Saturday, 12 September 2020
Wednesday, 2 September 2020
ముఖ్య విషయము
సృష్టికర్త సృష్టించిన జీవుల ఆత్మలు)అనేక దేహములలో ప్రవేశించి తిరిగి తిరిగి చివరకు మానవ దేహములో ప్రవేశించును. మానవవులుండే ప్రపంచము అంతా నాశమానము. ఈ విషయము తెలిసినను మానవులు మనసు,బుద్ధిల ప్రభావములవల్ల మాయాచే కప్పబడి అజ్ఞానముచే ఆనేక మంచి చెడు కర్మలు(కార్యములు) చేయుచు వానివల్ల సుఖదుఃఖములు ,పాపపుణ్యములు పొంది వానిచే జననమరణచక్రములోబడితిరుగుచుందురు .
మనము మనసు,బుద్ధిలను అదుపులోనుంచుకొని మంచికార్యములు చేయుచుండిన తత్ఫలితముగా ఆ జనంమరణచక్రమునుండి తప్పింపబడి మరల సృష్టికర్తదగ్గరకు వెళ్ళుటకవకాశముండును. ఇంకా కర్మలగూర్చి తెలిసికుందాము.
కర్మకాండలో కర్మత్రయo , ఫలత్రయం,దోషత్రయం ఉంటాయి.
1.. కర్మత్రయo :మనం వాడే కరణాల దృష్ట్యా మనం చేసే కర్మలు 3రకాలు
ఏ )కాయికకర్మ శరీరముతో పూజ,ప్రదక్షిణం చేసేది ,నమస్కారం ,తీర్ధయాత్ర,యజ్ఞం
బి )వాచికకర్మ వాక్కుతో చేసేది పైకిచెసేజపం,పారాయణం సి)మానసకర్మ మనసుతో చేసేది ధ్యానం
2ఫలత్రయం :ఏ కర్మ చేసినా దేయానికి ఫలముంటుంది . అది దృష్టఫలం అలా కావచ్చు . అదృష్టఫలంకావచ్చుఁ . అనగా కనబడేఫలం ,కనబడనిఫలం .
అది పుణ్యం కావచ్ఛు , పాపంకావచ్చుఁ . ఉదాహరణకు:ఆకలితో ఉన్న పేదవానికి అన్నం దాన0 చేస్తేపుణ్యం వస్తుంది . ఆదికనబడే, కనబడని ఫలములవవచ్ఛు . ఆకలి తీరిన ఆ పేదవాని ముఖంలో కలిగిన ఆనందం , ఆటను నోరారా మనను దీవించటం -దృష్టఫలం . ఈ మంచి కార్యం చేసినందుకు కొంచెము పుణ్యం లభించును. . ఇది ఇది అదృష్టఫలం. అలా కాకుండా ఆటను తిన్న తరువాత దుక్కలాగున్నావు,ఏదైనా పని చేసుకోరాదా అని అంటే అదృషట ఫలం గా పాపం చేరుతుంది.. అలా ప్రతీకార్యానికి తెలిసో,తెలియకనో పునీమో,పాపమో చేరును. ఆ ఫల 3రకములు (ఫలత్రయం).
2ఫలత్రయం :మనకు అర్ధ,కామ,ధర్మ రూపాల్లో కలుగుతుంది. అనగా మనం చేసే కార్యాల ధర్మార్ధకామమోక్ష నాలుగు పురుషార్ధాలలో మొదటి మూడింటిని కలుగచేస్తాయి.
ఏ )అర్ధం{ముందు కలిగే ఫలం అర్ధం. అది ప్రాధమిక ఫలం అర్ధం . అర్ధమ నగా డబ్బు. కానీ ఇక్కడడబ్బు ఒకటే కాదు డబ్బు,పదవి,అంతస్తు ఏ దై నాకావచ్చుఁ భద్రతని చేకూర్చునదేదైనా వస్తుంది దానిక్రింద. ఆవు కూడా ఎండగాఉంటే భద్రతకోసం నీడను వెతుక్కుంటుంది. బి )కామం :అనగా కోరిక .ఇది భద్రతనివ్వదు. ఆనందాన్నికలుగచేస్తుంది. ఉదాహరణకు టివి భద్రతనివ్వదు. కానీ ఆనందాన్నిస్తుంది. డబ్బు వచ్చ్చాక విదేశాలకు వెళ్లాలనో ,పెద్దభవనాలుకావాలనో కోరుకుంటారు. సి)ధర్మం : దీన్ని పుణ్యమని అంటారు.అనగా మనం చేసే కర్మలు మనకు పుణ్యమో,పాపమో కలుగచేస్తాయి.అది వాళ్ళపూర్వజన్మసుకృతంవల్లనో,లేక వాళ్ళపూర్వజన్మపాపమువల్లనో వాళ్లకు అనగా ఆత్మ ధరించిన దేహధారులకు సుఖదుఃఖములుకల్గుచుండును. వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి. అంటే గాని భగవానుడు పాపమో,పుణ్యమో మనకు హెలీకాఫ్టర్లోనుండి పడవేయడుగదా. ఇవ్వాళ మనం హాయిగా ఉన్నామంటే మనం చేసుకొన్నా పూర్వజన్మలో మనం చేసుకొన్నా మంచి చేతనే . అలా మనం చేసిన కర్మత్రయo మనకు ఫలత్రయం ఇస్తుంది . వ్యతిరేకంగా చూస్తే మనకర్మత్రయం మనమిచ్ఛే ఫలాత్రయంలో దోషత్రయముంది . కాయిక ,వాచిక, మానసిక కర్మల ద్వారా ధర్మార్ధాకామా లనే పురుషార్ధాలను పొందవచ్చు. ఇవి మనకు శాంతిని. భద్రతను ,ఆనందాన్నిచించినట్లే కనబడతాయి కానీ గులాబీ పువ్వుకింద ముళ్ళున్నట్లే వాని వెనుక దోశత్రయాన్ని తీసుకొనివస్తాయి. అవి దుఃఖమిశ్రితత్వం ,అతృప్తికరత్వం, బంధకత్వం
దుఃఖమిశ్రితత్వమనగా ఆనందాన్ని వెన్నంటి దుఃఖముంటుయింది. అతృప్తికరత్వమనగా కోరికలనటం గదా !ఒకటి తీరితే మరొకటి పుడుతుంది .అందువలన తృప్తి తీరదు. బంధకత్వమనగా ఒకవ్యక్తిమీద లేక ఒకవస్తువుమీదగాని ప్రేమఉండాలి గాని ఆ ప్రేమ మనసును కట్టిపడేయకూడదు. ఉదాహరణగా సెల్ఫోన్ మనకొకపరికరము, ఆదిమనను 24గంటలు దానికే కట్టిపడవేయకూడదు. వీనికి మూలకారణము మనమనసేమనబాధలకు,దుఃఖానికి,సుఖానికి ఆనందానికి కారణభూతమైనదని యర్థము. తైత్తరీయోపనిషత్తులో మనఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షా :--మనస్సే బంధించినా,మోక్షానికైనా ,మనస్సు మళ్ళీ మూడు దోషాలతో ఉంది .
