Tuesday, 18 July 2017

శ్రీమడుమాచోడేశ్వరసతకం-8

                        శ్రీమదుమాచోడేశ్వర శతకం-8
                                           శ్రీరావూరి వేంకటేశ్వర్లు
65.శా||నీవున్నేను నొకండుదప్పగలదే !నిత్యంబొకండిందునం
    దీవున్నేనునొకండుగాదె! పరమార్తిస్ఫూర్తిమద్ద్వైత స
   ద్భావంబీఘనమాయజీల్చుకొనినన్ బ్రహ్మాoడపూర్ణాకృతీ!
    దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా!ఇహమునందుగాని పరమునందుగాని నీవును నేనును
దప్ప నిత్యమైనదేమున్నది.ఆర్తి స్ఫూర్తి గల నామసంకీర్తనాది భక్తి  భావములతో గూడిన ద్వైత ధర్మమీ  అవిద్యారూపమైన మాయను భేదించి నచోనీవును నేనును ఒకడే గదా!
66.శా||భావంబెల్ల విధంబులన్విరిగి తీవ్రస్ఫూర్తితోడన్రిరం

        సావైవిధ్యములొప్పు నా స్ధితికి విశ్వంబీవయై తోచున 

No comments:

Post a Comment