శ్రీమదుమా
చోడేశ్వరశతకం –
4
శ్రీ రావూరి వేంకటేశ్వర్లు
28.శా||”లావాదీవులు”నాదుజీవితముసర్వజ్ఞుoడవో
దేవ! నా
భావంబీవు నెరుంగబోలుదిక నా
పాపంబులన్ద్రోచి నీ
సేవాసక్తిని బెంచి
గేస్తుతనమున్సిద్ధింపగా జేయరా!
దేవీ
పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||
నా జీవితమంతయు దాపములకు నిలయము.ఓ చోడేశ్వరా!
నీ కన్నియు తెలుసు కదా!నా తాపములను పోగొట్టి నీయందు సేవాసక్తిని పెంచి నా పాపంబులన్ద్రోచి
గృహస్ధధర్మమును సిద్ధింపగా
జేయుము.
29.శా||ఏవో!నామదినూహసేయుగవితావ్యూహమ్ములoదున్నయీ
భావమ్ముల్
భవదీయతత్వమును సంభావింపగా,నోపునే
యీ విశ్వoబదియెల్ల నీ కవిత; యందేనేమియై
యుందునో
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా!నా మనస్సులో నూహించు
గవిత్వ యుక్తులలోని
నా భావములు నీ తత్వమునూహింపగలవా?ఈ ప్రపంచమంతయు
నొక మహాకావ్యము.అది నీచేరచింపబడినది.అందులో నేనే లేశమో యైయుండును.
30.శా||సేవాధీనమునీమహత్వముకళాసిద్ధాంతరాద్ధాన్తముల్
గావేమాత్రమునిన్నులోగొనగసంస్కారోదయంబైన
యా
సేవాభాగ్యము జన్మజన్మములకు న్సిద్ధింపగాజేయరా!
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||ఓచోడేశ్వరా!నీ మహిమ సేవకు
వశమైనది.శాస్త్రాలలోని పూర్వపక్ష సిద్ధాంతములునిన్నువశపరచుకొనుటకుజాలవు.పూర్వజన్మ సంస్కారమువలన
బుట్టు సేవాభాగ్యము నాకు జన్మజన్మాలకు సిద్ధించునట్లు చేయుము.
31.శా||రావా!ప్రోవవ!
మామకీనమగుగర్వంబెల్లబోకార్పవా!
ఈవా!చిత్త నిర్మలత్వము
పరంబేనందుకోజూడవా!
ఈవే తల్లిదండ్రివిన్గురుడవున్నే
దైవమున్నాకు శ్రీ
దేవీ
పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||నాకు
తల్లివి,తండ్రివి,గురుడవు,సర్వదైవములు నీవే;ఓ
చోడేశ్వరా!వచ్చి రక్షించి నా గర్వమును పోగొట్టుము.
నా చిత్తమున నైర్మల్యమునుకల్గించి పరమును
చేరునట్లు చేయుము.
32.శా||జీవుల్
పుట్టుచువృద్ధిజెందుచునురాశీభూతమౌ మోదక
ష్టావేగమ్ముగాద్వైతవాసనలనధ్యానిoచియున్ జచ్చుచున్
వేవేగన్ మఱలంగబుట్టుదురునీ విశ్వత్వముంగొల్వకో
దేవీ పట్టణ పర్వతేంద్ర
శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా!నిన్ను విశ్వరూపునిగాసేవింపనినరులు
పుట్టుచు
బెరుగుచు సుఖదు:ఖరూపకములైన ద్వైత వాసనలతో నిండి
చచ్చుచు పుట్టుచు సంసార చక్రమందు తిరుగుదురు.
33.శా||కోవాబిళ్ళలుపాలుతేనెజలజాక్షుల్
మెచ్చియందిచ్చునా
హావంబుల్ మధురాధరోదితసుధా ప్రారంభముల్ దేవ!నీ
సేవంగలెడుసౌఖ్యమందు లవతాశ్రీ స్థానమున్గాంచునా
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా|| ఓ చోడేశ్వరా!కోవాబిళ్ళలు,పాలు,తేనె,వగలాడులు
మెచ్చుకొని
చూపు చేష్టలు తృప్తితో తమంతతామoదించునధరామృతములు,
నీ సేవవలనకలుగుననానందములోలేశభాగమైనను
ఆనందమునీయలేవు.
34.శా||పోవైశ్వర్యములాలుబిడ్డలకుసమ్పూర్ణ
మ్ముగామేలుదా
నేవేళన్సమకూరుసంఘమున బ్రాహ్మీత్వంబు సిద్ధించెడిన్
శైవంబైన భవత్పదార్చవమునన్సిద్ధంబు లోకాళికో
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా|| ఓ చోడేశ్వరా!మంగళకరమైన నీపాదసేవవలన
లోకులకు
సకలైశ్వర్యములు స్ధిరములైయుండును.దారపుత్రాదులకు
మేలు ఎల్లప్పుడూ కల్గును.సమాజములో దివ్యత్వము సిద్ధించును.ఇది
సత్యము.
35.శా||కావే మాత్రము గష్ట
సాధ్యములు,లోకమ్మందుగర్మావళుల్
దేవా!తావకమైన పూజలకుభక్తిస్ఫూర్తిమై
నిల్చు స
త్సేవాధర్ములకంతరంగనిలయాధిష్ఠాన! గౌరీశ !శ్రీ
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన!
చోడేశ్వరా!
తా||ఓ గౌరీపతీ! చోడేశ్వరా!సజ్జనులను
సేవించుచు భక్తితో నీ పూ జలొనర్చు వారికి లోకసంబంధములైనయేపనులునుగాష్టసాధ్యములు
కావు.కాన నీవoదఱి యంతరంగములనుండి
భక్తులకు సులభుడవై
యుందువు.
36..శా||రావే
హానులు రోగముల్ గుటిలగర్వస్ఫూర్తులున్ మూర్తిమ
ద్భావా! తావకలింగరూపమునకున్ దంభేతరశ్రీకృతిన్
సేవలు సేసెడు భక్త కోటికి బరాశ్రీనిష్ఠ సర్వేశ్వరా
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా|| ఓ సర్వేశ్వరా! చోడేశ్వరా! నీలింగస్వరూపమునకు
ఆడంబరము
లేని సేవలుచేయుచు పరమునందు నిత్యమైన నిష్ఠతోనుండు భక్తులకు ఏ కీడులు ఏ రోగములు ఏ
గర్వవికారములును రావు.
@@
No comments:
Post a Comment