1.మలమంటే3 కామక్రోధలోభమదమోహమాత్స్యరాలు మనసుకున్న మలినాలు.
2.విక్షేపము అనగా మనస్సు స్ధిరంగా యుండక చంచలత్వముతోనుండుట.
3. అజ్ఞాన ఆవరణము అనగా తానెవరో తెలిసికొని భగంతుని (తనలోని ఆత్మను )దర్శించుటకు తగినజ్ఞానమును సంపాదించుట .దీనికై ధ్యానముచేయుట. ..... కర్మలు చేయుటవలన చిత్తశుద్ధి ఉపాసనచేయుటంవల్ల చిట్టా ఏకాగ్రత లభిస్తుంది. దానివలన వివేకం, వైరాగ్యం, శమదమాదిషట్క సంపత్తి ముముక్షత్వములకధికారియై కీర్తిని సంపాదించును.
Tuesday, 18 August 2020
TAATAPUDIVAMSHAM
రాధాస్వామి
తాతపుడివారి వంశం -చరిత్ర
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా మంచిలి గ్రామమున తాతపూడివారు ఉండుటచే గ్రంధకర్త తాతగారి దగ్గరనుండి వంశచరిత్ర వ్రాయాలని సంకల్పించారు. మాకు తెలిసినంత వరకు మూలపురుషుడు తాతపూడి పలుగు రాముడు ..
ఆ) తాతపూడి చిట్టివేంకటేశ్వరరావు (భార్య వెంకమ్మ }
]
]
తాతపూడి సుబ్రహ్మణ్యం {1.జగ్గమ్మ 2.రత్తమ్మ }
ప్రస్తుతం సుబ్రహ్మణ్యం,జగ్గమ్మ ల గూర్చి తెలిసికొందాము .
వీరికి }}
సత్యనారాయణ {వెంకటరత్నం}
}}
--------------------------------------------------------------------------------------------------------------------------
-1 }}}] }
2.రాజే శ్వరి 3.సూర్యకాంతము
{వెంకటేశ్వర్లు } {యోగిశాస్త్రి}
}
మాత {వెంకట్రావు {భాస్కరం } 1.రాంబాబు 2.నర్సిబాబు బాచన్న {సూరమ్మ} 1.శైలజ {శాస్ట్రీ } {ఉషా} {భవానీ
} 2.శిరీష {శేఖర్}
1. సత్యనారాయణ 2వెంకటేశ్వర్లు . ]]
{రమాదేవి} వెంకటరమణ }1.అభిరాం
} 2.శరణ్య
1 సాయి భాస్కర్
2.సత్యవతి
2.వెంకమ్మ {వెంకటశాస్త్రి }
-------------------------------------------------------------------------------------------------------------------1.అన్న పూర్ణ 2.మంగతాయారు {వీరి సంతానం 4}
]] {యోగీశాస్ట్రీ
}---------------------------------------------------------------------------------------------------
1.దుర్గ 2.గిరిజ 3.భువనేశ్వరి 4.శర్మ {సీత}
!
నాగు (లలిత )!
!
___________________
! !
కార్తీక్ మణికంఠ
Monday, 30 March 2020
మారుతి శతకం 6
మారుతిశతకం 6
91,కర్ణోపాంతపరీత లోచననుతగ్రైవేయభూపాన్వితున్
స్వర్ణోద్భాసిత సత్పటావృతతనూభాస్వంతుసంస్తుత్య సం
సంపూర్ణో త్సాహు కృపార్ణవున్ మహితభూపుత్రీమనోనాథు వి
స్తీర్ణానంతయశుఁన్ భజించు హరినే సేవింతు శ్రీ మారుతిన్ .
92.కళ్యాణాత్ముచరాచరాంతరవిభున్ కాకుత్ఫునిన్ ముక్తవై
కల్యున్ లాఘవనిర్జితాఖిలమహాగర్వానురోద్ధామున్ కౌ
సల్యానందసుతున్ నుతించు ప్లవగున్ సంతోషమేపారసా
కల్యంబైనయనన్యభక్తిగొలుతున గాఢంబుగా మారుతిన్.
93.సర్వారిష్టమహీరుహాసివిదితాశానాధసంస్తవ్యత
న్నిర్వాణప్రదసద్విభూతికలితున్ నీరేజపత్రాక్షునిన్
సర్వాంగీకృతకార్యనిర్వహణభాస్వంతున్ నితాంతంబెదన్
ఉర్వీజాతసతీశుగొల్చు హరిగొల్తుప్పొంగియమ్మారుతిన్.

