పర్యాయపదాలు-3 67. అయిదు=ఇంద్రియము,పంచమము,జ్ఞానము,
ఇషువు,బాణము మార్గణము,భూతము,శరము,ప్రాణము,
విషయము.
68.అమ్ములపొది=తూణము,తూణీరము,తూణి,ఉపాసంగము,నిషంగము,ఇషుధి,పొది,దొన,తరకసము.
69.అరటిచెట్టు=కదళి,వారణబుస,రంభ,మోచ,అంశుమత్ఫల,
కాష్ఠిల ,ఆనటి,ప్రసువు,గిరిజ,సప్తపర్ణము,
శారదము,విషమచ్ఛదము
70 .అరిదళము =ఆలంతాళము,కనకప్రభము,గోదంతము,
అలము,గౌరీ,లితము,గోరోచనము,తాలము
చిత్రగంధము,నటసంజ్ఞకము,పిండాలకము, పీతనము,పింజరము,మనస్తాలము,
హరితాలము.
71.అరుగు =తి(న్నె)న్నియ,తీనె,జగిలె,జగతి,వితర్ది,వేదిక.
72.అర్జునుడు =ఫల్గుణుడు,పార్థుడు,కిరీటి,శ్వేతవాహనుడు,
బీభత్సుడు,విజయుడు,కృష్ణుడు,సవ్యసాచి,
ధనంజయుడు,నరుడు,కఱ్ఱి,కవ్వడి,క్రీడి,వివ్వచ్చుడు.
73.అఱచేయి =చప్పట,అరచెయి,లోజెయ్యి,ఉద్ఘము,కరతలము,
ఖజ,గోఛాలము,చపటము,చపేటము తలము,
చర్పటము,పర్పరీకము,ప్రహస్తము,ప్రతలము.
74.అల =ఊర్మి,కడలు,తెర,తరంగము,భంగము,
వీచి(క),లహరి.
75.అలచందలు =అలసందెలు,బొబ్బర్లు,అలసాంద్రము,కల్మాషము, కుల్మాషము,యవకము,రాజమౌషము. 76.అల్పుడు =వివర్ణుడు,పామరుడు,నీచుడు,ప్రాకృతుడు,
పృధగ్జనుడు,నిహీనుడు,ఆపశదుడు,జాల్ముడు,
క్షుల్లకుడు,చేతరుడు,చెందిపోతు,మొండికట్టె,టకటొంకు,టాటోటు,టక్కులాడు,పిసాళి,టక్కరి,మడికాడు,ఠవళికాడు,కల్లరీడు,కైలాటకాడు,చెడుగు,బేరజము,దోసకారి,చెనటి,గొంటు,
పాలసుడు,స్తోకుడు,నాలిభూతము,పలువ,
నలువ,తులువ,కూళ,గడుసు.
77.అల్లము =అంగలోడ్యము,అనూపజము,ఆపాకశాకము,
ఆర్ద్రకము,అవోడము,కందరము,కతుభద్రము,
కటుభంగము,కటూత్కటము,కఫారి,గ్రధిలము,
గుల్మమూలము,చంద్రాఖ్యము,భేషజము,రోలము,
మూలజము సాంద్రము,శృంగభేదము.
78.అవమానము =అనాదరము,అభిభావము,అవజ్ఞ,అవహేళనము,
అనూర్షణము,ఒచ్చెము,పరిభవము,పరిభావము,
న్యక్కారము,బన్నము,తిరస్క్రియ,పరీభావము,
రీఢ.
79.అవిసె =అగిసె,అగస్త్యము,ఐకాష్ఠీలము,కాకవాసము,కాకశీర్షము,
పాశుపతము,బకపుష్పము,మునిపుష్పము,
వంగసేనము,వక్రపుష్పము,వసూకము,శాంభవము,
శివప్రియము,శివాపీడనము,శివేష్టము,సుపూరకము,
సువ్రతము,స్ధూలపుష్పము.
8౦.అశోకము
=అంగనాప్రియము,కంకేళి,కర్ణపూరము,దోహాలి,
కింకిరాతము,పల్లవద్రువు,ప్రియంగువు,
విచిత్రము,సుభగము.
81.అశ్వవిశేషములు
=ఆజానేయము,వినీతము,యయువు,జవనము,
పృష్యము,స్ధౌరి,సితము,కర్కము,రధ్యము,
వనాయుజము, కాంభోజము,బాహ్లికము,
స్ధూరి,పారసీకము.
82.అశ్విని = గుఱ్ఱపుచుక్క,ఆశ్వీ,దస్రము,అశ్వము,
తురంగమము,వాజి, హరిహయము.
83.అశ్వనీదేవతలు=అశ్వినీసుతులు,అశ్వినులు,ఆశ్వనీయులు,దస్రులు,నాసత్యులు,స్వర్వైద్యులు.
