Tuesday, 18 June 2019

నారాయణశతకము 4

                                                      నారాయణశాతకము 4

శా || పసులంగాపరి యేమెఱుంగు మధుర ప్రాయోల్ల సద్వృత్తవా

     గ్వి సరారావము మోవిదావెదురు గ్రోవిం బెట్టినాడంచు నిన్ 

      గసటుల్  సేయగనాడు గోపికల తద్గానంబులన్  మన్మధ 

      వ్యసనాసక్తల జేయుచందములు నే వర్ణింతు నారాయణా!!51

మ || జడియెoతే దడవయ్యె జెయ్యి యలసెన్ శైలంబు మా చేతులం 

        దిడుచున్నన్  జిఱునవ్వుతో వదలినన్ హీనోక్తి గీపెట్టనె 

         క్కుడుగోవుల్  బ్రియమంద నింద్రుఁ డడలంగోవర్ధనాద్రీoద్రమున్ 

          గొడుగై యుండగగేలబూనితిగదా గోవింద నారాయణా !!52  

మ || లలితాకుంచిత వేణియందడవిమొల్లన్ జాఱ ఫాలస్ధలిన్ 

        దిలకంబొయ్యన జాఱ గుండలరుచుల్   దీపింప లేజెక్కులన్ 

        మొలకన్నవ్వుల చూపు లోరగిల మెన్మువ్వంకలన్ బోవఁగా 

       నలిగైకొందువు గాదె నీవు మురళీనాట్యంబు నారాయణా !!53 

శా  || మాపాలం గడుగ్రొవ్వి గోపికలలో మత్తిల్లి వర్తింతువే 

         మాపాలె o బుల వచ్చి యుండుదు వెసన్మాపాలలో నుండుమీ 

          మాపాలైన సుఖాబ్ధిలో మునుగుచున్  మన్నించి తా గొల్లలన్ 

          మాపాలంగల వేల్పు నీవె యని కామన్నింతు  నారాయణా!! 54

మ|| ఒకకాంతామణి కొక్కడీవు మఱియు న్నొక్క ర్తె కొక్కండవై 

          సకల స్త్రీలకు సంతసంబలరరాసక్రీడ తన్మధ్యక

           ల్ప కమూలంబునఁ వేణునాదరసమొప్పంగా బదార్వేలగో 

           పికలంజెంది వినోదమొందునెడనీ పెంపొప్పు నారాయణా!!55 

మ|| లలితంబైన భవత్తనూవిలసనన్ లావణ్యాదివ్యామృతం

        బలుగుల్వారగ నీకటాక్షమున దామందంద గోపాంగనల్ 

       తలపుల్పా దులుగట్టి కందళిత నూత్న శ్రీలు వాటింతురా 

      నెలతల్ తీవెలు చైత్రవుస్ఫురణమౌ నీయొప్పు నారాయణా !!56  

   శా || లీలన్  బూతకి ప్రాణవాయువులు పాలిండ్లoదువెళ్లించి దు 

       శ్శీ లుండై చను బండిదానవు వెసంజిందై పడందన్ని యా 

      రోలన్మద్దులుగూల్చిధేను దనుజున్  రోజంగ నీల్గించి వే 

      కూలం గంసుని గొట్టి గోపికలకోర్కుల్ దీర్తు నారాయణా !!57

మ || రసనాగ్రంబున  నీదు నామరుచియున్  రమ్యంబుగా జెవ్లుకు

        న్నసలారంగ భవత్కథాభిరతియున్  హస్తాబ్జయుగ్మoబులం 

        వెసనీపాదసుపూజితాదియుగమున్  విజ్ఞాన మధ్యాత్మకున్ 

         వెసనింపొందనివాడు  దా పశువు సూ వేదాత్మ నారాయణా!!58    

మ|| వరకాళింది తరంగడోలికలలో వైకుంఠ ధామంబులో 

