శ్రీ మదుమాచోడేశ్వరశతకం -7
శ్రీ
రావూరి వేంకటేశ్వర్లు
54 శా||చావుంబుట్టువు నైన సంసృతిని
నైచ్యంబేదిరా!కానిదో
దేవా!తావక భవ్య నామజపరక్తిన్గల్గు
నానందమే
యావంతేనియునున్నదొక్కడు
గదా!యధ్యాత్మదివ్య ప్రభా!
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన!
చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా!చావుపుట్టువుల రూపమైన
యీ సంసారము నైచ్యము కానిదేమున్నది?నీ భవ్యమైన నామజపమున నాసక్తి వలన కలుగు
నానందము లేశమాత్రము గల్గిన విషయమొక్కటే
నైచ్యము కానిది.
55.శా||హావమ్ముల్ మృదుభావముల్ గలిగి
దీవ్యద్రూపమునల్గితా
నేవమాక్షిఫాలమందుదిలకంబెలేనిచోనొప్పునా
?
ధీ వైదుష్యము రమాభిరాములును నిన్
సేవింపరా ?యొప్పరో
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన!
చోడేశ్వరా!
తా||ఓచోడేశ్వరా!హావభావములను మంచి
సౌందర్యము గల్గియున్నను
నుదుట తిలకము లేకున్నచో నే సొగసుకత్తెయు
బ్రకాశింపదు.అట్లనే
ఎంత పాండిత్యముసంపద గల్గియున్నవారును
నిన్నుసేవింపనివారైనచో
ప్రకాశింపరు.
56.శా||దేవా! సేవకపారిజాతతరువా! దివ్యప్రభావా!
జగ
త్సేవాదీక్షిత!దీనజనతాధిష్ఠాన! భాగీరధీ
హేవాకా! హలాహలాకంఠ!గతమాయీ!భావనాతీత!శ్రీ
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన!
చోడేశ్వరా!
తా||సేవించు వారి కోర్కెలు దీర్చుటకు
గల్పవృక్షమైన వాడా!తేజోమయ
ప్రభావా!దీనులను రక్షించువాడా!గంగను
నెత్తిపై నుంచు కొన్నవాడా!
విషకoఠ !నీవు భావాతీతుడవు.చోడేశ్వరా!
57.ఏ వేల్పులు నినుబోలగల్గుదురె తండ్రీ!
లోకరక్షార్ధమై
చావుంగెల్చి విషంబు గ్రోలగలరె! సౌహార్దమే
నీవొకో!
నీవే నీకును సాటి;యద్వయ!శివా!
నిత్యానుకంపానిధీ!
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన!
చోడేశ్వరా!
తా||స్వామీ!చోడేశ్వరా!లోకముల నేదేవతలును
నిన్ను బోలు వారులేరు.
ఎవరైనను
మృత్యువునుజయించి,విషమునుద్రాగగలరా?సుహృద్ధర్మమే
నీవని తోచుచున్నది.నీవద్వయుడవు.నీకు
నీవే సాటి.నీకు లోకముపై
నిత్యమైన దయ గలదు.
58.శా||నీ వైద్యంబఘరుక్తతిన్దొలచురా! నీ
యోగామార్తావన
శ్రీ విద్యావిభవంబు, నీ తనువు
రాశీభూతవేదమ్ము;నీ
ప్రావీణ్యoబులు దుష్టసంహరణముల్
స్వామీ!జగన్నాధమో
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన!
చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా!నీవు పాపములను రోగములను
బోగొట్టుటకు
వైద్యుడవు.దీనులను రక్షించు విద్యగల
మహాయోగివి.వేదమే
నీ శరీరము.నీ నేర్పులు దుష్టులను
సంహరించునవి.నీవు
జగన్నాధుడవు.
59.శా.||మావాసుండగుగాక నీ
పదములన్మాన్యమ్ముగానెంచకే
యేవాడన్జనెనేని నిల్చినను గానీ
దివ్యతన్గాంచలే
డో విశ్వేశ్వర! వైష్ణవాలయములెన్నో!
చూడదెల్లంబగున్
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన!
చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా! సంపదకు
నిలయమైనవాడయ్యునునీ పాదములను
పూజింపదగినవిగా భావింపకుండనెచటికేగినను
బ్రకాశింప నేరడు.