94.ధన్యున్ లోకమనోభిరాము శ్రుతివిద్యారూపతారుణసౌ
జన్యున్ తద్ధరణీసుతేశు బుధసంస్తవ్యాత్మునిన్ శత్రురా
జన్యానేకపసింహు రామునమరేశస్తవ్యబోధార్హచై
తన్యున్ గొల్చు కపీంద్రుమ్రొక్కెదసదాదైవాంశునమ్మారుతిన్.
95.సింధురవైరివిక్రమప్రసిద్ధమునీంద్రహృదబ్జసత్కళా
బంథువుసత్కృపార్ణవు నిబంధితసింధువు సర్వలోకసం
బంధనుతోన్నతాభ్యుదయపద్మవిభూతిదివాకరున్ హృదిన్
బంధవిమోచనున్ గొలుచు వాయుసుపుత్రుని గొల్తు మారుతిన్.
96.భండనభీమురాము రవివంశసుధాంబుధిసోము దివ్య మా
ర్తాండసమానతేజునుతతామరసాక్షు సుమేరుదీరునా
ఖండలసన్నుతాభ్యుదయకంజదివాకరుభూమిజావరున్
నిండగు హృద్గతిన్ సతము నిల్పినభక్తునిగొల్తు మారుతిన్.

97.ఖండితషడ్రిపూత్కరు షడ్రిపూత్కరు విఖండితభీకరదానవోత్కరున్
దండితరావణాసురునుతప్రభకల్గుచతుర్భుజోత్కరున్
అండజవాహనున్ కరిపరావనశస్తపవరాయుధోత్కరున్
దండిగగొల్చువానరవితానవరున్ భజియింతు మారుతిన్.
98.పన్నగభూషణాభినుతపంకజమిత్రకులైకభూషణున్
చెన్నుదలిర్చుసద్గుణవిచిత్రచరిత్రునిదివ్యసత్కధా
భ్యున్నతిగల్గురాఘవకులోన్నతవీరుని రామచంద్రునిన్
మున్నుగొల్చునట్టికపిముఖ్యునెడంద తలంతుమారుతీన్.
99.అరవిందాక్షునిశాకరాభయశునార్యాత్మేశముఖ్యామరో
త్కరసంస్తుత్యశుభాకరున్ వినుతమౌకాకుత్సవంశోద్భవున్
కరిరాజావనుతత్పరాత్పరునినిష్కామున్ పరంధామునిన్
చిరమున్ గొల్చుకపీశుగొల్తు గుణరాశీభూతునమ్మారుతిన్.
100.అంగజసుందరాంగు సుగుణాంబుజభృంగు శుభాంగుభూసుతా
ర్ధాంగునిబంధితోద్ధతమహాంబుధిభంగు నరాతిభంగు దు
స్సంగతమఃపతంగుఖగసంతతినాధతురంగు సత్కృపా
పాంగునెడంద గొల్చు కపివర్యుదలంచెదభక్తి మారుతిన్.
101.సీతారామవిభున్ సమిద్ధగుణరాశీభూతమూర్తిన్ జితా
రాతివ్రాతసమేతుభూసుతపతిన్ రాజీవనేత్రున్ నుత
స్ఫీతప్రాభవు లోకబాంధవు ఘనున్ శ్రీ రామచంద్రున్ సదా
చేతోవీధిని నిల్పినట్టి కపినే సేవింతు నమ్మారుతిన్.
102.శ్రీ తరుణీవిభుద్యుతిపరీత మనోజ్ఞ కళావతారు భూ
జాతహృదబ్జభాస్కరు ప్రశస్త శుభావహసద్గుణాకరున్
వాతతనూజహృద్గృహనివాసవిలాసవిభూతితత్పరున్
ఆతతభక్తిగొల్చువినుతాగచరున్ హరి గొల్తు మారుతిన్.
103.తరణికులాబ్ధిసోము పరధాము సుధీజనసంఘరక్షణా
కరసుకళాభిరాము శుభకాము రిపూత్కరభీము తద్ధరే
శ్వరగణసన్నుతాభ్యుదయశస్తపద్ధేకవిభాగగామురా
ము రమణ గొల్చుచిద్విభవమూర్తి భజింతు సతంబు మారుతిన్.
104.సన్నుతకీర్తినిర్జితలసద్విభవాన్వితరాజు సర్వలో
కోన్నతభోగభాగ్యకలితోన్నతినిర్జితరాజు వి
ద్వన్నుతసత్పదాంబుజు కృపాగుణరక్షితనాగరాజు స
ర్వోన్నతరామరాజు మదినుంచినవాని భజింతు మారుతిన్.
105.ఫుల్లసరోజసద్విభవభూషితలోచను స్తుత్యతద్రసా
వల్లభురామభూవిభు నపారకృపాగుణవాహినీవిభున్
ఉల్లసితైకకీర్తివిభవోన్నతినిర్జితతన్నిశావిభున్
సల్లలితోక్తి గొల్చుకపిసత్తముగొల్తు సతంబు మారుతిన్.
106.కమలవిరోధియున్ కమలకాంతుడు కన్నులునైనదేవునిన్
కమలవిరోధి శేఖరముఖప్రధితామరసన్నుతార్యునిన్
కమలధరప్రభాభసుతకాంతియుతున్ ధరణీజకాంతునిన్
కమలజుతండ్రిగొల్చు కపిగాటపుభక్తి భజింతు మారుతిన్.
107.ఖండితశత్రుచాపునుతకంజనికాయసఖప్రతాపుది
ఙ్మండలనాధసంఘనుతమాన్యమహత్తరవిశ్వరూపు భూ
మండలరాజశేఖరసమాజనుతప్రమదస్వరూపు న
య్యండజవాహనున్ గొలుచు నయ్యనిలాత్మజు గొల్తు మాపురుతిన్.
