Saturday, 15 December 2018

భాస్కరశతకము2

                  భాస్కరశతకము2
13.ఈజగమందుదామనుజుడెంతమహాత్మకుడైనదైవమా
దేజముతప్పజూచునెడద్రిమ్మరికోల్పడు;నెట్లనన్మహా
రాజకుమారుడైనరఘురాముడుగాల్నడగాయలాకులున్
భోజనమైతగన్వనికిబోయిచరింపడెమున్నుభాస్కరా!
***పూర్వము రాముడుకాలినడకతోనడవికేగిఆకులు కాయలునాహారముగాజేసికొనితిరుగవలసివచ్చెను.అట్లేమానవుడుతానెంతగొప్పవాడైననుదైవానుగ్రహములేనిచోగొప్పపొగొట్టుకొనిదేశసంచారియైతిరుగును.
14.ఉరుకరుణాయుతుండుసమయోచితమాత్మదలంచియుగ్రవా
క్పరుషతజూపినన్ఫలముగల్గుటతధ్యముగాదెయంబుదంబుదం
బురిమినయంతనేకురియకుండునెవర్షములోకరక్షణ
స్థిరతరపౌరుషంబుననశేషజనంబులెఱుంగభాస్కకరా!
          **మేఘుడుప్రాణంబునకుభయముగలుగునట్లురిమివెంటనేజనులనురక్షించుపట్టుదలతోనందరికినానందముగల్గునట్లువర్షించును.అట్లేగొప్పదయగలవాడుసమయానుకూలముగకఠినవాక్యములాడిననుతర్వాతతప్పకమేలుగల్గించును.
15.ఉరుగుణవంతుడొడ్లుదనకొండపకారముసేయునప్పుడున్
బరహితమేయొనర్చునొకపట్టునైననుగీడుజేయగా
నెఱుగడునిక్కమేకదయదెట్లనగవ్వముబట్టియెంతయున్
దరువగజొచ్చినంబెరుగుతాలిమినీయదెవెన్నభాస్కరా!
           ***పెరుగు,మానవులుతన్నుగవ్వముచేగొనియెంతచిలుకుచున్ననుయోర్చివెన్ననచ్చును.అట్లేగుణవంతుడుతనకుబరులుకీడుచేయుచున్నను,వారికపకారముచేయకతానుపరోపకారముచేయును.
16.ఉరుబలశాలినంచుదనునొల్లనియన్యపతివ్రతాంగనా
సురతముగోరెనేనికడసుమ్మదిభూతికిబ్రాణహానియౌ
శిరములుగూలరాఘవునిచేదశకంఠుడుద్రుంగిపోవడే
యెఱుగకసీతకాసపడియిష్టులభృత్యులగూడిభాస్కరా!
   **రావణుడుచేటెఱుగకసీతనుగోరిబంధుభటుసమేతుడైరామునిచేసంహరింపబడెను.అట్లేమానవుడుబలశాలిననిగర్వించితన్నునొల్లనిపరవనితనుగవయగోరినసంపదహానియు,ప్రాణహానియుసంభవించును.
17.ఊరకవచ్చుబాటుపడకుండినైనఫలంబదృష్టమే
పారగగల్గువానికిబ్రయాసమునొందినదేవదానవుల్
వారలటులుండగానడుమవచ్చినశౌరికిగల్గెగాదెశృంగా
రపుబ్రోవులక్ష్మియునుగౌస్తుభరత్నమురెండుభాస్కరా!
     **సముద్రమునుచిలుకునప్పుడుకష్టపడిన దేవతల ,రాక్షసులునుండగానడుమవచ్చినశ్రీహరి కిలకక్ష్మియు ,కౌస్తుభభరత్నములభించెను.అట్లేగొప్పయదృష్టవంతులకుపాటుపడనక్కరలేకుండగనేఫలములభించును.
18.ఊరకసజ్జనుండొదిగియుండిననైనదురాత్మకుండుని
ష్కారణమోర్వలేకయపకారముచేయుటవానివిద్యగా
చీరెలునూరుటంకములుచేసెడివైననుబెట్టెనుండగా
జేరిచినింగిపేగొఱుకుచిమ్మటకేమిఫలంబు?భాస్కరా!
      **బట్టలునూఱేసిమొహరీలువిలువగలవైననుపెట్టెలోనుండినప్పటికిని‌,చిమ్మిటపురుగుతనకేమిలాభములేకపోయిననువాటిదగ్గఱకుజేరిముక్కలుగకొఱుకును.అట్లేమంచివాడుయూరకయొదిగియున్ననుచెడ్డవాడుకారణములేకుండగనేయోర్వలేకమంచివానికపకారముచేయుచుండును.
19.ఎట్టుగబాటుబడ్డనొకయించుకప్రాప్తములేకవస్తువుల్
పట్టుపడంగనేరవునిబద్ధిసురావళిగూడిరాక్షసుల్
గట్టుపెకల్చిపాల్కడలిగవ్వముచేసిమధించిరంతమున్
వెట్టి యెకాక యేమనుభవించిరి వారమృతంబుభాస్కరా!*
***రాక్షసులుదేవతలతోకలిసిపాలసముద్రమునుమధించగానమృతంబుపుట్టెను.అట్లేమానవుడెంతకష్టపడిననుదాననుభవింపదగిన యదృష్టములేకపోయినచోఫలముదొరకదు
.20.ఎడపకదుర్జనుండొరులకెంతయుగీడొనరించుగానియే
యెడలనుమేలుసేయడొకయించుకయైనను;జీడపర్వుదా
జెడదినునింతెకాకపుడిసెండుజలంబిడనేర్చునే
పొడవగుచున్నపుష్పఫలభూరుహమొక్కనైనభాస్కరా!
***చీడపురుగుచక్కగాపెరుగుచున్నపూవులు,కాయలుగలచెట్లనుపాడగునట్లు తినునేకానిచేరెడునీళ్ళుపోసిపెంచలేదు.అట్లేదుర్జనుడు
పరులకెంతయోహానిచేయునేగానిఎప్పుడైననుకొంచెమైననుమేలుచేయడు.
21.ఎడ్డెమనుష్యడేమఱుగునెన్నిదినంబులుగూడియొనన్
దొడ్డగుణాఢ్యునందుగలతోరపువర్తనలెల్లబ్రజ్ఞబే
ర్వడ్డవివేకరీతి;రుచిపాకమునాలుకగాకెఱుంగునే?
తెడ్డదికూరలోగలయద్రిమ్మరుచుంండిననైనభాస్కరా!
       **కూరరుచినినాలుకతెలుసుకొనును,ఎల్లప్పుడుకూరలలోదిరుగుచున్నను,తెడ్డారుచినితెలిసికొనలేదు.అట్లేగుణవంతునినడవడికలనుజ్ఞానితెలిసికనునుగానిమూఢుఢుఆగుణపంతునితోయెన్నిదినాలుకలిసితిరిగిననుతెలిసికొనలేడు.
.22.ఎప్పుడదృష్టతామహిమయించుకపాటిలునప్పుడింపుసొం
పొప్పుచునుండుగాకయదియొప్పనిపిమ్మటరూపుమాయుగా
నిప్పుననంటియున్నయతినిర్మలినాగ్నిగురుప్రకాశముల్
దప్పిననట్టిబొగ్గునకుదానలుపెంతయుబుట్టుభాస్కరా!
        **బొగ్గుఅగ్నిలోచేరియున్నప్పుడుదానియందలిస్వచ్ఛమైన
కాంతులతోప్రకాశించును.అగ్నిసంబంధముతొలగినచోతెల్లనికాంతిపోయినల్లగామారును.అట్లేమానవునకదృష్టమువృద్ధియగునప్పుడుప్రభగల్గియుండును.గానియదివిడిచిపోయినతర్వాతమొదటిప్రభనశించును.
23.ఏగతిబాటుపడ్డగలదే భువినల్పునకున్ సమగ్రతా
భోగముభాగ్యరేఖగలపుణ్యునకుంబలె?భూరిసత్తసం
యోగమదేభకుంభయుగళోత్థితమాంసమునక్కకే
లాగుఘటించుసింహముదలచినజేకుఱుగాకభాస్కరా!
   .  **మదించినయేనుగుయొక్కకుంభస్థలమునందున్నమాంసమునుసింహముకోరినదొరుకునుగానినక్కకుదొరకదు.అట్లేసపూర్ణసౌఖ్యమదృష్టవంతునకుదొరుకునుగానియెంతశ్రమపడిననుఅల్పునకుదొరకదు.
24.ఏడననర్హుండునటకేగుననర్హుడునర్హుడున్నచో
జూడగనొల్లడెట్లననశుద్ధగుణస్థితినీగపూయముం
గూడినపుంటిపైనిలువగోరినయట్టులునిల్వనేర్చునే
సూడిదపెట్టునెన్నుదుటిచొక్కపుగస్తురిమీద భాస్కరా!
        ***ఈగమంచివాసనగలకస్తూరిబొట్టుపైవ్రాలక‌ ,చెడువాసనగలచీముపట్టినకురుపుపైవ్రాలును.అట్లే అయోగ్యుడు
యోగ్యునివద్దకుబోక యయోగ్యునివద్దకేచేరును.
25.ఏలసమస్తవిద్యలనొకించుకభాగ్యముగల్గియుండినన్
జాలుననేకమార్గములుసన్నుతికెక్క,నదెట్లొకోయనన్
రాలకునేడవిద్యలుతిరంబుగదేవరరూపుచేసినన్
వ్రాలినమస్కరించిప్రసవంబులువెట్టరెమీదభాస్కరా!
        **రాళ్ళు విద్యలు నేర్వకున్నను ,వానియదృష్టమునదేవతా
రూపుగాచేసినచోమానవులువ్రాలినమస్కరించిపూలతోపూజింతురు.అట్లేమానవులకదృష్టరేఖయుండిన ననేకపొగడ్తలుగాంచును.విద్యలునేర్చినందులకుకాదు.
26.ఒక్కడెచాలునిశ్చలబలోన్నతుడెంతటికార్యమైనదా
జక్కనొనర్పగౌరవులసంఖ్యులుపట్టినధేనుకోటులం
జిక్కగనీకతత్ప్రబలసేనననేకశిలీముఖంబులన్
మొక్కపడంగజేసితుదముట్టడెయొక్కకిరీటి భాస్కరా!
         **దుర్యోధనాదులుగొప్పసైన్యముతోవిరటునియాలమందనుతోలుకొనిపోవుచుండగానునుుునుడొక్కడేఅనేకబాణములచేవారలనుజయించిగోవులనువిరటునకప్పగించెను.అట్లేస్థిరమైనబలవంతుడుతానెంతటికార్యమునైననునెఱవేఱ్పగలడు.
27.కట్టడదప్పితాముచెడుకార్యముజేయుచునుండిరేనిదో
బుట్టినవారినైనవిడిపోవుటకార్యము;దౌర్మదాంధ్యముం
దొట్టినరావణాసురునితోనెడబాసివిభీషణాఖ్యుడా
పట్టునరాముజేరిచిరపట్టముగట్టుకొనండెభాస్కరా!
      **రావణునితమ్ముడగువిభీషణుడతనినివిడిచిరామునిజేరి
శాశ్వతమైనలంకాధిపత్యమునుపొందెను.అట్లేచెడుపనులుజేసినచోసోదరుడైననువానినివిడువవలెను.(విడిచిపెట్టుటమంచిది)

Thursday, 6 December 2018

భాస్కరశతకం-3

                              భాస్కరశతకం-3


28.కట్టడయైనట్టినిజకర్మముచుట్టుచువచ్చియేగతిం
బెట్టునొపెట్టినట్లనుభవింపకతీరదుకాళ్ళు మీదుగా
గిట్టకవ్రేలుడంచుదలక్రిందుగగట్టిరెయెవ్వరైననా
చెట్టునగబ్బిలంబులకుజేరిన కర్మముగాకభాస్కరా!
      *గబ్బిలములు యితరులెవ్వరునుతమ్ముతలక్రిందుగా
చె్టు్టు్టునకువ్రేలాడగట్టకున్ననుతనపరాకృతకర్మముచేతనే యట్లువ్రేలాడుచుండును.అట్లేవిథివిహితమైన పురాకృతకర్మముతన్నావరించియెట్టికష్టములబెట్టిననుమానవుడట్లు అనుభవింపకతీరదు.
29.కట్టడలేనికాలమునగాదు శుభంబొరులెంతవారుచే
పట్టిననైనమర్త్యునకుభాగ్యమురాదనుటెల్లగల్లకా
దెట్టనిపల్కినన్  దశరథేశవశిష్ఠులు రామమూర్తికిన్
బట్టముకట్టగోరిరది పాయక చేయరె నోటు భాస్కరా!
           *దశరథుడును ,వశిష్టమహామునియును శ్రీరామునకుపట్టాభిషేకము జేయనెంత ప్రయత్నించిననువిథివిథానములేక జరుగలేదు.అట్లేమానవునకుదైవికమగునేర్పాటులేనప్పుడుయెంతటిగొప్పవారుసాయముచేసిననుశుభములుగలవు.
30.కానక చేరబోలదతికర్ముడునమ్మికలెన్నిచేసినం
దానదినమ్మివానికడదాయగబోయినహానివచ్చున
చ్చోనదియెట్లనంగొరకుచూపుచునొడ్ఢనబోనుమేలుగా
బోననికానకాసపడిపోవుచు గూలదెకొక్కుభాస్కరా!
           *తనకుదిండినిజూపుచు పన్నిన బోనును బోననితెలిసికొనకపందికొక్కుఆశించిబోయియందుచచ్చును.అట్లేయెన్నినమ్మికలుచేసినను తెలిసికొనకుండ పాపాత్మునిదగ్గరకువెళ్ళరాదు.నమ్మివెళ్ళినచోహాని సంభవించును.
31.కానిప్రయోజనంబుసమకట్టదు తాభువినెంతవిద్యవా
డైననుదొడ్డరాజుకొడుకైననునదెట్లు?మహేశుఫట్టివి
ద్యానిథిసర్వవిద్యలకుదానెగురుండు వినాయకుండుదా
నేనుగురీతినుండియునదేమిటికాడడుపెండ్లి?భాస్కరా!
            *వినాయకుడుశివునికొడుకైననుసర్వవిద్యాస్థానభూతుండైనను అన్నివిద్యలగురువున్నుఏనుగువంటిబలముగలవాడునుఅయియున్ననుపెండ్లాడలేకపోయెను.అట్లనేమనుజుడెంతవిద్యావంతుడైననుగొప్పరాకుమారుడైననుైైైవమనుకూలింపనికార్యముజేసుకొనలేడు.
32.కామితవస్తుసంపదలుగల్గుఫలంబొరులాసపడ్డచో
నేమియుబెట్టడేనిసిరియేటికి?నిష్ఫలమున్నబోయినన్
బ్రామికశడ్డలోకులకుబంటగనేమదియెండిపోవగా
నేమిఫలంబు?చేదువిడదెన్నటికైన ముసిండి భాస్కరా!
       *ఎప్పుడునుచేదువదలనిముషిణిచెట్టుపండినను,యెండిననువానినాశ్రయించియున్నమనుజులకేమియునునష్టములేదు.లాభములేదు.అట్లనేభాగ్యవంతుడుతన్నాశ్రయించికోరుకొన్నమనుజులకెంతఫరమునీయకున్నచోవానికిసంపదయున్ననునశించినను లాభములేదు.నష్టములేదు. సమానమేయగును.
33.కారణమైనకర్మలు కాక దిగంబడవెన్నిగొందులం
దూరిననెంతవారలకు;దొల్లిపరీక్షతుశాపభీతుడై
వారథినొప్పునుప్పరిపైబదిలంబుగదాగియుండినం
గ్రూరభుజంగదంతహతిగూలడెలోకులెఱుంగ భాస్కరా!
       *ముని యిచ్చిన శాపమునకు భయపడిపరీక్షిత్  మహరాజు
సముద్రములోనిమేడపైభద్రముగదాగియుండినను పాముకాటు వలన చనిపోయెను.అటులనే ఎంతగొప్ప వారైననుయెన్నిమూలల దాగియున్ననుఅనుభవించవలసిన కర్మమనుభవింపకతీరదు.
34..కులము ననక్కడనకుంఠిత థార్మికుడొక్కడొక్కడే
కలిగెడుగాకపెందరుచుగల్గగనేరరు!చెట్టుచెట్టునన్
గలుగగనేర్చునేగొడుగుకామలుచూడగ నాడనాడనిం
పలరగనొక్కటొక్కటినయంబున జేకురుగాక భాస్కరా!
             *ఆలోచింపగా గొడుగుకామలు అక్కడక్కడట్ప
పరిమితముగ నొక్కటొక్కటి దొరకునుగాని పత్తిచెట్టునందుదొరకదు.
అట్లనేమంచిధర్మబుథ్థిగలవాడుకులమునక్కడక్కడనెక్కడోకల్గును

