శ్రీమదుమాచోడేశ్వరశతకం -11
శ్రీ రావూరి వేంకటేశ్వర్లు
91.శా||ప్రేవుల్ ప్రోవుగనయ్యుబుధ్ధి
చలిత శ్రీ యయ్యుముండంబునం
దావేశించిన కంపమున్గలిగియున్ వ్యాధుల్
పిసాళించియున్
భావంబుచ్చియునాసవీడదెటులప్పా !మాకు
మోక్షంబు ?శ్రీ
దేవీ
పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా! శరీరము
ప్రేగులప్రోగువలె శుష్కించినను,
బుద్ధి సంపద చలించినను,తలకు వణుకు
పుట్టినను,రోగములు వి
జృoభిoచినను, భావము నశించినను,ఈ జీవులకు
ఆశ నశింపకున్నది.
అట్టి మోక్షమెటుల మాకు లభించునయ్యా ?
92.శా||ఏవో బాల్యమునందు గ్రీడలటుపై
నింపై నప్రాయంబున
న్భావోద్భూతమదమ్మునించుదయుతామోహంబు
వార్ధక్యమం
దావేశించినచింతయున్మాలయ
నిన్నర్చించుటేలాగురా!
దేవీ
పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా! స్వామీ!బాల్యమునందు
ఆటలు యౌవన వయస్సున
కాంతావ్యామోహము ముసలితనమున జింతయు
జీవునిజీవితమునందంతట
వ్యాపించి నిండియుండగా నిన్ను బూజిoచుట యెట్లో
తెలియరాకున్నది.
93 .శా||దేవా!సార్వజనీన భావ!సమతాదీప్తి
ప్రభావా!యుమా
దేవీ సంశ్రిత
వామభాగరుచిమద్దీవ్యద్వపుర్హావ! స
ర్వావాసానఘలింగసంగత మహాద్వైతానుభావా!శివా!
దేవీ
పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా! సమస్త జనుల యందుసమభావముగలవాడా!పార్వతీదేవితో
ప్రకాశించు వామభాగముచే ప్రకాశించు శరీర శృంగార చేష్టలు గలవాడ!
సర్వము నివాసముగాగల లింగమున సంగతమైన
అద్వైతవ్యక్తిత్వము
గలవాడా!నమస్కారము.
94.శా|| శ్రీవాణీగిరిజాత్రయిన్ హరిసుర
జ్యేష్ఠాభవాద్యానుభా
వావాసంబగు బూరుషత్రయిని సంభావించి
శాక్తస్ఫుర
ద్భావాద్వైతమవైన
బ్రహ్మమ!భవద్భక్తిన్బ్రదీపింతు శ్రీ
దేవీ
పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా! లక్ష్మీ సరస్వతి
పార్వతి యను శక్తిత్రయము విష్ణువు బ్రహ్మ
శివుడు అను పురుష త్రయము నీ యుభయముచే
సమన్వితమైన శక్తి
విశిష్టాద్వైతస్వరూపమగు
బ్ర్హమమువు.నీయొడల భక్తితోబ్రకాశించుదును.
95.శా||ఏ వాదమ్ములలోన
నీస్ధితికిబ్రాహ్మీత్వంబు సిద్ధింపదో
ఏ వేదమ్ములలోన నీ యునికి గర్హింపన్బడున్
స్వామి !నా
కావాదమ్ములు వేదముల్ దృణమయ్యా! శాశ్వత
బ్రహ్మమా
దేవీ
పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా! నీస్ధితికిబ్రాహ్మీత్వముసిద్ధించని
వాదములు,నీ ఉనికిని
గర్హించు వేదములు నాకు తృణప్రాయములు.
96.శా||నావాడoచును “నుండమట్ల”కులుడౌనారాయణ
స్వామియం
దావేశించియు నాలయంబునకు దివ్యంబౌ
పునర్నిర్మితిన్
గావింపన్ సమకట్టిజేసితి జగత్కల్యాణ! నాప్రార్ధనన్
దేవీ
పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా! నా ప్రార్ధనముతో నీవు
శ్రీ ఉండమట్ల నారాయణస్వామిని
“నావాడని”భావించిఅతనియందావేశించి
ఆలయమును బునర్నిర్మింప జేసితివి. నీవు
జగత్కల్యాణము గలవాడవు.
97.శా||దేవా!సత్యము !నీదు నీకృతినినుద్దీపింపగా
జేయగా
శ్రీ విస్తారమునందజేసిన
మహాశ్రీమంతులానందవ
ల్లీ వేద్యంబగు భోగముల్ గలిగి ముల్లీలన్ బిసాలింతురో
దేవీ
పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా!నీకు జెందిన యీ
కావ్యమును మఱలప్రకాశింప జేయుటకు
విశేషముగా (అన్నిరకాల)సంపదలనందించిన
శ్రీమంతులు ఆనందవల్లి యను
ఉపనిష త్తునందు జెప్పబడిన శతానoదములను,బ్రహ్మానందములను
అనుభవించి
యానందింతురు.ఇది నిజము.
99.శా||సేవింపన్ సమకట్టి నీ పయిని
సుశ్రీమత్కృతిన్ వ్రాయగా
భావింపన్ గలిగించె స్వర్గతుడు
సుబ్బారావు ధీమంతుడా
కావుల్గట్టని యోగి మిత్రుడల లింగంపల్లివ్లశ్యుండు
నో
దేవీ
పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా!నిన్ను సేవించుటకు
యత్నించి నీమీద మంచి కావ్యము
వ్రాయుటకు నాకు భావముగలిగించినవాడు
ప్రస్తుతము స్వర్గమునందున్న
వాడు.అతడు లింగంపల్లి సుబ్బారావు.చాల
బుద్ధిమంతుడు.నాకు మిత్రుడు.
నిజమునకాతడు కాషాయములు గట్టని
యోగీశ్వరుడు.అతని ప్రేరణమే నాచే
నీకావ్యము వ్రాయించినది.
1౦౦.శా||గోవాహా!పరమేశా! శర్వ!యడపాగోపాలమిత్రుండునునీ
సేవన్ నాటికి నేటికిన్ సలుపుచున్
శ్రీమంతులౌవారి సు
శ్రీవిద్యాదికమెల్ల నీ యెడల వాసిన్ బొందగా జూతునో
దేవీ
పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా! ఓ వృషభ
వాహనా!పరమేశ్వర! అడపాగోపాలమను
మిత్రుడు ఆనాటినుండి యీ నాటివఱకును నీ
సేవ చేయుచు శ్రీమంతుల
సంపదయు విద్యావంతుల విద్య నీయెడల
వినియోగపడి ప్రకాశించునట్లు
ప్రచారము చేయుచున్నాడు.
No comments:
Post a Comment