మనోనిగ్రహసాధనలు
1.కామం
కామము అనగా కోరిక్ అనియర్ధ ము .జీవితంలో ప్రతివానికి ఎన్నో కోరికలుంటాయి.వానిని తీర్చుకోవడము పురుషా ర్ధమే యైనప్పటికి ధర్మమునతిక్రమింపరాదు. ఎన్ని కట్టెలు వేసిననుఅగ్నికితృప్తిలేనట్లుఎన్నిసుఖములనుభవించినాను మానవునకు తృప్తి కలిగదు.కాన క్షణికములగు ఐహిక సుఖాలపై ఆశలను పరిమితిలోనుంచుకొనవలయును.అట్టి కోరికలను (తృష్ణ లను)విడుచుట అంతసులభమా?
శ్లో||భ్రాస్తం దేశమనేకదుర్గవిషమం ప్రాప్తం న కించత్ఫలం
త్యక్త్వా జాతికులాభిమానముచితం నేవా కృతానిష్ఫలా
భుక్తం మానవివర్జితం పరగృహేష్వా శంకయాకాకవ ,
త్తృష్ణే!జృoభసిపాపకర్మ పిశునేనాద్యపి సంతుష్యసి.
అన్నిచోట్ల తిరిగినాను.పడరాని పాట్లు పడ్డాను.విసిగినాను.కుల,జాత్యభిమానాలను విడిచి సేవకవృత్తిచేసాను.ఇతరుల ఇంట బెదురుతూ తిండి తిన్నాను.ఇంత చేస్తున్నా ఓ ఆశా!నీకింకా తృప్తి లేదేమి?
వార్ధక్య దశలో గూడా తృష్ణ వదలలేదు.
శ్లో||భోగానభుక్తా,వాయమేవ భుక్తా;
స్తపోనతపోతం,వయమేవ తప్తా:
కాలోనయాతో ,వయమేవ యాతా;
స్తృష్ణాన జీర్ణా,వయమేవ జీ ర్ణా :
భోగాలు మాచేత అనుభవింపబడలేదు.మేమే వానిని అంటిపెట్టుకొని ఉన్నాము.తపస్సు మా చేత ఆచరించ బడుటలేదు.కాలం గడిచినదనుకున్నాము కాని మా జీవితాలే గడిచినవి.ఇదంతా ఆశవల్లనేగదా ! అందునా దురాశ దుఃఖము నకు దారితీయును.
శారీరిక వ్యభిచారము కన్నా మానసిక వ్యభిచారము మహాపరాధము.దీనిగుర్చి క్రీస్తు "ఒక స్త్రీని మోహపు చూ పుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు --ఆమెతో వ్యభిచారము చేసినవాడగును."(కొత్త నిబంధన ,మత్తయి సువార్త 5;28)శీలానికి విలువివ్వక పైపై మెరుగులకు భ్రమసి నాశామానమగు తాత్కాలికానందం కొరకు ప్రాకులాడుటఅవివేకముగదా!మానవుడు చేయు ప్రతి పాప కృత్యమునకు ఎప్పుడో ఒకనాడు భగవంతునికి లెక్క అప్పజేప్పవలసి యుంటుంది.పాప ఫలితాలను ఈ లోకములోనున్నప్పుడే అనుభావింప వలసియుండును.
భగవద్గీతలో
దూమె నావ్రియతె వహ్ని
ర్యధాదర్శో మలేనచ,
యధోల్బెనా వృతో గర్భ
స్తధా తె నేదమావృతమ్
కాముకునికిసహజంగా తెలివి తగ్గును.శరీరసౌo దర్యాని కిచ్చే ప్రాధాన్యత ఆత్మకీయడు.పోగానిన్దినప్పుడు అగ్ని కనబడదు గదా!మురికి జేరిన అద్దములో ప్రతిబింబము కనబడదుగదా! కామము మానవును విజ్ఞానాన్నిమూ స్తుంది గదా!"నిప్పుల మీద నడచిన--పాదములు కాలినట్లే పొరుగువాని భార్యను కూడువాడుకూడా నాశనమగును."బైబిలు,పాతనిబంధన సామెతలు 6:26 -29
రామాయణాన్ని పరీక్షించిన సీతనెత్తుకొని పోవుటచేతనే తను నశించుటయే గాక తనకులాన్ని నాశనము రావణుడు చేసినాడుగదా! స్త్రీ పురుషులు ఒకసారి చేయుసంయోగమున ఐదు రోజులాయస్సును పోగొట్టుకుందురు. కాన సన్మార్గముతోభగవంతుని జేరవలేనన్న నీవు ప్రతి క్షణము భగవన్నామాన్నిస్మరిస్తూఉన్నకామాన్నిమానవుడు సులభంగా జయించగలడు.
No comments:
Post a Comment