Thursday, 13 July 2017

శ్రీమదుమాచోడేశ్వర శతకము-2 శ్రీ రావూరి వేంకటేశ్వర్లుగారు సేవింపన్ సమకట్టిరో దయనుదచ్ఛ్రినామమున్నిల్పితో దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా! తా||ఓ చోడేశ్వరా!ఆ చోళరాజులే శుభసమయాన నీ దయకునర్హులై భక్త్యావేశముతో నిన్ను సేవింపనారంభించిరోకాని స్వామీ!వారుపై దయతో వారిపేరును నీ పేరుగా దాల్చి స్థిరము జేసినావు. 12.శా||ఏ విద్యావిభవంబులేని జనుడే నీ తావకీనాoఘ్రులన్ సేవింపoగ మహానుభావుడగుచున్ సిద్ధుండుగా నొప్పుగా దే!వహ్వా!కవిగేయ!నంద చరితాదిన్ స్పష్టమియ్యర్ధమో దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా! తా||ఏ చదువుగొప్పతనములేని వాడైననునీ పాదసేవచే సిద్ధుడగును. ఆహా!ఈ విషయము నందనార్ మొదలైన శివ భాగవతుల చరిత్రలచే స్పష్టమగుచున్నది.ఋషులచే కొనియాడబడుఓ చోడేశ్వరా! 13.శా||నీ వాసంబగు దేవీపట్టణమునన్నిత్యంబు సద్భక్తితో నీవే యార్తులందు నుండుదనియెoతే నమ్మి యాతిధ్యధ ర్మావిర్భూతినిబొల్చు సజ్జనులు వహ్వా!చెప్పలేనెందఱో దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా! తా||ఓ చోడేశ్వరా!నీ నివాసమైన దేవీపట్టణమునఆర్తులయందునుండుదవని నమ్మి ఆతిధ్యమునిచ్చుచు ధర్మముచేయు సజ్జనులు లెక్కలేనంతమంది గలరుస్వామీ! 14.శా||ఏవాక్కెప్పుడు నీదుకీర్తనముతోనింపొంది పెంపారునో ఆ వాక్కచ్చముత్వచ్చిరస్థవిలుఠత్ప్రాంచత్సురస్రోతిసిన్ సావాసంబుననిల్చు నాటలకు దోషశ్రేణి బోకార్చుటన్ దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా! తా||ఓ చోడేశ్వరా!నిన్ను కీర్తించు వాక్కు గంగానదివలెనుండును. అనగా వారి దోషములను పోగొట్టును. 15.శా||నీవేనేనుగ నేనెనీవుగ మహానిష్ఠన్ భవద్ధ్యానమున్ గావింపన్ సమకట్టుయోగులకు నాకైంకర్యమర్పింతున న్నేవేరీతినిగానిచూడవట రానీవౌ నటుల్ శ్రీ గళా దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా! తా||ఓ చోడేశ్వరా!నీవేనేను నేనేనీవు అను భావముతో మహా నిష్ఠతో నిన్ను ధ్యానించు యోగులకు నా సేవనర్పింతును. ఎలాగైనా నన్నువైపోవునట్లు చూడవా స్వామీ! 16.శా||ఏవో సంసృతిబంధముల్ క్షణముగానీ ఆగకేచుట్టి నా సేవావృత్తిని,గట్టుచుండునెదురై జీవాత్మకున్;బూర్వక ర్మావిర్భూత ఫలానురోధమున నిన్నర్చించుటేలాగురా! దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా! తా||ఓ చోడేశ్వరా!సంసారబంధములేవో ఒక్క క్షణముకూడ ఆగక నన్నుబంధించిజీవాత్మకువిరుద్ధముగాముగాసేవావృత్తినంట గట్టుచున్నవి.పూర్వజన్మకర్మఫలానుభవమిట్లున్నది.నిన్ను పూజించుటెట్లు? 17.శా||ప్రావీణ్యమ్ముగలాడు లౌక్యమునదత్ప్రాగల్భ్యమెల్లన్భవ త్సేవాసక్తుల గేలిసేయుటకు సంసిద్ధంబుగా నిల్చునో దేవా!మీదును గాంచలేక కృపనాదీనున్సమర్ధింపవే దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా! తా||ఓ చోడేశ్వరా!లౌకికజ్ఞానుడు నీ సేవకులను ఎగతాళి చేయుటకు తన జ్ఞానాన్నివినియోగించుచున్నాడు.పరముపై దృష్టి యతనికుండదు.వానికంటే దీనుడెవ్వడు.వానిని కూడ రక్షించు. 18.శా||ఆవుల్లేనిద్విజేంద్రువాసము శుభవ్యాహారముల్లేనివి ద్యావoతుండును;బుద్ధిలేనినరుడున్ దధ్యంబు ధాత్రిన్భవత్ సేవల్లేని పు