108.భండనభీమమూర్తి సమవర్తి శరచ్ఛశికీర్తి దూరితా
ఖండలదేవతార్తినుతగర్గమునీంద్రమనోనువర్తి భూ
మండలచక్రవర్తిరిపుమండలికిన్ సమవర్తి చండకో
దండుని రామమూర్తి నెదదాల్చు హరీశు భజింతు మారుతిన్.
@@#####@@@&&&****$$$

విఖండివిఖండితభీకరతభ
మారుతీశతకము3
మారుతీశతకము3
31.అండజరాజతుల్యవిభవాన్వితవేగసమన్వితాద్భుతో
ద్దండుని రామపాదయుగతామరషట్పద విశ్వసేవ్యునిన్
భండనభీమరామవిభుభక్తు సదాగతిశక్తియుక్తునిన్
చండభమార్గగామిఘనుసత్యపరాక్రముగొల్తు మారుతిన్
32.పరనారీవిముఖున్ పరాత్పరపదాబ్జాతార్చనాసక్తునిన్
దురితధ్వాంతదివాకరున్ ప్లవగసందోహప్రభూత్తంసునిన్
ద్విరదాస్య ప్రముఖాఖిలామరకులద్వేషైకవిద్రోహి సు
స్ధిరభక్తిన్ భజియింతు నామదినిసందీపించునమ్మారుతిన్.

33.నుతమందారగుణప్రభాన్వితు విరాణ్మూర్తి ప్రభాభాసితున్
తతవిజ్ఞానసుథాప్రభాన్వితసుధీధామన్ పరంధామస
న్నుతకామున్ నుతరామనామమయచిన్మూర్తిన్ హరిశోత్తమున్
సతతంబున్ గొలుతున్ మదిన్ వినుతసంస్కారున్ హరిన్ మారుతిన్.
34.సత్య విలాసు రామవిభు సత్తమదాసు సుధీజితామరా
మాత్యుజితాసురౌఘ గుణ మాన్య కళైక విభాసు నిర్జితా
దిత్యవిశేష తేజు వెనుదీయని భక్తి విసమ్రతన్ మదిన్
నిత్యము గొల్తు రామపదనిరజలగ్నమనస్కు మారుతిన్
35.కరువలిముద్దుపట్టి కపికాంతు సమీరతనూ భవున్ హరిన్
తరుచరశేఖన్ నుతసదాగతిసూను ప్లవంగు కీశకుం
జరు హనుమాను స్తుత్యకపిసత్తము గంధవహాత్మజున్ వనే
చరవరు వానరాగ్రణి ప్రశస్త సుభక్తి భజింతు మారుతిన్
36.కైసరి పాపమానిసితికంఠసుతాంశభవున్ హరీశ్వరున్
భూసతిపుత్త్రికేశసంపదభూషితమూర్ధునియ క్రోతిఱేని ని
ర్వాసితషడ్రిపూత్కరునవారితబాహుబలాభిరామునిన్
వాసవవందితున్ ప్లవగవల్లభు సుందరు గొల్తు మారుతిన్.
37.ఆరవిపుత్త్రమిత్రువిజితామరశత్రు పతత్రివాహనా
పారకృపాభివర్ధితశుభప్రకరాకారు స్తుత్యవానరున్
శ్రీ రఘురామదూత కపిశేఖరు కేసరినూను భక్తునిన్
క్రూరసురారిసంచయవిరోధి నుతింతు నెడంద మారుతిన్
38.శ్వసనకుమారు వానరు ప్లవంగకులాబ్ధిసుధాకరున్ హరిన్
అసమబలాకరున్ నుతసురారికులారి మరుత్తనూజు దు
ర్వ్యసనవిదూరకేసరివరాత్మజుత్ర్యక్షకళాంశభూషితున్
అసదృశభక్తిగొల్తు ననయంబునయంబున నేను మారుతిన్.
39.అగచరలోకపుంగవు నుతానిలపుత్త్రువనాటనాధు త
న్నగతతిభేదనున్ పవననందను కీశకులేంద్రు సన్నుతా
శుగతనయున్ కపిప్రభుని సుందరవీరవరున్ మహాబలున్
పొగడుదునాత్మసద్గుణవిభూషితశీలు సతంబు మారుతిన్.
40.భానుకుమారమిత్రుజితభానుమరీచివితాను రాఘవా
ధీనమనోభిరాము వితధీకృథరాక్షసశక్తియుక్తునిన్
దీనజనావనున్ పవనదేవునిగాదిలిపట్టిభక్తివి
జ్ఞానవిశారదున్ ప్లవగసత్తము కైసరి గొల్తు మారుతిన్.
41.వాయుతనూభవున్ సకలవానరనాయకు విద్రుమాననున్
స్ఫాయదుదారభావవిలసన్మతి తత్కపి వీరశేఖరున్
ధ్యాయితభూమిజాపతికధాంశు శివాంశభవైకమూర్తి నే
పాయక గొల్తు వ్యాకరణపండితు వానరనాధు మారుతిన్.
42.మారుతనౌరసున్ సుగుణమండలమండితపండితోత్తమున్
భూరుహచారిభీమబలుపూతచరిత్రు మహాబలాత్మజున్
శ్రీ రఘువీరపాద సరసిరుహలగ్నహృదంజాన్వితున్
వారిజబంధుపుత్రసచివాగ్రణి నేభజియింతు మారుతిన్
43.తరుచరవీరు రామపదతత్పరు వీరు కళాకారున్ సురో
త్కరవినుతప్రతాపు జితకాము ప్రశస్తపరాక్రమున్నుమా
వరచరణాబ్జషట్పదు ననివార్యమహాబలుని నఖాయుధున్
స్థిరతరభక్తినేనెడదజేర్చి భజింతు సతంబు మారుతిన్ .
