Saturday, 16 November 2019

మారుతిశతకము4

                మారుతిశతకము4
48.పర్వతభేదనున్ పతితపావనభక్తుని బంధమోక్షదున్
పర్వనిశాకరాభయశు పావని రామకధావిధేయునిన్
సర్వరుజప్రకోపహరు శంభుకళాంశజు ఫల్గుణప్రియున్
గర్వవిహీనభావు వెనుకాడక కొల్తు నెడంద మారుతిన్.
49.సన్నుత లోకపూజ్యు కపిసంతతిపుంగవు వజ్రకాయువి
దృన్నుతరామభక్తు కపివల్లభుబంటు జితాహితోత్కరున్
పన్నగభూషణాభనుతభాసురతత్త్వకళాప్రపూర్ణుని
త్యోన్నతసత్యగోచరుపరోత్కరభీకరు గొల్తు మారుతిన్
50.పావనవాయు వంశనుతవార్ధిసుధాకరుప్రాంశుబీజుది
నావను రామభక్తుని నఖాయధుపుచ్ఛహతాసురున్ చిరం
జీవివిమత్సరున్ వినుతశీలు మహాబలు కాంచనాభుసు
గ్రీవునిమంత్రిసత్తముని కీశకులాధిపు గొల్తు మారుతిన్.
51.భీకరవజ్రదంష్ట్రు పరవీరభయంకరు శంభుతేజు న
స్తోకపరాక్రమాభ్యుదయశోభితబాహుయుగున్ మహాబలున్
లోకసమర్చితున్ సకలరోగహరున్ కపికుంజరున్ పరా
నీకమదాపహారి హరి నే భజియింతు కపీశు మారుతిన్.
52.. మేటి వనాట కోటి విభు మేరు సమానసుధీరు వీరు వృ
క్షాట చయే O ద్రు సద్గుణ సమంచిత మర్కట సింహు స్తుత్యభూ
జాటకులావతంసు మహిమాత్ము కపీశు ప్లవంగ రాజు నా
రాటము లేని భక్తి మదిరంజిల నమ్రత గొల్తు మారుతిన్
53.పారావారగభీరు దీప్తివలయప్రాకారు శూరున్ మరు
ద్వారా గార నివాసదేవగణసత్కారాన్వితున్ వానరున్
ధారావాహిక రామనామకలితోద్ధామప్రభాకారు సీ
తారామాభినుతావనీజచరునిన్ ధ్యానింతునమ్మారుతిన్ఱఘ
54.నిరేజోద్భవముఖ్యదేవగణవాణిస్తుత్యసామీరి దు
ర్వారాఖర్వపరాక్రమోజ్జ్వలితసద్భాహుద్వయున్ వాయుజున్
స్మే రోద్భాసితసుందరాస్యు వినుత శ్రీరామ భక్తాగ్రణిన్
మేరూర్వీధరధీరు గొల్తు నెదలో మేకొంచునమ్మారుతిన్.
55.నోరారన్ రఘురామమూర్తిన్ నుతచిన్మూర్తిన్ జితార్తిన్ శుభున్
సారాచారుభజించునక్కపివరున్ సర్వస్తుతాశోత్కరున్
ఘోరాఘప్రకరంబుబాపనెదసంకోచంబులేకెప్పుడున్
ఆరాధింతును భక్తిభావకలితున్ అమ్మాన్యు నమ్మారుతిన్.
56. రౌశీభూత నుతోన్నతాభ్యుద యపారావారపద్మారి త
త్కా శీక్షేత్ర వరాంశ సంభవు పరంధామున్ నుతోద్దాము వా
రాశి ప్రావృతమేదినీ శ్వరవరారాద్యున్  శుభున్  రామభూ
మీశో ద్భాసిత హృత్సరోజు కొలుస్తూ న్నింపార నమ్మారుతిన్ .
57. విపదబ్ధిన్ గడపంగతత్కపి ననిర్వేదాత్ము భక్తోత్తమున్
కపిశార్దూలుని దీర్ఘబాహుశుభునిన్  కారుణ్యమూర్తిన్ హరిన్
విపులప్రాభవవైభవున్ సుగుణసంవేద్యున్ ప్లవంగప్రభున్
అపిధానేతరభక్తితత్పరతనే నర్చించెదన్  మారుతిన్
58.ఫాఫసమౌహకాననవిభాగహుతాశవుసర్వదేవతా
తాపనివారణాభ్యుదయధామగదాధరు ముష్టిఘాతసం
తాపితరాక్షసాధిపవితాను సుతానిలసూను పావనున్
స్థాపితధధర్మజివనులసన్మతిగొల్తుసతంబుమారుతిన్.
59.స్ఫూర్తి నొసంగిజీవనవీభూతికి తద్భవమోహవార్థికిన్
స్ఫూర్తి నడంచిమోక్షణము పొందుగగూర్చెడి రామనామసం
కీర్తనమెప్పుడున్ వీడువకేభజియించెడి వీరుజానకి
భర్తకుప్రాణమైనకపివరేణ్యునిభజింతుమారుతిన్
60.కంజదళాయతాక్షపదకంజములన్ వెనుకంజలేకహృ
త్కంజమునందునిల్పికలకాలముసన్నుతభక్తితత్త్వమున్
పుంజుకొనంగగొల్చునుతపుణ్యుప్రభంజనసూనునే నెదన్
రంజిలుభక్తిభావమలరన్ నిరతంబుభజింతు మారుతిన్.
61.సన్నుతఫల్గుణప్రియుని సర్వసురస్తుతదివ్యసత్కళా
భ్యున్నతునిర్జితాబ్దిమహిమోన్నథభంగసమన్వితున్ స్తుతా
త్యున్నతకామరూపువిజితోద్ధతభీమరిపూత్కరాన్వితున్
విన్నదనంబుపోవమదివేడ్కభజింతుసతంబుమారుతిన్.
62దౌత్య సమార్జితాధిక సుధామ యసుందరసద్యశోధనున్ 
   మత్యమరేశ సద్గురు నుమావరదేవకుమారుతాధ్ధరా 
పత్య నుతాంతరాత్ము పరిపక్వ విభూతికళా నుభూతిసాం 
గత్యసుశోభితున్ గరళకంఠనుతున్ భజియింతు మారుతిన్ .
63.మాకికనీవు ముఖ్యుడవు మాన్యగుణుండవు సర్వదేవతా 
నీకనుతోన్నతాభ్యుదయనేతవు దాతవు రామదూతవ 
న్నక్కకులాభిమానివి వినమ్రుడ వంచు నుతించియిచ్చు మై 
నాకసపర్యగొన్నకపినందను భక్తి భజియింతు మారుతిన్ .
64.అధ్వరమోదితాఖిల సురార్చితభక్త వితానవర్యు  పా 
ర్ధధ్వజు నాశుగాత్మజు ధృతస్తుత రామపదాంబుజున్ నిశీ 
ధాధ్వగసంఘకంజగజు  నారవితేజు  నుతైకజానకి 
సాధ్వి కృపార్జితా భ్యుదయు సత్కపిసింహు భజింతు మారుతిన్ .
  65. .దశరధ బాలు సద్వినుత ధర్మమయై క మనోజ్ఞశీలున
ద్దశ ముఖ కాలు సద్విభవ ధామ సమేత సువర్ణ చేలు నా
శశిధరసన్నుతైక గుణజాలు సుభక్త జనానుకూలు  న
వ్విశ దధ రేశపాలు నెడవేఁడు మహాత్ముగొల్తు మారుతిన్
66.మానితసత్యభామ మణిమండల భూమ నుతేషు దేవస
మ్మానితసద్గుణా భ్యుదయమండితమంజుల వేషు భక్తసం
తానకళా భిలాషు వినుతప్ర ధితాఖిలలోకపోషు న
ద్దానవసంఘశోషు నెడద న్  గను పూజ్యుని గొల్తు మారుతిన్ .
67.శూలిముఖామరేశనుతసుందరదివ్యతనూవిలాసునిన్
లాలితహాసు సద్గుణవిలాసు ప్రసిద్ధకళావిభాసు సం
పాలితదాసుభద్రగిరీవాసుకుజేశునుతావనీశు ను
ద్వేలముదంబుతో కొలుచువీరుని నే భజియింతు మారుతిన్.
68.భండనభీముసూర్యకులవారిధిసోముగుణాభిరాము ను
ద్దండపరాక్రమాభ్యుదయధామునుతోన్నతనాము సన్నుతా
ఖండలముఖ్యదేవహితకాముపూ
దండలపూజచేయుగుణధామునిసత్కపి గొల్తు మారుతిన్.