84.అసత్యము
=వితధము,ఆళీకము,మృష,మిధ్య,అనృతము,
అబద్ధము,పొల్లు,బొల్లు,బొంకు,దబ్బర,కల్ల,
హుళక్కి,బద్దు,బద్దుర,డంబు,టాటోటు.
85.అహంకారము
=అభిమానము,గర్వము,మన్యువు.
86.ఆకలి
=అంగద,అశనాయ,క్షారిక,క్షుత్తు,జిఘత్స,
బుభక్ష,ఆకొంట,గొద,పసి.
87.ఆగాకర
=అడవికాకర,కంకసి,కర్కోటకి,కంకణ్యము,
ఫలపూరకము,వాయసి.
88.ఆబోతు =ఆలపోతు,ఇట్చరము,ఇడ్వరము,ఇత్వరము,
గిబ్బ,గోపతి,బసవడు,ముక్కంటిమావు,
షండము,మూపురపుటెద్దు,ఱంకెలమొకము.
89.ఆకాశగంగ =మందాకినీ,వియద్గంగ,స్వర్ణది,సురదీర్షిక,
తాటిసిడమువానితల్లి,కూతురుబిడ్డ,వెన్నునడుగుపాప,
మిన్నువాక, వేల్పుటేఱు,కదలివెలదుక ముత్త్రోవదిమ్మరి,
9౦.ఆకాశము
=దివము,అభ్రము,వ్యోమము,పుష్కరము,
అంబరము,నభము,అంతరిక్షము,గగనము,
అనంతము,సురవర్త్మముఖము,వియత్తు,
విష్ణుపదము,విహాయసము,నాకము,తారా
పధము,శబ్దగుణము,మేఘద్వారము,రోదసి,
మహాబిలము,నిన్ను,మిన్ను,చదలు,నింగి,
బయలు,ఉప్పరము,ఆకసము,మొగులు.
91.ఆకు =పత్రము,ఫలాశము,ఛదనము,దళము,పర్ణము,
ఛదము,బర్హము.
92.ఆకుపత్రి
=ఆమలకీదళము,ఉత్కటము,తమాలపత్రము,
రోమశకము.
93.ఆజ్ఞ
=ఆనతి,ఆదేశము,ఆన,ఆజ్ఞప్తి,అపవాదము,
ఉత్తరువు,నిర్దేశము,నివేశము,పంపు,ముదల,
శాసనము,హవము.
94.ఆటంకము
=అడ్డగింత,అడ్డపాటు,అడ్డంకి,అడ్డీ,అడ్డు,అంకిలి,
అవరోధము,నిరోధము.
95.ఆట
=తాండవము,నటనము,నాట్యము,లాస్యము,
నృత్యము,నృత్తము,నర్తనము.
96.ఆటపట్టు
=నాట్యశాల,నర్తనశాల,ఆనర్తము,క్రీదాస్ధానము.
97.ఆనబకాయ =సొరకాయ,ఆలానువు,అనుగము,ఇక్ష్వాకువు,
ఏలాబువు,కచదుగ్ధిక,తుంబిక,మహాఫల,తుంబుక.
98.ఆముదపుచెట్టు
=వ్యాఘ్రపుచ్ఛము,గంధర్వహస్తకము, ఏరండము,
ఉరుబూకము,రుచకము,చంచువు,చిత్రకము,
పంచాంగులము,మండము,ఆమండము,
వ్యడంబరము,వర్ధమానము.
99.ఆరెతీగ
=పానీయవల్లి,సుషవికాఫల.
1౦౦.ఆఱు
=శాస్త్రము,షట్,రుచి,కాలము,ఋతువు,కోశము,
రిసద్రవ్యము,షడ్డర్శనము,షడాగమము.
101.ఆర్ద్ర
=పగడపురిక్క,పురజిత్తు,భవము,రౌద్రము,
శర్వము,సాణువు.
102.ఆలస్యము =కాలహరణము,కాలక్షేపము,జాగు,తడవు,
తడయుట,మసలుట.
103.ఆలుమగలు
=జాయాపతులు,జంపతులు,దంపతులు ,
భార్యాభర్తలు.
104.ఆళ్లు =ఆళులు,ఆరుగలు, కొరదూషము, పరీరూషము,
105.ఆవాలు
=అనఘము,ఆసుకి,క్షతకము,ఐంద్రము,
తిక్తగంధ,నాసికావేదనము,వేసవారము,శ్వేతము,
సిధ్ధారము,సుతీక్ష్ణక,సందీపనము,సూరి,రక్షఘ్నము
106.ఆశ్రేష
=సప్పపుచుక్క,అసివేరు,అహి,ఉరగము,
భుజంగము,వ్యాళము,సర్పము.
107.ఆశ్వాస(న)ము =ఉఛ్ఛ్వాసము,ఊరట,ఊరడి,ఊరడింపు ,ఓదార్పు,సాంత్వనము.
108.ఆసక్తి
=ఆపేక్ష,అనురక్తి,ఆసత్తి,ఆస్ధ,పరాయణత,వ్యసనము,శ్రధ్ధ.
No comments:
Post a Comment