శ్రీమదుమాచోడేశ్వర శతకం -6
శ్రీ
రావూరి వేంకటేశ్వర్లు
46.శా||దేవా!
కర్షకసంఘమీజగతికిన్దేజంబునున్గూర్చుద
జ్జీవాధారమునన్నమిచ్చియును
దచ్ఛ్రీసాధనంబౌనుగా
నీవాహంబగునుక్షమున్ శిరసునన్దీపించు
గంగమ్మయున్
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన!
చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా!రైతులు
ప్రపంచానికంతటికి యన్నమునిచ్చితే జస్సును కలుగజేయుచున్నారు.నీ వాహనమైన ఎద్దు,నీ
నెత్తిపైనున్న
గంగయు ఆ యన్నమును సృష్టించుటకు
సాధనములగుచున్నవి.నీ
పరివారమే జగత్తులకు బ్రాణాధారమని భావము.
47.శా|| ఏ వైదగ్ధికి
సంతసించుదువో!స్వామీ!చూపరా!మద్గురు
శ్రీ
వాచా విభవమ్ములన్నిటన్ నిలచి
రాశీభూతపుణ్యాకృతీ!
హేవాకాయిత
మారుతాశన! యుమాహ్రీభూషితరాoగశ్రీ
దేవీ
పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||
ఓ చోడేశ్వరా!నాగభూషణ!పార్వతీదేవి సిగ్గుచే నలంకరింపబడిన యర్ధశరీరము గలవాడా!
నీవేనేర్పునకానందిoతువో ఆ నేర్పును మా గురువుల వాక్కులలో నిలిచి నాకుదెలుపుము .
48.శా||నీవైపోయినదీజగంబు
నెటులేనీ కాకయున్నన్ గటు
ప్రావీణ్యoబులు నిండియుంటనిటులేవాడాగు శాపాగ్నితో
నావంతేనియు లేనియట్లొనరుపండా!నీఱుగా సాధువో
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా!ఈ ప్రపంచమంతా
నీవైయున్నది.కానిచో
తీవ్రములైన కుచ్చితములైన నేర్పులతో నిండిన యీ ప్రపంచము
నే ఋషి యైనకొంచెమైనను మిగులకుండా తన శాపాగ్నితో బుగ్గిని జేసియుండకమానడు.
49.శా||లేవా? తావులు వల్లకాట
దిరుగన్ హ్రీ లేదె!యా పార్వతీ
దేవిన్ బేలను జేసినాడవుర!మంత్రిoపుల్
ప్రసారించి నీ
సావాసంమున గజ్జెకట్టిన పిశాచశ్రేణితో
శంకరా!
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన!
చోడేశ్వరా!
తా||ఏమయ్యా!శంకరా!నీకు వల్లకాడు తప్ప ఇక
చోటు దొరకలేదా?పిశాచాలతో తిరుగుచు పార్వతిని మోసగించావుగదయ్యా !
ఏ మంత్రం వేసావో గాని ఆమె నిన్నే
వలచిన్దయ్యా!
50.శా||దేవాగారము భూసురోత్తముడు
భుక్తిన్గూర్చు నా హాలికుం
డావున్గుమ్మరియేరునున్బడియువైద్యస్వామియున్దానమున్
లేవేయూరను నేవునుండవట యౌలే!ధర్మనీతి స్ఫుర
ద్దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన!
చోడేశ్వరా!
తా||దేవాలయము,ఉత్తమ
బ్రాహ్మణుడు,రైతు,ఆవు,కుమ్మరి,నది,
బడి,వైద్యుడు,దానములేని యూరిలో నీవుండవట గదా!అవి యున్న దేవీపట్టణమున
కొండపై నున్నావుగదా.
51.శా||సేవన్
జేయని ఛాత్రుడున్ ఘనకృపాసింధుడనన్బోధన
శ్రీ వైదగ్ధిని జూపలేనిగురుండున్
జెల్వుండుమెచ్చన్ గృతి
ప్రావీణ్యమ్ముదొరoగుభార్యయు
భవత్భక్తేతరుండొక్కడే
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన!
చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా!గురుసేవ చేయని శిష్యుడు,దయాసముద్రుడై బోధించు
నైపుణ్యములేనిగురువు,భర్త మెచ్చుకొనునట్లు మంచి పనులను
చేయని భార్య,నీ సేవలకు దూరుడైనమనుజుడును సమానులు.
52.శా||మోవిన్దేనియలనిచ్చు వేశ్యయువతుల్ పోటీకి రాలేరు వి
ద్యావైదుష్యములుండి లేకయును స్వార్ధ
ప్రజ్ఞకున్సత్ప్రజా
శ్రీ విస్తారములన్బలిన్గొనెడివారిన్
గెల్వజూడంగదే
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన!
చోడేశ్వరా!
తా||విద్యావంతులయ్యు గొందఱు ,గాకయు గొందఱు స్వార్ధపరులై
తియ్యని మాటలతో సజ్జనుల సంపదలనపహరించుచున్నారు.
అధరసుధలనందించు వేశ్య యువతులు కూడా వారితో పోటీకి రాలేరు.అట్టివారినొక్క చూపు చూడవయ్యా ఓ స్వామీ!
53.శా||నీవా!ధర్మివి నేను ధర్మమును
తండ్రీ నీవు లేకున్నచో
నా వస్తుత్వము
నిల్చునా?యభవ!సంధానింపునీవాస్ధితిన్
నీవేనీనుగ నేనేనీవుగ భవానీరమ్యవామాంగ శ్రీ
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా|| నీవుధర్మివి.నేను ధర్మమును.నీవులేనిదే నా వస్తుతత్వము నిలువదు.తండ్రీ
!చోడేశ్వరా!నేనే నీవు నీవే నేను అగునట్లు నా వస్తుత్వమును నిల్పుము.
No comments:
Post a Comment