35.కౄరమనస్కులౌ పతులగొల్చివసించిన మంచివారికిన్
వారిగుణంబెపట్టిచెడువర్తనవాటిలు;మాథురీజలో
దారలుగౌతమీముఖమహానదులంబుథిగూడినంతనే
క్షారముజెందవే మొదలికట్టడలన్నియుదప్పిభాస్కరా!
           *తియ్యనినీరుగలగోదావరిమొదలగునదులు సముద్రములోకలిసిన వెంటనే తమతియ్యదనమునుకోల్పోయి యుప్పదనమునుపొందుచున్నవి.అట్లేకౄరుడగురాజునుసేవించుచున్నమంచివారికివారిమంచిగుణముపోయికౄరగుణముసంభవించును.
36.గిట్టుటకేడగట్టడ లిఖించిన నచ్చటగానియొండుచో
బుట్టదుచావుజానువులపున్కలనూడిచికాశిజావగా
 ల్గట్టనశూద్రుకున్    భ్రమలగప్పుచు దద్విథిగుఱ్ఱమౌచునా
పట్టునగొంచుమఱ్ఱికడబ్రాణముతీసెగదయ్యభాస్కరా!
          *శూద్రకమహారాజుకాశిలోచచ్చుటకైయచ్చటనుండగాదైవముగుఱ్ఱముగామారియారాజునుతనపైనెక్కించుకొనిదూరంగాతీసికొనివెళ్ళిమఱ్ఱిచెట్టువద్దప్రాణముదీసెను.అట్లనేజచ్చుటకుయెచ్చటవిథివ్రాసియుండెనోయచ్చటనేచచ్చునుగానివేరొకచోటజావడు.
౩7ఘనబలసత్త్వమచ్చుపడగల్గినవానికిహానిలేనిచో
తనదగుసత్త్వమేచెఱుచుదన్ను;నదెట్లన?నీరులావుగా
గనువసియించినన్ చెఱువుకట్టకుసత్త్వముచాలకున్నచో
గనుమలుపెట్టినట్టనడిగండితెగంబడకున్నె?భాస్కరా!
             *చెఱువునకునీరెక్కువగానున్నప్పుడుచెఱువుగట్టుబలములేకున్నమథ్యగండితెగును.అట్లనేతనకధికబలమున్నందుననితరులచేహాని
కల్గకున్నను తనసత్తువయేతన్నుపాడుచేయును.
38ఘనుడగునట్టివాడునిజకార్యసముద్థరణార్థమైమహింబని
వడియల్పమానవునిబ్రార్థనచేయుటతప్పుగాదుగా;యన
ఘతగృష్ణజన్మముననావాసుదేవుడుమీదటెత్తుగాగను
గొనిగాలిగానికడకాళ్ళకుమ్రొక్కడెనాడుభాస్కరా
       ×*శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో నాతనితండ్రియగువసుదేవుడుకృష్ణునిరక్షించుటకైగాడిదవెనుకకాళ్ళనుపాపరహితముగానుభావించినమస్కరించెను.అట్లేగొప్పవాడైనవాడుతనకార్యమునునెఱవేర్చుకొనుటకైపనిబూనినీచునిప్రార్థించిననుదోషముకానేరదు.
39ఘనుడొకవేళగీడ్పడినగ్రమ్మఱనాతనిలేమివాపగా
గనుగొననొక్కసత్ప్ర ప్రభువుగాగనరాథములోపఱుం
బెనజెఱువెండినట్టితఱి బెల్లునమేఘుడుగాకనీటీతో
దనుపదుషారముల్ శతశతంబులుచాలునటయ్యభాస్కరా!
            *పెద్దచెఱువుయెండిపోయినపుడుదానినిత్వరలోనీటిచేనిండించుటకుమేఘమేవర్షింపసరిపోవును.గానిమంచుబిందువులెన్నివర్షించినను జాలవు.అట్లేయొకగొప్పవాడుకీడుచేబీదవాడైనచో నాతనిబీదతనమునుబోగొట్టుటకుమంచిరాజేసరిపోవునుగానినీచమానవులెందరైననుసరిపోవరు.
40.చంద్రకళావతంసుకృపచాలనివాడుమహాత్ముడైనదా
సాంద్రవిభూతిబాసియొకజాతివిహీనునిగొల్చియుంటయో
గీంద్రసుతాంఘ్రిపద్మమతిహీనతనొందుటకాదుగాహరి
శ్చంద్రుడువీరబాహునినిజంబుగగొల్వడెవాడు భాస్కరా-!
          *పూర్వముహరిశ్చంద్రమహారాజు దైవకృపలేకమాదిగకులజుడగు వీరబాహునిసేవించెను.అట్లే ఈశ్వరుని దయ లేనప్పుడుతానెంతటిఘనుడైనను గొప్పసంపదలను విడిచి ఒక నీచుని సేవింపవలసి వచ్చును.అట్లు సేవించుట దైవకృపలేకయే కానితెలివితక్కువగాదు.
41.చక్కదలంపగావిధివశంబుననల్పునిచేతనైనదా
జిక్కియవస్థలంబొరలుజెప్పగరానిమహాబలాఢ్యుడున్
మిక్కిలి సత్త్వసంపదలమీఱినగంధగజంబుమావటీ
డెక్కియదల్చికొట్టికుదియించిననుదెయోర్చిభాస్కరా!
            *మిక్కిలి సత్తువగలమదపుటేనుగు తనపైకిమావటీడెక్కియదలించియంకుశముతోకొట్టికృంగజేసినసహించియుండును.అట్లేయెంత బలవంతుడైననుదైవవశముచేత నీచునిచేజిక్కికష్టములనుపొందుచుండును.
42.చదువదియెంతగల్గినరసజ్ఞతయించుకచాలకున్ననా
చదువు నిరర్థకంబు గుణసంయుతులెవ్వరుమెచ్చటెచ్చటం
బదునుగ మంచికూర నలపాకముచేసిననైననందునిం
పొదవెడునుప్పులేకరుచిపుట్టగనేర్చునటయ్యభాస్కరా!
           *నలమహారాజువలెకూరనుఎంతచక్కగవండినను ఉప్పవేయనిచోరుచికలుగదు.అట్ధనేమానవుడెంతవిద్వాంసుడైననుకొంచెమైనరసమునుగ్రహింపలేకున్నవానివిద్యపనికిమాలినదగును.ఎక్కడను గగుణవంతులెవ్వరును మెచ్చుకొనరు.
43చాలబవిత్రవంశమున సంజనితుండగునేనియెట్టిదు
శ్శీలునినైనదత్కులవిశేషముచేనొకపుణ్యుడెంతయుం
దాలిమినుద్థరించును;సుధానిధిబుట్టగగాదెశంభుడా
హాలహాలానలంబుగళమందుధరించుటపూని భాస్కరా!
     *మిక్కిలిభయంకరమగుహాలాహలమునునగ్నిహోత్రమునుపాలసముద్రములోపుట్టుటచేశంభుడు దానిని కంఠమునందుదాల్చెను.అట్లేఎట్టిచెడుగుణములు గలవాడైననుమంచికులమునపుట్టినచోనాకులమందలి గౌరవముచేత పుణ్యాత్ముడెవరైననునొకడుఆ దుష్టుని కాపాడును.
44.చేరిబలాథికుండెఱిగి చెప్పినకార్యముచేయకుండినన్
బారముముట్టలేడొక నెపంబునదాజెడునట్టి ధన్యుడున్
బోరక పాండుపుత్త్రులకు భూస్థలిభాగము పెట్టుమన్నగం
సారినిగాకుచేసిచెడడాయెనె గౌరవభర్తభాస్కరా!
    *శ్రీకృష్ణుడు దుర్యోథనునివద్దకు వెళ్ళిపాండవులతోయుద్థము చేయకుండ రాజ్యమును పంచియిమ్మని చెప్పగానాతనినితిరస్కరించి దుర్యోథనుడుచెడెను.అటులనేబలశాలితనకడకేతెంచి చెప్పిన
పనులజేయకున్న యెంతటివాడైనను తనపని పూర్తిచేసుకొన
లేక ఏదేని కారణముచేత తానే నశించును.
45.చేసినదుష్టచేష్టనది చెప్పకనేర్పునగప్పిపుచ్చితా
మూసినయంతటన్ బయలుముట్టకయుండదదెట్లురాగిపై
బూసిన బంగరుంజెదరి పోవగడగిననాడునాటికిన్
దాసినరాగి గానబడదా జనులెల్లనెఱుంగ భాస్కరా!
            *రాగిపై పొదిగిన బంగరుపూతచెదరిపోయినక్రమముగా
నందున్నరాగియందఱకు కనబడును.అట్లేనీచుడొక నీచ కార్యముచేసి చెప్పకుండనుపాయముచే దాచిపెట్టిననునది క్రమ
ముగనందఱకు దెలియక మానదు.
46.తగిలి మదంబుచేనెదిరిదన్నునెఱుంగకదొడ్డవానితో
బగగొని పోరుటెల్ల నతిపామరుడైచెడుటిఃతెకాకము
న్నెగడిజయింపనేరడదినిక్కముతప్పదు;ధాత్రిలో పలన్
దెగియొకకొండతోదగరుడీకొని తాకిననేమి?భాస్కరా!
        **గొఱ్ఱెపోతుసాహసించియొకపర్వతమునుయెదుర్కొనితాకిన
దానితలపగులుట తప్పలాభమేమియునుండదు.అటులనే బలహీనుడుకావరముచే,తన.ఎదుటివారిబలములనుతెలియకుండ గొప్పవారితోవిరోధము పూని పోట్లాడిన తానే చెడిపోవును.కాని లాభమేమియును పొందలేడు.
47.తడవగరాదు దుష్ట గుణుదత్త్వమెరుంగకయెవ్వరైన
చెడు గుణమిట్లువల్వదని చెప్పిన గ్రక్కునగోపచిత్తుడై
గడుదెగజూచుగామఱుగగాగినతైలమునీటిబొట్టుపై
బడునెడనాక్షణంబెగసి భగ్గునమండక యున్నెభాస్కరా!
         **బాగుగా గాగిన నూనెతనపైనీటిచుక్కపడిన వెంటనే
మీదికి లేచి భగ్గున మండును.అట్లేచెడ్డవాడు తనకు హితముచె
ప్పినవారికిచెడుచేయుటకేతెంచును..కావునచెడ్డవానినిజముతెలియకుండావానిజోలికిపోరాదు.

   

Wednesday, 5 December 2018

భాస్కరశతకము-7

                 భాస్కరశతకము-7
96.సకలజనప్రియత్వమునిజంబు ,గల్గినపుణ్యశాలికొక్కొకయె
డనాపదైనదడవుండదు వేగమెపాసిపోవగా ,యకలుషమూ
ర్తియైనయమృతాంశుడురాహువుతన్నుమ్రింగినం ,
టకటకమానియుండడె?దృఢస్థితనెప్పటియట్లభాస్కరా!
        *చంద్రుడుతానురాహువుచేమ్రింగబడికాంతిలేనివాడైననుతిరిగికొలదికాలములోనేతొందరపాటునుమానిపూర్వరీతినికాంతినిబొందుచున్నాడు.అట్లేపుణ్యాత్ముడొకపట్టునకష్టములబొందిననువెంటనేయాకష్టాలనుండివిముక్తుడైపూర్వరీతినిసుఖములొందును.
97.సన్నుతకార్యదక్షుడొకచాయనిజప్రభయప్రకాశమై
యున్నపుడైనలోకులకునొండొకమేలొనరించుసత్వసం
పన్నుడుభీముడాద్విజులప్రాణముకావడెయేకచక్రమం
దెన్నికగాబకాసురునినేపునరూపడగించిభాస్కరా!
           *భీముడుద్విజులప్రాణరక్షణకైబకాసురునిచంపెను.అట్లే
కార్యదక్షుడుప్రతాపహీనుడైనలోకరక్షణకేదోయొకటిచేయును.
98.సరసగుణప్రపూర్ణునకుసన్నపుదుర్గుణమొక్కవేళయం
దొరసిననిట్లునీకుదగునోయనిచెప్పినమాననేర్చుగా
బురదయొకించుకంతముబొందినవేళలజిల్లవిత్తుపై
నొరసిననిర్మలత్వముననుండవెనీరములెల్లభాస్కరా!
         *నీళ్ళుయొకప్పుడుబురదగలవైనప్పుడుకొంచెముయిండుప
గింజగంధమందులోగలిపినబురదపోయిశుభ్రముగనుండును.అట్లేసద్గుణునకొకచెడుగుణముగల్గిననీకుతగదనియెవ్వరైనచెప్పినవిని
దానినమానును.
99.సరసదయాగుణంబుగలజాణమహింగడునొచ్చియుండియుం
దరచుగవానికాసపడిడాయగవత్తురులోకులెట్లనం
జెఱకురసంబుగానుగనుజిప్పిలిపోయినమిదబిప్పియై
ధరబడియున్నజేరవెముదంబునజీమలుభాస్కరా!
          *చెఱకుగడయొక్కరసమునంతటినిగానుగనందుదీయబడినపిదపపిప్పినేలమీదవేసిననుచీమలుదానిదగ్గఱకుజేరును.అట్లేదాతదరిద్రుడైబాధపడుచున్ననుప్రజలువానిమీదనాసపెట్టుకొనిదగ్గఱకుచేరుదురు.
100.సాలరవివేకవర్తనలసన్నుతికెక్కినవారిలోపలం
జేరినయంతమూఢులకుజేపడదానడ‌;యెట్టులన్నగా
సారములోనహంసములసంగతినుండెడికొంగపిట్టకే
తీరునగల్గనేర్చునుదదీయగతుల్దలపోయభాస్కరా!
         *చెరువులోహంసలతోకలిసియున్నంతమాత్రానకొంగకుహంసల
నడకలేవిధముగారావో,అట్లేమంచిపేరుపొందినమానవులతోస్నేహముచేసినంతమూఢులకామంచివారినబవడిలభింపదు.
101.స్థానముతప్పివచ్చునెడదానెటువంటిబలాఢ్యుడున్ననిజ
స్థానకుడైనయల్పునికతంబునైననుమోసపోవుగా
కానలలోపలన్ వెడలిగంధగజంబొకనాడునీటిలో
గానకచొచ్చినన్ మొసలికాటులలోబడదోటుభాస్కరా!
          *మదించినగజముతానువసించునడివినివిడిచినీటబ్రవేశించిమొసలికిలొంగినది.అట్లేబలవంతుడైనవాడుతనస్థానమునువిడిచివచ్చిన ,యల్పునిచేమోసగింపబడును.
102.సిరిగలవానికెయ్యెడలజేసినమేలదినిష్ఫలంబగున్
నెఱిగుఱిరాదుపేదలకునేర్పునజేసినసత్ఫలంబగున్
వఱపునవచ్చిమేఘుడొకవర్షమువాడినచేలమీదటం
గురిసినగాకయంబుధులగుర్వగనేమిఫలముభాస్కరా!
         *మేఘుడువానలులేఎండుచున్నసస్యములపైవర్షించినలాభముండునుగానిసముద్రాలలోగురిసినలాభమేమి?అట్లేమనుజుడుపేదవారికిసాయముచేసినలాభముండునుకానిధనవంతులకుసాయంచేసిననునెట్టిలాభముండదు.
103.సిరివలెనేనిసింహగుహచెంతవసించినజాలుసింహముల్
కరులవధింపరానచటగల్గునుదంతచయంబుముత్యముల్
హరువుగనక్కబొక్కగడనాశ్రయమందిననేమిగల్గెడుం
గొరిసెలుదూడతోకలునుగొమ్ములునెమ్ములుగాకభాస్కరా!
            ***భాగ్యముగోరువారుసింహముగుహవద్దకువెళ్ళిన
ఏనుగుదంతాలు,వానికుంభస్ధలములలోనిముత్యాలుదొరుకును.అంతేకానినక్కగుహవద్దకువెళ్ళినఎముకలుదొరకును.కానగొప్పవారినాశ్రయించినలాభముండునుకానినీచులనాశ్రయించినలాభముకలుగదు.
104.స్థిరతరధర్మవర్తనబ్రసిద్ధికినెక్కినవానినొక్కము
ష్కరుడతినీచవాక్యములగాదనిబల్కిననమ్మహాత్ముడుం
గొఱతవహింపడయ్యెడ ,నకుంఠితపూర్ణసుధాపయోధిలో
నరుగుచుగాకిరెట్టయిడినందుననేమికొఱంతభాస్కరా!
         **సముద్రముమీదనెగురుకాకిసముద్రమునరెట్టవేసిననా
సముద్రమునకేమియులోపముంబదు.అట్లేధర్మజ్ఞుడగుమానవునికొకనీచుడునీచపల్కులాడిననాతనికేమియులోపముకల్గదు.
105.సిరిగలవాడులభ్యమగుచిత్తమునందుదలంచినంతనే
నరులకునెట్టికార్యమైనన్ జతకాదుబహుప్రయత్నముల్
జరిపిననైనలేమియెడసత్యముసుమ్మిదిచేతికందుపండర
యగదోటికందదుగదాయనుసామ్యముపోల్కిభాస్కరా!
          **ఒకప్పుడుచేతికందినపండుమరియొకపుడునోటికందదు యనుసామెతవలెమానవునకెంతసంపదున్నయెంతగొప్పపనియైననుదలంచినంతమాత్రమునేసమకూడును.సంపదలేనప్పుడెంతప్రయత్నముచేసినను సమకూడదు.
106.స్ఫురతరకీర్తిమంతులగుపుత్రులగాంచినగాకమూఢము
ష్కరులగనంగదేజములుగల్లవుగామణికీలితాంగుళా
భరణములంగుళంబులశుభస్థితిబెట్టినగాకగాజుటుం
గరములుపెట్టినందునవికాసముగల్గునటయ్య?భాస్కరా!
         **చేతివ్రేళ్ళకుమణిమయయుంగరములుధరించినచోచేతికి
కాంతికల్గునుగానిగాజుటుంగరమనుధరించినకాంతికల్గదు.అట్లేకీర్తిగలకుమారులనుకన్నప్రతిష్ఠకల్గునుకానిజ్ఞానహీనులగుకొమరులనకనుటవల్లప్రతిష్ఠలుకల్గవు.
107.సేనగవాంఛితాన్నముభుజింపగలప్పుడుకాకలేనిచో
మేనులుడస్సియుంటనిజమేకదదేహులకగ్నిహోత్రుడౌ
నేనిభోజ్యముల్ గుడుచునేనియుబుష్టివహించులేనినా
డూనివిభూతిలోనడగియుండడెతేజముదప్పిభాస్కరా!
         **అగ్నియెక్కువతేజశ్శాలియైననుతనకిష్టపదార్థములనుదిని
పుష్ఠిగనుండిప్రకాశించును.లేనిచోబూడిదలోనుండును.అట్లే
ప్రాణులుతమకిష్టమైనవిదినిశరీరకాంతినికల్గియుండును.ఇష్టముకానవితిన్నచోవానిశరీరములుకృశించును.
108.హాళినిజప్రబుద్ధితిరమైనవిధంబునబెట్టుబద్ధులా
వేళకునంతెగానిమఱివెన్కకునిల్వవు ,హేమకాంతియె
న్నాళులకుండుగానియొకనాడుపదంబడిసానబట్టినన్
దాళ్ళుకయుఃడునేయినుపతాటకుజాయలుసోకభాస్కరా!
         **స్వతస్సిద్ధముగపుట్టినబుిబంిబంగారుకాంతివలెస్థిరముగానుండును.గానిపరులుచెప్పినందువలనగల్గినబుద్ధిసానబట్టినయినుప
ఱేకుతళుకువలెఅప్పుడేయుండివెంటనేనశించును.
109.హీనకులంబునందుజనియించినవారికిసద్గుణంబులె
న్నేనియుగల్గియున్ననొకనేరముచెందకపోదుపద్మముల్
భూనుతిగాంచియున్ బురదబుట్టుటవల్లసధాకరోదయం
బైననసహ్యమొందవెపప్రియంబునజూడగలేకభాస్కరా!
         ***తామరపువ్వులులోకానఖ్యాతిపొందినవైననుబురదలోపుట్టుటచేచంద్రోదయసమయానప్రియముగాచూడబడవు.అట్లేతక్కువకులజాతమైనమానవునకెన్నిసద్గుణములన్ననుతప్పుడుగుణముండకపోదు.
110.ఇంచుకనేర్పుచాలకవిహీనతజెందిననాకవిత్వమున్
మించువహించెనీకతనమిక్కిలియెట్లనదోలుబొమ్మలన్
మంచివివేకివానితెరమాటుననుండిప్రశస్తరీతినా
డించినవాడవేజనులడెందమునింపవెప్రీతిభాస్కరా!
         **ఓసూర్యుడానేర్పరియగుమానవుడుతెరచాటుననుండితోలుబొమ్మలనునేర్పుగనాడింపయాబొమ్మలేప్రజలకానందముకలిగించును.అట్లేనీపేరునాపద్యములచివరజేర్పబడినమహత్తుచేకొంచెమైననునేర్పుచాలనినాకవిత్వముమిగులప్రకాశించిప్రజలకమందానందముగల్పినది.
                  **సంపూర్ణము****