శ్రీమదుమాచోడేశ్వర శతకము-2
శ్రీ రావూరి వేంకటేశ్వర్లుగారు
10.శా||ద్యావాపృధ్యవకాశమెల్ల భవదీయ స్వచ్ఛరూపంబుగా
         నావేశించియు మానవ ప్రచయమందత్యంతమున్ లక్ష్యమున్
          గావింపంగనులింగ రూపములతో గన్పట్టు బ్రహ్మంబ!యో
           దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
 తా||ఓ చోడేశ్వరా!భూమిఆకాశములకుమధ్యనున్నఅవకాశమునందoత టను నీ స్వచ్ఛమైన రూపము ఆవేశించియున్నది.ఐనను మానవులకు
లక్ష్యమును కలిగించుటకు లింగరూపములలోకనబడుచున్న బ్రహ్మము నీవే ఐయున్నావు.
11.శా||ఏ వేళన్ భవదీయసత్కృపకుదామెoతేనియు న్బాత్రులై
          యావిష్టాలఘుభక్తిపూర్ణులగుచున్  ఆ చోళపాలకుల్  
          సేవింపన్ సమకట్టిరో దయనుదచ్ఛ్రినామమున్నిల్పితో
         దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా!ఆ చోళరాజులే శుభసమయాన నీ దయకునర్హులై
   భక్త్యావేశముతో నిన్ను సేవింపనారంభించిరోకాని స్వామీ!వారుపై దయతో
   వారిపేరును నీ పేరుగా దాల్చి స్థిరము జేసినావు.
12.శా||ఏ విద్యావిభవంబులేని జనుడే నీ తావకీనాoఘ్రులన్
         సేవింపoగ మహానుభావుడగుచున్  సిద్ధుండుగా నొప్పుగా
         దే!వహ్వా!కవిగేయ!నంద చరితాదిన్  స్పష్టమియ్యర్ధమో   
         దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఏ చదువుగొప్పతనములేని వాడైననునీ పాదసేవచే సిద్ధుడగును.
     ఆహా!ఈ విషయము నందనార్ మొదలైన శివ భాగవతుల
      చరిత్రలచే స్పష్టమగుచున్నది.ఋషులచే కొనియాడబడుఓ
      చోడేశ్వరా!  
13.శా||నీ వాసంబగు దేవీపట్టణమునన్నిత్యంబు సద్భక్తితో
         నీవే యార్తులందు నుండుదనియెoతే నమ్మి యాతిధ్యధ
         ర్మావిర్భూతినిబొల్చు సజ్జనులు వహ్వా!చెప్పలేనెందఱో
          దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
  
తా||ఓ చోడేశ్వరా!నీ నివాసమైన దేవీపట్టణమునఆర్తులయందునుండుదవని
     నమ్మి ఆతిధ్యమునిచ్చుచు ధర్మముచేయు సజ్జనులు లెక్కలేనంతమంది
     గలరుస్వామీ!

14.శా||ఏవాక్కెప్పుడు నీదుకీర్తనముతోనింపొంది పెంపారునో
         ఆ వాక్కచ్చముత్వచ్చిరస్థవిలుఠత్ప్రాంచత్సురస్రోతిసిన్
         సావాసంబుననిల్చు నాటలకు దోషశ్రేణి బోకార్చుటన్    
        దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!నిన్ను కీర్తించు వాక్కు గంగానదివలెనుండును.
     అనగా వారి దోషములను పోగొట్టును.

15.శా||నీవేనేనుగ నేనెనీవుగ మహానిష్ఠన్ భవద్ధ్యానమున్
          గావింపన్  సమకట్టుయోగులకు నాకైంకర్యమర్పింతున
      న్నేవేరీతినిగానిచూడవట రానీవౌ నటుల్ శ్రీ గళా
      దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!నీవేనేను నేనేనీవు అను భావముతో మహా
    నిష్ఠతో నిన్ను ధ్యానించు యోగులకు నా సేవనర్పింతును.
    ఎలాగైనా నన్నువైపోవునట్లు చూడవా స్వామీ!
            
        16.శా||ఏవో సంసృతిబంధముల్ క్షణముగానీ ఆగకేచుట్టి నా
         సేవావృత్తిని,గట్టుచుండునెదురై జీవాత్మకున్;బూర్వక
         ర్మావిర్భూత ఫలానురోధమున నిన్నర్చించుటేలాగురా!
         దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!సంసారబంధములేవో ఒక్క క్షణముకూడ ఆగక
  నన్నుబంధించిజీవాత్మకువిరుద్ధముగాముగాసేవావృత్తినంట
  గట్టుచున్నవి.పూర్వజన్మకర్మఫలానుభవమిట్లున్నది.నిన్ను
    పూజించుటెట్లు?

17.శా||ప్రావీణ్యమ్ముగలాడు లౌక్యమునదత్ప్రాగల్భ్యమెల్లన్భవ
         త్సేవాసక్తుల గేలిసేయుటకు సంసిద్ధంబుగా నిల్చునో
        దేవా!మీదును గాంచలేక కృపనాదీనున్సమర్ధింపవే
         దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా!లౌకికజ్ఞానుడు నీ సేవకులను ఎగతాళి చేయుటకు

 తన జ్ఞానాన్నివినియోగించుచున్నాడు.పరముపై దృష్టి                                       యతనికుండదు.వానికంటే దీనుడెవ్వడు.వానిని కూడ రక్షించు.

18.శా||ఆవుల్లేనిద్విజేంద్రువాసము శుభవ్యాహారముల్లేనివి
         ద్యావoతుండును;బుద్ధిలేనినరుడున్ దధ్యంబు ధాత్రిన్భవత్
         సేవల్లేని పురంబులేటికభవా! ధిక్కారభాజంబులౌ
         దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||చోడేశ్వరా!గోవులులేని బ్రాహ్మణగృహము,మంచిమాటలు పలుకని
     విద్యావంతుడును,బుధ్ధిలేని మనుజుడు,నీ సేవలులేని పట్టణములు
    తిరస్కరింపదగినవి.అవి యుండి ప్రయోజనమేమి? 

No comments:

Post a Comment