నారాయణ శతకము7
మ!!అపరాధంబులునిన్నునమ్మివినుమేనాజన్మపర్యంతమున్
విపరీతంబుగజేసినాడనిక నీవే దిక్కు నాలోనికిన్
గపటంబింతయులేక దండధరుకుంగట్టీక రక్షింపుమీ
కృపకుంబాత్రుడనయ్యధర్మపురి లక్ష్మీనాథనారాయణా!!97
శా!!చెల్లంజేసితిపాతకంబులు మదిన్ శ్రీనాథ మీనామముల్
పొల్లుల్ బోవనినమ్మె వీడని దయంజేపట్టిరక్షింపుమీ
తల్లిందండ్రియునీవుగాకయొరులేతర్కింపనారాయణా!!98మ!!నరసింహాచ్యుత వాసుదేవవకసన్నాళీకపత్రాక్షభూ
ధరగోవిందముకుందకేశవజగత్త్రాతాహితల్పాంబుజో
దరదామోదరతాక్ష్యవాహనమహాదైత్యారివైకుంఠమం
దిరపీతాంబర భక్తవత్సలకృపన్ దీపింపు నారాయణా!!99
మ!!కడకంటంగడవేని సంపదలొగింగావింపు లక్ష్మీశపా
ల్కడలిన్ బన్నగశాయివై భువనముల్ గల్పించు సత్పుత్రునిన్
బొడమంజేసిన నాభిపంకజజిగత్పుణ్యాత్మ భాగీరథీ
పడతింగన్న పదారవిందములనేభావింతునారాయణా!!100
మ!!తపముల్ మంత్రసమస్తయజ్ఞఫలముల్ దానక్రియారంభముల్
జపముల్ పుణ్యసుతీర్థసేవఫలముల్ సద్వేదవిజ్ఞానమున్
ఉపవాసవ్రతశీలకర్మఫలముల్ యొప్పారనిన్నాత్మలో
నుపమింపంగలవారికేగలుగు వేయున్నేల నారాయణా!!101
శా!!శ్రీమన్నారాయణయన్నజాలుదురితశ్రేణిన్నివారింపంగా
నానందస్థితిగల్గునంచునిగమార్థానేకమెల్లప్పుడున్
నానాభంగులజెప్పనేనువినిశ్రీమన్నారాయణాయంచుని
న్నేనేనెప్పుడుగొల్తుబ్రోవగదెతండ్రీనన్నునారాయణా!!102
మ!!కలితాఘౌఘవినాశకారియగుచుంగైవల్యసంధాయియై
నవినొప్పారెడుమంత్రరాజమగునీనామంబు ప్రేమంబునన్
అలరన్నెవ్వనివాక్కునంబొరయదోయన్నీచుదేహంబుదా
వెలయన్ భూరుహకోటరంబదియసూవేదాత్మనారాయణా!103
మ!!రమణీయంబుగ నాదిమంబునవతారంబున్ భవద్దివ్యరూ
పమునామామృతమున్ దలంప దశకప్రాప్తయ్యెగృష్ణావతా
రముసుజ్ఞానముమోక్ష మున్
ద్వివిధసంప్రద్వివిధసంప్రాప్తిన్ శతాంధ్రాఖ్యకా
వ్యమునర్పించితిమీపదాబ్జములకున్ వైకుంఠ నారాయణా!!104
శా!!నీమూర్తుల్ గననీకథల్ వినదుదిన్ నీపాదనిర్మాల్యని
ష్ఠామమోదంబునెఱుంగ ,నీచరణతోయంబాడ ,నైవేద్యముల్ ,
నీమంబొప్ప భజింప నీజపము వర్ణింపన్ గృపంజేయవే ,శ్రీమించన్ బహుజన్మజన్మములకున్ శ్రీయాది నారాయణా!105
ఇదిశ్రీపరమేశ్వరకరుణాకలిత కవితా విచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్యప్రణీతంబైన నారాయణ శతకంబున సర్వంబును సంపూర్ణము.
@@@###@@@$$$$$$@@@@
No comments:
Post a Comment