భాస్కరశతకము6

                   భాస్కరశతకము6
78.భూపతికాత్మబుద్ధి మదిబుట్టనిచోటబ్రధానులెంతప్ర
జ్ఞాపరిపూర్ణులైనగొనసాగదుకార్యము ,కార్యదక్షులై
యోపినద్రోణభీష్మకృపయోధులనేకులుగూడకౌరవ
క్ష్మాపతికార్యమేమైన జాలిరెచేయగలవారుభాస్కరా!
          *కార్యాచరణలేనిదుర్యోధనునిపనినిభీష్మ,ద్రోణాచార్యాదికార్యదక్షులునెఱవేర్చలేకపోయిరి.అట్లేరాజునకునిజమైనయాలోచనపుట్టనప్పుడుతెలివిగలమంత్రులెవ్వరునునెఱవేర్పలేరు.
79.భూరిబలాఢ్యుడైన దలపోయకవిక్రమశక్తిచేనహం
కారమునొందుటల్ తగవుగానతడొక్కెడమోసపోవుగా
వీరవరేణ్యడర్జునుడు వింటికి నేనధికుండనంచుదా
నూరకవింటినెక్కిడగనోపడుకృష్ణుడు లేమిభాస్కరా!
         *అర్జునుడు ముల్లోకాలకుదానెవిలువిద్యయందధికుడనని
గర్వముచెందును.కానికృష్ణనిర్యాణానంతరంవిల్లెక్కపెట్టలేకపోయెను.అట్లేమనుజుడెంతబలవంతుడైనగర్వముకూడదు.ఎప్పుడోయొకప్పుడుమోసపోవచ్చును.
80.భ్రష్టునకర్ధవంతులగుబాంధవులెందఱుకల్గినన్ నిజా
దృష్టములేదుగావునదరిద్రతబాపగలేరు;సత్కృపా
దృష్టినినిల్పిలోకులకతిస్థిరసంపదలచ్చులక్ష్మియా
జెష్టకదేటికింగలుగజేయదుతోడనెపుట్టిభాస్కరా!
       *జ్యేష్ఠాదేవికిచెల్లెలైపుట్టినలక్ష్మిప్రజలకందరికిదయతోశాశ్వతభాగ్యములనిచ్చుచుతనయక్కకేమియునివ్వదు.అట్లేపనికిమాలినవానికి భాగ్యవంతులగుచుట్టాలెందరున్ననువానికదృష్టములేనిచోవానిపేదరికాన్నిపోగొట్టలేరు.
81.మదిదనునాసబడ్డయెడమంచిగుణోన్నతుడెట్టిహీనునిన్
వదలడుమేలుపట్టుననవశ్యముమున్నుగనాదరించుగా
త్రిదశవిమానమధ్యమునదెచ్చికృపామతిసారమేయముల్
మొదలనిడండెధర్మజుడుమూగిసురావళిచూడభాస్కరా!
    *ధర్మరాజుతన్నువెంబడించివచ్చుచున్నకుక్కనుదేవతలాశ్చర్యపడునట్లుదేవతావిమానమునందుగూర్చుండబెట్టెను.అట్లేసుగుణవంతుడుతన్నాశ్రయించినవాడెంతహీనుడైననువానినివిడువకమంచిసమయమువచ్చినప్పుడుతప్పకుండముందాతనినిగౌరవించును.
82.మాటలకోర్వజాలడభిమానసమగ్రుడుప్రాణహానియౌ
చోటులనైనదానెదురుచూచుచునుండుగొలంకులోప
న్నీటమునింగినప్పుడతనీచములాడిన రాజరాజుపో
రాటమొనర్చినేలబడడాయెనెభీమునిచేతభాస్కరా!
        *కౌరవపాండవయుద్ధానంతరందుర్యోధనుడుశత్రుభయంతోసరస్సులోజలస్తంభనవిద్యచేదాగియుండిపాండవులాడెడిమాటలనుస
హించలేకయుద్ధముచేయుచుభీమునిచేజంపబడెను.అట్లేఅభిమానవంతుడుప్రాణములనైనవదులుకొనునుకానిహీనమాటలనుసహింపడు.
83.మానవనాధుడాత్మరిపుమర్మమెరింగినవానినేలినం
గానిజయింపలేడరులగార్ముకదక్షుడురామభద్రుడా
దానవనా యకుంగెలువదానెటులోపు దదీయనాభికా
స్థానసుధన్విభీషణుడుతార్కొనిచెప్పకయున్నభాస్కరా!
         *శ్రీరామునికివిభీషణుడురావణునిబొడ్డునందమృతమున్నదనిచెప్పనిచోరావణునిచంపగలడారాముడు.అట్లేరాజుశతృరహస్యమునుతెలిసినవానినిచేరదీయకున్నశతృవునుజయింపలేడు.
84.మానవుడాత్మకిష్టమగుమంచిప్రయోజనమాచరించుచో
గానకయల్పుడొక్కడదిగాదనిపల్కినవానిపల్కుకై
మానగజూడడాపనిసమంచితభోజనవేళనీగకా
లూనినవంటకంబుదినకుండగనేర్పగునోటుభాస్కరా!
        *మనుజుడుభోజనపదార్ధములపైనీగవ్రాలినంతమాత్రానభోజనపదార్ధమునుమానకభుజించును.అట్లేమానవుడుతనిిిష్టమైనపనిచేయుచున్నప్పుడునీచుడువద్దని చెప్పిననుయాపనినిమానరాదు.
85.మానినిచెప్పునట్లెఱుకమాలినవాడటుచేసినన్ మహా
హానిఘటించునేఘనునికైననసంశయముర్విపైగృపా
హీనతబల్కినన్ దశరథేశ్వరుడంగనమాటకైగుణాం
భోనిధిరాముబాసిచనిపోవడెశోకముతోడభాస్కరా!
          *దశరధుడుతనభార్యయగుకైకచెప్పినమాటకైచక్కగనాలోచింపకరామునియడవికంపియాతనివియోగంవల్లప్రాణములువిడిచెను.అట్లేతెలివిమాలినవాడుతనభార్యచెప్పినట్లునడచుకొన్నచోతప్పకయాపదలపాలగును.
86.మునుపొనరించుపాతకమమోఘముజీవులకెల్లబూనియా
వెనుక టిజన్మమందనుభవింపకదీరదు ,రాఘవుండువా
లినిబడవేసితామగుడలీలయదూద్భవుడైకిరాతుచే
వినిశితబాణపాతమున వీడ్కొనడేతనమేనుభాస్కరా!
       *రాముడువాలినిజంపుటవల్లకల్గినపాపఫలమునుకృష్ణావతారంలోనెఱుకలవానిబాణపుదెబ్బచే యనుభవించిశరీరమునువిడి
.చిపెట్టెను.అట్లేఎట్టివారికైననుపూర్వజన్మమునజేసినపాపమునుతర్వాతజన్మలోయనుభవించును.
87.రాకొమరుల్ రసజ్ఞునిదిరంబుగమన్నననుంచినట్లుభూ
లోకమునందుమూఢుదమలోపలనుంపరు;నిక్కమే కదా
చేకొనిముద్దుగాజదువుచిల్కనుబెంతురుగాకపెంతురే
గాకమునెవ్వరైనశుభకారణసన్మునిసేవ్యభాస్కరా!
         *మనుష్యులుముద్దుగాచదువుచిలుకనుపెంతురుకాకిని
పెంచరు.అట్లేభువిపైరాకుమారులురసికునిస్ధిరముగగౌరవంతోతమవద్దనుంచుకొందురుకానిమూఢునిజేరనీయరు.
88.లోకములోనదుర్జనులలోతులెఱుంగకచేయరాదుసు
శ్లోకుడుజేరినంగవయజూతురుచేయుదురెకసెక్కముల్
కోకిలగన్నచోటగుమిగూడియసహ్యపుగూతలార్చుచుం
గాకులుతన్నవేదఱిమికాయముతల్లడమందభాస్కరా!
           *లోకంలోమంచివాడుదదురర్జనులయభిప్రాయముతెలిసి
కొనకుండదగ్గఱకుచేరరాదు.ఒకవేళ చేరినచోదుర్జనులచేతప్పక
యెగతాళిపాలగుదురు.
89.లోనుదృఢంబుగానిపెనులోభినినమ్మియసాధ్యకార్యముల్
గానకపూనునేనతడుగ్రక్కునగూలునునోటిపుట్టిపై
మానవుడెక్కిపోవనొకమాటుబుటుక్కునముంపకుండునే
తానొకలోతునంగెడసిదానదరింపగలేకభాస్కరా!
           *పాతపడవమీదమానవుడెక్కిమిగులలోతుగలప్రవాహమునుదాట
ప్రయత్నించెనేనిఆప్రవాహమునపడవదాటలేకఒక్కసారిబుటుక్కునముంచివేయును.అట్లేమానవుడుదృభచిత్తములేనిలోభినినమ్మియేదేనికార్యముచేయబూనినయాలోభివానినినశింపజేయును.
90.వంచనయింతలేకయెటువంటిమహాత్ములనాశ్రయించినం
గొంచెమెకానిమేలుసమగూడదదృష్టములేనివారికిన్
సంచితబుద్ధిబ్రహ్మననిశంబునువీపునమోచునట్టిరా
యంచకుదమ్మితూండ్లుదిననాయెగదాఫలమేమిభాస్కరా!
         *సృష్టికర్తయగు బ్రహ్మదేవుని తన వీపుపైనెల్లప్పుడును
మోయుచున్నిరాజహంసతామరకాడలనేయాహారమయ్యెను.
అట్లేకపటములేకుండయెంతగొప్పవానినిసేవించినను యదృష్టములేనివానికి సామాన్యలాభమే కల్గును.
91.వట్టుచుదండ్రియత్యధమవర్తనుడైననుగానివానికిం
బుట్టినపుత్త్రకుండుతనపుణ్యవశంబునదొడ్డధన్యుడౌ
నెట్టనమఱ్ఱివిత్తుమునుపెంతయుగొంచెముదానబుట్టునా
చెట్టుమహోన్నతత్వమునుజెందదెశాఖలనిండిభాస్కరా!
       *మఱ్ఱివిత్తనముచిన్నదైననుదానినుండిపుట్టినచెట్టుకొమ్మలతోపొడవుగాపెరుగును.అట్లేతండ్రియెండిపోవుచుమిగులనీచుడైనను
వానికుమారుడుగొప్పవాడుకావచ్చును.
92.వలనుగగానలందుబ్రతివర్షమునంబులినాలుగైదుపి
ల్లలగనుదూడనొక్కటినిలంగనుధేనువురెండుమూడునే
డులకటులైనబెబ్బులికుటుంబములల్పములాయెనాలమం
దలుగడువృద్ధిజెందవెయధర్మముధర్మముదెల్పభాస్కరా!
        *అన్యాయముగావర్తించుపులులుప్రతిసంవత్సరమునాలుగైదుపిల్లలనుయీనుచున్ననువాటివంశమభివృద్ధిలోలేదు.ధర్మవర్తనముగలగోవులురెండుమూడేండ్లకొకమారీనుచున్ననువానివంశమభివృద్ధిలోనుండను.అట్లేయధర్మవర్తనునివంశమునశించును.ధర్మవర్తనునివంశమువృద్ధిజెందును.
93.వలవదుక్రూరసంగతియవశ్యమొకప్పుడుసేయబడ్డచో
గొలదియెగాకయెక్కువలుగూడవు ,తమ్ములపాకులోపలం
గలసినసున్నమించుకయగాకమఱించుకయెక్కువైనచో
నలుగడజుఱ్ఱుజుఱ్ఱుమనినాలుకపొక్కకయున్నెభాస్కరా!
        *తమలపాకులోసున్నముకొంచెముండిననేగానియెక్కువైననాలుకపొక్కును.అట్లేచెడ్డవారితోయెక్కువస్నేహముచేయరాదు.ఒకవేళచేయవలసినచోకొంచెముచేయవలెనుగానియెక్కువజేసినయపాయముగల్గును.
94.వానికివిద్యచేతసిరివచ్చెనటంచునువిద్యనేర్పగా
బూనినబూనుగాకతనపుణ్యముచాలకభాగ్యరేఖకుం
బూనగనెవ్వడోపు;సరిబోచెవిపెంచునుగాకదృష్టతా
హీనుడుకర్ణభూషణములెట్లుగడింపగనోపు?భాస్కరా!
      *అదృష్టములేనిమానవుడుచెవికన్నమునుపెంచిననుపెంచవచ్చుగానికర్ణకుండలములనుసంపాదింపలేడు.అట్లేవిద్యచేవానికిసంపదవచ్చినదనివిద్యనేర్చిననునేర్చునుగానిపూర్వపుణ్యసుకృతములేకుడభాగ్యమునుతెచ్చు కొనజాలడు.
95.సంతతపుణ్యశాలినొకజాడనుసంపదవాసిపోయి
నంతటబోకనెట్టుకొనియప్పటియట్లువసించియుండుమా
సాంతమునందుజందురునినన్నికళలఽపెడబాసిబోయినం
గాంతివహింపడోటు?తిరుంగబడిదేహమునిండభాస్కరా!
        *చంద్రకళలన్నియునమావాస్యనాటికివిడిపోయినను తాను
బ్రతిదినమునుదేవతలకుదనకళలనిచ్చెడిపుణ్యమువలనతిరిగిక్రమముగకళలనుతనబింబమునుండిపూర్ణముగాదాల్చును.అట్లేఎల్లప్పుడుపుణ్యములొనర్చువానినొకవిధముగాసంపదవిడిచిపోయిననుఅతడొనరించినపుణ్యముచేదిరిగియాసంపదనొందగలడు.