(దివ్యతను గాంచలేడు)
6౦.శా||దేవా!గాంగఝరీతరంగవిలుఠద్దివ్యాన్న
రేఖా కిరీ
టా!విశ్వాకృతి !సర్వభూతమయ! శిష్ట
వ్రాతరక్షామణీ
నీవే !సర్వము నాకు బ్రోవగదవే!
నిత్యానుకంపానిధీ!
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన!
చోడేశ్వరా!
తా|| ఆకాశగంగా తరంగాలలో నెగిరిపడుచున్నచంద్రరేఖ
కిరీటముగాగల
వాడవు.విశ్వాకృతివి. సర్వభూత
వికారుడవు.సజ్జనులను రక్షించు వాడవు.నిత్యదయానిధివియైన యో చోడేశ్వరా!నాకు సర్వము
నీవై
రక్షింపుము.
61.శా||భావాంభోజ మకర్దమోద్భావము దీవ్యద్వైఖరీవాహినీ
శ్రీ వాస్తవ్యమొకండుదక్క నిడగా
లేదేదియున్నాకడన్
పావిత్ర్యమ్మగు భక్తిద్వచ్చరణ
శుంభత్పూజకర్పించెదన్
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన!
చోడేశ్వరా!
తా||దేవా!ఓ చోడేశ్వరా! నీ పాదపూజకు
సమర్పించుటకు నా దగ్గఱ
నేమున్నది?ప్రకాశించు వాక్ప్రవాహమున
నున్న బురదలో పుట్టని
పద్మము మాత్రమున్నది.దానినే నీపాదపూజకు
సమర్పింతును.
62.శా||ఏవో యేవొ
!తలంపులొక్కమెయిరానేవచ్చునందున్ భవ
త్సేవాదీక్షరహించుధారకును
నెంతేశక్తియౌటన్ మదీ
యావేశంబుల నెన్న ద్రుంచు;నిడుమయ్యా
దార్ఢ్యoబునన్
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన!
చోడేశ్వరా!
తా||దేవా!చోడేశ్వరా!కవినగుటచే నాకు
బలువిధములైన భావాలు
వచ్చుచుండును.నిన్ను సేవించు యోగమునందలి
దీక్ష శక్తివంతమగుటచే నా భావాల్లోని యావేశములనుబోగొట్టును.స్వామీ!నాకు
అట్టి దీక్షను దృఢముగా గల్పింపుము.
63.శా||ఈ విశ్వంబదియెల్ల నీ
కవిత;బ్రాహ్మీమూర్తి !తత్రత్యవి
ద్యావైదుష్యమునేర్పుసద్గురుడవయ్యా !నీవు
నేనన్న ద్వ
త్సేవాధీనుడనందు బాత్రమఱియున్
శిష్యుండ!బోషింపరా
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన!
చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా!యీ ప్రపంచమoతయు నీ
కవిత్వము.విద్యా స్వరూపుడ వైన నీవందలి విద్యలోని పాండిత్యమును నేర్పు గురుడవు,నేను
నీ సేవకధీనుడను.నీ కవిత్వమైన ప్రపంచమున నొక పాత్రమును .నీకు శిష్యుడను.నన్ను
పోషింపుము.
64.శా||దేవీరమ్యశుభాంగ!భారతసటీ
దీవ్యద్వ్రత ప్రాచురీ
శ్రీ విద్యాభవనా! పరార్ధకలనా!ప్రేమాకృతీ
!నైగమ
శ్రీవర్ధిష్ణుగుణాఢ్య!సర్వజగతీ
శ్రేయోనిధానా!శివా!
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన!
చోడేశ్వరా!
తా||ఓచోడేశ్వరా!పార్వాతీసుందరమైన శరీరము
గలవాడా!భారత
నారుల పాతివ్రత్యధర్మ ప్రచారమైన శ్రీ
విద్యకు నిలయమైనవాడా!
జ్ఞానముతో నొప్పు వాడా
ప్రేమస్వరూపా!వైదికసంపదను వృద్ధి
నొందించు శీలముగలసద్గుణుడా! సర్వ
జగత్శ్రేయోదాయకా!శివా!
No comments:
Post a Comment