44.కపికంఠీరవునిన్ నుతానిలసుతున్ కారుణ్యవారాన్నిధిన్
జపిసంఘార్చితపాదపద్మయుగునబ్జాతాదిసంస్తుత్యత
త్తపనాభాద్భుతసంప్రభాకలితు విధ్వస్తాఖిలాఘౌఘునిన్
ఎపుడున్ భక్తివినమ్రతన్ గొలుతు కీశేశున్ మదిన్ మారుతిన్.
45.గాడుపుముద్దుపట్టి నుతకాంచనశైలసమానదేహు న
వ్వేడివెలుంగుకన్నుగలవేలుపువీర్రసముద్భవున్ హరిన్
నీడజవాహహనాదిసురనేతృనుతాగచరేశపుంగవున్
వీడక సర్వదా హృదివివిక్తసుభక్తి భజింతు మారుతిన్.
46.సామీరిన్ కపికాంతు కీశవరునిన్ సాకేతనాధస్తుతున్
కామక్రోధమదాదిశూన్యు విజితాకాశేశశత్రూత్కరున్
రామస్వామి సతంబు గొల్చు సుమనోరాజీవతేజద్భవున్
వేమారున్ భజియింతు తఛ్ఛ్రుతికళావేద్యున్ సదా మారుతిన్.
47.ఘనమేధావిని కీశచంద్రు హరి తత్కాకుత్సభక్తాగ్రణిన్
దిననాధాత్మజసేవకున్ పవనజున్ గాడ్పుకొడుకున్ వక్తన్ సదారాధ్యునిన్
మనసారాన్ భజియింతు తత్తరుచరున్ మాన్యున్ సదామారుతిన్.

మారుతి శతకము2
మారుతిశతకము2
16.ఖండితశత్రుదండు రిపుకంధరగండకకాండుసన్నుతా
ఖండలకీర్తితాభ్యుదయకౌతుకభాండు యుధిప్రచండును
ద్దండునుతప్రభావలయ ధామనుతేషుకళాప్రచండు మా
ర్తాండకులోద్భవున్ గొలుచుథన్యునినే భజియింతు మారుతిన్.
17..సదయకళావిలాసు సురసంచయసన్నుతరామదేవభూ
మిదయితలగ్నహృద్విభవమేథురశక్తిసమేతకీశు దు
ర్మదరిపుసంఘసంహననరామ వినాశపరాసు కపీశుగొల్చెదన్
ముదమున పారిజాత తరుమూలనివాసు సుదాసుమారు తిన్
18.కన్మొనలందుతన్మయతకన్పడగొల్చెదభక్తవత్సలున్
సన్మునిసేవితాంఘ్రియుగసారసు సర్వకళావిలాసు న
మ్మన్మథకోటిగెల్చునసమానవిలాసయశోనివాసునిన్
జన్మతరింపగోరి విలసచ్చరితాలయు గొల్తు మారుతిన్.
19.సారాచారవిచారకోవిదునుతసాంత్వున్ హనూమంతు త
త్పారావారగభీరుసత్కపివరున్ ప్రామాణ్య వేదప్రభా
సారాలంకృతశీలునే గొలుతు విశ్వాసంబుతో నిత్యమున్
ధారావాహిక రామనామ జపవిజ్ఞానాత్మునిన్ మారుతిన్.
20.దేవాధీశనుతోన్నతాభ్యుదయసందేశాత్మసంకాశు త
న్నివారంపచసన్మునీంద్రసుతతన్నీరేజనేత్రోత్సవ
శ్రీ వాల్లభ్యమనోజ్ఞహృత్సరసిజున్ శ్రీరామకైంకర్యస
ద్భావాధీనమహాకపీంద్రు మదిలోభావింతు నే మారుతిన్.
21.శ్రీ వాణీగిరిజానుతోన్నతసుచారిత్రాంశసద్వేమ స
ద్భావాలంకృతభామ రామవిభుసత్పాదాబ్జసంసేవగీ
తావాణీమయకీర్తనాభ్యుదయసంధానప్రవీణున్ హరిన్
కైవారంబునుచేయ నేనెడదలో కాంక్షింతు నమ్మారుతిన్.
22.గీర్వాణప్రభుమౌళిమండితపదున్ కీశేశసంఘోత్తమున్
పర్వేందుద్యుతితుల్యకీర్తిధను సద్భావాభిరామున్ కపిన్
దూర్వాంకూరవిభూషణాదివిబుధస్తోమాభివంద్యానఘున్
సర్వారాధ్యగుణాభిరాముగొలుతున్ సామీరినిన్ మారుతిన్.
23.సర్వాంగీకృతసచ్చరిత్రకలితున్ సంస్తవ్యలీలావిభున్
దుర్వారాధికదివ్యశక్తియుతు సంతోషప్రభాభూషితున్
గర్వాంధాసురకంజమత్తకరి సత్కార్యైకతేజోనిధిన్
నిర్వాణప్రదు వాయుసూను గొలుతున్ నిత్యంబునేమారుతిన్.
24.ఉర్వీశాగ్రణి రామచంద్రుమదినత్యుత్సాహమేపారత
త్సర్వాకాశవిహారదేవతలుమెచ్చన్నాత్మలో సర్వదా
సర్వంబున్ రఘురామమూర్తిగనె యాశ్చర్యంబుగాజూచు అ
దర్వీహస్తవిభూణాంశు గొలుతున్ ధన్యాత్మునమ్మారుతిన్.
25.సారవిహీనమైనభవసాగరతీరము చేరగోరున
వ్యారికి శక్తి యుక్తులనపారముగా నిడుభద్రరూపు న
క్కారణజన్ముషడ్గుణవికారవిదూరు హరిప్రవీరు న
మ్మేరుసమానధీరుని సమీరకుమారు నుతింతు మారుతిన్.