Tuesday, 18 June 2019

నారాయణ శతకము7

           నారాయణ శతకము7

మ!!అపరాధంబులునిన్నునమ్మివినుమేనాజన్మపర్యంతమున్

విపరీతంబుగజేసినాడనిక నీవే దిక్కు నాలోనికిన్

గపటంబింతయులేక దండధరుకుంగట్టీక  రక్షింపుమీ

కృపకుంబాత్రుడనయ్యధర్మపురి లక్ష్మీనాథనారాయణా!!97

శా!!చెల్లంజేసితిపాతకంబులు మదిన్ శ్రీనాథ మీనామముల్

పొల్లుల్ బోవనినమ్మె వీడని దయంజేపట్టిరక్షింపుమీ

తల్లిందండ్రియునీవుగాకయొరులేతర్కింపనారాయణా!!98మ!!నరసింహాచ్యుత వాసుదేవవకసన్నాళీకపత్రాక్షభూ

ధరగోవిందముకుందకేశవజగత్త్రాతాహితల్పాంబుజో

దరదామోదరతాక్ష్యవాహనమహాదైత్యారివైకుంఠమం

దిరపీతాంబర భక్తవత్సలకృపన్ దీపింపు నారాయణా!!99

మ!!కడకంటంగడవేని సంపదలొగింగావింపు లక్ష్మీశపా

ల్కడలిన్  బన్నగశాయివై భువనముల్  గల్పించు    సత్పుత్రునిన్  

బొడమంజేసిన నాభిపంకజజిగత్పుణ్యాత్మ భాగీరథీ

పడతింగన్న పదారవిందములనేభావింతునారాయణా!!100

మ!!తపముల్ మంత్రసమస్తయజ్ఞఫలముల్ దానక్రియారంభముల్

జపముల్ పుణ్యసుతీర్థసేవఫలముల్  సద్వేదవిజ్ఞానమున్

ఉపవాసవ్రతశీలకర్మఫలముల్ యొప్పారనిన్నాత్మలో

నుపమింపంగలవారికేగలుగు వేయున్నేల నారాయణా!!101

శా!!శ్రీమన్నారాయణయన్నజాలుదురితశ్రేణిన్నివారింపంగా

నానందస్థితిగల్గునంచునిగమార్థానేకమెల్లప్పుడున్

నానాభంగులజెప్పనేనువినిశ్రీమన్నారాయణాయంచుని

న్నేనేనెప్పుడుగొల్తుబ్రోవగదెతండ్రీనన్నునారాయణా!!102

మ!!కలితాఘౌఘవినాశకారియగుచుంగైవల్యసంధాయియై

నవినొప్పారెడుమంత్రరాజమగునీనామంబు ప్రేమంబునన్

అలరన్నెవ్వనివాక్కునంబొరయదోయన్నీచుదేహంబుదా

వెలయన్ భూరుహకోటరంబదియసూవేదాత్మనారాయణా!103

మ!!రమణీయంబుగ నాదిమంబునవతారంబున్  భవద్దివ్యరూ

పమునామామృతమున్ దలంప దశకప్రాప్తయ్యెగృష్ణావతా

రముసుజ్ఞానముమోక్ష మున్ 

ద్వివిధసంప్రద్వివిధసంప్రాప్తిన్ శతాంధ్రాఖ్యకా

వ్యమునర్పించితిమీపదాబ్జములకున్ వైకుంఠ నారాయణా!!104

శా!!నీమూర్తుల్ గననీకథల్ వినదుదిన్ నీపాదనిర్మాల్యని

ష్ఠామమోదంబునెఱుంగ‌ ,నీచరణతోయంబాడ ,నైవేద్యముల్ ,

నీమంబొప్ప భజింప నీజపము వర్ణింపన్ గృపంజేయవే ,శ్రీమించన్ బహుజన్మజన్మములకున్ శ్రీయాది నారాయణా!105

      ఇదిశ్రీపరమేశ్వరకరుణాకలిత కవితా విచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్యప్రణీతంబైన నారాయణ శతకంబున సర్వంబును సంపూర్ణము.

