,కీర్తికాంక్ష,బ్రతుకుతీపి--యిత్యాదులన్నీ మానవ ఆత్మను మలినబరిచేవి.
అవశ్యం యాతారశ్చి రతర
ముషిత్వాపి విషయాః
వియోగే కో బేధ,స్త్యజతి
నజనో యత్ప్వ యమమూన్?
వ్రజంత స్వాతంత్య్రా
దతుల పరితాపాయ మనస,
స్వయంత్యక్తా హ్యేతే
షమ సుఖమనంతం విదధతి.
మానవుడు ఆశించి అనుభవించేవన్నీ ఎప్పటికైనా విడువవలసినదేగదా! స్త్రీ ,సంతాన,సంపదలు నాశమానమైనవనితలంచి మానవుడు తనంతతాను విడిచినచో ..ఎంతమనశ్శాంతి......ప్రశాంత మధుర జీవనము.మనోహర మంగళ ప్రద జీవితము.అయితే దీనిని అందరు చేయగలరా?భగవద్గీతయందు ఇట్లున్నది.....
ఉద్ధరేదాత్మనాత్మానం
నత్మానమవసాదయేత్
ఆత్మైనవాహ్యత్మనో
బంధురాత్మైవ రిపురాత్మనః
ఆత్మను నిగ్రహించి ...సర్వమూ ప్రభువునకు సమర్పించువారు మాత్రమె దైవసన్నిధికి అర్హులు.ఆత్మే హితుడు.ఆత్మే శత్రువు.కాన తన్ను తాను ఉద్ధరించుకొనే శక్తి ప్రతి మానవాత్మలోను ఉన్నది.లోకములోనున్న పెక్కు గ్రంధములు మార్గాలను చూపగలవే గాని మనసును కట్టడి చేయలేవు. సత్ప్రవర్తనను సాధించే శక్తి ఆత్మమోహబంధనానికి పగ్గాలు బిగిమ్పవలసిన వ్యక్తివి నీవే.
అలఘులు బోధపూర్ణులు మహాత్ములు
భోగానిదానమౌ మహా
ధనముంబరిత్యజింతురు గతస్పృహులై
పరమాద్భుతంబుగా;
మునుపును బొంధ,కిప్పుడును ముట్టక,
యింకను జెందలేక,నె
మ్మనమునందోచు భోగములు మానగ
జాలము మే మొకింతయున్.(భర్తృహరి)
స్నానజ్ఞానముచేత పరిశుద్ధమగు మనసుగల మహానుభావులు ఎంత మనఃకష్టమైనపనులైనను
చేయుదురు.ధనమును ఎందుకు పనికిరాని ఎండిపోయిన గడ్డివలె విడుచుదురు.ఈ ధనము పుట్టినప్పుడు వెంట తేలేదు.పోవునప్పుడు వెంట తీసికోనిపోలేదు.కాన ధన,కనక,వస్తు,వాహనాది ,స్త్రీవ్యామోహములను విడిచి ప్రభువువద్దకు జేరుటకు యత్నించవలెను.బైబిలు కూడా "సుఖ భోగాములయందు వాంఛ గలవానికి లేమి కల్గును".అని చెప్పుచున్నది.(పాత నిబంధనలు 21:17)
No comments:
Post a Comment