నారాయణ శతకము 5
మ || పరమజ్ఞాన వివేక పూరిత మహాభవ్యాoతరాళంబునన్
పరగన్నీనిజనామమంత్రమొనరన్ భక్తిన్ననుష్ఠింపుచుం
దురితాన్వేషణకాల భూతమువెసన్ దూలంగ వాకట్టువా
డరుగున్ భవ్యపదంబు నొందుటకునై యివ్యక్త నారాయణా !!68
మ || సరి ఘోరాంధక బోధకారణ విపత్సంసార మాలిన్యమున్
పరమానంద సుబోధకారణ లసద్భస్మంబుపైనూది యా
నిరతజ్ఞాన సుకాంతి దర్పణమునన్నిస్సంగుడై తన్నుదా
నరయంగాంచినవాడు నిన్ను గనువాడబ్జాక్ష నారాయణా !!69
మ || పరుషాలాపములాడ నోడి మదినీ పాపార్జనా రంభుడై
నిరసించేరికి గీడు సేయక మదిన్ని ర్ముక్తకర్ముoడునై
పరమానదనిషే ధముల్ సమ ముగా భా వించి వీక్షించునా
పరమజ్ఞాని భవత్కృపంబొరయ నో పద్మాక్ష నారాయణా !!70
మ || ఒరులం దన్నుఁనెఱుంగు నయ్యెఱుకయు న్నొ ప్పారనేకాంతమం
దరయం బైపడు నన్య భామినులపైనాకాంక్ష దూరత్వమున్
మరణావస్ధను నీదు నామములె సన్మానంబునందోచుటల్
ధరలోనన్నివి దుర్లభంబులు సుధాధామాక్ష నారాయణా!!71
మ || వెరవొప్ప న్బహు శాస్త్రమంత్రములొగి న్వీక్షించివేతెల్సీమీ
వరనామామృతపూరమానుచు దగన్ వైరాగ్య భావంబునన్
సరి నశ్రాంతముగోరువారుపిదపన్ సంసారమాతు:పయో
ధరదుగ్ధంబులుగ్రోలనేరరు వెసన్ దైత్యారి నారాయణా !!72
శా || వేదంబందు సునిశ్చయుండగు మహా వేల్పెవ్వడో యంచు నా
వేదవ్యాసపరాశరుల్ వెదికినన్వేరొండు లేడంచు మీ
పాదాంభోజములెల్లప్రొద్దుమదిలోభావింతురత్యున్నతిన్
శ్రీ దేవీవదనారవింద మధుపా శ్రీరంగ నారాయణా !!73
మ || సుతదారాప్తజనాది విత్తములపై శూన్యాభిలాషుండునై
యతనో ద్రేకయుతంబులై పొదలున్నయ్యైoద్రియవ్రాతముల్
మృతిబొందించి దమంబునన్ శమమున్ మీఱంగ వర్తించు ని
ర్గతసంసారి భవత్కృపంబొరయు నో కంజాక్ష నారాయణా !!74
మ|| ప్రమదంబారగపుణ్యకాలగతులన్ భక్తిన్ననుష్థింపుచున్
నమరన్నన్న సువర్ణ గోసలిలా కన్యాధారుణి గ్రామదా
నమూలామ్నాయవిధోక్తి భూసురులకున్ సన్మార్గుడై యిచ్ఛువా
దమరేంద్రార్చితవైభవోన్నతుడగు న్నామీద నారాయణా !!75
మ|| ఇలనెవ్వారిమనంబులో నెఱుక దానెంతెంత గల్గుoడునా
కొలదింజెందివెలుంగుచుందుకలయన్గోవింద నీరూపులన్
యలరన్నయలరన్నంబుమితంబులైసరసిలోనంభోరుహంబుల్ దగన్
నిలనొప్పారెడుచందమొందెదెపుడున్నీలాంగనారాయణా!!76
మ !!మదిలోనుత్తమభక్తిపీఠముపయిన్ మానాథ మీపాదముల్
గదియంజేర్చినవానికేనొడయడన్ గాదంచు. నత్యున్నతిన్
పదిలుండైసమవర్తి మృత్యువునకున్ బాఠంబుగా బల్కుమీ
పదపద్మార్చకులెంత పుణ్యులొ కృపాపారీణనారాయణా!!77
మ!!కులమెన్నంగొలదేల యేకులజుడుం గోత్రాభిమానాభిలా
షలునజ్ఞానముబాసి జ్ఞానము మదిన్ సంధించి శుద్ధాత్ముడై
యలరారంబరుసంబుసోకు నినుమున్ హేమాకృతిస్తోమమై
వెలయున్నాగతి వాడుముక్తికరుగున్ వేదాత్మ నారాయణా!!78
మ!!నిరతానంద నియోగులైనియతులై నిర్భాగ్యులైనీచులై
కరుణాహీనమనస్కులై మలినులై కష్టాత్ములై నష్టులై
పరుషవ్యాధినిబద్ధులై పతితులై భగ్నాంగులైమ్రగ్గువా
రరయన్నిన్నొగినాత్మయందిడనివారబ్జాక్షనారాయణా!!79
మ!!ఘనభోగాస్పదులైగతౌఘమతులై కారుణ్యులైముక్తులై
ధనకీర్తిప్రదులైదయాభిరతులై ధర్మాత్ములైనిత్యులై
మనుజాధీశ్వరులైమనోజనిభులైమాన్యస్ధులై స్వస్ధులై
యెవరన్నొప్పెడువారు నీ పదరుచుల్ యూహించు నారాయణా!!80
మ!!విదితామ్నాయనికాయభూతములలోవిజ్ఞానసంపత్కళా
స్పదయోగీంద్ర మనస్సరోజములలో బ్రహ్మేంద్రదక్పాలక
త్రిదశవ్రాతకిరీటరత్నములలోదీపించుచున్నట్టిమీ
పదపద్మంబులుభావగేహమున నే భావింతు నారాయణా!!81
మ!!వెలయన్ యౌవనకాలమందు మరుడున్ వృద్ధాప్యవేళంబులన్
బలురోగంబులునంత్యమందుయముడుంబాధింపబట్టైనయీ
పలుజన్మంబులుచాలదూలితి ననుంబాలింపవేదేవమీ
ఫలితానంద దయావలోకనము నాపైజూపునారాయణా!!82
No comments:
Post a Comment