@@@###@@@$$$$$$@@@@

నారాయణ శతకము6

               నారాయణ శతకము6

మ!!బలుకర్మాయత పాశబంధవితతిన్ బాహాపరిశ్రేణికిన్

జలయంత్రాన్వితబంధయాతనగతిన్ సంసారకూపంబులో

నలరంద్రిమ్మరుచుండునన్నునకటా!యార్తుండనైవేడెదన్

వెలయన్నీకృపచేతజేకొనవెనన్ వేవేగనారాయణా!!83

మ!!మమహంకారవికారసన్నిభమహామత్తాదిలోభాంధకా

రముచేముక్తికినేగుమార్గమెఱుగన్  రాదింకనాలోననీ

విమలాపాంగదయాదివాకరరుచిన్ వెల్గింపుమింపారనో

కమలానందవిహారవక్షలలితా కంజాక్షనారాయణా!!84

మ!!పరిపంథిక్రియనొత్తివెంటబడునప్పాపంబుదూలించిమీ

చరణాబ్జస్థితిపంజరంబు శరణేచ్ఛంజొచ్చితింగూవుమీ

బిరుదుంజూడుముమీరుసూడగభవద్భృత్యుండుదుఃఖంబులం

బొరయన్మీకపకీర్తిగాదెశరదంభోజాక్షనారాయణా!!85

మ!!సతతాచారముసూనృతంబు కృపయున్ సత్యంబంన్ శీలమున్

నతిశాంతత్వము చిత్తశుద్ధి కరమున్  నథ్యాత్మయున్ ధ్యానమున్

ధృతియున్ ధర్మముసర్వజీవహితముందూరంబుగాకుండ స

మ్మతికింజేరువమీనివాససుఖమున్ మానాథ నా  రాయణా!!86

మ!!భవనాశిన్ గయ తుంగభద్ర యమునన్ భాగీరథింగృష్ణ

వేత్రవతిన్మరద పెన్నగౌతమిపయోరాశిన్వియద్గంఢయం

దవగాహంబుననైనపుణ్యములుబెంపారంగనేడిచ్చటన్

భవదంఘ్రిస్మరణంబునంగలుగునోపద్మాక్షనారాయణా!!87

మ!!ధరగ్రామాధిపునింటిదాసుడువెసందాద్రోహముంజేసినన్

పరగంజెల్లుటసూచితీభువనసంపాద్యుండవైనట్టిమీ

వరదాసావలిదాసదాసిననిదుర్వౌఘముల్ జేసితిన్

కరుణంజేకొనికావుమయ్యత్రిజగత్కళ్యాణనారాయణా!!88

మ!!గణుతింపన్ బహుధర్మశాస్త్రనిగమౌఘంబెప్పుడున్నిన్నకా

రణబంధుండనిచెప్పనత్తెఱగుదఃరంబందకుండంగనే

బ్రణతుల్ జేసెదగొంతయైన గణుతింపంబాడిలేకుండినన్

ఋణమానానుతినీవుశ్రీపతివి నీకేలప్పునారాయణా!!89

మ!!కరినాథుండుజలగ్రహగ్రహణదుఃఖాక్రాంతుడైయీశమీ

శరణంబన్నగృశానుభానుశతతేజస్స్ఫూర్తియైనట్టిమీ

కరచక్రంబుననక్రకంఠము వెసన్ ఖండించి మించెందయా

పరసద్భక్తభయానకప్రకరసత్ప్రాకట్య నారాయణా!!90

మ!!ఏ భావంబున నిన్ దలంచె గజయూధేంద్రుండు ఆఫన్నుడై

యేభావంబునద్రౌపదయ్యెడరమాధీశా యనెన్వాయసం

బేభావంబున నీ శరణ్యమనెనోయీనీకృపాదృష్టిచే

నాభావంబున నీతలంపు గలుగన్నాకిమ్మునారాయణా!!91

శా!!నీలగ్రీవుడుచేతిపున్క విడిచెన్నీయింతిభిక్షంబునన్

నీలగ్రీవుడు యీశ్వరాఖ్యదనరెన్నీనామజప్యంబునన్

నీలగ్రీవుడుమించిత్రుంచెబులముల్ నీప్రాపుసేవించినన్

నీలగ్రీవమఖాబ్జ భాస్కరకృపా నిత్యా త్మ నారాయణా!!92

మ!!నిను వర్ణింపనివాడు మూగమదిలోనీనామమున్ వీనులన్

వినిమోదింపనివాడు చెవ్డుమరినిన్ వేడ్కన్ మనోవీథినిన్

గనిపూజింపనివాడు నాశకరుడౌ కర్మక్రియారంభుడై

తనలోగాననివాడునీచమతివోతత్వజ్ఞ నారాయణా!!93

మ!!నినువర్ణింపనినీచబంధమతి దానిర్మగ్నమూఢాత్ముడై

పెనుదైవంబులగోరి తా మనమునన్

సేవించుచంచందంబుతా

నవలంబారినభూతియందువెలయన్నాజ్యాహుతుల్ పూనివే

ల్చినచందంబున వ్యర్థమై తనరుజూచిద్రూప నారాయణా!!94

మ!!నినువర్ణింపనిజిహ్వదాబదటికా?నీలాభ్రదేహాంగకా

నినునాలింపనిచెవ్లు దాబదటికా?నీరేజపత్రేక్షణా

నినుబూజింపనికేలు దాబదటికా నిర్వాహకక్ష్మాతలా

నిను జింతింపనియాత్మ దాబదటికా?నిర్వాణనారాయణా!!95

శా!!నీవేతల్లివినీవెతండ్రివరయన్నీవేజగన్నాథుడౌ

నీవేనిశ్చలబాంధవుండవరయన్నీవేమునీస్తుత్యుడౌ

నీవేశంకరమూలమంత్రమరయన్ నీవేజగత్కర్తవున్

నీవేదిక్కనువారివారలెకడున్నీవారు నారాయణా!!96


నారాయణ శతకము 5నిరతానంద

                                           నారాయణ శతకము 5

మ || పరమజ్ఞాన వివేక పూరిత మహాభవ్యాoతరాళంబునన్ 

      పరగన్నీనిజనామమంత్రమొనరన్  భక్తిన్ననుష్ఠింపుచుం 

     దురితాన్వేషణకాల భూతమువెసన్ దూలంగ వాకట్టువా 

    డరుగున్  భవ్యపదంబు నొందుటకునై యివ్యక్త నారాయణా !!68

మ || సరి ఘోరాంధక బోధకారణ విపత్సంసార మాలిన్యమున్ 

       పరమానంద సుబోధకారణ లసద్భస్మంబుపైనూది యా 

        నిరతజ్ఞాన సుకాంతి దర్పణమునన్నిస్సంగుడై  తన్నుదా 

      నరయంగాంచినవాడు నిన్ను గనువాడబ్జాక్ష నారాయణా !!69 

మ || పరుషాలాపములాడ నోడి మదినీ పాపార్జనా రంభుడై  

         నిరసించేరికి గీడు సేయక మదిన్ని ర్ముక్తకర్ముoడునై 

       పరమానదనిషే ధముల్ సమ ముగా భా వించి వీక్షించునా 

       పరమజ్ఞాని భవత్కృపంబొరయ నో పద్మాక్ష నారాయణా !!70  

మ || ఒరులం దన్నుఁనెఱుంగు నయ్యెఱుకయు న్నొ ప్పారనేకాంతమం 

        దరయం బైపడు నన్య భామినులపైనాకాంక్ష దూరత్వమున్ 

      మరణావస్ధను నీదు నామములె సన్మానంబునందోచుటల్ 

    ధరలోనన్నివి దుర్లభంబులు సుధాధామాక్ష నారాయణా!!71

మ || వెరవొప్ప న్బహు శాస్త్రమంత్రములొగి న్వీక్షించివేతెల్సీమీ

       వరనామామృతపూరమానుచు దగన్ వైరాగ్య భావంబునన్ 

         సరి నశ్రాంతముగోరువారుపిదపన్ సంసారమాతు:పయో 

        ధరదుగ్ధంబులుగ్రోలనేరరు వెసన్  దైత్యారి నారాయణా !!72

 శా || వేదంబందు సునిశ్చయుండగు మహా వేల్పెవ్వడో  యంచు నా 

      వేదవ్యాసపరాశరుల్    వెదికినన్వేరొండు లేడంచు మీ 

        పాదాంభోజములెల్లప్రొద్దుమదిలోభావింతురత్యున్నతిన్ 

         శ్రీ దేవీవదనారవింద మధుపా శ్రీరంగ నారాయణా !!73

మ || సుతదారాప్తజనాది విత్తములపై శూన్యాభిలాషుండునై 

     యతనో ద్రేకయుతంబులై పొదలున్నయ్యైoద్రియవ్రాతముల్

     మృతిబొందించి దమంబునన్  శమమున్  మీఱంగ వర్తించు ని 

     ర్గతసంసారి భవత్కృపంబొరయు నో కంజాక్ష నారాయణా !!74  

మ|| ప్రమదంబారగపుణ్యకాలగతులన్  భక్తిన్ననుష్థింపుచున్ 

      నమరన్నన్న సువర్ణ గోసలిలా కన్యాధారుణి గ్రామదా 

     నమూలామ్నాయవిధోక్తి భూసురులకున్ సన్మార్గుడై యిచ్ఛువా 

    దమరేంద్రార్చితవైభవోన్నతుడగు న్నామీద నారాయణా !!75    

మ|| ఇలనెవ్వారిమనంబులో నెఱుక దానెంతెంత గల్గుoడునా 

కొలదింజెందివెలుంగుచుందుకలయన్గోవింద నీరూపులన్

యలరన్నయలరన్నంబుమితంబులైసరసిలోనంభోరుహంబుల్ దగన్

నిలనొప్పారెడుచందమొందెదెపుడున్నీలాంగనారాయణా!!76

మ !!మదిలోనుత్తమభక్తిపీఠముపయిన్   మానాథ    మీపాదముల్

గదియంజేర్చినవానికేనొడయడన్ గాదంచు. నత్యున్నతిన్

పదిలుండైసమవర్తి మృత్యువునకున్  బాఠంబుగా బల్కుమీ

పదపద్మార్చకులెంత పుణ్యులొ కృపాపారీణనారాయణా!!77

మ!!కులమెన్నంగొలదేల యేకులజుడుం గోత్రాభిమానాభిలా

షలునజ్ఞానముబాసి జ్ఞానము మదిన్ సంధించి శుద్ధాత్ముడై

యలరారంబరుసంబుసోకు నినుమున్ హేమాకృతిస్తోమమై

వెలయున్నాగతి వాడుముక్తికరుగున్ వేదాత్మ నారాయణా!!78

మ!!నిరతానంద నియోగులైనియతులై నిర్భాగ్యులైనీచులై

కరుణాహీనమనస్కులై మలినులై కష్టాత్ములై నష్టులై 

