Sunday, 16 July 2017

శ్రీమదుమాచోడేశ్వర శతకం -5

శ్రీమదుమాచోడేశ్వర శతకం-5
శ్రీ రావూరి వేంకటేశ్వర్లు
37.శా||నీవేమాత్రము జాలిజూపిననుగానీ చాలు విశ్వాత్మ!నా
భావoబార్షతభవ్యమై పొలిచెడిన్ భక్తి ప్రసిద్ధంబుగా
లావాదేవులనెన్నియేగడచుచున్లక్ష్యంబునుంజేరునో
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా|| ఓ చోడేశ్వరా!విశ్వరూపా!నీవే మాత్రము జాలి జూపినను చాలును.
నా భావమంతయు నార్షధర్మముతో గొప్పదై ప్రకాశించును.ఋణా   నుబంధములన్నియు పోవును.లక్ష్యమును జేరుకొనును.

38.శా||లేవే కోర్కులు త్వత్పదాబ్జయుగళీ రింగన్మదాళిధ్వని
ప్రావీణ్యమ్ములలోని తియ్యదనమున్బ్రా పింపగా జేయరా
నా వాక్కుల్ గుసుమించినిన్గొలుచు దన్మాత్రంబెనాకోర్కెశ్రీ
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!నాకేకోర్కెలు లేవు .నీపాద పద్మములపై దిరుగు
మదించు తుమ్మేదలధ్వనిలోని మాధుర్యమునుమాత్రము                        కోరుచున్నాను.నాపలుకులు పుష్పించి నిన్ను కీర్తించు కోర్కెను
సిధ్ధిoపజేయుము.ఆ కోర్కె తీరిన జాలును.

39.శా||నీవా!నేన! యటన్నపల్కుటలు నేనె సర్వము న్నేర్తు నం
చేవో ! డంబపుగూతలున్ మెయికి నెంతే బూదితోబూతలున్
గావేమాత్రము నిన్నుగాంచుటకు లక్ష్యముల్  ప్రపత్తి ప్రియా
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!నీ దర్శనభాగ్యమును పొందుటకు తగవులు తెచ్చే మాటలుకాని,నేనె సర్వజ్ఞుడునను బడాయిమాటలుకాని,శరీరమున విపరీత విభూతి పూతలు మున్నగునవిసాధనాలు కావు.ప్రపత్తికే నీ దర్శనము సాధ్యము.

40.శా||సావిత్రీఘన మంత్రరాజజపమే సత్యమ్ముగా నీ స్థితిన్
బ్రావిర్భూతముసేయునంచునుడువు న్బ్రాబల్కులత్యంతమున్
ఓ వేదత్రయమూర్తి ! యార్తిదళనా !ఓoకారసాధ్యమా !శివా!
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||వేదాలు మూడు నీ స్వరూపాలు.ఓoకారజపముచే నీవు లభిస్తావు.
వేదాలు,శివుడు,గాయత్రి,ప్రణవము మున్నగునవి యొక్కటే                                          యని వైదికమతము.

41.శా||తావుల్ సిమ్మెడు బుష్పమయ్యెను భవత్పాదములంజేరకే
పోవున్  వాడియువత్తయౌచుస్వజను:పుర్వానుబంధమ్మునన్
దావుల్లేని దయయ్యు దూర్వము భవత్పాదమ్ములన్జేరునో
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా! పూర్వజన్మసుకృతము లేనిచో నెంత యైశ్వర్యము న్నను నీ పాదములచెంతకు జేరలేదుజీవి.పూలు వాసనగలవయ్యును
గరికపోచవలె నీ వద్దకు జేరలేవు.
42.శా||గ్రావాకారము నీదులింగమని సంకల్పింపగానేల?లీ
          లావేద్యా! జగమెల్ల నీదయిన లీలారూపమౌ గాదె!స
          ర్వావాసా! వసురుద్రకోటివినుత వ్యాపారసర్వోదయా!
           దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
   తా||ఓ చోడేశ్వరా!నీవంతతనిoడియున్నావు.నీ లీలలను బట్టి చూడ ప్రపంచమంతయు నీ లీలాస్వరుపమే.నీ వ్యాపారములందు సర్వవిశ్వముల
యభ్యుదయమును గమనించి అష్టవసువులు,ఏకాదశరుద్రులు నిన్నును
నీ వ్యాపారములను గోనియాడుచుందురు.   
43.శా||ధీవిజ్ఞానము మానసంబయిన వృత్తిన్నిల్పిసద్భావనల్
భావింపన్  సమకట్టినింప భవదాకారoబు విశ్వాకృతిన్
జేవల్ దీరిరహించు యాగమనగా సిద్ధాన్తమీమాట;యో
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!


తా||ఓచోడేశ్వరా!బుద్ధికి జెందిన విజ్ఞానము మానసిక వృత్తులనరికట్టి
నీ స్వరూపము యొక్క ఆకారముగా భావించుట యోగమనబడును.
అనుటయే శాస్త్ర సిద్ధాంతము.


44.శా||నీవా ఆత్మవు నేను జీవుడను తండ్రీ!నేనె నీవయ్యెదన్
నీవాపూవవు నేను వాసనను తండ్రీ! వీడనిన్నెడనున్
నీవా గోవవు నేను వత్సమను దండ్రీ!నిన్నువెంటాడెదన్
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా!నీవు పరమాత్మవు నేను జీవాత్మను.నేనేనీవైపోదును.
నీవు పూవువు.నేను దావిని.నిన్నెప్పుడును విడువను.నీవు    గోవువు.నేను దూడను. నిన్నెప్పుడును వెంటాడెదను.  45.శా||భూవిద్యాధనగౌరవాఢ్యులకు నీ పుణ్యంపురూపంబునే
సేవింపoగలయట్టియున్కి గలుగన్ జెప్పన్ వలెన్ సౌఖ్యమ
య్యా!వేదాన్తవిహార!లేనియెడ నత్యన్తoబుగష్టంబురా!
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా!దరిద్రుడు నిన్ను సేవిoపకున్నచొ దు:ఖపడును.భూస్వామి,ధనవంతుడు విద్యాధికుడు భగవత్సేవ చేయనిచో
వాడు దు:ఖపడుటయే కాక లోకానికి చేటు కల్గించును.


No comments:

Post a Comment