పర్యాయపదాలు 11
౩౩2.గుగ్గిలము=కుంభి,పులుము,బహురూపము,యవనద్విష్ట,
యామినీచరము,రక్షగంధము,వనపీతము,
సురేష్టము.
౩౩౩.గుడారము=గుండారము,గూడారము,గు(గూ)డారు,గొల్లెన,
చప్పరము,డేరా,అసిమిగొల్లెన,ఉపకారిక,గుణవతి,
పటకుటి,శిబిరము,శ్రేణిక.
౩౩4.గుడి
=ఆయతనము,ఆలయము,చైత్యము,దేవాలయము,కోయిల,
కోవెల,దేవళము,వేల్పుటెంకి.
౩౩6.గురిగింజ=గురివెంద,గుంజ,గుంజాఫలము,కాకతిక్త,కాకణి,కాకతుండిక,కాంభోజి,కృష్ణరక్తకము,కృష్ణశీర్షిక,కాకచించిక,కాకనాసిక,
చూడ,భిల్లభూషణ,ఫశీర్షాహ్వ,శిఖిండి(ని),శీతపాకి,
శీతిక,శ్యామచూడ,సంచాలి.
౩౩7.గుఱ్ఱపువాడు
=గుఱ్ఱాలగోచ,గులప,గు(లా,ల్లా)ము,మందడీడు,
అశ్వపాలకుడు,మందురకుడు.
౩౩8.గుఱ్ఱము=ఘోటకము,నీతి,తురగము,తురంగము,అశ్వము,గంధర్వము,వాజి,అధ్వ,వాహము,హయము,సైంధవము,సప్తి,
తేజి,వారువము,మావు,తట్టువ,వామి,కత్తలాని,బాబా,
కత్తళుడు,జక్కి,తత్తడి,పారంగము,పటాణి.
౩౩9.గులాబి=పన్నీరుపూవు,రొజాపూవు,విక్టోరియా,అతిమంజుల,
కుబ్జకము,తరుణి,భద్రతరుణి,లాక్షాపుష్ప,సుపుష్ప,
సుశీత.
340.గూబ=ఉలూకము,వాయుసారాతి,పేచకము,దివాన్ధము,
దివాభీతము,నిశాటనము,కోడడు.
341.గేదె=గేదియ,ఎనుపెంటి,ఎనుము,బఱ్ఱె,ఎనుపసరము,మహిషి.
342.గొడుగు=ఎండచాటుపుట్టువు,ఎండమరుపు,ఎల్లి,గొడువు,చుట్టువు,
ఆతపత్రము,ఆతపవారణము,ఉత్కూటము, కావారి,
ఉష్ణవారణము,ఖర్పరము,గోత్రము,చక్రాంగము,ఛత్రము,
ఛాయామిత్రము,జలత్రాణము,మూర్ధఖోలము, వస్త్రకుట్టిమము.
343.గొడుగుగడ్డి=గ్రుడ్డికామంచి,చిప్పకసవు,గృహ్యము,తృణరాజము,పాలఘ్నము,ధూస్త్రణము,మాలాతృణము,రౌహిషము.
344.గొడ్రాలు=ఆశిశ్వి,వృదార్తన,వంధ్య,గోడ్డురాలు.
345.గొయ్యి=ఒరకము,కుంట,గుంట,గుండము,గుంత,గొల్లము,గోయి,పఱ్ఱె,పల్లము,పల్లుడు,పొక్కిలి,బాడువ,బొంత,వ్రంత,
గర్తము,గహ్వరము.
346.గొఱ్ఱె=అవి,ఉరణము,ఉరభ్రము,ఊర్ణాయువు,ఏడకము,పశువు,
ప్లవము,మేఢ్రము,మేఘము,కురరి,లోమశము,తగరు,
ఏడిక,వృష్టి,పొట్టేలు.
347.గొలిమిడి=గువ్వగుత్తిక,ఇక్షురసము,కోకిలాక్షకము,పర్వమూలము, స్ధూలకంటకము.
348.గొల్లజిడ్డు=నాగిని,మత్స్యాక్షి,లక్ష్మి,శూలిని.
349.గొల్లవాడు=ఆలగా(వు)పరి,గోవుడు,గోపాలుడు,గోసఖ్యుడు,గోధుక్కు,
అభీరుడు,పల్లవుడు,దోగ్ధ.
350.గొళ్ళెము=కొండి,గొండెము,గొండ్లెము,గొణ్ణెము,చిలుకు.
351.గోధుమలు=కుశిక,క్షుద్ర,గవేధుకము,గవేరుకము,గొధూమము,
మ్లేఛ్ఛభోజనము,సుమానము.
352.గోమూత్రము=ఆవుఉచ్చ,గోoబువు,పంచితము,బ్రహ్మాంబువు.
353.గోరింక=గోరంకువు,గోరాండిక,గో(కి)రాటి,గౌరిక,గొరంకి,గొరవంక,గొరవక,గొరువంక,గోర,గోరంక,గోరంకి,గోరవంక,గొరువంక,
కురరము.
354.గోరు=పునర్భవము,కరరుహము,నఖము,నఖరము.
355.గోరోచనము=కాంచని,గవ్య,గౌతమి,చందనీయ,పింగపీత,మంగల,రుచి(ర),రోచని,రామ,వందనీయ,శివ,శోభన,శ్యామ.
356.గోవు=మాహేయి,సౌరభేయ,శృంగిణి,అర్జుని,అఘ్న్య,రోహిణి,ఆవు,గిడ్డి,మొదవు,తొడుకు,కపిల,ధేనువు,సురభి,ఇల,పావని,
బహుళ,పైచికి.
357.గ్రద=గద్ద,గృధ్రము,దాక్షాయ్యము,దూరదర్శి,భాసము,వజ్రతుండము,
గరుడపక్షి,గ్రెద్ద.
358.గ్రహణము=ఉపరాగము,గ్రహము,పరాగము,సూర్యచంద్రగ్రహణము.
359.గ్రామము=ఊరు,కుప్పము,కొటిక,కొట్టిక,పల్లె,సంవసధము.
360.గ్రుడ్డివాడు=అంధకుడు,అంధుడు,గ్రుడ్డి,చీకు.
No comments:
Post a Comment