పరుషవ్యాధినిబద్ధులై పతితులై భగ్నాంగులైమ్రగ్గువా

రరయన్నిన్నొగినాత్మయందిడనివారబ్జాక్షనారాయణా!!79

మ!!ఘనభోగాస్పదులైగతౌఘమతులై కారుణ్యులైముక్తులై

ధనకీర్తిప్రదులైదయాభిరతులై ధర్మాత్ములైనిత్యులై

మనుజాధీశ్వరులైమనోజనిభులైమాన్యస్ధులై స్వస్ధులై

యెవరన్నొప్పెడువారు నీ పదరుచుల్ యూహించు నారాయణా!!80

మ!!విదితామ్నాయనికాయభూతములలోవిజ్ఞానసంపత్కళా

స్పదయోగీంద్ర మనస్సరోజములలో బ్రహ్మేంద్రదక్పాలక

త్రిదశవ్రాతకిరీటరత్నములలోదీపించుచున్నట్టిమీ

పదపద్మంబులుభావగేహమున నే భావింతు నారాయణా!!81

మ!!వెలయన్ యౌవనకాలమందు మరుడున్ వృద్ధాప్యవేళంబులన్

బలురోగంబులునంత్యమందుయముడుంబాధింపబట్టైనయీ

పలుజన్మంబులుచాలదూలితి ననుంబాలింపవేదేవమీ

ఫలితానంద దయావలోకనము నాపైజూపునారాయణా!!82


నారాయణశతకము 4

                                                      నారాయణశాతకము 4

శా || పసులంగాపరి యేమెఱుంగు మధుర ప్రాయోల్ల సద్వృత్తవా

     గ్వి సరారావము మోవిదావెదురు గ్రోవిం బెట్టినాడంచు నిన్ 

      గసటుల్  సేయగనాడు గోపికల తద్గానంబులన్  మన్మధ 

      వ్యసనాసక్తల జేయుచందములు నే వర్ణింతు నారాయణా!!51

మ || జడియెoతే దడవయ్యె జెయ్యి యలసెన్ శైలంబు మా చేతులం 

        దిడుచున్నన్  జిఱునవ్వుతో వదలినన్ హీనోక్తి గీపెట్టనె 

         క్కుడుగోవుల్  బ్రియమంద నింద్రుఁ డడలంగోవర్ధనాద్రీoద్రమున్ 

          గొడుగై యుండగగేలబూనితిగదా గోవింద నారాయణా !!52  

మ || లలితాకుంచిత వేణియందడవిమొల్లన్ జాఱ ఫాలస్ధలిన్ 

        దిలకంబొయ్యన జాఱ గుండలరుచుల్   దీపింప లేజెక్కులన్ 

        మొలకన్నవ్వుల చూపు లోరగిల మెన్మువ్వంకలన్ బోవఁగా 

       నలిగైకొందువు గాదె నీవు మురళీనాట్యంబు నారాయణా !!53 

శా  || మాపాలం గడుగ్రొవ్వి గోపికలలో మత్తిల్లి వర్తింతువే 

         మాపాలె o బుల వచ్చి యుండుదు వెసన్మాపాలలో నుండుమీ 

          మాపాలైన సుఖాబ్ధిలో మునుగుచున్  మన్నించి తా గొల్లలన్ 

          మాపాలంగల వేల్పు నీవె యని కామన్నింతు  నారాయణా!! 54

మ|| ఒకకాంతామణి కొక్కడీవు మఱియు న్నొక్క ర్తె కొక్కండవై 

          సకల స్త్రీలకు సంతసంబలరరాసక్రీడ తన్మధ్యక

           ల్ప కమూలంబునఁ వేణునాదరసమొప్పంగా బదార్వేలగో 

           పికలంజెంది వినోదమొందునెడనీ పెంపొప్పు నారాయణా!!55 

మ|| లలితంబైన భవత్తనూవిలసనన్ లావణ్యాదివ్యామృతం

        బలుగుల్వారగ నీకటాక్షమున దామందంద గోపాంగనల్ 

       తలపుల్పా దులుగట్టి కందళిత నూత్న శ్రీలు వాటింతురా 

      నెలతల్ తీవెలు చైత్రవుస్ఫురణమౌ నీయొప్పు నారాయణా !!56  

   శా || లీలన్  బూతకి ప్రాణవాయువులు పాలిండ్లoదువెళ్లించి దు 

       శ్శీ లుండై చను బండిదానవు వెసంజిందై పడందన్ని యా 

      రోలన్మద్దులుగూల్చిధేను దనుజున్  రోజంగ నీల్గించి వే 

      కూలం గంసుని గొట్టి గోపికలకోర్కుల్ దీర్తు నారాయణా !!57

మ || రసనాగ్రంబున  నీదు నామరుచియున్  రమ్యంబుగా జెవ్లుకు

        న్నసలారంగ భవత్కథాభిరతియున్  హస్తాబ్జయుగ్మoబులం 

        వెసనీపాదసుపూజితాదియుగమున్  విజ్ఞాన మధ్యాత్మకున్ 

         వెసనింపొందనివాడు  దా పశువు సూ వేదాత్మ నారాయణా!!58    

మ|| వరకాళింది తరంగడోలికలలో వైకుంఠ ధామంబులో 

        వెరవొప్పారనయోధ్యలో మధురలో వ్రేపల్లెలో ద్వారకా 

         పురిలో నాడెడు భంగి నాదుమదిలో భూరిప్రసన్నావనాం 

         బురుహంబొప్ప నటించునొప్పును సితాంభోజాక్షా నారాయణా!!59

శా  || చల్లల్వే ఱొక యూరణమ్ముకొను నాసంబోవు చో ద్రోవనీ 

        వుల్లాసంబున నడ్డకట్టి మదనోద్యోగానులాపంబులన్ 

        చల్లన్ జల్లనిచూపు జల్లుమని గోపస్త్రీలపై జల్లుమీ 

      చల్లంబోరుతెఱంగుజిత్తమునఁ నే జర్చింతు నారాయణా !!60  

మ|| కలయన్వే దములున్  బురాణములు బ్రఖ్యాతంబుగా తెల్పి మీ 

         వలనన్  భక్తివిహీనుండైన పిదపన్  వ్యర్ధ ప్రయత్నంబెపో 

         గులకాంతామణి గొడ్డువోయినగతిం గ్రొవ్వారు సస్యంబుదా 

          ఫలకాలంబున నీచపోవుపగిదిన్ పద్మాక్ష నారాయణా !!61

శా || స్నానంబుల్  నదులందు జేయుట గజస్నానంబు చందంబగున్ 

        మౌనంబొప్ప జపించు వేదమటవీ మధ్యంబులో నేర్పగున్ 

        నానాహోమములెల్ల బూడిదలలోన న్వేల్చు నెయ్యై చను 

     న్నీ నామోక్తియు నీపదాబ్జరతియున్  లేకున్న  నారాయణా !!62

మ || అలనీటందగు రొంపిపై జిలికిన న్నానీటనే పాయునా 

        యిల పాపంబులు దుర్భరత్వము మహా హేయంబునంబొందినం 

       బలువై జీవుని దొప్ప దోగినవి యీ బాహ్యంబునం బాయునే 

      పొలియుం గాక భవత్సుపాద జలముం బ్రోక్షింప నారాయణా !!63 

మ|| తన చిత్తాబ్జము మీపదాబ్జములకుం దాత్పర్య సద్భక్తితం

        తున బంధించిన  బంధనంబుకతనం దుష్పాప పుంజంబులె 

        ల్లను విఛ్చిన్నములై యడంగు మహి మొల్లాసాబ్ధి యైనట్టి దా 

        సునకింపొందును మోక్షవైభవము దా సుశ్లోక నారాయణా !!64  

మ || తనువుం జీవుడు నేకమైన పిదపన్  ధర్మక్రియారంభుడై 

        యనయంబు న్మది దన్నెఱుoగక తుదిన్నా మాయచే మగ్నుడై  

        తనుతత్త్వాది వియోగమై నపిదపం దానేర్చునే నీదు ద 

       ర్శనమింపారగ భక్తివైభవమహాసంకాశ నారాయణా !!65

మ||తనకున్  సాత్వికసంపదా న్వితమహా దాసోహభావంబునన్ 

      ననయంబున్మది నన్యదైవభజనం బారంగ దూలింపుచున్ 

       జనితాహ్లాదముతోడ నీచరణముల్ సద్భక్తి పూజించి నిన్ 

      గనుగొన్నంతనె కల్మషంబులడగుo గర్మఘ్న నారాయణా !!66

మ|| పరికింపన్  హరిభక్తి భేషజునకు న్  భవ్యంబుగా మీదమీ 

      చరణాంభోరుహ దర్శనంబు గలదే సంప్రీతి నెట్లన్నదా 

        ధరలో జోరుడు గన్న దుస్తర పరద్రవ్యంబుపై నాసలం 

          బొరయ న్నేర్చు నె దుర్లభంబగు గృపాంభోజ నారాయణా !!67

నారాయణ శతకము 3

                                             నారాయణశతకము 3మ ||                                                        కలుషాగాధవినాశికారియగుఛుం గైవల్య సంధాయియై 

        నలినొప్పారెడు మంత్రరాజమగు నీనామంబు ప్రేమంబుతో 

         నలరన్నె వ్వని వాక్కునం బొరయదె నన్నీచుఘోరాత్మయున్ 

        వెలయన్ భూరుహకోటరంబదియ  సూ వేదాత్మ నారాయణా !!33

మ || పరమంబై పరతత్వమై సకలసంపత్సారమై భవ్యమై 

       సురసిద్ధోరగయక్షపక్షముని రక్షోహృద్గహాభ్యంతర

       స్ధిర సుజ్ఞాన సుదీపమై శృతికళా  సిధ్ధాంతమై సిధ్ధమై 

       సరిలేకెప్పుడు నీయదునామమమరున్ సత్యంబు నారాయణా!! 34!!