భాస్కర శతకం. 4.

pratilipi                           
                                    భాస్కర శతకం4
48.తనకుఫలంబులేదనియెదందలపోయడుకీర్తిగోరునా
ఘనగుణశాలిలోకహితకార్యము మిక్కిలి భారమైన మే
లనుకొనిపూను శేషుడుసహస్ర ముఖంబులగాలిగ్రోలితా
ననిశముమోపడేమఱిమహాభరమైనధరిత్రి భాస్కరా!
       *ఆదిశేషుడుతనవేయినోళ్ళతోగాలినేపీల్చుకొనుచుతనకేమియు లాభములేకున్నను,మిక్కిలిబరువుగలభూమినిమోయుచున్నాడు.అట్లేకీర్తిగోరువాడుతనకలాభములేదనిమదినాలోచింపక లోకానికిమేలగుపని యెంతకష్టమైనదైననుమంచిదేయనుకొని
పూనిచేయును.
49.తనకునదృష్టరేఖవిశదంబుగ గల్గినగాని లేనిచో
జనునకునెయ్యడన్ బరులసంపదవల్లఫలంబులేదుగా
కనుగవలెస్సగాదెలివిగల్గినవారికిగాక గ్రుడ్డికిన్
కనుబడునెట్లువెన్నెలలుగాయగనందొకరూపు భాస్కరా!
       *వెన్నెలలుప్రకాశించుచున్నప్పుడుచూపుగలరెండుకళ్ళున్నవానికేలాభము.కానిగుడ్డివానికి లాభములేదు గదా!అట్లనేతనకుసంపద (భాగ్యము)యున్నలాభముగల్గును.భాగ్యంలేనిచోయితరులసంపద తనకబ్బదుకనుకలాభములేదు.
50.తాలిమితోడుతందగవుతప్పకనేర్పరి‌ ,యొప్పుదప్పులం ,
బాలనసేయుగాకటనుపాయవిహీనుడుసేయనేర్చునే?
పాలును నీరు వేఱుపరుపంగ మరళమెరుంగుగాకమా
ర్జాలమెరుంగునేతదురుచారురసజ్ఞతబూనభాస్కరా!
***పాలు,నీరునువిడదీయుశక్తిహంసకుకలదుగానిపిల్లికిలేదు.అట్లనేఓర్పుతోతగవుయొక్కమంచిచెడులనునేర్పుగలవాడుకనిపెట్టినిర్ణయించునుగానితెలివితక్కువవాడుకనిపెట్టి నిర్ణయించలేడు.
51.తాలిమితోడ గూరిమిగృతఘ్నునకెయ్యెడనుత్తమోత్తము
ల్మేలొనరించినన్ గుణముమిక్కిలికీడగుబాముపిల్లకున్
బాలిడి పెంచినన్విషముపాయగనేర్చునె దానికోఱలం
జాలగనంతకంతకొకచాయనుహెచ్చునుగాక భాస్కరా!
     . **పాముపిల్లకుపాలుపోసిపెంచిననుదానికోఱలందుక్రమక్రముగవిషముపెరుగునుగానితఱిగిపోదు.అట్లనేమంచివారుశాంతముతోప్రేమచేతనుకృతఘ్నునకుమేలుచేసినచోవీరిమేలునకుప్రతిఫలముకీడుగల్గును.
52.తెలియనికార్యమెల్లగడతేర్చుటకొక్కవివేకిజేకొనన్
వలయునటైనదిద్దుకొనవచ్చుబ్రయోజనమాంద్యమేమి
యుంగలుగదుఫాలమందుదిలకంబిడునప్పుడుచేతనద్దమున్
గలిగినజక్కజేసికొనుగాదెనరుండదిచూచిభాస్కరా!
           **మానవుడునుదుటియందుబొట్టునుపెట్టుకొనునపప్పుడుచేతియందద్దమున్నచోనాయద్దమునుజూచిబాగుగాబొట్టుదిద్దుకొ
నును.అట్లేతనకుతెలియనిపనినెరవేర్చుకొనుటకొక నేర్పరినిజేరదీసినచోయాపనినితప్పులులేకుండ ,యాలస్య్య్యముకాకుండానిర్వహించుకొనవచ్చును.
53.దక్షుడు లేనియింటికిబదార్ధమువేఱొకచోటనుండివే
లక్షలు వచ్చుచుండినబలాయనమైచనుగల్లగాదు ,ప్ర
త్యక్షమువాగులున్ వఱదలన్నియువచ్చిననీరునిల్చునే
యక్ష యమైనగండితెగినట్టితటాకములోనభాస్కరా!
         **స్థిరమైన గండిపడినచెఱువులోనికెన్ని కొండకాలువలు‌ ,
జలప్రవాహములువచ్చిననునీరునిలువకపోవును.అట్లేకుటుంబబాథ్యతగలయజమానిలేనియింటిలోనికిద్రవ్యములక్షలకొద్దీవచ్చిననుయెప్పటికప్పుడేపోవుచుండును.
54.దానపరోపకారగుణధన్యత చిత్తములోననెప్పుడున్
లేనివివేకశూన్యునకు లేములు వచ్చినవేళ ,సంపదల్
పూనినవేళ ,నొక్కసరిపోలును ,జీకునకర్థరాత్రియం
దైననదేమి పట్టపగలైన నదేమియు లేదు భాస్కరా!
        *గ్రుడ్డివానికిరాత్రైనా,పగలైనాఒకటే.అట్లనేదానపరోపకారములులేని మూఢునకు పేదరికమువచ్చినా,భాగ్యము వచ్చినా యొకటేగాని భేదముండదు.
55.దానముసేయగోరిన వదాన్యునకీయగ శక్తిలేనిచో
నైనబరోపకారమునయొకదిక్కున దెచ్చియైన నీ
బూనునుమేఘుడంబుధికిబోయి జలంబులదెచ్చియీయడే
వానసమస్తజీవులకు వాంఛితమింపెసలారభాస్కరా!
        *మబ్బుతనవద్దజలములేనప్పుడుసముద్రమువద్దకుబోయిజలమునుదెచ్చిఅన్నిజీవులకుతృప్తికల్గునట్లువర్షించును.అటులనేధర్మముచేయుదాతకుతనదగ్గఱదానముచేయుటకుశక్తిలేనిచోపరోపకారమునకైయింకొకచోటునుండితెచ్చియిచ్చుచుండును.
56.దానముచేయనేరనియధార్మికుసంపదయుండియుండియున్
దానెపలాయనంబగుటతథ్యము ,బూరుగుమ్రానుగాచినన్
దానిఫలంబులూరకవృథాపడిపోవవెయెండిగాలిచే
గానలలోననేమిటికిగాకయభోజ్యములౌటభాస్కరా
                                                                         
*బూరుగుచెట్టుకాయలుంండిిననునవితినుటకుపనికిరాకయెండిగాలిచేవృథాగాయడవులలోపడును.అట్లేదానముచేయనివానిభాగ్యముయన్నట్లుండియొరులకెవ్వరికుపయోగపడకతనంతదానె
మాయమగును.
57..నడవకచిక్కిలేమియగునాడు నిజోదరపోషణార్థమై
యడగిభుజించుటల్ నరులకారయవ్యంగ్యముకాదుపాండవుల్
గడుబలశాలులేవురునఖండవిభూతిదొలగిభైక్షముల్
గుడువరెయేకచక్రపురిగుంతియుదారొకచోటభాస్కరా!
         **పాండవులుసమస్తసంపదలనువిడిచితమతల్లికుంతితోకలసిఏకచక్రపురమునభిక్షమెత్తుకొనిజీవించిరి.కావునమానవుడుతనకుటుంబపోషణకైపరులనుయాచించితినిబ్రదుకుటతప్పుకాదు.
58.నుడువులనేర్పుచాలనిమనుష్యుడెరుంగకతప్పనాడినం
గడుగృపతోజెలంగుదురుగానియదల్పరుతజ్ఞులెల్ల
దప్పడుగులువెట్టుచున్నడుచునప్పుడుబాలునిముద్దుసేయగా
దొడగుదురింతెకానిపడద్రోయుదురేయెవరైనభాస్కరా!
        **ఎట్టికఠినహృదయులగుమానవులైనను ,పిల్లవాడు
తప్పటడుగులుపెట్టినడచునప్పుడువానినిముద్దుచేయుదురుగాని
క్రిందకుబడద్రోయరు.అట్లే పండితులుమాటలయందు నేర్పులేనివాడుతప్పుమాటలలెఱుగకపలికినచోదయతోసంతసింతురుగానికోపముతోకసరరు.
59.నేరిచిబుద్థిమంతుడతినీతివివేకముదెల్పినంజెడం
గారణమున్నవానికదికైకొనకూడదునిక్కమేదురా
చారుడురావణాసురుడసహ్యమునొందడెచేటుకాలముం
జేరువయైననాడునిరసించివిభీషణుబుద్ధి భాస్కరా!
         *చెడునడతగలరావణుడుతనకుచేటుకాలముసమీపించుటచే
దమ్ముడగువిభీషణునిమాటలనుతిరస్కరించివంశనాశముపొందెను.అట్లేమనుజుడుతనకుచెడిపోవకారణమున్నప్పుడు తెలివి
గలవాడుతెలిసికొనిన నీతిమార్గమునుచెప్పినచో ఆ నీతిమార్గమునవలంబించుటకిష్టపడడు.
60.నొగిలినవేళనెంతటిఘనుండునుదన్నొకరొక్కనేర్పుతో
నగుపడిప్రోదిసేయకతనంతటబల్మికిరాడునిక్కమే
జగముననగ్నియైనగడుసన్నగిలంబడియున్ననింధనం
బెగయగద్రోచియూదక మఱెట్లురవుల్కొననేర్చుభాస్కరా!
      **కాల్చువాడగు అగ్ని యైననుక్షీణించియున్నప్పుడు ,పుల్లలనుయెగసనద్రోచియూదకపోయినమరలరాజిమండదు.అట్లేగొప్పవానికి పేదఱికము వచ్చినప్పుడింకొకరుపాయముచేతన్ను పోషింపకపోయినచోతనంతటతాను తిరిగిబలమునుజెందలేడు.
61.పండితులైనవారుదిగువందగనుండగనల్పుడొక్కడు
ద్దండతబీఠమెక్కినబుధప్రకరంబునకేమియెగ్గగున్?
గగొంండొకకోతిచెట్టుకొనకొమ్మలనుండగగ్రిందగండభే
రుండమదేభసింహనికురుంబములుండవె?చేరిభాస్కరా!
 **చెట్టుక్రిందగండభేరుండాదిసమూహముండగనాచెట్టుకొమ్మలచివరయందొకకోతియున్నను నామృగములకేమియు లోపములేదు.అట్లేపండితులుక్రిందకూర్చున్నప్పుడొకనీచుడుపీఠముపైకూర్చున్నను పండితులకేమియుకొఱతకలుగదు.
62.పట్టగనిక్కుచున్ మదముబట్టి మహాత్ములదూలనాడినం
బట్టిన కార్యముల్ చెడునుబ్రాణముపోవునిరర్ధదోషముల్
పుట్టు ,మహేశుగాదనికుబుద్థినొనర్చినయజ్ఞతంత్రముల్
ముట్టకపోయిదక్షునకిమోసమువచ్చెగదయ్యభాస్కరా!
          *ఈశ్వరునితిరస్కరించిదక్షుడుచెడుబుద్ధిచేయొనర్చినయూగమునెఱవేఱకపోవుటయేగాక యతనిప్రాణములుగూడపోయెను.అట్లే
దుష్టుడుమంచివారిని ధిక్కరించితానొకపనిచేయబూనినచోనాపనిపాడగుటయేగాకప్రాణహానికల్గును.
63.పరహితమైనకార్యమతిభారముతోడిదియైనబూనుస
త్పురషులులోకముల్పొగడబూర్వమునందొకఱాలవర్ష
మున్ గురియగజొచ్చినన్ గదిసి గొబ్బున గోజనరక్షణార్థ
మైగిరినొకకేలనెత్తెనటకృష్ణుడుఛత్రముభాతిభాస్కరా!
         **ఇంద్రుడుకోపముచేకృష్ణునిపైరాళ్ళవర్షమును గురిపించుచుండగానాతడుగోజనరక్షణకైగోవర్ధనగిరిని యొకవేలితోనెత్తెను.అట్లేమంచివాడెంతకష్టకార్యమునైననుపరోపకారముకొఱకులోకములుమెచ్చునట్లుచేయును.

