Tuesday, 18 June 2019

నారాయణ శతకము 3

                                             నారాయణశతకము 3మ ||                                                        కలుషాగాధవినాశికారియగుఛుం గైవల్య సంధాయియై 

        నలినొప్పారెడు మంత్రరాజమగు నీనామంబు ప్రేమంబుతో 

         నలరన్నె వ్వని వాక్కునం బొరయదె నన్నీచుఘోరాత్మయున్ 

        వెలయన్ భూరుహకోటరంబదియ  సూ వేదాత్మ నారాయణా !!33

మ || పరమంబై పరతత్వమై సకలసంపత్సారమై భవ్యమై 

       సురసిద్ధోరగయక్షపక్షముని రక్షోహృద్గహాభ్యంతర

       స్ధిర సుజ్ఞాన సుదీపమై శృతికళా  సిధ్ధాంతమై సిధ్ధమై 

       సరిలేకెప్పుడు నీయదునామమమరున్ సత్యంబు నారాయణా!! 34!!

మ||అధికాఘోతమోదివాకరమునైయద్రీంద్రజాజిహ్వకున్        

        సుధయై వేద వినూత్న రత్నములకున్ సుత్రాభిధానంబునై

      బుధసందోహామనోహరాంకురమునైభూదేవతాకోటికిన్ 

      విధులై మీ బహునామరాజి వెలయన్  వేదాత్మ నారాయణా !!35

 మ|| పొనర న్ముక్తికి ద్రోవవేదములకంబుట్టిల్లు మోదంబునం 

       దునికి స్ధానము యిష్ట భోగములకున్నుత్పత్తియేప్రొద్దునున్

       ఘనపాపంబులవైరి షడ్రిపులకున్  గాలావసానంబుమీ 

      వినుతాంఘ్రిద్వయపద్మసేవనగదా విశ్వేశ నారాయణా !!36 

మ|| భవరోగంబులమందు పాతకమో బాలార్కబింబంబుక 

       ర్మవిషజ్వాలసుధా0షుగామృతతుషారా వ్రాతపాధోధిమూ 

      ర్తివి కైవల్యపదానలోకనకళాదివ్యా0జనశ్రేష్ఠమై   

      భువిలో మీదగు మంత్రరాజమమరున్  భూతాత్మ నారాయణా !!37

మ|| వరుసన్ గర్మపిపీలికాకృత తనూవల్మీక నాళంబులో

       బరుషాకారముతోవసించినమహాపాపోరగశ్రేణికిం

      బరమోచ్చ్చాటనమై రహస్యమహిమంబాటింపుచున్నుండుమీ

     తిరుమంత్రంబగు మంత్రరాజమమరుం దివ్యాత్మ నారాయణా !!38  

మ|| హరునిన్నద్రిజ నాంజనేయుని గుహున్నయ్యంబరీషున్ ధ్రువుం 

     గారి బ్రహ్లాదు విభీషణాఖ్యుని బలిన్  ఘంటాశ్రవున్నారదున్ 

   గరమొప్పన్విదురున్ బరాశర సుతున్ గాంగేయునిన్ ద్రౌపదిన్ 

    నరునక్రూరునిబాయకుండును భావన్నామంబు నారాయణా!!39 

శా || శ్రీకిన్మందిరమైన వక్షము సురజ్యోష్ఠోద్భవ స్ధాననా 

   భీకంజాతము చంద్రికాంతర సుధాభివ్యక్త నేత్రంబులున్  

  లోకస్తుత్యమ రున్నదీజనక మాలోలాంఘ్రియున్  గల్గునా 

  లోకారాధ్యుడవైన నిన్నెపుడునాలో జూతు నారాయణా !!40 

శా || విందుల్ విందులటంచు గోపరమణుల్ వ్రేపల్లెలో బిన్ననా 

       డందెల్ మ్రోయగ ముద్దుమోమలరనిన్నాలింగితున్ సేయుచో 

        డెందంబుల్  దనివారరాగరసవీటీలీలలన్  దేల్చుమీ 

        మందస్మేరము ఖేందు రోచులు మముఁన్మన్నించునారాయణా !!41