మ||అధికాఘోతమోదివాకరమునైయద్రీంద్రజాజిహ్వకున్        

        సుధయై వేద వినూత్న రత్నములకున్ సుత్రాభిధానంబునై

      బుధసందోహామనోహరాంకురమునైభూదేవతాకోటికిన్ 

      విధులై మీ బహునామరాజి వెలయన్  వేదాత్మ నారాయణా !!35

 మ|| పొనర న్ముక్తికి ద్రోవవేదములకంబుట్టిల్లు మోదంబునం 

       దునికి స్ధానము యిష్ట భోగములకున్నుత్పత్తియేప్రొద్దునున్

       ఘనపాపంబులవైరి షడ్రిపులకున్  గాలావసానంబుమీ 

      వినుతాంఘ్రిద్వయపద్మసేవనగదా విశ్వేశ నారాయణా !!36 

మ|| భవరోగంబులమందు పాతకమో బాలార్కబింబంబుక 

       ర్మవిషజ్వాలసుధా0షుగామృతతుషారా వ్రాతపాధోధిమూ 

      ర్తివి కైవల్యపదానలోకనకళాదివ్యా0జనశ్రేష్ఠమై   

      భువిలో మీదగు మంత్రరాజమమరున్  భూతాత్మ నారాయణా !!37

మ|| వరుసన్ గర్మపిపీలికాకృత తనూవల్మీక నాళంబులో

       బరుషాకారముతోవసించినమహాపాపోరగశ్రేణికిం

      బరమోచ్చ్చాటనమై రహస్యమహిమంబాటింపుచున్నుండుమీ

     తిరుమంత్రంబగు మంత్రరాజమమరుం దివ్యాత్మ నారాయణా !!38  

మ|| హరునిన్నద్రిజ నాంజనేయుని గుహున్నయ్యంబరీషున్ ధ్రువుం 

     గారి బ్రహ్లాదు విభీషణాఖ్యుని బలిన్  ఘంటాశ్రవున్నారదున్ 

   గరమొప్పన్విదురున్ బరాశర సుతున్ గాంగేయునిన్ ద్రౌపదిన్ 

    నరునక్రూరునిబాయకుండును భావన్నామంబు నారాయణా!!39 

శా || శ్రీకిన్మందిరమైన వక్షము సురజ్యోష్ఠోద్భవ స్ధాననా 

   భీకంజాతము చంద్రికాంతర సుధాభివ్యక్త నేత్రంబులున్  

  లోకస్తుత్యమ రున్నదీజనక మాలోలాంఘ్రియున్  గల్గునా 

  లోకారాధ్యుడవైన నిన్నెపుడునాలో జూతు నారాయణా !!40 

శా || విందుల్ విందులటంచు గోపరమణుల్ వ్రేపల్లెలో బిన్ననా 

       డందెల్ మ్రోయగ ముద్దుమోమలరనిన్నాలింగితున్ సేయుచో 

        డెందంబుల్  దనివారరాగరసవీటీలీలలన్  దేల్చుమీ 

        మందస్మేరము ఖేందు రోచులు మముఁన్మన్నించునారాయణా !!41

శా || విందుల్వచ్చిరి మీయశోదకడకున్వేగంబె పొమ్మయ్యయో 

       నందానందన !చందనాంకురమ !కృష్ణా!యింకా బోవేమిమా 

      మందం జాతరసేయబోదమిదెరమ్మా యంచు మిమ్మెత్తుకో

     చందంబబ్బిన నుబ్బకుండుదురె  ఘోషస్త్రీలు నారాయణా !!42

శా  || అన్నా కృష్ణమ నేడు వేల్పులకు మీదన్నారమీ చట్లలో 

       వెన్నల్  ముట్టకు మన్న నాక్షణము నన్విశ్వాకృతి స్ఫూర్తివై

       యున్నన్  దిక్కులు చూచుచున్  బెగడి నిన్నొలినుతుల్ సేయుచున్ 

      గన్నుల్ మూయ యశోదకున్  జిఱుతవై కన్పింతు నారాయణా !!43

శా || ఉల్లోలంబులుగా గురుల్ నుదుటిపై నుప్పొంగ మోమెత్తి ధ 

        మ్మిల్లం బల్లలనాడ రాగరస సమ్మిశ్రంబుగా నీవు వ్రే 

        పల్లెం దాడుచు గోపగోనివహ గోపస్త్రీలయుల్లంబుమీ 

        పిల్లంగ్రోవి ని జుట్టిరాదిగుచు నీ పెంపొప్పు నారాయణా !!44 

మ|| కసవొప్పన్  పసి మేసి ప్రొద్దుగలుగంగాంతా రముంబాసి య 

        ప్పసియు న్నీవును వచ్చుచో నెదురుగా బైకొన్న గోపాంగనా

        రసవద్వృత్త పయోధరద్వయ హరిద్రాలేపనామోదముల్ 

       పసిగొంచున్  బసి   గొంచు వచ్చుఁటలు నేభావింతునారాయణా   !!45

శా||చన్నుల్ మీదికి చౌకళింప నడుముం జవ్వాడ కందర్పసం 

      పన్నాఖ్యంబు నటించు మాడ్కి కబరీభారంబులూటాడగా 

     విన్నాణంబు నటింప గోపిజన గోబృందంబుతో వచ్ఛుమీ 

    వన్నెల్  కన్నుల ముంచి గ్రోలుటలు నే వర్ణింతునా నారాయణా !!46 

మ || పెరుగుల్  ద్రచ్చుచు నొక్క గోపిక మిముం బ్రేమంబునంజూచిరా 

         గరసావేశత రిత్త ద్రచ్ఛనిడ నా కవ్వంబు నీవున్మనో 

         హర లీలంగనుగొంచు ధేనువని యయ్యాబోతునుంబట్టితీ 

         వర  వృత్తాoతము లేను పుణ్యకథగా వర్ణింతు నారాయణా !!47

శా || కేలన్  గోలయు గూటి చిక్కము నొగింగీలించి నెత్తంబునం 

      బీలీపింఛము  జట్టి నెన్నడుమునం బింఛావళిన్  గట్టిక 

    ర్ణాలంకారికడంబగుఛ్చమధుమత్తా లీస్వనంబొప్పనీ 

     వాలన్ గాచినభావమిట్టిదని నేవర్ణింతు నారాయణా!!48           

  శా || కాళిందీతటభూమి నాలకుదుపుల్  కాలూది మేయన్  సము 

      త్తాలాలోలతమాల పాదప శిఖాంతస్ధుండవై వేణు రం 

       ధ్రాలిన్  రాగరస0బునిండ విలసద్రాగంబు సంధిం చి గో 

     పాలవ్రాతము గండుగోయిలలుగా  వర్ణింతు నారాయణా !!49

శా || రాణించెన్  గడునంచు నీ సహచరుల్  రాగిల్లి సోలంగమీ

        వేణు క్వాణము వీనులంబడి మనోవీధుల్  బయల్  ముట్టగా 

       ఘోణాగ్రంబులు మీదికెత్తుకొని లాంగూలంబులల్లార్చి గో 

       శ్రేణుల్  చిందులు ద్రొక్కియాడుటలు నే జర్చింతు నారాయణా !!50  

నారాయణ శతకము

                                  నారాయణ శతకము 

                                                                                  పోతన 

శా || శ్రీ రామామణి పాణి పంకజ మృదు శ్రీ తజ్ఞ పాదాబ్జశృం

        గారాకార శరీర చారుకరుణాగంభీర సద్భక్త మం 

         దారాంభోరుహపత్ర లోచన కళా ధారోరు సంపత్సుధా 

         పారావారవిహార!నాదురితముల్  భంజింపు నారాయణా !   1

శా || కడకుం బాయక  వేయినోళ్లు గలయాకాకోదరాధీశుండుం 

         గడముట్ట న్వినుతింపలేక నిగుడఁన్  గ్రాలంగ నొప్పారుమి 

         మ్మడరన్  సన్నుతిసేయ నడువశమే యజ్ఞాని  లోభాత్ముడన్ 

         జఢుడన్నజ్ఞుడ  నైక జిహ్వుడ జన స్తబ్ధుండ నారాయణా !2

శా || నే నీదాసుడ నీవు నాపతివి నిన్నే కాని యొండెవ్వరిన్ 