26.వానరు వేదపారగుప్లవంగకులాగ్రణి విశ్వపావనున్
పీన విశాలవక్షుఁ జిత వీరసురారి సమూహు జానకీ
జానివిధేయ సద్గుణ లసద్రుచి వేల్లితదేహుస్తుత్యస
మ్మానవిమానయాను హనుమాను భజింతునెడంద మారుతిన్ ..
27.వాసవ ముఖ్యదేవగణవందిత దివ్యకళా విలాసవి
న్యాసు కుజేశ పాద యుగళాబ్జవిలగ్న మనోబ్జసత్ప్రభా
భాసురరామదాసు నుతభక్తినివాసు జితాసురేశుని
ర్వాసితషడ్రి పూత్కరు కరంబు భజింతు నెడoద మారుతిన్ .
28.హనుమంతున్ మతిమంతు భక్తవరునూహాతీతవీరాగ్రణిన్
వినుతప్రాభవకాంతుమాన్యునెదలో విస్ఫూర్తిమంతున్ శుభున్
జననభ్రాంతివిహీనుధీకలితు నిస్స్వార్ధున్ మహాకాయు స
ద్గుణవంతు బలవంతుగొల్తు కపిసందోహాగ్రణిన్ మారుతిన్
29.బంధురపాపశోషణు కృపాగుణభూషణు శతృవాహినీ
బంధవిదారణున్ హరికబంధ విరాధ విరోధిబంధు ని

ర్బంధితలోకబాంధవునరాతికులాంబుజగంధసింధుగ
ర్వాంధతమఃపతంగుని సమంచిత భక్తి భజింతు మారుతిన్.
30.ఘనప్రవాహ ప్రముఖాఖిలామరవరౌఘస్తుత్యతేజోఖనిన్
మనసారన్ భజియింతువీతభయు సమ్మానాత్మునమ్మారుతిన్
30.ఘనప్రవాహ ప్రముఖాఖిలామరవరౌఘస్తుత్యతేజోఖనిన్
తనుమథ్యామణిభూమిజాభినుతసద్ధర్మార్ధవిద్యానిధిన్
హనుమంతున్ నఖదారితారి రఘురామాధీనహృత్పంకజున్మనసారన్ భజియింతువీతభయు సమ్మానాత్మునమ్మారుతిన్
మారుతి శతకము
మారుతి శతకము
రావూరి సత్యనారాయణ మూర్తి, మంచిలి
1.శ్రీ కళ్యాణ గుణాకరున్ సురనుతశ్రీరమ్యశోభాకరా
స్తోకప్రాజ్యకళాధరున్ జితరిపుస్తోమున్ గజాన్యున్ మదిన్
సాకారప్రమథున్ నుతామరవరస్తవ్యామలాశాలయున్
రాకాచంద్రసమానసద్యశునియారాథింతునశ్రాంతమున్ .
2.వేయి కరంబులన్ వెలుగువేలుపు మ్రొక్కులజొక్కుతన్మహా
కాయునమేయసద్విజయుకాంచనచేలవిధేయు సత్కళాధ్యాయునజేయసద్బలసహాయు నుతాద్భుతరామభక్తి ధౌ
రేయుజితాతికాయు మది రేయిబవళ్ళు భజింతు మారుతిన్.
3.మానితదివ్య తేజు నవమానితరాక్షసరాజు దేవతా
మౌనిసమర్చితాభ్యుదయమండితపాదసరోజుక్ష్మాసుతా
ధీనమనోబ్జు తద్రఘువిధేయసమస్తసమాజరాజువి
జ్ఞానమహాబ్ధిరాజువిలసన్మతి గొల్తు నెడందమారుతిన్.
4.శ్రీ రఘు రామ పాదసరసీరుహలగ్నమనోంబుజాన్వితున్
భూరమణీసుతాభినుతిపూతవిభూతిసమేతు సుందరా
కారజితాబ్జనాభసుతు ఖండితశతృకులాన్వితున్ హృదిన్
నీరజనాభసన్నుతవినీతిసమన్వితు గొల్తు మారుతిన్.
5.మానితవిద్రుమాననునమానుషశక్తివితాను కార్యసం
ధానుకపిప్రధానుని సదాగతిసూనుజితాసురేంద్రసం
తాను విమానయానువినుతాద్భుతభక్తి నిధాను భక్తిస
మ్మానితవిశ్వయోని పవమానునిసూను నుతింతుమారుతిన్.
6.దీనజనావనాభ్యుదయదేవుని శ్రీ రఘు రామ భక్తునిన్
గానకళానురక్తు సితికంఠకృపాబ్ధిజలాభిషిక్తు త
ద్భానుకులాబ్ధిసోమపరధామవిరోధకళావిరక్తు సం
మ్మానగుణప్రసక్తు మహిమాన్వితభక్తు నుతింతుమారుతిన్.
వవరనుతోన్నతాంశు ననవద్యసుకీర్తిజితామృతాంశు క్ష్మే
శవరనుతప్రభావిజితసారసమిత్రఖరాంశు జానకీ
శవినుతశంకరాంశుని ప్రశస్తకపీశు నుతింతుమారుతిన్
8.సద్వినుతాంజనేయు విలసద్రఘురామవిధేయు దేవతా
సద్విభువందితాభ్యుదయు సంచితసన్మహిమాద్వితీయునిన్
ఆద్విదాదివానరసహాయు విరించికృపార్జితాయుశ్రీ
మద్వభవాతిథేయు రుచిమండితకాయు నుతింతుమారుతిన్.
9.సర్వకళాలవాలు విలసద్రఘురామవిథేయుశీలు గాం
ధర్వకళావశీకృతనుతప్రభుజాలు దయాలవాలు దు
ర్గర్వసురారిశేఖరనికాయవిదారణవాలు లంకిణి
గర్వవిదారణైకబలు గౌరిపదస్థితఫాలు మారుతిన్.