Friday, 16 November 2018

భాస్కర శతకము5

               భాస్కర శతకము5
64.పలుచనిహీనమానవుడుపాటిదలంపకనిష్ఠురోక్తులం
బలుకుచునుండుగానిమతిభాసురుడైనగుణప్రపూర్ణుడ
ప్పలుకులబల్కనోపడుసుబుద్ధిగ;నెట్లనవెల్తికుండదా
దొలకుచునుండుగానిమఱితొల్కునెనిండుఘటంబుభాస్కరా!
        *వెల్తికుండతొనకునుగానినీరునిండుగాగలకుండతొనకదు.అట్లేనీచుడు న్యాయమునెంచకపరుషపల్కులుపలుకునుగానిగుణవంతుడు
కఠినముగిపలుకడు.
65.పలుమఱుసజ్జనుండుప్రియభాషలెపల్కుగఠోరవాక్యముల్
పలుకడొకానొకప్పుడవిపల్కిన గీడునుగాదు ,నిక్కమే
చలువకువచ్చిమేఘుడొకజాడనుదావడగండ్లరాల్చినన్
శిలలగునోటు వేగిరమె శీతలనీరముగాక భాస్కరా!
        *మేఘుడునీటిబిందువులనేవర్షించును.ఒకానొక ప్పుడు చ
లువకొఱకువడగండ్లనుగురిసిననవినీరుగామారునుగానిరాళ్ళలాయుండవు.మంచివాడు మంచిమాటలనేపల్కును.ఒకానొకప్పుడు
కఠినపల్కులుపలికిననుమేలగునుగానికీడుకల్గదు.
66.పాపపు ద్రోవవానికొకపట్టునమేనువికాశమొందినన్
లోపలదుర్గుణంబెప్రబలుంగదనమ్మగగూడదాతనిన్
బాపటకాయకున్మనువుపైగల్గినగల్గుగాకయే
రూపున దానిలో గల విరుద్ధపుజేదునశించుభాస్కరా!
         *పాపిడికాయమీదిభాగమునునుపుగానుండిననుదానిలో
నున్నవికటమగుచేదుపోదు.అట్లే దుర్మార్గనకుసుందరముకల్గినను
మనసులోనిచెడుగుణముఎక్కువగునుకానిపోదు.కాన వానినినమ్మరాదు.
67.పూనినభాగ్యరేఖచెడిపోయినపిమ్మటనెట్టిమానవుం
డైననువానినెవ్వరుబ్రియంబునబల్కరుబిల్వరెచ్చటందా
నిదియెట్లొకోయనినదథ్యముపుష్పమువాడివాసనాహీ
నతనొందియున్నయెడనెవ్వరుముట్టుదురయ్యభాస్కరా!
  *పూవుయెండివాసనలేకపోయినచోదానినెవ్వరునుకొనరు.అట్లేమనుజుడెంతగొప్పవాడైనవానియదృష్టముతొలగినవానితోనెవ్వరునుమాట్లాడరు.పిల్వరు.
68.పూరితసద్గుణంబుగనిపుణ్యునకించుకరూపసంపదల్
దూరములైనవానియెడదొడ్డగజూతురుబుద్థిమంతులె
ట్లారయగొగ్గులైనమఱియందులమాథురిజూచికాదెఖ
ర్జూరఫలంబులంబ్రియముచొప్పడలోకులుగొంటభాస్కరా!
       *ఖర్జూరపుపండ్లుపైకిగొగ్గిగొగ్గిగానున్నను,దానియందలిమాథుర్యమునుజూచిప్రజలప్రియముతోగొందురు.అట్లేసద్గుణములుగలవానికిఅందములేకున్ననుబుద్థిమంతులువానినిగౌరవింతురు.
69.ప్రల్లదనంబుచేనెఱుకపాటొకయింతయులేకయెచ్చటన్
బల్లిదుడైనసత్ప్రభునబద్ధములాడినగ్రుంగిపోదు ,రె
ట్లల్లసభాస్థింింింగుమతులైశిశుపాలుడుదంతవక్త్రుడున్
గల్లలుగృష్ణునింబలికికాదెహతంబగుటెల్ల భాస్కరా!
      *ధర్మరాజు చేయు రాజసూయ యాగంబునందలి సభలో
శిశుపాలదంతవక్త్రులుచెడుబుద్థిగలవారైశ్రీకృష్ణునినిందించియతనిచేచంపబడిరి.అట్లేఎక్కడైనజ్ఞానములేనివాడుబలవంతుడగురాజునుతూలనాడిననశించుదురు.
70.ప్రేమనుగూర్చియల్పునకుబెద్దతనంబుదొడ్డవానికిం
దామతితుఛ్ఛపుంబనినెదంబరికింపగయీయరాదుగా
వామకరంబుతోడ గుడువంగుడిచేతనపానమార్గముం
దోమగవచ్చునేమిగులదోచనిచేతులుగాకభాస్కరా!
       *మానవునకుఎడమచేతితోదినుటయుగుడిచేతితోమలమువిడుచుచోటకడుగుటయుయెట్లాలోచనలేనిపనులోఅట్లేప్రభువులుప్రేమచేనీచునకుగొప్పయుద్యోగము,గొప్పవానికినీచపుపనియిచ్చుటయాలోచనలేనిపాలనయగును.
71.ఫలమతిసూక్ష్మమైననునృపాలుడుమంచిగుణాడఢ్యుడైనచో
నెలమివివేకులాతనికపేక్షయొనర్తు;రదెట్లుచంద్రికా
విలసనమైనదాననుభవింపజకోరములాసజేరవే
చలువగలట్టివాడగుటజందురునెంతయుగోరిభాస్కరా!
     *చకోలములుచంద్రునివల్లదమకుగాంతిమాత్రమేతప్పవిశేషలాభములేకపోయిననుచల్లనివాడగుటచేనాచంద్రోదయమునుగోరుచుండును.అట్లేబుద్థఅట్లేబుద్థిమంతులుమంచిరాజునేకోరుకొందురులాభములేకపోయినాసరే.
72.బంధురసద్గుణాఢ్యుడొకపట్టునలంపటనొందియైనదు
స్సంధిదలంపడన్యులకుజాలహితంబొనరించుగాకశ్రీ
గంధపుజెక్కరాగిలుచుగాదెశరీరులకుత్సవార్థమై
గంధములాత్మబుట్టదఱుగంబడియుండుటలెరికిల్లభాలోబడికృష్రా!
             *మంచిగంధపుచెక్కతఱుగబడియునుతనయందుపరిమళములుప్రకాశింపగజనులకువేడుకల్గించును.అట్లేసద్గుణవంతుడొకవేళకష్టపడియైననుపరులకుకీడుకలుగజేయకమిగులమేలుచేయును.
73.బలముదొలంగుకాలమునబ్రాభవసంపదలెంతధన్యుడున్
నిలుపుకొనంగనోపడదినిశ్చయమరర్జునుడీశ్వరాదులం
గెలిచినవాడుబోయలకుగీట్పడిచూచుచుగృష్ణభార్యలం
బలువురనీయడేనిలువబట్టసమర్థుడుగాకభాస్కరా!
      *శివుడమొదలగువారినిగెల్చినఅర్జునుడుశ్రీకృష్ణనిర్యాణానంతరంబోయవారికిలోబడికృష్ణునిభార్యలనుకాపాడలేకచాలమందినిబోయలకిచ్చెను.అట్లేదైవబలంపోయినతరువాతఎంతగొప్పవాడైనప్రాభవసంపదలను నిలుపుకోలేడు.
74.బలయుతుడైనవేళ నిజబంధుడుతోడ్పడుగానియాతడే
బలముతొలగెనేనిపాలిటిశత్రు;వదెట్లుపూర్ణుడై ,జ్వ
లనుడుకానగాల్చుతఱి సఖ్యముజూపునువాయుదేవుడా
బలియుడుసూక్ష్మదీపమగుపట్టుననార్పడెగాలి భాస్కరా!
      *అగ్నినిండుబలముగలవాడైయడవినిగాల్చుసమయానగాలిదేవుడుస్నేహముతోసాయపడును.ఆయగ్నిచిన్నదీపమైయున్నప్పుడుయాగాలియేదీపమునార్పును.అట్లేమనుజుడుబలముతోనున్నప్పుడుచుట్టముసాయపడును.బలములేనిచోచుట్టమేతనకుకీడుచేయును.
75.బల్లిదుడైనసత్ప్రభువుపాయకయుండినగానిరచ్చలో
జిల్లరవారునూరుగురుసేరినదేజముగల్గదయ్యెడిన్
జల్లనిచందురుండెడసిసన్నపుజుక్కలుకోటియున్నరం
జిల్లునెవెన్నెలల్ జగముచీకటులన్నియుబాయభాస్కరా!
      *చంద్రుడులేకుండాచిన్ననక్షత్రములుకోటియున్ననుచీకట్లుపోవునట్లుప్రకాశింపవు.అట్లేబలవంతుడగుమంచిరాజుయుండిననేగానిచిల్లరవారునూఱుమందియున్ననుకాంతికలుగదు.
76.భుజబలశౌర్యవంతులగుపుత్త్రులగాంచినవారికెయ్యెడన్
నిజహృదయేప్సితార్థములునిక్కముచేకుఱుగుంతిదేవికిన్
విజయబలాఢ్యుడర్జునుడువీరపరాక్రమమొప్పదేవతా
గజమునుదెచ్చిత్లి్లివ్రతకార్యముదీర్పడెతొల్లిభాస్కరా!
       *కుంతీదేవికిబలవంతుడగు అర్జునుడుండుటచేతొల్లి ఐరావతమునుదెచ్చితల్లివ్రతమునునెఱవేర్చినాడు.అట్లేబాహుబలపరాక్రమములుగల పుత్త్రులనుకనినవారికియెక్కడైనామనస్సులోని
కోరికలు నెఱవేరును.
77.భూనుతులైనదేవతలుపూర్వముకొందఱువావివర్తనల్
మానిచరింపరోయనుచుమానవులట్ల చరింపబోలదం
భోనిధులన్నియుందనదుపుక్కిటబట్టెనగస్త్యుడంచునా
పూనికకెవ్వడోపుననిపూర్వమహత్త్వముసుమ్ముభాస్కరా!
           *పూర్వమహత్త్వముననగస్త్యుడుసముద్రములనినీటినంతటిని
తనపుక్కిటబట్టెను.మానవులెవ్వరునుచేయలేరు.అట్లేపూర్వముదేవతలుచెడుమార్గమునసంచరించిరనివినివారివలెమానవులు
చేయకూడదాపనులను.

Tuesday, 31 July 2018

భాస్కర శతకం

                                 భాస్కర శతకం 

1.శ్రీ గల భాగ్య శాలి గడు 

               జేరగ వత్తురు తారు దారెదూ 

రాగమన ప్రయాసమున 

                   కాదట నోర్చియు నైన నిల్వ ను 

ద్యోగము చేసి రత్ననిల 

                     యుండని కాదె సమస్త వాహినుల్ 

సాగరు జేరు టెల్ల ముని 

                     సన్నుత మద్గుణమూర్తి  భాస్కరా!

ఓ భాస్కరా!నదులన్నియు  రత్నాకరుడను నాశతో సముద్రుని జేరు విధాన కల్గిన కష్టాలను సహించి ,నివసించుటకు యత్నించి తమంత తామేప్రేమతో భగవంతుని వద్దకు చేరుదురు.


2.ఉ||అంగన నమ్మరాదు తనయంకెకు రానిమహాబలాఢ్యు వే 

భంగుల మాయలొడ్డి చెఱుపం దలపట్టు వివేకి యైన సా 

రంగధరుo బదంబులు గరంబులు గోయగ జేసె దొల్లి చి 

త్రాంగి యనేకముల్  నుడువరాణికుయుక్తులుపన్ని భాస్కరా!   

పూర్వము చిత్రాంగి బుద్దిమంతుడగు సారంగధరునిపై చెప్పుటకు వీలుగాని చెడు పన్నాగములను పన్ని ,యాతని కాళ్ళు,చేతులు నరికించిన విధముగస్త్రీలు తమకు స్వాధీనము కాని బలవంతుని గూడ ననేక మాయలు పన్ని పాడుచేయుటకు  నాలోచింతురు.కావున స్త్రీ లను  నమ్మకూడదు.


3.అక్కరపాటు వచ్చు సమయంబున జుట్టములొక్కరొక్కరి 

న్మక్కుననుద్ధరించుటలు మైత్రికి జూడగ యుక్తమేసుమీ 

యొక్కట నీటిలో  మెరక నోడల బండ్లను బండ్లనోడలున్ 

దక్క క వచ్చుచుండుట నిదానము గాదె తలప భాస్కరా!


ఒకానొక సమయాన నీటిలో బడవలమీద బండ్లను,మెరక భూమి యందు బండ్లమీద పడవలును ,వచ్చుచుండుట ప్తత్యక్షము.అట్లే తగిన యవసరము వచ్చు కాలమున 

బంధువులొకరినొకరు కాపాడు కొనుట స్నేహమునకు మంచిది. 

4.అడిగినయట్టి యాచకుల యాశలెరుంగక లోభవర్తియై 

కడిపిన ధర్మదేవత యొకానొకయప్పుడు నీదు వానికె 

య్యెడలనదెట్లు పాలుతమకిచ్చునె యెచ్చట నైనలేగలన్ 

  గుడువగ నీనిచో గెరలి గోవులు తన్నును గాక భాస్కరా!


మనుజుడు దూడలను త్రాగనీయకుండా పాలు పిండుకొన దలచినచో ,ఆవులు కోపించి తన్నుచు పాలీయవు.అట్లే మానవుడు లోభియై యడిగినయాచకుల కోరికల దీర్పక పొమ్మని పంపినచో ,వానికెచ్చటను ధర్మ దేవత సంపదనీయదు. 

5.అతిగుణహీన లోభికి బదార్ధము గల్గిన లేకయుండినన్ 

మితముగ గాని కల్మిగల మీదట నైన భుజింపడింపుగా

సతమనినమ్ముదేహమునుసంపదనేఱులునిండిపాఱినన్

గతుకగ జూచు గుక్క తనకట్టడ మీఱక యెoదు  భాస్కరా!

   ఏఱులు జలములతో నింపి ప్రవహిన్చుచున్నను,కుక్క తన యలవాటు తప్పక నాలుకతోనే త్రాగునుకాని ;బాగుగా త్రాగదు .అట్లనే లోభి గూడ తనకు సంపద యున్నను ,లేకున్నను మితముగానే తినును.శరీరము సంపద శాశ్వతమనుకొని సంపద యున్నప్పుడై నను బాగుగా భుజింపడు.  

6.అదను దలంచికూర్చినప్రజనాదరమొప్పవిభుండుకోరినన్
గదిసిపదార్థమిత్తురటకానకవేగమేకొట్టితెండనన్
మొదటికిమోసమౌబొదుగుమూలముగోసినబాలుగల్గునే
పిదికినగాకభూమిబశుబృందమునెవ్వరికైనభాస్కరా!
      **ఆవులను మచ్చికతోబిదికినపాలువచ్చునుగాని
పొదుగునుకోసినపాలురావుగానిమొదటికిమోసమగును.అట్లే
రాజు సమయముజూచిప్రజలనుగౌరవించి యడిగిన ధనమిత్తురు.
కానివేగమేబాథించితెమ్మన్నచోయివ్వకవిడిచిపోవుదురు.

7.అనఘునికైనజేకుఱుననర్హునిగూడిచరించినంతలో
మనమెరియంగనప్పుడవమానముకీడుధరిత్రియందునే
యనువుననైనదప్పవుయథార్ధము!తానదియెట్టులన్నచో
నినుమునుగూర్చియగ్నినలయింపదెసమ్మెటపెట్టుభాస్కరా!
      * *ఇనుముతోచేరుటవలననిప్పునకుసుత్తిదెబ్బలబాధకల్గునట్లు
చెడ్డవానితోస్నేహముచేసిన మంచివారికైన మనస్సుమండునట్లు
అవమానము ,కీడును తప్పక కల్గును.
8.అలఘుగుణప్రసిద్థుడగునట్టి ఘనుండొకడిష్టుడైతనున్
వలచియొకించుకేమిడినవానికిమిక్కిలిమేలుచేయగా
తెలిసికుచేలుడొక్కకొణిదెండటుకుల్ దనకిచ్చినన్ మహి
ఫలదుడు కృష్ణుడత్యధికభాగ్యములాతనికీడెభాస్కరా!
           **శ్రీ కృష్ణునకు కుచేలుడు భక్తితో జేరెడటుకులీయగాఆ కు
చేలునకుగొప్పసంపదలిచ్చెను.అట్లేప్రఖ్యాతిగలగుణవంతుడుతనకుస్నేహితుడైనవాడుతనమీదిప్రేమచేతనకేమిచ్చిననువానికధికఫలమునేయిచ్చును.
9.అవనివిభుండు నేరుపరియైచరించినగొల్చువారలె
ట్లవగుణులైైైననేమిబనులన్నియుజేకుఱువారిచేతనే
ప్రవిమలనీతిశాలియగురామునికార్యము మర్కటంబులే
తవిలియొనర్పవే?జలధిదాటిసురారులద్రుంచి భాస్కరా!
         *శ్రీ రామునికార్యమునుకోతులేపూనుకొనిసముద్రమునుదాటి
రాక్షసులనుచంపిరి.అట్లేరాజునేర్పరియైనచోసేవకులల్పులైననుపనులునెఱవేరును.
10.ఆదరమింతలేక నరుడాత్మబలోన్నతి మంచివారికిన్
భేదము చేయుటం దనదుపేర్మికిగీడగుమూలమెట్లమ
ర్యాదహిరణ్యకశిపన్ దనుజుండుగుణాఢ్యుడైప్ర
హ్లాదునకెగ్గుచేవిప్రళయంబునుబొందడెమున్నుభాస్కరా!
         -*పూర్వముచెడువృత్తిచే హిరణ్యకశిపుడు గుణవంతుడు
ప్రహ్లాదునకపకారముచేసినశించెను.అట్లేమనుజుడుతనగొప్పబలముచే ప్రేమనుచూపక మంచివానినిబాధించిన తప్పకనశించును.
11.,ఆరయనెంతనేరుపరియైచరియించినవానిదాపునన్
గౌరవమొప్పగూర్చునుపకారిమనుష్యుడులేక
కూఱదెట్లు?హత్తుగడగూడునెచూడబదాఱువన్నెబం
గారములోననైన వెలిగారముగూడకయున్నభాస్కరా!
    .    *మేలిమిబంగారములోనైననువెలిగారముకలియకున్నచో
అతుకు అంటుకొనదు.అట్లేమానవుడెంతనేర్పరియైననువానిదగ్గఱ
ఉపకారము చేయువాడు లేనిచో మంచి కలుగదు.