       ధ్యానింపం బ్రణుతింప నట్లగుటకు న్నా నేర్చుచందంబునన్ 

      నీనామ స్తుతులాచరించు నెడల న్నేతప్పులుంగల్దినన్ 

     వానిన్ లోగొనుమయ్య తండ్రి!విహితవ్యాపార నారాయణా !3

మ || నెరయ నిర్మల మైన నీస్తుతికధానీకంబు పద్యంబులో 

       నొరుగుల్  మిక్కిలి గల్గె నేనియు గడు న్యోగ్యంబే చర్చింపగా 

      గుఱుగణ్పైనను వంకబోయిన గడుం గుజ్జైనబేడె త్తినం 

      జెరుకుంగోలకు తీపుగాక కలదే చేదెందు నారాయణా !4

మ || చదువుల్ పెక్కులు సంగ్రహించి పిదపం జాలంగసుజ్ఞానియై  

        మదిలో బాయక నిన్ను నిల్పదగు నా మర్మంబు వీక్షింపడే 

        మొదలు గాడిదచారు గంధవితతుల్ మోవంగశక్యంబె కా 

       కది సౌరభ్యపరీక్ష జూడ కుశలే యవ్యక్త నారాయణా  | 5

 మ || లలిగబ్బoబు కరాటమి వ్విధనెల్లన్మించె బో నీకథా 

         వలి కర్పూరము నించినన్నితరమౌ  వ్యర్ధార్ధకామోదముల్

        పెలుచంబూనినయక్కరాటము తుదిన్ బేతే కరాటంబెపో   

       చలాదిందీవరపత్ర లోచన ఘనశ్యామాంగ నారాయణా | 6| 

మ  || మనమారన్నచలేంద్ర జాధిపతికి నాస్తాగ్రామాణిక్యమై 

       మునికోపానలదగ్ధ రాజతతికిన్ముక్తిస్ఫురన్మార్గమై 

       యెనయన్ పాయకశాయికిం జననియై యేపారుమిన్నేటికిం 

        జనిమూలంబగు నంఘ్రినాదుమదిలో జర్చింతు నారాయణా !7

శా || నీ పుత్రుండు చరాచర ప్రతతుల న్నిర్మించి పెంపారఁగా 

       నీపుణ్యాOగన సర్వ జీవతతుల న్నిత్యంబు  రక్షింపగా 

       నీ పాదోదకమీజగ త్త్రయముల న్నిష్పాపులం జేయగా 

       నీ పెంపేమని చెప్పవచ్చుఁ సుగుణా నిత్యాత్మ నారాయణా !8

శా || బ్రహ్మాoడావలిలో సత్వగుణివై  బాహ్యoబునందాదిమ 

      బ్రహ్మాఖ్యం బరతత్వ బోధములకున్  భవ్యాధినాధుండవై 

     బ్రహ్మేంద్రామరవాయుభుక్పతులకున్   భావింప రాకున్ననా 

    జిహ్మవ్యాప్తులనెన్న  నాదువశమే  చిద్రూప నారాయణా !9

మ|| ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్  భృత్యులై 

     పరమామ్నాయములెల్ల వందిగణమైబ్రహ్మా0డమాగారమై  

      సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై 

       వరుసన్నీఘన రాజసంబు నిజమై వర్ధిల్లు నా రాయణా !10

మ|| మగమీనాకృతి వార్ధిజొచ్చి యసురన్మర్దించియవ్వేదముల్

     మగుడం దెఛ్చి విరించి కిచ్చి  యతని న్మన్నించి యేపారగా 

     బగసాధించిన దివ్యమూర్తి వాణి భావింతునెల్లప్పుడున్ 

     ఖగ రాజధ్వజ భక్తవత్సల జగత్కారుణ్య నారాయణా !!11

మ|| అమరుల్  రాక్షసనాయకుల్  కడకతో నత్యంత సామర్ధ్యులై 

       భ్రమరీ దండము మందరాచలముగా బాదోనిధిం ద్రచ్చగా 

    దమకించెన్ భువనత్రయంబును గిరుల్  దంతావళుల్  మ్రొగ్గినం 

    గమకంబై ధరియించి మించినజగత్కళ్యాణ నారాయణా !12

  శా|| భీమాకార వరాహమై భువనముల్  భీతిల్లి కంపింపను 

        ద్దామోర్విo గొనిపోయి నీరనిధిలోడాగున్న గర్వాంధునిన్ 

       హేమాక్షాసురు వీకదాఁకి జయలక్ష్మిన్   గారవింపంగ నీ 

        భూమిం దక్షిణదంష్ట్ర నెత్తిన నినుం బూజింతు  నారాయణా !!13

శా || స్తంభంబందు నృసింహమై వెడలి యచ్ఛండాట్టధ్వనుల్ 

      దంభోళిం గడువంగ హేమకశిపోద్దాండాసురాధీశ్వరున్ 

      శుంభ ద్గర్భము వ్రచ్చి వానిసుతునిన్ శోభిల్ల మన్నైనుంచియ 

      జ్జం భారాతినిబ్రీతి దేల్చిన నినుం జర్చింతు నారాయణా !!14

మ||మహియు న్నాకసముం బదద్వయపరీమాణంబుగా బెట్టి యా 

    గ్రహమొప్పం బలిమస్తకంబొక  పదగ్రస్తంబుగా నెమ్మితో 

      విహరించింద్ర విరించి శంకరమహావిర్భూత దివ్యాకృతిన్ 

    సహజంబై విలసిల్లు వామనలసచ్చా రిత్ర నాఱయణా    !!15

మ || ధరణిన్  రక్తమహాహ్రదంబు లెలమి 0ద్రైలోక్యనిర్దిష్టమై 

      పరగ0బైతృకతర్పణంబుకొఱకై ప్రఖ్యాతిగా  దీవ్రతన్  

     నిరువయ్యొక్కటి మారు క్షత్రవరులన్నేపారనిర్జించి త 

      త్పరశుభ్రాజిత రామనామము కడున్  ధన్యంబు నారాయణా !!16  

నారాయణ శతకము 2

                                  నారాయణ శతకము 

                                                                                  పోతన 

శా || శ్రీ రామామణి పాణి పంకజ మృదు శ్రీ తజ్ఞ పాదాబ్జశృం

        గారాకార శరీర చారుకరుణాగంభీర సద్భక్త మం 

         దారాంభోరుహపత్ర లోచన కళా ధారోరు సంపత్సుధా 

         పారావారవిహార!నాదురితముల్  భంజింపు నారాయణా !   1

శా || కడకుం బాయక  వేయినోళ్లు గలయాకాకోదరాధీశుండుం 

         గడముట్ట న్వినుతింపలేక నిగుడఁన్  గ్రాలంగ నొప్పారుమి 

         మ్మడరన్  సన్నుతిసేయ నడువశమే యజ్ఞాని  లోభాత్ముడన్ 

         జఢుడన్నజ్ఞుడ  నైక జిహ్వుడ జన స్తబ్ధుండ నారాయణా !2

శా || నే నీదాసుడ నీవు నాపతివి నిన్నే కాని యొండెవ్వరిన్ 

       ధ్యానింపం బ్రణుతింప నట్లగుటకు న్నా నేర్చుచందంబునన్ 

      నీనామ స్తుతులాచరించు నెడల న్నేతప్పులుంగల్దినన్ 

     వానిన్ లోగొనుమయ్య తండ్రి!విహితవ్యాపార నారాయణా !3

మ || నెరయ నిర్మల మైన నీస్తుతికధానీకంబు పద్యంబులో 

       నొరుగుల్  మిక్కిలి గల్గె నేనియు గడు న్యోగ్యంబే చర్చింపగా 

      గుఱుగణ్పైనను వంకబోయిన గడుం గుజ్జైనబేడె త్తినం 

      జెరుకుంగోలకు తీపుగాక కలదే చేదెందు నారాయణా !4

మ || చదువుల్ పెక్కులు సంగ్రహించి పిదపం జాలంగసుజ్ఞానియై  

        మదిలో బాయక నిన్ను నిల్పదగు నా మర్మంబు వీక్షింపడే 

