పర్యాయపదాలు 15.
457.తుమ్మెద=మధువ్రతము,మధుకరము,మధులిట్టు,మధుపాళి, ద్విరేఫము,పుష్పలిట్టు,భృoగము,షట్పదము,ఆళి,
భ్రమరము,ఇంధింధిరము,చంచరీకము,రోలంబము,
బంభరము,జమిలిముక్కాలి,తేటి.
458
.తుల=త్రాసు,తక్కె(క్కే)డ,తరా(జు)సు,తాళి,ధటము.
459.తులసి=తోల(ళ)సి,అమృత,కరీంజరము,కఠిల్లకము,కాండమణి, కాసఘ్నము,కాయస్ధ,కృష్ణపర్ణి,గంధహారిణి,గౌరి,గ్రామ్య,
జంబీరము,తీవ్ర,త్రిదశమంజరి,పర్ణాశము,పవిత్ర,పాపఘ్ని,
బిల్వగంధ,బృంద,భూతఘ్ని,మాధవి,లక్ష్మి,విష్ణుప్రియ,
సుభగ,సురభి.
46౦.తెడ్డు=త్రెడ్డు,గరిటె,కంచి,ఖజ,ఖజాక,ఖజిక,చట్టువము,చాటువు, తండువు,తర్ధువు.
461.తెర=అడ్డువల,పరదా,అపటి,కాండపటము,గండవడము,జ(య)వనిక,తిరస్కరణి.
462.తెలుపు=శుక్లము,శుభ్రము,శుచి,విశిదము,శ్వేతము,పాన్డురము,
అవదాతము,సైతము,గౌరము,వళిక్షము,ధవళము,
అర్జునము,తెల్ల,వెల,తెలివల,పుండరీకము.
463.తెల్లజీలకర్ర=అజాజి,జీరకము,సీతము,మేధ్యము.
464.తెల్లలొద్దుగు=అక్షిభేషిజము,జీర్ణవృంతము,దీర్ఘవృంతము,
శాఖరము,శ్వేతము.
465.తెల్లజాబిలి=అనంత,అర్ధసిద్ధకము,ఇంద్రాణి,ఇంద్రసుర,కాకనాశని,
నిర్గుండి, విసుగంధకము,శక్రాణి,శుక్లపృష్ఠకము,
సింధుకము,సింధువారము,సురస,రసాధకము.
467.తేనె=క్షాద్రము,కుసుమానవము,పవిత్రము,పుష్పరసము,
మధువు,మాక్షికము,సారఘము.
468.తేలు=ఆ(ళి)లి,కర్కోటరము,కాలిక,కులీలము,ఖర్జూరము,
ద్రుణము,ద్రూమము,ద్రుమి,ద్రోణము,పృదోకువు,పొట్టియ,
జిలీనము,దస్కవాటిక,విషపుఛ్చము,వలపురుగు,మండ్రగబ్బ,
మండగబ్బ.
469.తొండ=అండజము,కంటకాగారము,కులాహకము,కృకలాశము,కృకలాసము,క్రుకవాకువు,క్వకూలాసము,క్రకచపదము,
గాత్రసంకోచి,జాహకము,దురారోహము,శరండము,కామరూపి,
చిత్రబింబము,బింబము,ఊసరవెల్లి.
47౦.తొడ=అంకపాలిక,ఉత్సంగము,ఊరువు,కోలము,క్రోడము.
471.తొమ్మిది=నవమము,రత్నము,బ్రహ్మ,కమలాసనుడు,విధి,
గ్రహము,ఖండము,రంధ్రము,భావము,లబ్ధకము.
472.తోట=ఎలదోట,తోపు,హౌసుతోట,ఆమవనము,ఆరామము,
ఉద్యానము,ఉపవనము,కఛ్చము,కుటపము,గోత్రము,
గృహారామము,తెవనము,నందనము,నిష్కుటము,
ప్రమదావనము,వనిక,వాటము.
473.తోటకూర=పెరుగు(చిలుక)తోటకూర,నీరుతోటకూర,ఆరామశాకము,అంబుబాష్పము,మహాబాష్పము,శాకిని,కోయ్యతోటకూర,
తరుగాకు,ఛిక్కని,ఛిక్లిక,జీవంతిక,రోమశ.
474.తోడేలు=ఈహమృగము,వృకము,కోకము,గొఱియలనూడు.
475.తోలు=అంట,అట్ట,చట్ట,తాట,తొంట,తొక్క,తొడప,కోలుక,పట్ట.
476.త్రాడు=శుల్బము,వరాటకము,రజ్జువు,వటి,గుణము,పాశము.
477.త్రాసు=ఏషణి(క),తరాజు,తులనారాచి,తక్కెడ.
478.దగ్గు=కా(శ-స)ము,డగ్గు,క్ష(య-ప)ధువు,క్షవ(క)ము,
గదాగ్రణి,ఉక్కిస,ఉబ్బసము,కక్కువాయి,కుముటు,గస.
479.దయావంతుడు=దయాళువు,కారుణికుడు,కృపాళువు,సురతుడు, పార్ద్రుడు,సూరతుడు.
48౦.దయ్యము=గాలి,గాము,గ్రహము,పిశాచము,బూచి,సోకుడు.
481.ధనియాలు=కొత్తిమిరివిత్తులు,అల్లక,ఉగ్ర,ఉపదంతము,ధనికము,ధనీకము,ధాన్యాకము,ధేనిక,భిదవేధకము,బీజధాన్యము,
వేషణ,వేసవారము,శాకయోగ్యము,శ్వాసలిక,నిస్సారము,
స్వర్ణిక.
482.దబ్బచెట్టు=కిమ్మిరము,నాదేయి,శర్కరాంకము.
483.దబ్బనము=దబ్బడము,గొనెకుట్టుసూది,బృహత్సూచి.
484.దర్భ=దబ్బ,కుశము,కధము,కూర్చము,పవిత్రము,కొప్పె.
485.దాత=ఈ(గి-వి)కాడు,ఈవరి,చా(తే)గకాడు,ఉదారుడు,త్యాగి,
దానశాండుడు,బహుప్రదుడు,వదాన్యుడు,వితరణశీలి,
స్ధూలలక్షుడు,విసర్జకుడు.
486.దాడిచేయు=ఎత్తు,దండెత్తు,దళమెత్తు,పోటొగ్గు,మార్కొను,
మొనయు,మోహరించు.
487.దానము=త్యాగము,విహాసితము,ఉత్సర్జనము,విసర్జము,
విశ్రాణనము,వితరణము,స్పర్శనము,ప్రతిపాదనము,
ప్రాదేశనము,నిర్వపణము,వర్జనము,అపవర్జనము,
అంహతి,చాగము,వుడుకు,ఈగి,ఈవి,ఇడుట,తేగము,పెట్టుట.
No comments:
Post a Comment