శా || విందుల్వచ్చిరి మీయశోదకడకున్వేగంబె పొమ్మయ్యయో 

       నందానందన !చందనాంకురమ !కృష్ణా!యింకా బోవేమిమా 

      మందం జాతరసేయబోదమిదెరమ్మా యంచు మిమ్మెత్తుకో

     చందంబబ్బిన నుబ్బకుండుదురె  ఘోషస్త్రీలు నారాయణా !!42

శా  || అన్నా కృష్ణమ నేడు వేల్పులకు మీదన్నారమీ చట్లలో 

       వెన్నల్  ముట్టకు మన్న నాక్షణము నన్విశ్వాకృతి స్ఫూర్తివై

       యున్నన్  దిక్కులు చూచుచున్  బెగడి నిన్నొలినుతుల్ సేయుచున్ 

      గన్నుల్ మూయ యశోదకున్  జిఱుతవై కన్పింతు నారాయణా !!43

శా || ఉల్లోలంబులుగా గురుల్ నుదుటిపై నుప్పొంగ మోమెత్తి ధ 

        మ్మిల్లం బల్లలనాడ రాగరస సమ్మిశ్రంబుగా నీవు వ్రే 

        పల్లెం దాడుచు గోపగోనివహ గోపస్త్రీలయుల్లంబుమీ 

        పిల్లంగ్రోవి ని జుట్టిరాదిగుచు నీ పెంపొప్పు నారాయణా !!44 

మ|| కసవొప్పన్  పసి మేసి ప్రొద్దుగలుగంగాంతా రముంబాసి య 

        ప్పసియు న్నీవును వచ్చుచో నెదురుగా బైకొన్న గోపాంగనా

        రసవద్వృత్త పయోధరద్వయ హరిద్రాలేపనామోదముల్ 

       పసిగొంచున్  బసి   గొంచు వచ్చుఁటలు నేభావింతునారాయణా   !!45

శా||చన్నుల్ మీదికి చౌకళింప నడుముం జవ్వాడ కందర్పసం 

      పన్నాఖ్యంబు నటించు మాడ్కి కబరీభారంబులూటాడగా 

     విన్నాణంబు నటింప గోపిజన గోబృందంబుతో వచ్ఛుమీ 

    వన్నెల్  కన్నుల ముంచి గ్రోలుటలు నే వర్ణింతునా నారాయణా !!46 

మ || పెరుగుల్  ద్రచ్చుచు నొక్క గోపిక మిముం బ్రేమంబునంజూచిరా 

         గరసావేశత రిత్త ద్రచ్ఛనిడ నా కవ్వంబు నీవున్మనో 

         హర లీలంగనుగొంచు ధేనువని యయ్యాబోతునుంబట్టితీ 

         వర  వృత్తాoతము లేను పుణ్యకథగా వర్ణింతు నారాయణా !!47

శా || కేలన్  గోలయు గూటి చిక్కము నొగింగీలించి నెత్తంబునం 

      బీలీపింఛము  జట్టి నెన్నడుమునం బింఛావళిన్  గట్టిక 

    ర్ణాలంకారికడంబగుఛ్చమధుమత్తా లీస్వనంబొప్పనీ 

     వాలన్ గాచినభావమిట్టిదని నేవర్ణింతు నారాయణా!!48           

  శా || కాళిందీతటభూమి నాలకుదుపుల్  కాలూది మేయన్  సము 

      త్తాలాలోలతమాల పాదప శిఖాంతస్ధుండవై వేణు రం 

       ధ్రాలిన్  రాగరస0బునిండ విలసద్రాగంబు సంధిం చి గో 

     పాలవ్రాతము గండుగోయిలలుగా  వర్ణింతు నారాయణా !!49

శా || రాణించెన్  గడునంచు నీ సహచరుల్  రాగిల్లి సోలంగమీ

        వేణు క్వాణము వీనులంబడి మనోవీధుల్  బయల్  ముట్టగా 

       ఘోణాగ్రంబులు మీదికెత్తుకొని లాంగూలంబులల్లార్చి గో 

       శ్రేణుల్  చిందులు ద్రొక్కియాడుటలు నే జర్చింతు నారాయణా !!50  

No comments:

Post a Comment