        మొదలు గాడిదచారు గంధవితతుల్ మోవంగశక్యంబె కా 

       కది సౌరభ్యపరీక్ష జూడ కుశలే యవ్యక్త నారాయణా  | 5

 మ || లలిగబ్బoబు కరాటమి వ్విధనెల్లన్మించె బో నీకథా 

         వలి కర్పూరము నించినన్నితరమౌ  వ్యర్ధార్ధకామోదముల్

        పెలుచంబూనినయక్కరాటము తుదిన్ బేతే కరాటంబెపో   

       చలాదిందీవరపత్ర లోచన ఘనశ్యామాంగ నారాయణా | 6| 

మ  || మనమారన్నచలేంద్ర జాధిపతికి నాస్తాగ్రామాణిక్యమై 

       మునికోపానలదగ్ధ రాజతతికిన్ముక్తిస్ఫురన్మార్గమై 

       యెనయన్ పాయకశాయికిం జననియై యేపారుమిన్నేటికిం 

        జనిమూలంబగు నంఘ్రినాదుమదిలో జర్చింతు నారాయణా !7

శా || నీ పుత్రుండు చరాచర ప్రతతుల న్నిర్మించి పెంపారఁగా 

       నీపుణ్యాOగన సర్వ జీవతతుల న్నిత్యంబు  రక్షింపగా 

       నీ పాదోదకమీజగ త్త్రయముల న్నిష్పాపులం జేయగా 

       నీ పెంపేమని చెప్పవచ్చుఁ సుగుణా నిత్యాత్మ నారాయణా !8

శా || బ్రహ్మాoడావలిలో సత్వగుణివై  బాహ్యoబునందాదిమ 

      బ్రహ్మాఖ్యం బరతత్వ బోధములకున్  భవ్యాధినాధుండవై 

     బ్రహ్మేంద్రామరవాయుభుక్పతులకున్   భావింప రాకున్ననా 

    జిహ్మవ్యాప్తులనెన్న  నాదువశమే  చిద్రూప నారాయణా !9

మ|| ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్  భృత్యులై 

     పరమామ్నాయములెల్ల వందిగణమైబ్రహ్మా0డమాగారమై  

      సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై 

       వరుసన్నీఘన రాజసంబు నిజమై వర్ధిల్లు నా రాయణా !10

మ|| మగమీనాకృతి వార్ధిజొచ్చి యసురన్మర్దించియవ్వేదముల్

     మగుడం దెఛ్చి విరించి కిచ్చి  యతని న్మన్నించి యేపారగా 

     బగసాధించిన దివ్యమూర్తి వాణి భావింతునెల్లప్పుడున్ 

     ఖగ రాజధ్వజ భక్తవత్సల జగత్కారుణ్య నారాయణా !!11

మ|| అమరుల్  రాక్షసనాయకుల్  కడకతో నత్యంత సామర్ధ్యులై 

       భ్రమరీ దండము మందరాచలముగా బాదోనిధిం ద్రచ్చగా 

    దమకించెన్ భువనత్రయంబును గిరుల్  దంతావళుల్  మ్రొగ్గినం 

    గమకంబై ధరియించి మించినజగత్కళ్యాణ నారాయణా !12

  శా|| భీమాకార వరాహమై భువనముల్  భీతిల్లి కంపింపను 

        ద్దామోర్విo గొనిపోయి నీరనిధిలోడాగున్న గర్వాంధునిన్ 

       హేమాక్షాసురు వీకదాఁకి జయలక్ష్మిన్   గారవింపంగ నీ 

        భూమిం దక్షిణదంష్ట్ర నెత్తిన నినుం బూజింతు  నారాయణా !!13

శా || స్తంభంబందు నృసింహమై వెడలి యచ్ఛండాట్టధ్వనుల్ 

      దంభోళిం గడువంగ హేమకశిపోద్దాండాసురాధీశ్వరున్ 

      శుంభ ద్గర్భము వ్రచ్చి వానిసుతునిన్ శోభిల్ల మన్నైనుంచియ 

      జ్జం భారాతినిబ్రీతి దేల్చిన నినుం జర్చింతు నారాయణా !!14

మ||మహియు న్నాకసముం బదద్వయపరీమాణంబుగా బెట్టి యా 

    గ్రహమొప్పం బలిమస్తకంబొక  పదగ్రస్తంబుగా నెమ్మితో 

      విహరించింద్ర విరించి శంకరమహావిర్భూత దివ్యాకృతిన్ 

    సహజంబై విలసిల్లు వామనలసచ్చా రిత్ర నాఱయణా    !!15

మ || ధరణిన్  రక్తమహాహ్రదంబు లెలమి 0ద్రైలోక్యనిర్దిష్టమై 

      పరగ0బైతృకతర్పణంబుకొఱకై ప్రఖ్యాతిగా  దీవ్రతన్  

     నిరువయ్యొక్కటి మారు క్షత్రవరులన్నేపారనిర్జించి త 

      త్పరశుభ్రాజిత రామనామము కడున్  ధన్యంబు నారాయణా !!16  

Thursday, 21 March 2019

స్వామిజీ మహారాజు-2

                                            2పేజి 

స్వామీజీ మహారాజు వారు స్ధా పించిన మతము యొక్క సారాంశము 

1.ఆధ్యాత్మికసాధనలు 3    ---1.మానవశరీరములో ఆత్మస్ధానము వద్ద పవిత్ర నామమును స్మరణ చేయుట .

2.ఆయా త్మస్ధానము వద్దనే సంత్  సద్గురువు యొక్క పవిత్ర స్వరూపమును ధ్యానము చేయుట.  

3.శబ్దాభ్యాసము అనగా ఆత్మస్ధానము వద్ద లక్ష్యము నేకాగ్రము జేసిసచ్చిదానందతేజోరూపమగు చైతన్య శక్తి తో అనగాశబ్దధారతోనాంతర్యమున  సంయోగమేర్పరచుకొనుట . 

తప్పనిసరి కృత్యములు 

1.సంత్ సద్గురువు సేవ,మానవసేవ,పరమార్ధి ఈ సేవ చేసి సద్గురువుని దయాకటాక్షములను,ఆంగ్రంధములు తర్యసాయమును పొందవలయును. 

2.సత్సంగము  అనగా సంతు సద్గురువు యధ్యక్షతన జరుపబడు సామాజిక దైవ ప్రార్ధన.సత్సంగములో పవిత్ర   గ్రంథ పాఠ మును చేయుదురు .సద్గురువు అమృత వచనములను సెలవిచ్చుచుందురు.సంత్ సద్గురు సాంగత్య మహాలాభము గూడ చేకూరును .

     రాధాస్వామీమతములో  కర్మకాండ,బాహ్యాచారములు,మొదలగునవి   విధింపబడలేదు.జాతివర్ణములమూలమునపరస్పరభేదభావములు గూడనీమతములో పాటింపబడవు. ఈ మతములోని నీతిశాస్త్రమంతయు నీక్రింది సూత్రములలో నిండియున్నవి .

1.నీవితరులు నీ యెడలనెట్లు ప్రవర్తింపవలెనని గోరుదువో గోరుదువో నీ వితరులయెడలనట్లే ప్రవర్తించవలయును.

2.భగవంతుని సన్నిధానమునకు గొనిపోవునట్టి యూహలుపనులను శుభకర్మలు.

3.భగవంతుని వద్దనుండి దూరము జేయునట్టి కృత్యములు పాపకర్మలు.

పాటింపవలసిన నియమములు :-

1.ఈ మతమున  నుపదేశము గోరువారు మత్స్యమాంసములను ,గ్రుడ్లు మొదలగు జంతుసంబంధ మైన యాహారమును విసర్జించవలయును.

2.మద్యము మొదలగు మత్తుపదార్ధములను విసర్జించవలయును.

3.రాధాస్వామీ నామము పరమపితయొక్కనిజనామమని దృఢవిశ్వాసము కల్గియుండవలయును.

      స్వామీజీమహారాజు వారి ప్రధమ శిష్యులగు జీవన్  లాల్ ,మఱియు హుజూరు మహారాజుగారు .వేరు స్వామీజీ వారు ఆశువుగా జెప్పు శబ్దములను వ్రాసి తదుపరి అచ్చొత్తించిరి.అదియే సారబచన్  గ్రంధము.

