Saturday, 2 June 2018

10 8 యొక్క ప్రాముఖ్యత

                           108 యొక్క ప్రాముఖ్యత 

మనం ఏదైనా మంత్రం జపించడానికి 108 సంఖ్యను ఉపయోగిస్తాము.పైగా విష్ణు సహస్ర నామాలు -108

అష్టోత్తరాలలో 108 సంఖ్యనామాలతో దేవతలను ఆరాధిస్తుంటాము.దానికి మన మునులు క్రింది విధంగా చెప్పిరి.1.జ్యోతిష శాస్త్రములో మనకు ఉపయోగ పడేవి 

27 నక్షత్రాలు.ప్రతి నక్షత్రానికి 4 పాదాలు అనగా మొత్తము 10 8 అగును.   ప్రతి మానవుడు ఈ పదాలలో నొక్కదానిలో 

పుట్టియుంటాడు.కాన ఈ సంఖ్యకు అంత ప్రాముఖ్యత.

*2.ఖగోళ పరముగా సూర్యునికి,భూమికి మధ్యదూరము --

149.6 million kms.ఈ దూరాన్ని సూర్యుని చుట్టుకొలత 

1391౦౦౦ kms  తో భాగిస్తే వచ్చే సంఖ్యా రమారమి 108 .

*అటులనే చంద్రునికి ,భూమికి మధ్యదూరము 38 లక్షలకిలోమీటర్లనుచంద్రుని చుట్టుకొలత అయిన 3474 కి.మీ.తో భాగిస్తే వచ్చే సంఖ్యా 108.

12 రాశులు 9 నక్షత్ర పాదాలు=10 8 .

*హైందవము ప్రకారము ముఖ్య శివ లింగాలు 108.

శైవమతాలు కూడా 108. 

*గౌడియ వైష్ణవంలో బృందావనంలో 108 గోపికలను పూజిస్తారు.108 వైష్ణవ దివ్య క్షేత్రాలు కంబోడియాలోఆంగ్కోర్    వాట్ గుడిలో108మంది(అసురులు,దేవతలు)కలిసి సాగరమధనం చేసినట్లు చిత్రింపబడినది. 

*బౌద్ధం ప్రకారం పంచేంద్రియాలతో స్పృహను కలిపి ఆరు భావాలను వాటివల్ల కలిగే అంతర్భావా లైన  సుఖము,దుఃఖము ,స్దిరత్వ బుద్ధిని గుణించి అవి బాహ్యంగా నైనా,అంతరంగానైనా భూత,భవిష్యద్ ,వర్తమానాలలో కల్గినభావనలను గుణిస్తే 108.(6.3.2.3)

*ఓం పూర్ణ మద :పూర్ణ మిదం 

పుర్ణాత్పూర్ణముదచ్యుతే

పూర్ణస్య పూర్ణమాదాయ 

పూర్ణమే వావశిష్య తే .----నుండి ఇన్ఫినిటీ (8)కు చేరుకునే 

విధానం 108 symbolism. 

*ఆయుర్వేదముప్రకారము 108 మర్మస్ధానాలు,శక్తికేంద్రాలు,

 కిలారిపయట్టు ప్రకారం (తరువాత కరాటే గా మారింది)108 

 pressure points 108 డిగ్రీల జ్వరం వచ్చినపుడు శరీరములో   ఉన్న అన్ని అవయవాలు చచ్చుబడి పోతాయి.108 సార్లు 

  జపము చేయడం వల్ల మనస్సును నిర్మలం చేస్తుంది.

  లోపల ఉన్న భావాలను అణగదొక్కుతుంది.సంస్కృత       భాషలో 54 అక్షరాలుంటాయి.వాటికి శివ,శక్తి తత్వాలైన స్త్రీ,

   పురుష రూపాలుంటాయి.54*2=108.12 ౦౦౦ దివ్య                     సంవత్సరాలు=43,20,౦౦౦మానవసంవత్సరాలు=బ్రహ్మకు ఒక పగలు =4 ౦౦౦ *108108 లో1 జీవుడినితెలియచేస్తుంది.0 పరిపూర్ణ భగవత్తత్త్వము108.ఈ సంఖ్యను కూడితే 1+0+8=9 చాలా ముఖ్యమైన సంఖ్య.9 తో ఏది కలిపినా వచ్చిన సంఖ్యలోఅంకెలను కలిపితే చివరకు అదే సంఖ్య వస్తుంది.

  • గణితం పరంగా 108 ఒక abundant number.అంటే వాటి 

      divisors 1+2+3+4+6+12+18+27+36+54=163>108

     Technical number (ముందటి నాలుగుfibonaccinumbersను 

      కలిపితే వచ్చేది)0,0,1,1,2,4,8,15,29,56,108.

  • hyper factorable 1*1+2*2+3+3=108.   ఒకపెంటగాన్ కోణాలు అన్నీకలిపితే 108.ఒక refactorable number ( వాటి divisorsఎన్నున్నాయో వాటితో భాగింప పడ గలిగేది)
  • ఇంకా మరెన్నో విశిష్టతలను తనలో యిముడ్చుకున్న సంఖ్య.ఇటువంటి ప్రత్యేకతతో ఉన్నది కనుకనే మన మునులు,ద్రష్టలు ఎప్పుడో 108 సంఖ్యప్రాముఖ్యతను 
  • మనకు నామాలలోను,ప్రదక్షిణలలోను,జపాలలోను విధిగా విధించారు.మనపూర్వీకులైనవారు చాలా విషయాలను మన కోసము శోధన,సాధన వలన మనకు తెలియకుండానే లాభము పొందుతున్నాము.                                

No comments:

Post a Comment