10.అద్భుతవేగనిర్జితనుతానిలదేవు మనోజవున్ రమా
హృద్భవనస్థితోజ్జ్వలహరిస్తుతదీప్తిజితాదిదేవు నీ
డోద్భవవాహనాదివిబుధోత్తమనన్నుతభావు రుద్రవీ
ర్యోద్భవు నక్కపిప్రభువునూర్జితసద్యశు గొల్తు మారుతిన్.
11..పావని కైసరిన్ హరిని వానరముఖ్యుని కామరూపునిన్
భూవరరామభక్తిపరిపోషితజీవనధామునిన్ చిరం
జీవుని సర్వదేవనుతశీలమన్వితసత్కళాధునిన్
చేవదలిర్చుభక్తి తలచేరిచి చేతులు కొల్తు మారుతిన్.
12.వారనిభక్తిగొల్చెదనవారితబాహుబలాఢ్యునంజనా
వారిజపత్రనేత్రిసుతు వాయుకుమారు కపీశ్వరున్ చిదా
కారునుదారుచారుగుణకంధిసుధాకరు వీరు స్తుత్యస
త్కారు కుజేశపాదయుగతత్పరమాన్యవిచారు మారుతిన్
13.సదమలభావనాపటిమసత్కతహృత్కమలాభిరాముడు
ర్మదకలితాసురోద్ధతివిరాము కపీశకులాబ్ధిసోముభీ
ము దళితషడ్రిపూత్కరవిభూతిపరీతవిశేషధామునే
పదములు బట్టి మ్రొక్కెదశుభంబులుగోరిసతంబుమారుతిన్.
14.స్తుత్యనుతాద్భుతానుపమశోభసమిద్ధతనూవినిర్జితా
దిత్యునకిల్బిషాభ్యుదయదీప్తివిరాజితరామదేవతా
భృత్యునుతాఖిలాగమపరిష్కృతసంస్తుతసాహితీకళౌ
చిత్యునుతింతునాత్మకపిసైన్యవరున్ హరిమారుతిన్ సదా
15.తామ్రముఖున్ రమానిలయతామరసాప్తసుతైకసత్సఖున్
కమ్రసుధీకళాభిముఖు కశ్మలభావపరాఙ్ముఖున్ శుభున్
ఆమ్రఫలోన్ముఖున్ జితనుతార్యమచండమయూఖుసర్వదా
నమ్రత గల్తునయ్యనిలనందను నంజనిపుత్త్రుమారుతిన్.
Wednesday, 5 February 2020
మారుతీ శతకం5
మారుతీ శతకం5
69.ఈశు కుజేషు తత్త్రిభువనేశు యశోజితతన్నిశేషు దే
వేశగురుస్తుతైకసుమతీశు వినిర్జితరాక్షసేశు స
ర్వేశు కృపాగుణైక జలధీశు నుతైక జయేశు రామభూ
మీశు హృదిన్ భజించెద కపీశు భజింతు సతంబు మారుతిన్ .
70.త్యాగవిభాగభోగు శమితామితతద్భవరోగు సత్కళో
ద్యోగినుతాశు గున్నఖిలయోగి కులార్చితయోగు నమ్మహా
భాగు యశః ప్రభావితశుభావహ మంజుల దిగ్విభాగు స
ర్వాగమరాగు గొల్చు వినుతాశుగపుత్త్రు భజింతు మారుతిన్.
71.శాంతునుతోన్నతాభ్యుదయసారమనోజ్ఞకళోత్కరాలయ
స్వాంతుదిగంతీీీర్తివిభవప్రభవోజ్జ్వలసాగరాత్మజా
కాంతుతనూజితేద్ధరతికాంతుయశోవిజితైకతన్నిశా
కాంతుమహీలతాంగిసుతకాంతవిధేయుభజింతుమారుతిన్.
72.అగణితవైభవున్ సురుచిరాంబుజమిత్రకులైకసంభవున్
నిగమవిశేషవర్ణితవినిశ్చయభావు ప్రసిద్ధరాఘవున్
జగదధినాయకాభినుతసత్కులసంభవునాదిదేవునిన్
నగవరధీరుగొల్చుదిననాధనుతాప్తునిగొల్తుమారుతిన్.
73.రాముసుతావనీలలాముజితాభిలరాక్షసాధిప
స్తోము గుణాభిరాము నుతసుందరరూపజితైకకాముత
ద్భీమముఖామరేశనుతవిశ్రుతవైభవధాము తత్పరం
ధాముసదాభజించెడిసదాగతిసూనుభజింతు మారుతిన్.
74.దశదిగధీశమౌళిమణిధామసమర్చితదిప్యకీర్తికిన్
శశిధరవందితాభ్యుదయసారమనోజ్ఞపవిత్రశీలికిన్
దశముఖముఖ్యరాక్షసవితాననిహంతకురామమూర్తికిన్
వశమయిభక్తికరగువాయుతనూజుభజింతుమారుతిన్
75.భద్రగీరీశురాణి నుతవాణిరమాగిరిజాభదివ్యసా
ముద్రికలక్షణాభ్యుదభూషితసన్నుతసుందరాంగనన్
భద్రగతిన్గగనంగప్రతిభ వాంకితదేవతాళిన
ఛ్చిద్ర మనోజ్ఞ భక్తి నుతిచేయు హరిన్ భజియింతు మారుతిన్
76.కమలాక్షున్ సుజనావనాభ్యుదయ రక్షాదీక్షు నధ్యక్షు న
య్యమముఖ్యా ఖిల దేవసంఘనుత విద్యానాథకక్షున్ నుతా
ర్యమము ఖ్యాఖిల లోకకుక్షు నుతసంరక్షున్ దిలీపాన్వయున్
మమతన్ గొల్చెడి వాయుజున్ దలఁతునే మాన్యున్ సదా మారుతిన్ .