సత్సంగము ప్రతిదినము జరుగుచు నన్నిజాతుల వారును, వర్ణములవారును సత్సంగమునకు వచ్చి స్వామీజీమహారాజు వారి వచనామృతమును గ్రోలుచుండెడివారు.వీరి కాల ములో 4000మందికిపైగా ఉపదేశములనుతీసుకొనిరి.స్వామీజీ మహారాజు వారు తమ నిర్యాణమునకు ముందు హుజూర్  మహారాజువారు తమతర్వాతగురువగుదురనితెలియబరిచిరి.వారు 1878సం|| జూన్15వతేదీన మధ్యాహ్నము 1గుంట 45నిమిషాలకు 60వ యేట భౌతికశరీరమును విడిచిరి.

స్వామీజీమహారాజువారు తమ నిర్యాణమునకు ముందు భక్తులకు "ఈ త చేతకానివాడు నీటిలో మునిగిపోవుచుండగా నాతనిని యీదుమని  జెప్పినను అతడప్పుడీత నేర్చుకొనజాలక మునిగిపోవును.కానీ చిన్నతనమునుండియు ఈత నేర్చినవాడు నట్టేటిలో పడిపోయిన నెన్నటికిమునిగిపోడు.మన భౌతికశరీరము చర్మముతో కప్పిన మాంసాస్ధికల శకలం.యావజ్జీవము నాధ్యాత్మిక సాధనల జేసినవానికి ఈ   ప్రపంచమును వీడిపోవునప్పుడు పరమపురుషుని పవిత్ర నామముతప్పక స్మృతికి వచ్చుఁను.కావున మానవులు పవిత్ర నామమును ప్రాపంచిక కృత్యములను చేసికొనునప్పుడును,ఇటునటు తిరుగుచున్నప్పుడును,గూడ మఱువకుండనెల్లప్పుడును స్మరణ చేయుచునే యుండవలయును.

           కావున ప్రతి సత్సంగీ పై వచనములనాచరణలో నుంచుకొనవలయునని మనవి.

Wednesday, 20 March 2019

                        పరమ గురు స్వామీజీ మహారాజ్ 

పరమ పురుష రాధాస్వామీ దయాళురు క్రీ .శ .1818సం వత్సరము  ఆగష్టు 24వ తేదీ సోమవారం రాత్రి 12-30గం టలకుఆగ్రాలోని ఫన్నీగల్లు  అను మొహల్లాలో జనించెను.వారి పూర్వనామము శ్రీ శివదయాల్  సింగ్ .వీరు ఖత్రికులమునకు చెందిన శేఠ్ దిల్వాల్ సింగ్ సాహెబ్ గారికి మొదటి కొడుకు,రెండవకొడుకు శే ఠ్  బృందావన్ ,మఱియు మూడవకొడుకు శేఠ్ ప్రతాపసింగ్ .వీరు గురునానక్ సాహెబ్ భక్తులు .వీరు సంతు తులసీసాహెబ్ వారి సత్సంగములో చేరిరి మాతాపితరులతోసహా .వీరు 5వ సంవత్సరంలోనే చదువు మొదలుపెట్టి గురుముఖీ భాషలనే గాక పర్షియన్ భాషనునేర్చుకొని యొక గ్రంధమునుకూడారచించిరి.సంస్కృతము,అరబిక్,హిందీ,ఉర్దూ భాషలలో ప్రావీణ్యము సంపాదించిరి.ఆయనవద్దకు అనేకమందివిద్యను గ్రహించిరి.

            వీరు చిన్నతనమునుండియే ఆధ్యాత్మిక సాధనలు సల్పుచు  తల్లి సాయమున తమ 6వ ఏటనుండియే ఆధ్యాత్మికాఅభ్యాసముచేయుచుండెడివారు..స్వామిజివారు పసితనమునుండియు,బడికివెళ్ళుసమయములోను పిన్నలకు.పెద్దలకు,తమతల్లిదండ్రులకు పరమార్థబోధన లు చేయుచు పరిపూర్ణోధ్ధారణమునుసాధించుటకుదోడ్పడు పంధానందరు నవలంబింపవలసినదని బోధించెడివారు. 

              వీరు చిన్నవస్సులోనే ఫరీదాబాదు నివాసియగు లాలా  ఇజ్జత్  రాయ్ గారి   కు మార్తె శ్రీమతినారాయణదేవిగారితో వివాహము జరిగెను.చదువు  పూర్తయిన తర్వాత ఉద్యోగములో జేరినను ఆధ్యాత్మికాభ్యాసనలకాటంకము కల్గుచుండుటచే మానివేసిరి.కానీ కుటుంబపోషణకై వారి మామగారు యొక రాజుగారి దివాణమున 2గంటలు పనిచేయు షరతుతో జేరిరి.వారికి లభించినదానిలో తమకవసరమణదానినియుంచుకొని మిగిలినది బీదసాదలకిచ్చెడివారు .

                                                                                         ఇట్లుండగా నొకనాఁడుతమతండ్రిమరణమాసన్నమైనదని యుద్యోగమునువదిలి తమతండ్రియొద్దకుబోయిరి. వీరు వెళ్లునప్పటికీ వారితండ్రిగారు యొకవివాహమునకు హాజరై తిరిగివచ్చిజబ్బుపడిరి .స్వామిజివారు సపర్యలుజేయుచు సంతుల పవిత్ర గ్రంధములనుండి శబ్దపఠనము చేసి గతించిపోవు నాత్మకు సహాయసంరక్షణలనిచ్చిరి.

             స్వామీ జి మహారాజువారు తమకుటుంబబాధ్యతలనుండి,ప్రాపంచికబాధ్యతలనుండియు విముక్తులై తమ కాలమునంతటిని యాధ్యాత్మిక సాధనలలోను,పరమార్ధ బోధన చేయుటలోను గడుపు చుండిరి.వారికి వేరే గురువు లేరు.అట్టి యవసరము కలుగలేదు.స్వేఛ్చచేపరమోన్నత ధామమునుండి దిగివచ్చిమానవ రూపమును ధరించిన పరమపురుషుని యవతారము.వారు తినునది 2ఔన్సుల ధాన్యపు దినుసులు మాత్రమే.కానీ వారు గంటలకొలది యుపన్యాసములనిచ్చు చు నందరిని యబ్బుర పరిచెడివారు.   కొందరి విశిష్ట వ్యక్తులకు ఆధ్యాత్మిక సాధనలనుపదేశించెడివారు .తమ ప్రధాన శిష్యులైన హుజూర్  మహారాజువారియొక్కయు,ఇతరభక్తులయొక్కయు ప్రార్ధనలకు మన్నించి సమస్త ప్రజలందఱకు సత్సంగమును క్రీ|| శ 1861 వతేదీవసంతపంచమీ సుదినమున తెఱచి నట్లుమహానుగ్రహముతో ఘోషణ చేసిరి.హుజూరుమహారాజు వారి ప్రార్ధనను తెలియబరుస్తు స్వామీజీమహారాజు వారొకశబ్దమును రచించిరి. 

సతగురుసే కరూ పుకారీ ,సంతన మత్ కీజె  జారీ 

            అప్పటినుండి పన్నీగల్లు లో అభ్యసనాది ఎల్లవే  ళలచేయుచుండగా భక్తుల సoఖ్య  పెరుగుచుండుటచే ఇప్పుడున్న రాధాబాగ్  అదే స్వామిబాగ్  కి  మార్చుట జరిగినది.తమదగ్గరకు వఛ్చిన వారి సందేహాలను,ఖండనలు వారడగకముందే వారికీ విడమరిచిచెప్పెడివారు..వారు నూతి దగ్గరనుండి జలమును తీసుకొనివెళ్లెడివారు.ఒకరోజు ఆ నూతి చుట్టూ పెద్దనగరము తయారగునని చెప్పిరి.అదే ఇప్పటి దయల్బాగ్ .

Monday, 18 March 2019

ullasam: భాస్కర శతకం

ullasam: భాస్కర శతకం:                                  భాస్కర శతకం  1.శ్రీ గల భాగ్య శాలి గడు                 జేరగ వత్తురు తారు దారెదూ  రాగమన ప్రయాసమున  ...