12.ఈక్షితినర్ధకాంక్షమదినెప్పుడపాయకలోకులెల్లసం
రక్షకుడైనసతత్ప్రభునిరాకలగోరుదురెందుజంద్రికా
పేక్షజెలంగి చంద్రుడదయించువిధధంబునకైచకోరపుం
బక్షులుచూడవేయెదురపారముదంబునుబూనిభాస్కరా!
       **చకోరపక్షులువెన్నెలయందలియాసక్తిచే మిగులసంతసముతోచంద్రునికైయెదురు చూచుచుండునట్లేమనుజులుధనాశచేతమ్ముకాపాడునట్టిరాజు
రాకకైయెదురుచూచుచుందురు.
















Saturday, 28 July 2018

తులసీ శతకము-4

                                       --4--

86.కస్తురి చూడ్కికి మోదము 

విస్తరముగ గూర్ప దిచ్చు విరివిగ దావుల్ 

వాస్తవపు గార్య శూరుని 

మోస్తరిదే చేసి కీర్తి పొందును దులసీ!

87.బిరుదు గల ఘనుని గని పెర 

నరులెంతయు నోర్వలేక నవ్విన లోటా?

కరినిన్  గనుగొని కుక్కలు  

మొఱిగినచో దాని పరువు పోవునె?తులసీ!

88 . బెదురింత లేక సుజనుల 

నదరించుచు ధనము దోచునధికారి కెటున్ 

మది చెడి తిరిగెడు కుక్కకు 

గదిరెడి గతి తుదకొకప్డు గలుగను దులసీ! 


89.కవియై వ్రాసెడు వ్రాతలు 

నవరస భావములు నీతిన్యాయము దెలుపున్ 

చవి లేని కవితలల్లుచు 

జెవులను బాధించు చొరవ చెల్లదు తులసీ!

90.కొనలేము జనుల ధనమిడి 

కనికరమాప్యాయనంబు కనబడ వారిన్ 

మనసార నాదుకొనుచో 

బెనవేయుదు రతని జనులు ప్రేముడి దులసీ!    

    

91 .ధనమొకడే కాజాలదు 

మనుజుని సుఖ కారణంబు ,మానిని సుతులున్ 

వినయాన్వితులై యాతని 

కనుకూలత జూప నదియె నాకము తులసీ!

92 .తన విహిత ధర్మములనెపు

    డొనరించుచు ఫలముduttam కొరకుండియు దీనా 

    వనమునకే తనువనుకొని

    వినియోగమొనర్చు జనుడె విజ్ఞుడు తులసీ!

93.తన సుతుడె  తప్పు జేసిన 

వెనుకాడక యొకడు శిక్ష విధియుంచుచు స 

జ్జనులం గాచునొ సతమా 

మనుజేశ్వరు డుత్తము౦డు మాన్యుడు తులసీ!


94. మట్టియు మణి యని తలపక 

చుట్టంబని శత్రువనక సుఖదుఃఖంబుల్

పట్టించుకొనక భ్రాంతుల 

నెట్టినవాడౌనుయోగి నిక్కము తులసీ!

95.ఎక్కగ వచ్చును  మేరువు 

స్రుక్కక చేరంగ వచ్చు సూర్యుని ,జుక్కల్ 

లెక్కగొనవచ్చు ,వశమే 

చిక్కించు కొనగ స్త్రీల చిత్తము తులసీ!

96.పిల్లల గన్ననె సరియా?

తల్లియు నా  తండ్రి వారి దగు శిక్షణ రా 

జిల్లగ విద్యాబుద్ధులు 

మెల్లగ నేర్పింప రేని మేలొకొ ?తులసీ!

97.నీతియు ధర్మము నెఱపుచు 

బ్రీతిగ బలహీన జనుల బ్రేమించుచునే 

జాతికి హానిం గూర్చెడి 

పాతకుల నణంచు ప్రభువె ప్రభువగు  తులసీ!

98.ఆపద లొద వెడు నదమన

నాపగ లేరెంత దక్షులైనను విధి,నా 

తాపసులే తా రెఱుగని 

శాపంబులు గనరె ?మీర  జాలిరె? తులసీ!

99.ధనువును  విడచిన బాణము 

తనువును విడిపోవు నుసురు తరమగు నొక్కో 

వెనుకకు ద్రిప్పగ,విరిగిన 

మనసటులే యతుక లేము మహిలో తులసీ!

100.పాతివ్రత్యము తొలి మన

క్ష్మాతలి  కొక వన్నె తెచ్చె గానీ యిక స్త్రీ 

స్వాతంత్ర్య మె పెరిగిన నా 

నీతికి విడువంగ వచ్చు నీరము తులసీ!        

 

101.కలవారలిడుదు రెప్పుడు 

కలవారల కాదరంబు కడలు  కొనంగన్ 

బాలు బాధలు పడు పేదల 

దలపరు కసరుదురు విసుగుదలతో దులసీ!


102.లలితా కళారాధనతో  

నెలతలు విద్యలను నేర్చి నిర్మల చరితన్ 

గులదీపికలై జాతికి 

గల కీరితి నిల్ప మేలు గాదే?తులసీ!


103 పరులపయి నింద మోపుచు ,

మరచియు తన సొంత పనులు మాన్యుల తోడన్ 

పరుసము లాడెడు నరుడొక 

ధరణీశుండైన ముప్పు తప్పదు  తులసీ!

104.క్రూరులతోడను స్నేహము 

వైరంబును గూడ బూన వల దేమన్నన్ 

ఆరని నిప్పుల సంగతి 

యారిన బొగ్గునకునైన  హానియె తులసీ!

105.బలవంతుడు దుర్బలుడని, 

కలవాడు దరిద్రుడనియు , ఘన విద్వాంసుం 

డలతి జడుండని,భేదము 

కలుగునొకో మృత్యువునకు గాదిలి తులసీ!

106.వరలు సుఖము తగు బుద్ధిన్

గురుబుద్ది విశేష ఫలము గూర్పగ జాలున్ 

పరబుద్ది నష్టకరమౌ 

తరుణీ జనబుద్ది ప్రళయదంబగు దులసీ!


107. కోరును లోకము దాతనె 

కోరునొకో యీవి లేని కొటీశ్వరునేన్ 

వారిదము రాకకై ప్రజ 

కోరును సూ వార్ధి రాక గోరునె తులసీ!


108.వే గుణములు గల పెద్దల  

లోగూడ నెదేని గలుగు లోపంబదియే 

లాగున రత్నాకరమౌ

సాగరమున నుప్పు నీరు  చాడ్పున దులసీ!

                      &&&&&&&&&& 

తులసీ శతకము -3

                                -3-

61.ధృతి చెడి రణమున బారియు 

మృతి గను భటునకు  గృ తఘ్న  మిత్రఘ్నులకున్ 

సతమనృత  భాషికిని స 

ద్గతులే గతి గలుగవంచు గనుమా?

62.ఎఱిగి ఎఱుంగక చేసిన 

కొఱగామికి తగిన శాస్తి కొంచక గలుగున్ 

ఎఱుక చెడి కాల ద్రొక్కిన 

కొఱవి దహింపకయె  యూరకొనునే తులసీ!

63.ఎక్కడనొ లేదు పాపము 

నిక్కముగా వెఱపు లేని నీ చేతులలో 

నెక్కొని యున్నది మానక 

బొక్కసమున దాచుకొన్న పోలిక తులసీ!

64.అందముల నలరు సుందరి 

నిందల గారించు మొఱకు నేర్చునె?సుఖముం 

జెందగ ,నందన వనమున 

పంది వినోదంబు లవము పడయునె ?తులసీ!

65.పరధనముల తిన మరిగిన 

నరుడించుక తృప్తి గొనక నాశము చేయున్ 

తరువుల బట్టిన చీడలు 

పొరి బొరి దిని తుదకు గూల్చు పోలిక తులసీ! 

66. మిన్నగ జదువును దెలివియు 

నున్నను దురదృష్ట  మలమియుండిన వేళన్ 

వన్నెకు నెక్కడు వజ్రము 

మన్నున గప్పంగ బడిన మాదిరి తులసీ!

67.బాధగురు లెప్డు స్వార్ధము 

సాధింపగ  వాద భేద చాతుర్యముతో 

వేధింత్రు వారి బోధల 

బాధంతయు సొమ్ము లాగువఱకే తులసీ!

68.మందులు ఘనులగువారల 

చందంబును విలువ నెఱుగజాలక చులకన్ 

గందురు కోయలు చేయరె  

గంధపు దరువులను వంటకట్టెల దులసీ!

69.మాయమ్మైపోయెను గద 

న్యాయము ధర్మమ్ము దేశనాయకులందున్ 

మాయురె ;దేశంబున కిక 

శ్రేయో లాభంబు లెట్లు చేకురు?తులసీ! 

70.ఎఱుగడు తన తప్పుల ఖలు 

డరయుచునే యుండు నొరులయందలి  తప్పుల్ 

కురువిందము తన నీలిమ 

నెఱుగంగా గలదె యెన్నడేనియు దులసీ!  

71.కోరకయిచ్చెడు దాతయు 

నోరిమి నరివర్గమెల్ల నొడిచిన భటుడున్ 

గూరిమి బొరయని జననియు 

నారయ నీ మువ్వురవని నరుదౌ దులసీ!

72.ఎంత బలవంతుడైనను 

పంతంబులు పలుకరాదు పలువురిలోనన్ 

దంతి యొక వెంటి చేతను 

వింతగ బంధిoపబడుట  వినమే?తులసీ!

73.కొంత యెదియొ తెలిసినచో 

నంతయు దెలిసెనని పొంగు టవివేకంబౌ

నంతము గలదే విద్యల?

కెంత యెఱింగినను మిగులటెఱుగమే ?తులసీ! 

74.విందులకు మాత్రము వచ్చుచు 

బందుగునని మెక్కి పోయి పదపడి యిడుమల్ 

క్రందు కొన తొంగి చూడని 

బందుని రాబందువనుట భావ్యము తులసీ!

75 .తెలిసియొ  తెలియకయో తా 

సలిపిన తొలి తప్పు నెఱిగి సజ్జనుడగు వా 

డలయక  పశ్చాత్తాపం 

బెలమిం బ్రకటించు,నొప్పడితరుడు తులసీ!

76.త్యాగంబు,కళలయందను 

రాగంబు,సభాంతరముల రమ్య మృదూక్త్యా 

చేగంబు,కదన శౌర్యో 

ద్యోగంబు లభించు బుట్టుతోడనె తులసీ!

77.కార్యముల మాని ,పూనియ 

కార్యములకు ,నెదురు తిరిగి ,కడకన్ నిరతా 

వార్యయగు నప్పడంతుక 

భార్యయొకో ప్రక్క లోని బల్లెము తులసీ!

78.ఆవులె యందము మందకు 

పూవులె యందంబు దెచ్చు బూ దోటలకున్ 

బావుల కందము జల ,మే 

ధావులె యందంబు మాతృ ధాత్రికి దులసీ!


79.పాలకు దేనెకు దీటై 

క్రాలిన మన తెనుగుబాస రాయల నాటన్

లాలనము చెందె దానికి 

ఆలనయే  లేదు నేటికకటా ;తులసీ !

80.కీర్తి ధను సత్యశీలుని 

గుర్తింపక గెలిసేసి కొల్వదు లోకం 

బార్తిపడు  ధూర్తు గొలువగ ,

వర్తనమిటు సాగుచుండె వసుధను తులసీ!

81 .ఓరిమి చాలక యుండిన 

సారెకు వైరములె వచ్చి శాంతి నడంచున్ 

నోరొకటి మంచి దగునెడ 

నూరపుడే మంచిదగుచుండును దులసీ!

82.నిక్కచ్చిగ  శాస్త్రంబుల 

నుక్కీడున కెంత చెప్పా నొంట నిముడునా?

మిక్కిలిగ లాగి కట్టిన 

గుక్కకు గల తోక వంక కుదురునె?తులసీ!      

    

83.నిరతమొడలు వంచినచో 

కరవుండదు కష్టపడిన గలిమియుగలుగున్ 

పెరుగును దరువక పై పై 

కరుదెంచునె వెన్న ?చేతికందునె ?తులసీ!

84.క్రొత్తగ వచ్చిన వారల 

మెత్తగ మాటాడి నంత మేకొనకుము,త 

చ్చిత్తముల మంచి చెడ్డల 

సత్తెము గుర్తించి చేయు సఖ్యము తులసీ!

85.    సర్పముల మృతికి దలయం 

దేర్పడి యున్నట్టి విషమె హేతువు కాదే?

నేర్పె ఱుగని  మూర్ఖులకు 

న్దర్పమె  కద పతన కారణంబగు దులసీ! 

 

తులసీ శతకము -2.

                                - 2 -

26.దయగల ప్రభువుల కడ భట 

చయము న్నియమింత్రు చనవు సలుపక యుండన్ 

ప్రియమారు గులాబీలకు 

నియమింపడె సృష్టికర్త నిండుగ దులసీ!

27.ఎవరంటరానివాడన ?

 తివిరి యకృత్య ములు సేయు తెంపరి యొకడే;

భువి తాత తండ్రులిడిరని 

చవిటి పొలము నెవడు సాగు సలుపును దులసీ!

28.ఉందుమె తిరముగ ననరొక 

కొందఱు తమవెంట నేమి కొంపోదురొకో?

ఎందఱొొ యేలిరి ధరనొక 

కొందఱె పేర్వడిరి దాన గుణమున దులసీ!

29.చుట్టగ వచ్చును బృ ధివిo ,

బట్టంగా వచ్చు బుకిట పాధో నిధినే,

ముట్టగ వచ్చును దివి,నెటు 

నెట్టంగా నెవరి తరము నియతిం ?తులసీ!

 ౩౦.పాలకడవ చెయి జార్చిన 

నేలంబడి వ్రీలి పాలు నేలగలియవే?

తేలికగా మృదుమతులను 

వేళాకోళంబు  సేత వెడగగు తులసీ!

31.పరువుం జెఱచునుత్రాగుడు 

చెఱచు శరీరంబు వేశ్య చెలిమి ,గృహంబున్

జెఱచు దురోదర మట్టులె 

సరగ మౌఢ్యo బు  చెఱచు సర్వము  తులసీ!

32 .అవివేకు లెందరున్నను 

సువివేకి యొకండెకులము శోభిలజేయున్ 

దివినెన్నితారలున్నను  

ధవళాంశుడె  వెలుగు నిచ్చి తనుపును దులసీ||

  33.వింతలు కనబడినపుడు ప్ర 

శాంతముగా నూహసేయ సత్యము తెలియున్ 

ఎంతటి గారడియును మతి 

మంతులు గ్రహియింత్రు గడియ మాత్రనె తులసీ||

34.రుచియింపక  గర్వాంధుడు 

శుచియగు హితమెపుడు చెవిని జోరనీడు గదా 

రుచియించునె చింతామణి 

నుచితముగా చచ్చువాని కొసగిన దులసీ||

35.మాన ప్రాణoబులలో 

మానమె ప్రాణంబు కంటె మాన్యము తలపన్ 

మానినులు మల్లమాదులు 

మానము రక్షించుకొనగ మ్రందరె ?తులసీ?

36.దయయును దానగుణంబును 

నియమం బఘభీతి నిష్ఠనిజవర్తనమున్ 

ప్రియ భాషణంబు లజ్జయు

నయముంగల వారి మైత్రి నడపుము తులసీ||

37.ఉన్నదియె పుష్టి నరునకు 

తిన్నదియే పుష్టి యాల దేహంబులకున్ ,

మిన్నునకు పుష్టి వెన్నెల 

కన్నంబే పుష్టి చౌర్య కర్తకు దులసీ||

38.అప్పులు పెరిగిన వానిన్ ,

గొప్పకు జాడీలు చెప్పు కుజనుని ,నీతిం 

దప్పిన వానిం జేరిన 

నెప్పుడొ  ముప్పొదవితీరు నెఱుగుము తులసీ||

39.పెంచును విలువను త్యాగము 

దించును తన స్వార్ధగుణమె  తిరమగు కీర్తిన్ 

కుంచించు భయము మనుజుని 

వంచించును వెడగు దనము వసుధను దులసీ ||

40.వెలుగు రవి పగటివేళనె 

నెలవెలుగును రేలనొక్క నిలకడ గనకే 

వెలగల విజ్ఞుని తెలివియొ 

వెలుగుం బ్రజమెచ్చ నెల్లవేళల దులసీ||      

41.సిరిలేకయు సుఖమబ్బును 

సరిగ ననామయము లేక సౌఖ్యమొదవునే 

సిరి కన్న ననామయమే 

వరమని తద్రక్ష సేయవలయును దులసీ||

42.కష్టమునకు దగుభృతి నిడ 

కిష్టమ్ముగ తిట్టు కుజను నేమనవలయున్ 

భ్రష్ట యగు గొడ్డు రాలెటు 

కష్టతర ప్రసవబాధ కనుగొను దులసీ!