77.ఘోరాఘాoబుజమత్తనాగవిభునిన్ కోదండరామున్ సదా
చారకారు జితారివీరు కరుణాస్వాంతున్ ప్రశాంతోజ్జ్వలా
కారున్ భూపరుభూమిజావరుని తత్కకుత్సవంశో ద్భవున్
శ్రీ రంజిల్ల సతంబు గొల్చు కపి నేసేవింతునమ్మారుతిన్ .
78.దినకరచంద్రనేత్రు నుతదేవనుతోన్నతసచ్చరిత్రు త
ద్ఘననిభగాత్రు సన్ముని నికాయవిధేయ పవిత్రపాత్రు త
జ్జనకసుతాకళత్రు నుత సాధుజనోత్కర మిత్రు తత్తపో
ధనమునిచంద్రు ఛాత్రుని సదాగతిపుత్త్రు నుతింతు మారుతిన్ .
79.రణజయ ఘోమనిగ్రహ నిరస్తసమస్త కఠోరదోషు స
ద్గుణ మణిభూషు సద్వినతకుంజరపోషుతన్నబో
మణికులభూషణున్ గొలుచు మాన్యకపీంద్రు భజింతు మారుతిన్ .
80.సన్నుతరామచంద్రుగుణసాంద్రు మహీశకులేంద్రచంద్రు న
ప్పన్నగ భూషణాద్యమరవర్ణితదేవ సఖేంద్రు సన్నుతా
త్యున్నతకీర్తిచంద్రు సుగుణోజ్జ్వలదాసచకోరచంద్రుదీ
ప్త్యున్నతరాఘవేంద్రుని గను భక్తునిగొల్తు మారుతిన్
81.హరు నుతార్యహృద్గృహవిహారు జితాసురవీరుస్తుత్యస
త్కారు పరోపకారగుణకంజదివాకరు దివ్యసత్ ప్రభా
కారు దశావతారు భవకర్మవిదారు సుదారలోకసం
చారు నుతించునట్టికపిసత్తముగొల్తు నె డం ద మారుతిన్.
82.సన్నుత సృష్టికర్త విలస త్ప్రతిభాన్విత కార్యకర్తగ
ర్వోన్నతదానవేశ్వరమదోద్ధతిహర్తను తద్ధరాత్మజా
త్యోన్నతభావచిత్రితరసోజ్జ్వల కావ్య వితాన భర్త వి
ద్వన్నుతరాము గొల్చు కపివర్యు నుతింతు నెడంద మారుతిన్.
83.ఘననిభనీలుసద్వినుతకాంచనచేలుదయాలవాలు స
జ్జనగుణలోలుసద్విబుధసన్నుతశీలు జితారిజాలు స
న్మునివినుతాజిబాలు పరిపోషితదివ్యకళాలవాలు న
య్యినకులనాధు గొల్చు సుగణేశు కపీశు భజింతు మారుతిన్.
84.ఆర్తి హరించి తఛ్ఛుభసమంచితసన్నుతసౌఖ్యమిచ్చు స
ద్వర్తన కాలవాలమగు పంక్తిరధాత్మజు దివ్యనామసం
కీర్తనభాగ్యమబ్బెనని కేలుమొగిడ్చి సతంబు రాముభూ
భర్తను హృద్గతిన్నిలుపు వానరు భక్తి భజింతు మారుతిన్.
85.క్ష్మావరు దేవతావరనికాయసమర్చిత కార్యశూరు స
ద్భావసమన్వితాభ్యుదయధామవిహారు వికారదూరు సీ
తావనితామనోహరు నితాంతసుఖైకవినోదహారునిన్
చేవదలిర్ప గొల్చుకపిశేఖరు గొల్తు నెడంద మారుతిన్.
86.పుణ్యుననణ్యు మాన్యు నుతభూపవరేణ్యు మునీంద్రవల్లభా
గణ్యమహంబుగల్గుగుణగణ్యుని భానుకులాగ్రగణ్యునిన్
వాణ్యధినాయకాదిసురవల్లభసంచయసన్నుతార్యసా
ద్గుణ్యునుతించు తత్ల్పవగకోటివరేణ్యు భజింతు మారుతిన్.
87.భక్తసురద్రుమున్ పతిత పావననాము గుణాభిరాము వి
ధ్యుక్తనుతైకధర్మమహిమోజ్జ్వలసత్పథగాము రామునిన్
ముక్తికళా బ్దిసోము నుతమోదమయైకవినోదధాము శ్రు
త్యుక్తవిధానగొల్చుకపినూర్జితశక్తి భజింతు మారుతిన్.
88.భద్రుని కీర్తిపారగుని భక్తజనైకవశంవదున్ సుర
చ్చిద్రవిదారణానుభవసింధుసుధాకరు రామచంద్రునిన్
భద్రగిరీంద్ర సద్భవనవాసు భవాఘనిరాసునిన్ దయా
ముద్రితశీలుగొల్చు కపిముఖ్యుని నే భజియింతు మారుతిన్.
89.జలదశ్యాముని కీర్తికాముదళితక్షామున్ సుధాధాము చి
ద్వలయ ప్రాభవదాము నున్నతగుణోధ్ధామున్ రుచిస్తోము భూ
వలయాధీశ లలాము రాము దగ సంభావించు వాతాత్మజున్
విలసద్భక్తి భజింతు వాయుసుతునే వీరాగ్రణిన్ మారుతిన్
90.ఓంకారోద్భవచిత్కాళా మయుని శ్రుత్యు ద్భూతశక్త్యాత్ము నే
ణాలంకాలంకృత దేవజాతనుతభద్రాధీశునిన్ శేషప
ర్యం కా సీనువినీల కాయు జలదశ్యామున్ నితాంతం ఔద్న్
కైంకర్యంబొనరించు వాయుసుతునికైమోడ్తు శ్రీ మారుతిన్ .

Subscribe to:
Posts (Atom)