        వెరవొప్పారనయోధ్యలో మధురలో వ్రేపల్లెలో ద్వారకా 

         పురిలో నాడెడు భంగి నాదుమదిలో భూరిప్రసన్నావనాం 

         బురుహంబొప్ప నటించునొప్పును సితాంభోజాక్షా నారాయణా!!59

శా  || చల్లల్వే ఱొక యూరణమ్ముకొను నాసంబోవు చో ద్రోవనీ 

        వుల్లాసంబున నడ్డకట్టి మదనోద్యోగానులాపంబులన్ 

        చల్లన్ జల్లనిచూపు జల్లుమని గోపస్త్రీలపై జల్లుమీ 

      చల్లంబోరుతెఱంగుజిత్తమునఁ నే జర్చింతు నారాయణా !!60  

మ|| కలయన్వే దములున్  బురాణములు బ్రఖ్యాతంబుగా తెల్పి మీ 

         వలనన్  భక్తివిహీనుండైన పిదపన్  వ్యర్ధ ప్రయత్నంబెపో 

         గులకాంతామణి గొడ్డువోయినగతిం గ్రొవ్వారు సస్యంబుదా 

          ఫలకాలంబున నీచపోవుపగిదిన్ పద్మాక్ష నారాయణా !!61

శా || స్నానంబుల్  నదులందు జేయుట గజస్నానంబు చందంబగున్ 

        మౌనంబొప్ప జపించు వేదమటవీ మధ్యంబులో నేర్పగున్ 

        నానాహోమములెల్ల బూడిదలలోన న్వేల్చు నెయ్యై చను 

     న్నీ నామోక్తియు నీపదాబ్జరతియున్  లేకున్న  నారాయణా !!62

మ || అలనీటందగు రొంపిపై జిలికిన న్నానీటనే పాయునా 

        యిల పాపంబులు దుర్భరత్వము మహా హేయంబునంబొందినం 

       బలువై జీవుని దొప్ప దోగినవి యీ బాహ్యంబునం బాయునే 

      పొలియుం గాక భవత్సుపాద జలముం బ్రోక్షింప నారాయణా !!63 

మ|| తన చిత్తాబ్జము మీపదాబ్జములకుం దాత్పర్య సద్భక్తితం

        తున బంధించిన  బంధనంబుకతనం దుష్పాప పుంజంబులె 

        ల్లను విఛ్చిన్నములై యడంగు మహి మొల్లాసాబ్ధి యైనట్టి దా 

        సునకింపొందును మోక్షవైభవము దా సుశ్లోక నారాయణా !!64  

మ || తనువుం జీవుడు నేకమైన పిదపన్  ధర్మక్రియారంభుడై 

        యనయంబు న్మది దన్నెఱుoగక తుదిన్నా మాయచే మగ్నుడై  

        తనుతత్త్వాది వియోగమై నపిదపం దానేర్చునే నీదు ద 

       ర్శనమింపారగ భక్తివైభవమహాసంకాశ నారాయణా !!65

మ||తనకున్  సాత్వికసంపదా న్వితమహా దాసోహభావంబునన్ 

      ననయంబున్మది నన్యదైవభజనం బారంగ దూలింపుచున్ 

       జనితాహ్లాదముతోడ నీచరణముల్ సద్భక్తి పూజించి నిన్ 

      గనుగొన్నంతనె కల్మషంబులడగుo గర్మఘ్న నారాయణా !!66

మ|| పరికింపన్  హరిభక్తి భేషజునకు న్  భవ్యంబుగా మీదమీ 

      చరణాంభోరుహ దర్శనంబు గలదే సంప్రీతి నెట్లన్నదా 

        ధరలో జోరుడు గన్న దుస్తర పరద్రవ్యంబుపై నాసలం 

          బొరయ న్నేర్చు నె దుర్లభంబగు గృపాంభోజ నారాయణా !!67

No comments:

Post a Comment