43.తొణకకుము ఘనత పెరిగిన 

నణకువతో మెలగుమెంత యౌన్నత్యమునన్  

తృణ రాజ మెక్కునప్పుడు 

బెణికినచో  గాలు ,క్రింద బెట్టడె  ?తులసీ!

4 4 .సిరితరమని మురియుకుమీ 

జరిగినవరకాచరింపు సత్కార్యములన్ 

వెరవకు మెవరేమన్నను  

ధర బెరుగును కీర్తి కొన్ని తరముల తులసీ||

45.సిరికిన్ లేదొక నిలకడ 

సరి పతినే    విడిచిపోయి చేరె  బలీంద్రున్ 

సిరి కన్న మిన్న పరపతి 

పరపతి నార్జించుకొంచు బ్రదుకుము తులసీ!

46.రూపము  ధనముం గలిగియు 

నూపిరియగు విద్యలేక యొప్పడు ధరలో 

నేపుగ పెరుగు పయిరునకు 

గాపే లేకున్న ఫలము కలదే?తులసీ!

47.కలవారి తోడ కలహము 

నిలుకడగా చుట్టమింట నిలుచుట,పరదా 

రల గోరుట యను మూడును  

కలిగించును మానహాని కడపక తులసీ!       

48.అడవిన్ గాసిన వెన్నెల ,

కడలిన్ వర్షించు వాన,కాదు వృద్ధుని చే

పడు పడుచు భార్య ,ధనికున

కిడు దానము నిష్ఫలంబులే యగు దులసీ!

49.శక్తికి మించిన దానము  

రక్తింగొలుపంగ లేని రాగ,మదనున్ 

యుక్తి నెఱుంగని సచివత,

భక్తియుతము గాని పూజ వ్యర్ధము తులసీ!

50.వింతగు వేసముతో వే 

దాంతోక్తుల్ చదివి నంత నగునే సిధ్ధుం 

డాంతర మలమినభ్రాంతిని 

సొంతము విడనాడలేని యజ్ఞుడు తులసీ!

51.వేప తరువునకు చేదును 

మాపంగాదరమె యెంత మధువెరు విడినన్ 

దీపించు సూక్తి బోధల 

పాపాత్ముని పాపబుద్ధి పాయునె?తులసీ!

52 .అల్లురకును నల్లులకును 

ఉల్లంబే లేని యట్టి యుద్యోగులకున్ 

మొల్లపు వెలదులకును నిలు 

వెల్లను దోచుకొను బుద్దియే సుమి తులసీ!

53.ఎప్పుడు పారును నది ప్రజ 

దప్పి దీర్ప ,వెలుగు నిడగ దా రవి  దిక్కుల్ 

తప్పక తిరుగును గద ;ఘను 

లెప్పుడు జన సేవ కొఱకె యెంతురు తులసీ!

54.ఆచరణము లేకుండిన 

వేచదువులు చదివియున్న విఫలమె సుమ్మీ,

వాచా దీపం బనగనె 

యేచిన చీకట్లు చెదురునెట్టులు ?తులసీ!

55.గొ ప్పనుకొని  విజ్ఞులతో 

తప్పుడు చాడీలు చెప్పదలచిన  ధరలో 

నెప్పుడు విజయము కలుగదు 

నిప్పునకున్ చెదలు పట్ట నేర్చునె?తులసీ!

 56.వినుమీ స్వజనుల కంటెను 

గనుమీ నీ పొరుగువారి కష్టంబులనే 

తనవారు మెచ్చరె ప్పుడు 

వినయము తో గొ ల్త్రు నిన్ను పెరలే  తులసీ!

57.ధనము గల వాని కెంతటి 

ఘనదోషములున్న నతని గణియింతురు సూ 

వినయము సుగుణము లున్నచొ 

ధనహీనుండైన వాని దలపరు  తులసీ!

58.సిగ్గును గావావు వలువలు 

నిగ్గుగ నీ పరువు నిల్ప నేరక యున్నన్ 

గగ్గరులు  కలుగు పందికి 

రగ్గును గప్పినను గలదె రమ్యత  తులసీ!

59.ఆదమరచి నట్టి కృషియు 

సాధన లేక యున్న సంగీతంబున్

బొధనము లేని మతము 

నాధుడు లేనట్టి యిల్లు నాసిలు దులసీ!

60.పంచంగ వచ్చు నినుమును,

అంచులపై  బారు నదుల నాపగ వచ్చున్ 

పెంచంగ  వచ్చు బులులను 

వంచంగా దరమె పెంకి  వనితను దులసీ! 

      

                                                                                                                                                                                


Tuesday, 24 July 2018

తులసీ శతకం -----మట్టా వేంకటేశ్వరరావు

                               తులసీ శతక ము 

                                                         శ్రీ  మట్టా వేంకటేశ్వరరావు

                         ప్రార్ధన 

శ్రీదయితా!సీతాపతి!

వేదాంతి జనైకవేద్య!  విబుధారాధ్యా!

కోదండ ధారి!భూజన

తాదర్శా!రామభద్ర!అంజలి గొనుమా!

నల్లని వానిని భూమిజ

వల్లభు సాకేతవాసు వనరుహవదనున్

ఎల్ల జగములకు వెలుగౌ 

చల్లని శ్రీ రామమూర్తి  శరణము నాకున్. 

గణములకధినాయకు స 

ద్గుణితతులకు మేలుబంతి గుజ్జగు వేల్పున్ 

ఫణిధరు ముద్దులపట్టిని 

గణనాధుని మదిని దలచి కవితనొనర్తున్ .

వాణిని ధాతకు వలపుల 

రాణిని సాహిత్య గాన రాగిణి వీణా 

పాణిని చదువులనిడు నలి 

వేణిని సత్కవిత నిడగ వేడెద నెపుడున్  .

                                     * తులసీశతకము *

1.శ్రీ రఘుపతి కృపచేతను

ధారణి వ్రాయుదును నీటి ధర్మము సత్యం 

బోరిమితో జదివిన జే

కూరును నీమదికి బ్రీతి కూరిమి తులసీ !

2.పచ్చని తోరణములతో 

ముచ్చటగా దీర్చినట్టి ముగ్గులలోనన్ 

మెచ్చిన తోబుట్టుల కడ 

లచ్చి వసించుచు నొనర్చు లాస్యము తులసీ!

3.సిరియే మూలము జగతికి 

సిరి తోడనె దైవముండు సిద్ధము గానన్ 

సిరిబాసినట్టి మనుజుడు 

నరసి విడిన మకరి కాడె?సత్యము తులసీ!

4.జాతిని గొప్పగా జెప్పెను 

నీతియె పోషించుచుండు నిజముగ జాతిన్

వాతపడు వధువు కంటెను 

నీతిచెడని విధవ నయము నిక్కము తులసీ!

5.మతములు కులములు ననుచున్ 

సతమతమై లోకమెల్లసత్యము విడిచెన్ 

మతముల గమ్యమొకటె  యని 

మతినెఱిిగి  చరించు వాడె మాన్యుడు తులసీ!

6.వృద్ధ సమయోచితముగ 

బుద్ధిగఱపి ప్రజల భయము పోగొట్టవలెన్

వృద్ధుండయ్యును -మేలగు 

పద్ధతి గనడేని నిందపాలగు దులసీ!

7.మెప్పునకై శ్రీమంతున 

కప్పిడిన ఘనంబె?యనద నాదుకొనవలెన్ 

చప్పని కూరను గాదని 

యుప్పును జలనిధిని వేయుటుచితమ?తులసీ!  

8.హితకరులగు పితరులకున్ 

సతి తోడను సేవజేయ సద్గతి కల్గున్ 

మతిలేని రాతి ప్రతిమల 

నుతి జేసిన నేమి -నోరునొ వ్వదె ?తులసీ!

9.పెంచుకొనకు కోర్కులగని,

వంచింపగ వలదు పరుల,వసుధనొరులలో

నెంచరు దోసమ్ముల,సవ 

రించుకొనుము నీదు తప్పులెప్పుడు తులసీ!    

10.కర్మమున బొడము జగములు 

కర్మంబున నణుగుచుండు గాలము దరియున్ 

కర్మమె జన్మము మూలము 

కర్మమె సుఖదుఃఖ కారకంబగు దులసీ!

11.పురపతి వెలుగును బురమున 

నరపతి తన జన పదంబునన్ వెలుగొందున్ 

నెఱి గలిగిన విద్వాంసుడు 

ధరనెల్లెడలందువేలుగా దక్షుడు తులసీ!

12.పండితుడు పస వెలార్చును,న 

పండితుడో మొఱుగు నె యవాకులొ పెలుచున్ 

నిండిన భాండము తొణకదు 

కొండ వెలితియైననె తొణకుoగద!తులసీ!

13.ఎంతటి దక్షుoడైనను 

కొంతేనియు హితుల పొత్తు కోరగవలయున్

అంతటి దహనుడె గాలి ర 

వంతయినను దోడుపడక యడరునె?తులసీ!

14.చేయకు నీచుల స్నేహము 

పాయక నీ  తొంటి గౌరవం బణగాఱున్ 

తీయగ గూసెడికోయిల 

వాయసముల చెల్మి నిందపాలగు దులసీ!

15.కనికరమెఱుగని ధూర్తుడు 

చనవిచ్చిన జేయు ముప్పు సమయము గనుచున్ 

పనిమాలి ఫణిని మెడనిడ

వెనుదీయనె నెట్టుకాటు వేయక ?తులసీ!  

16.ఒరుల సిరి జూచి యేడ్వకు 

నిరతంబు శ్రమింతువేని నీకుంగలుగున్ 

తరువున నందలి ఫలముల 

నరసి యఱచినంతమాత్ర నందునె?తులసీ!

17.తనకెంత యుండినను దా 

దినకొరులకునిడక యున్నదియు నొక ధనమే?

కను పండువుగా నంబుధి 

గొని త్రావని జలములున్న గొఱయే ?తులసీ!  

18.మలతురు శిల్పివరులు తమ 

యులి మొనలన్ గఠిన  శిలల నొప్పలరారన్ 

తెలివిగల గురులు శిష్యుల 

బలుకులతో దిద్ది తీర్పవలతురు తులసీ!

19.అరిషట్కమును జయించిన 

వెరవరి యొ క్కండెసూ వివేకియనంగన్ 

గుఱి లేని బలులు పూజలు 

పొరిబొరి సల్పినను  ముక్తి బోరయునె ?తులసీ !          

  20.సలలితమగు సత్కవితకు 

విలువెఱుగని బాలిశుండు విఱుచుంబెదవిన్

విలసిల్లు కలికి మురిపెపు 

చెలువముగని పేడి వేడ్క జెందునె?తులసీ!

21.ఎదురేది జితేంద్రియునకు 

 ముదముగ ధర్మార్ధకామ మోక్షము లొదవున్

అదనెఱిగి పదునుబెట్టిన 

కొదవగునే ధాన్యరాశి కోర్కెకు ?తులసీ!

22.మానమె ధనమనుకొను నభి 

 మానులు తలమోడ్పరెంత మాత్రంబరికిన్ 

తా నములునె కసవును బల

హీనస్ధితినైన సింగమెప్పుడు  తులసీ!

23.భువి విధి గానని సృష్టిన్ 

 గవి చేయుచు నుండు నవ్య కావ్య స్ఫూర్తిన్ 

నవరస భావ సమున్నతి 

జవి దేల్చెడు కవి ధరిత్రి జావడు తులసీ!

24.వేగిరపడి దుష్టుల యెడ 

సాగింపకు సాహసంబు సహనమె మేలౌ 

 కాగల కార్యము దీర్పం 

గా గంధర్వులె తమంత కలుగరె ?తులసీ!

25.ఆలి యెరుగును బూదీవియ 

 బాలు దూరమునందు నున్న బ్లవగమెఱుగునే?

అలతి జడుడు విద్వాంసుని 

వలె  దెలివిం జూపి మెరయ వలతియె?తులసీ! 

Wednesday, 11 July 2018

మనోనిగ్రహసాధనలు-మాత్సర్యం

                           మనోనిగ్రహ సాధనలు-

                                                        మాత్సర్యం 

ఈర్ష్యాసూయద్వేషాలకు మరోపేరు మాత్సర్యం.మన పెంకుటింటికి ప్రక్కన మూడంతస్తుల పెద్ద భవనంలో నున్నవ్యక్తులనుజూచియీర్ష్యపడడంమహాపాపము.ఎడమ ప్రక్క పూరి గుడిసె లో నున్నవారిని జూచి వారిలేమిని ద్వేషించడం మహాపాపము.మానవుని మాత్సర్యమెప్పుడు అతని మనుగడకు ముప్పు  తెస్తుంది.కేవలము  ఈ ఈర్ష్యా ర్ష్యా సూయలవలన నె గదా నూర్గురు సోదరులను,ఏకైక సోదరిని, కన్నకొడుకును,తల్లిదండ్రులను,యావత్తు సామ్రాజ్యాన్ని,ప్రాణాన్నిపోగొట్టుకోవడమేగాక,దుర్యోధనుడను పేరుదెచ్చుకొన్నాడు-సుయోధనచక్రవర్తి .

ఈ అసూయకే ఆహుతి యైన కైకేయి తనభర్తను పోగొట్టుకొంది.కన్నకొడుకు ప్రేమకు దూరమైనది.పైగా లోకనింద పాలైనది.

ఈ యీర్ష్య ఆవరింపబడిన శిశుపాలుడు నిండు సభలో శిరస్సు తెగి కళేబరముతో క్రిందికి పడినాడు.బ్రహ్మద్వేష ము గలహిరణ్యకశిపుడు ఘోరమరణంపాలైనాడు.పూర్వ ప్రబంధాలను పరికించిన మాత్సర్య ప్రతిఫలాలు కన్పట్టును.

ఈ ఈర్ష్యాసూయద్వేషాలా వరింపబడిన వ్యక్తి నిరంతరమూ ఆందోళన,అశాంతి చెందవలసి ఉంటుంది.దీనికి యుపశాంతి భగవద్గీతలో నిట్లు చెప్పబడినది.సాంఖ్య యోగమున ---

రాగద్వేష వియుసుక్తై 

విషయానిన్రియైశ్చరన్,

ఆత్మ వశ్యైర్విదేయాత్మా 

ప్రసాదమధిగచ్ఛతి ------అనగా ఈర్ష్యాసూయద్వేషములకతీతుడు,  అందరిని సమంగా జూచు వాడు ,మాత్సర్యములేనివాడు,మనస్సును తన వాదీనములో నుంచుకొనువాడు,మనోనైర్మల్యము గలవాడును,శాంతిని బొందగలడని యర్ధము. ఇది సామాన్యులకర్దమయ్యేల బైబిలులో సాలోమోను రాజు మహోన్నత సామెతలద్వారా ఇట్లు చెప్పుచున్నాడు.

సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము,మత్సరము ఎముకలకు కుళ్ళు.ప్రియ ఆత్మస్వరూపా!కేవలం శారీరిక డాంబికఆధునికాడంబర ప్రదర్శనకై ఉవ్విళ్ళూరుతూ --నీకన్నా గొప్పవారితో నిన్ను ఊహించుకొనినీ లేమికి నిన్ను నీవు కించ బరచుకింటూ ఎందుకు మరణాన్ని ఆహ్వానిస్తున్నావు ?  ---అనగా మీరు శరీరేచ్చానుసారముగా ప్రవర్తించినయెడల నిశ్చియముగా మరణము కొని తెచ్చుకొందురనియర్ధము.కానీ ..ఆత్మచేత ...శారీరక వాంఛలనుచంపినయెడల దేవుని పరిశుద్ధా త్మలో జివిం చెదరు.బైబిలులో పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక ఎని  మిదవ   అధ్యాయం,పదమూడవ వచనంలో అమూల్యరత్నమీయుపదేశము.మానవాత్మకు మహా అపకారియైన మాత్సర్యమును జయించడానికి ఇది సులువైన మార్గము.-

    ప్రభువు ప్రేమమయ సృష్టి లో నీవు ఉన్నతుడవని భావిస్తూ నీవీ మెరుగు పరిస్ధితులలో నున్నందుకు ...నిత్యం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు...!మాత్సర్యము నీకు ఆమడ దూరములో నుండున్.

మనస్సు నీది.మార్గము నీవే యేర్పరుచుకోగలవు .నీ ఆత్మను సంరక్షించుకోవలసిన బాధ్యతా నీదే...ఈ క్షణము నుండినీసాధనప్రారంభించు.త్వరపడుము.సమయమాసన్నమైనది.నీ సాధన సఫలమగుగాక! 

Thursday, 14 June 2018

మనోనిగ్రహసాధనలు --మోహము

                                మనోనిగ్రహసాధనలు 

                                                   మోహము 

ఇది కామమునకు దగ్గర చుట్టము.ఒక కాముకుడు ఇట్లు చెప్పుచున్నాడు.

శ్లో||ఇహ హి మధురగీతం ,నృత్తమే తద్రసోయం ,

     స్ఫు రతి పరిమళోసౌ,స్పర్శ ఏషస్తానమ్ ,

     ఇతి హతపరమా ర్ధైరింద్రియై ర్భ్రామ్యమాణః 

     స్వహితకరణధూర్తై:పంచభిర్వఞ్చితోస్మి.

స్త్రీలోలత్వముచే పరమార్ధము తెలియక చెడినవాడను.ఈ పంచేంద్రియాలు నన్ను ఎలామోసపుచ్చినాయో చెబుతున్నాను.ఈ లలన చనుమొనలరాపిడిచే నాచర్మము,దీనిపెదాల తీపిరుచిచేనా నాలుక,ఈమె  మాటలమాధుర్యానికి నా చెవి ఈ మె వగలు,హొయలు నాకళ్ళను ,దీనిశరీరసువాసనలు నానాసిక నన్ను స్త్రీలకు  బానిసగా మార్చినవి.   ఇదీ మోహానికి ఒక ఉదాహరణ.

కాన సామాన్య మానవులు ఈ భ్రమనుండి బయటబడలేరు.స్త్రీమోహము,ధనార్జన తృష్ణ ,కీర్తికాంక్ష,బ్రతుకుతీపి--యిత్యాదులన్నీ మానవ ఆత్మను మలినబరిచేవి.

అవశ్యం యాతారశ్చి రతర 

ముషిత్వాపి విషయాః 

వియోగే కో బేధ,స్త్యజతి 

నజనో యత్ప్వ యమమూన్?

వ్రజంత స్వాతంత్య్రా 

దతుల పరితాపాయ మనస,

స్వయంత్యక్తా హ్యేతే 

షమ సుఖమనంతం విదధతి.

మానవుడు ఆశించి అనుభవించేవన్నీ ఎప్పటికైనా విడువవలసినదేగదా!  స్త్రీ ,సంతాన,సంపదలు నాశమానమైనవనితలంచి మానవుడు తనంతతాను విడిచినచో  ..ఎంతమనశ్శాంతి......ప్రశాంత మధుర జీవనము.మనోహర మంగళ ప్రద జీవితము.అయితే దీనిని అందరు చేయగలరా?భగవద్గీతయందు ఇట్లున్నది.....

ఉద్ధరేదాత్మనాత్మానం 

నత్మానమవసాదయేత్ 

ఆత్మైనవాహ్యత్మనో 

బంధురాత్మైవ రిపురాత్మనః

ఆత్మను నిగ్రహించి ...సర్వమూ ప్రభువునకు సమర్పించువారు మాత్రమె దైవసన్నిధికి అర్హులు.ఆత్మే హితుడు.ఆత్మే శత్రువు.కాన తన్ను తాను ఉద్ధరించుకొనే శక్తి ప్రతి మానవాత్మలోను ఉన్నది.లోకములోనున్న పెక్కు గ్రంధములు మార్గాలను చూపగలవే గాని మనసును కట్టడి చేయలేవు. సత్ప్రవర్తనను సాధించే శక్తి ఆత్మమోహబంధనానికి పగ్గాలు బిగిమ్పవలసిన వ్యక్తివి నీవే.

అలఘులు బోధపూర్ణులు మహాత్ములు 

                         భోగానిదానమౌ మహా 

ధనముంబరిత్యజింతురు గతస్పృహులై

                        పరమాద్భుతంబుగా;

మునుపును బొంధ,కిప్పుడును ముట్టక,   

                     యింకను జెందలేక,నె

మ్మనమునందోచు భోగములు మానగ

                     జాలము మే మొకింతయున్.(భర్తృహరి)

స్నానజ్ఞానముచేత పరిశుద్ధమగు మనసుగల మహానుభావులు ఎంత మనఃకష్టమైనపనులైనను 

చేయుదురు.ధనమును ఎందుకు పనికిరాని ఎండిపోయిన గడ్డివలె విడుచుదురు.ఈ ధనము పుట్టినప్పుడు వెంట తేలేదు.పోవునప్పుడు వెంట తీసికోనిపోలేదు.కాన ధన,కనక,వస్తు,వాహనాది ,స్త్రీవ్యామోహములను విడిచి ప్రభువువద్దకు జేరుటకు యత్నించవలెను.బైబిలు కూడా "సుఖ భోగాములయందు వాంఛ గలవానికి లేమి కల్గును".అని చెప్పుచున్నది.(పాత నిబంధనలు 21:17)                             

Wednesday, 13 June 2018

మనోనిగ్రహ సాధనాలు

                         మనోనిగ్రహసాధనలు 

                                మదం 

మదమనగా క్రొవ్వు అనియర్ధము.మనమొకనిచెడ్డగుణాన్ని,

నిర్లక్ష్యంగాచెప్పుకొనేటప్పుడుజాతీయంగావాడుకుంటాము. వీడికెంతమదంరా -అనియంటూ యుంటాము.మదం అంటే అహం అని చెప్పవచ్చు.ఈ విచిత్ర సృష్టి చక్రము 

నిరంతరమూ త్రిప్పు భగవంతుడుండగా అన్నిటినీ -నేనే 

చేస్తున్నానని అనుకోవడమెంత అవివేకము.ఈ అహమే అన్ని అనర్ధాలకు మూలము.నవీన మానవుడు "నేనీరోజు ఈ పనిని సునాయాసంగా చేసాను".అని చెప్పుకుంటాడు కానీ,భగవంతుని కృపచే పూర్తి చేశానని చెప్పడు.

ఇప్పటి విద్యార్ధి రెండు చేతులు వదిలిపెట్టి సైకిలు త్రొక్కుతూ గర్వంగా కాలరు సర్దుకుంటాడు.ఏ చిన్న కారో ఎదురొస్తే తప్పుకోవడం చేతకాక తిన్నగా దానిక్రిందికి దూరి ప్రాణాలను వదులుతాడు.శారీరిక బలాన్ని పెంపొందించుకోవడంలో తప్పు లేదు గాని దాని ఆధారంతో బ్రతుకదానికి ప్రయత్నించడం మహాపాపం,మరియు ఆత్మీయ శక్తిని కోల్పోతున్నారు.

అహం+మదం =నేను అనే స్వభావాన్ని విడిచి వినయవిధేయతలతో నాకన్నా బలవంతుడు ,సత్యస్వరూపి ,ప్రేమమయుడైన భగవంతుడున్నాడని జ్ఞాపకం తెచ్చుకుంటూ పరుల కష్టనష్టాలలో సాయం జేస్తూ సత్ప్రవర్తనతో దేవుని ధ్యానించుకుంటూమంచి మనుగడ సాగిస్తున్న వ్యక్తి  వద్దకు మదము జేరాడు.

శ్లో||విపుల హృదయై ర్ధనై:కైశ్చి జ్జగజ్జనితం పురా,

      విధృత మపరై,ర్దత్తం చాన్యై ర్విజిత్యతృణం యధా ,

   ఇహ హాయ్ భువనాన్యన్యే ధీరాశ్చతుర్దశభుఞ్జతే,

కతిపయ పురస్వా మ్యే పుంసాం క ఏష మదజ్వరః ?

ఆదిలో హరిశ్చంద్రాదులు ప్రజాపతులు.సమగ్ర ధర్మాచరణo చేతఈ భూమండలాన్ని చక్కగా చేశారు.దానిని మన్వాదులు కాపాడారు.ఎందరెందరో రాజులు చక్కగాపాలించినారు.దీన్నే పరశురామాదులు స్వవశం చేసికొని ఇతరులకు దానం చేశారు.వారెంతమాత్రము గర్వమును చూపలేదు .చిన్నమండలానికి జెందిన ప్రభువులు జ్వరంలాంటి మదంచేత వికారం పొందడం ఆశ్చర్యమే గదా!     

మనోనిగ్రహసాధనలు-కోపము

                               మనోనిగ్రహసాధనలు 

                                               కోపము 

కోపము అనగానే క్రింది పద్యము గుర్తుకొస్తుంది.

తన కోపమె తన శత్రువు 

తన శాంతమె తనకు రక్ష;దయ చుట్టంబౌ;

తన సంతోషమె స్వర్గము ;

దన దు:ఖమె నరకమండ్రు తధ్యము సుమతీ.---అని సుమతీ శతకములో కోపము యొక్క ఫలితమును కవి చక్కగా చెప్పెను.

కోపము(ఆగ్రహము)ఆలోచనను నశింపజేయును.తోటి మానవుల మంచితనమునుపోగొట్టి ఆప్యాయతను లోపింప జేస్తుంది.కోపము గలవారు సాధారణంగా శారీరిక బలహీనులుగా ఉంటారు.అటులనే మానసికముగాను బలహీనులే.కానశారీరిక,మానసికబలములనుపొందాలంటే తప్పక శాంతగుణమునలవరచుకోవాలి.అని పై పద్యము మనకుచెప్పుచున్నది.భర్తృహరిసుభాషితములులోనిక్రింది శ్లోకమును పరికించుడు. 

శ్లో||క్షాన్తిక్చేత్కవచేన కిం కిమరిభి:క్రోధోస్తి చేద్దేహినాం 

      జ్ఞాతి శ్చేదనలేన కిం యది సుహృద్దివ్యౌషధై:కింఫలం

     కిం సర్పైర్యది దుర్జనాః కిము ధనైర్విద్యానవద్యాయాది 

 వ్రీడా చేత్కిము భూష ణై స్సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్ 

ఓర్పు ఉంటే కవచకుండలాలెందుకు?ఆగ్రహమున్నవాడికి వేరే శత్రువులు అక్కర లేదు.దాయాదులున్నచోట నిప్పు కొని తేనక్కరలేదు.దుర్మార్గుడున్నచో వేరేసర్పములెoదు  కు.పురాణాలను చూచిన దుర్వాసమహర్షి ముక్కోపి గా కనబడును.      పురాణాలలో పరికించి తే దుర్వాసమహర్షి ముక్కోపి .రావణుడు తనకోపముచేతనే తాను ,తనవంశమును నశింపజేసికొనెను.కోపమున్నంతవరకు అరిషడ్వర్గాలు దగ్గరగా ఉంటాయి.బైబిలునందు "కోపము గలవానితో సహవాసము వద్దు.పరిచయము కూడా వలదు.లేనిచో ణీ ప్రాణమునకు "ఉరి"తెచ్చుకుందువు."

అని యున్నది.కోపము వస్తున్నప్పుడు మౌనంగా ఉండడం మంచిది.పూర్వులు "మౌనేన కలహం నాస్తి "అని చెప్పిరి.

Saturday, 9 June 2018

మనోనిగ్రహాసాధనలు

                            మనోనిగ్రహసాధనలు 

                           1.కామం 

కామము అనగా కోరిక్ అనియర్ధ ము .జీవితంలో ప్రతివానికి ఎన్నో కోరికలుంటాయి.వానిని తీర్చుకోవడము పురుషా ర్ధమే యైనప్పటికి ధర్మమునతిక్రమింపరాదు. ఎన్ని కట్టెలు వేసిననుఅగ్నికితృప్తిలేనట్లుఎన్నిసుఖములనుభవించినాను మానవునకు తృప్తి కలిగదు.కాన క్షణికములగు ఐహిక సుఖాలపై ఆశలను పరిమితిలోనుంచుకొనవలయును.అట్టి కోరికలను (తృష్ణ లను)విడుచుట అంతసులభమా? 

శ్లో||భ్రాస్తం దేశమనేకదుర్గవిషమం ప్రాప్తం న కించత్ఫలం 

    త్యక్త్వా జాతికులాభిమానముచితం నేవా కృతానిష్ఫలా 

   భుక్తం మానవివర్జితం పరగృహేష్వా శంకయాకాకవ ,

 త్తృష్ణే!జృoభసిపాపకర్మ పిశునేనాద్యపి సంతుష్యసి.

అన్నిచోట్ల తిరిగినాను.పడరాని పాట్లు పడ్డాను.విసిగినాను.కుల,జాత్యభిమానాలను విడిచి సేవకవృత్తిచేసాను.ఇతరుల ఇంట బెదురుతూ తిండి తిన్నాను.ఇంత  చేస్తున్నా ఓ ఆశా!నీకింకా తృప్తి లేదేమి?

వార్ధక్య దశలో గూడా తృష్ణ వదలలేదు.

శ్లో||భోగానభుక్తా,వాయమేవ భుక్తా;

      స్తపోనతపోతం,వయమేవ తప్తా:

     కాలోనయాతో ,వయమేవ యాతా;

     స్తృష్ణాన జీర్ణా,వయమేవ జీ ర్ణా :

భోగాలు మాచేత అనుభవింపబడలేదు.మేమే వానిని అంటిపెట్టుకొని ఉన్నాము.తపస్సు మా చేత ఆచరించ బడుటలేదు.కాలం గడిచినదనుకున్నాము కాని మా జీవితాలే గడిచినవి.ఇదంతా ఆశవల్లనేగదా ! అందునా దురాశ దుఃఖము నకు దారితీయును.

శారీరిక వ్యభిచారము కన్నా మానసిక వ్యభిచారము మహాపరాధము.దీనిగుర్చి క్రీస్తు "ఒక స్త్రీని మోహపు చూ పుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు --ఆమెతో వ్యభిచారము చేసినవాడగును."(కొత్త నిబంధన ,మత్తయి సువార్త 5;28)శీలానికి విలువివ్వక పైపై మెరుగులకు భ్రమసి నాశామానమగు తాత్కాలికానందం కొరకు ప్రాకులాడుటఅవివేకముగదా!మానవుడు చేయు ప్రతి పాప కృత్యమునకు ఎప్పుడో ఒకనాడు భగవంతునికి లెక్క అప్పజేప్పవలసి యుంటుంది.పాప ఫలితాలను ఈ లోకములోనున్నప్పుడే అనుభావింప వలసియుండును.

భగవద్గీతలో 

దూమె నావ్రియతె వహ్ని 

ర్యధాదర్శో మలేనచ,

యధోల్బెనా వృతో గర్భ 

స్తధా తె నేదమావృతమ్ 

కాముకునికిసహజంగా తెలివి తగ్గును.శరీరసౌo దర్యాని  కిచ్చే ప్రాధాన్యత ఆత్మకీయడు.పోగానిన్దినప్పుడు అగ్ని కనబడదు గదా!మురికి జేరిన అద్దములో ప్రతిబింబము కనబడదుగదా! కామము మానవును విజ్ఞానాన్నిమూ స్తుంది గదా!"నిప్పుల మీద నడచిన--పాదములు కాలినట్లే పొరుగువాని భార్యను కూడువాడుకూడా నాశనమగును."బైబిలు,పాతనిబంధన సామెతలు 6:26 -29 

రామాయణాన్ని పరీక్షించిన సీతనెత్తుకొని పోవుటచేతనే తను నశించుటయే గాక తనకులాన్ని నాశనము రావణుడు చేసినాడుగదా! స్త్రీ పురుషులు ఒకసారి చేయుసంయోగమున ఐదు రోజులాయస్సును పోగొట్టుకుందురు.  కాన సన్మార్గముతోభగవంతుని జేరవలేనన్న నీవు ప్రతి క్షణము భగవన్నామాన్నిస్మరిస్తూఉన్నకామాన్నిమానవుడు  సులభంగా జయించగలడు.