పర్యాయపదాలు 8
236.కల్లు
=సుర,సోమము,వస్తువు,అమృతము,హరిప్రియ,
హాల,పరిసృత్తు,వరుణాత్మజ,గంధోత్తమ,ప్రసన్న,
ఇర,పరిసృత,మదిర,కళ్ల్యము,
మద్యము,కల్య,
వారుణి,మధువు,ఆళి,మాధవి.
237.కవచము =కత్తళము,
జోడు,జీర,దుప్పటము,బొందళము,
తనుత్రమము,వర్మ,దంశనము,ఉరశ్చదము ,
కంకటకము,జగరము,ఇందు.
238.కవిరి
=కాచు,అద్భుతసారము,ఖాదిరము,పూగీఫలనిర్యాసము,
రంగదము,సత్సారము.
239.కవ్వము =వైశాఖము,మంధము,మంధానము,మంధదండము.
24o.కషాయము
=క్వాధము,నిష్పక్వము,నిర్యూహము,కసివెండ,మధ.
241.కస్తూరి
=మృగమదము,అండజ,కురంగినాభి,గంధకే(చే)లిక,
గన్ధధూలి,గంధవంతము,నాభిజము,మృగనాభి,
శ్వేతమృగాండజము,ఇఱ్ఱిగోరజము,జిన్కపొక్కిలి,
మెకముటాము.
242.కల్లెము
=రశ్మి,ఖలీనము,కలి(క),వాగె,కలి.
243.కాంతి =ధామము,ఛట,వన్నె,జ్యోతి,ప్రభ,రుచి,త్విట్టు,ఛని,
ద్యుతి,దీప్తి,రోచి,శోచి,వెలుగు,నిగ్గు,డాలు,మించు,జని.
244. కాకర =ఉగ్రకాండ,కాండీర,కారవ (వే)ల్లి ,కారవి,తోయవల్లి,
కాండకటుక,బృహద్వల్లి,రాజవల్లి,వ్రణఘ్ని,వహ్నిమాష,
సుకాండిక,సు(ష-షే)ని.
245. కాకి
=కరటము,అరిష్టము,బలిపుష్టము,సకృత్ప్రజము,ధ్వాoక్షము,
ఆత్మఘోషము,పరభ్రుత్తు,
బలిభుక్కు,వాయసము,చిరజీవి,
ఏకదృష్టి,మాకళి,పిశవర్ధనము.
246.కాకితురుకి
=కాకితూకి,కాకపీలుపు,కాకేందువు,కుపీలువు,నల్ల,
స్ఫూర్జకము,తిందుకము.
247.కాకోలి
=కబరి,కారుబొల్లి,తేలుమణి,మధుర,వీర,అబల.
248.కాగితము =కాకి(త-ద)ము,కా(గి-గ)ముడ,కా(క-గ)లము.
249.కాటుకపిట్ట
=కణాటీనము,కాకచ్ఛవి,ఖంజనము,ఖంజ(రీ-ఖే)టము,
ఖంజరీ,ఖేటము,ఖంజఖేలము,గూఢనీఢము,నీలకంఠము,
భకండము,భమ్రుద.
25౦.కామధేనువు
=వేల్పుటావు,సురభి,వుడుకుదొడుకు,జేజేగడ్డి,తెల్లమొదవు,
చదలుతొడుకు.
251.కాముకుడు
=కమిత,ఆమకుడు,కామయిత,అభీకుడు,,శమి,శలాటువు.
253.కారము
=కటువు,క్షారము,ఒఱ్ఱ,ఒఱ్ఱు,గాటు,ఉగ్రము,ఛండము.
254.కారుపెసర
=అడవిపెసర,కాకముద్గా,ముద్గపర్ణి,వనజాద్గ,హ్రస్వ.
255.కావ్యము =కృతి,గ్రంధము,ప్రబంధము,సందర్భము,కబ్బము,పొత్తము.
256.కార్మికుడు
=కూలివాడు,జీతగాడు,సంబళకాడు,కర్మకరుడు,ఘృష్టీశ్వర
సోరణగండ్లు,గృహముఖము.
259.కిరణము =మయూఖము,అంశువు,గభస్తి,ఘృణి,
ఘృష్టి ,భానుపుకరము,
మరీచ,దీధతి,ఆర్చి,తేజము,ధామ,హేతి,రుచి,రశ్మి,వెలుగు,
శిఖ,గోవు,వసువు,ఉస్రము.
26౦.కిరీటము
=మౌళి,మకుటము,ఉష్ణీవము,బంధురము,కోటీరము.
261.కీర్తి
=యశ(స్సు)ము,సమజ్ఞ,సమాఖ్య,అభిఖ్య,అభిజ్ఞ,
భగము,శ్లోకము,పేరు.
262.కుంకుమపువ్వు
=కుంకుమము,కాశ్మీరము,కాశ్మీరజము,అగ్నిశిఖ,వరము
బాహ్లికము,పీతనము,రక్తము,సంకోచపిశునము,సంకోచము,
పిశునము,కాంతము,రుధిరము,గుడము,కాలేయకము,
ధీరము,లోహితము,చందనము,లోహితచందనము.
263.కుంటెనకత్తె =కర్ణిక,కుట్టని,దూతి,దూతిక,తాసికత్తె,మాధవి,వాణిని,మిటారి,శంభలి,సంభళి,సంచారి,తార్పుడుకత్తె.
264.కుందేలు
=గంధర్వము,శరభము,రామము,సృమరము,గవయము,
శశము,శశకము,చెవులపోతు.
265.కుంపటి =అగ్నిష్ట,అంగారధాని,అంగారశకటి,పుష్పకము,
హసంతి,
హసని.
266.కుక్క
=కాలేయము,సారమేయము,కుక్కరము,మృగదంశకము,
శునకము,భషకము,శ్వానము,గబ్బి,దేపి,జాగిలము.
267కుక్కపొగాకు =కుకుంద(ర)ము,కుక్కురద్రువు,తామ్రచూడము,మృదు
ఛ్ఛదము,సూక్ష్మపత్రము.
268.కుటీరము
=కుటము,కుటిక,కూపాలయము,ఇలువరము,ఇలువారము,
ఇలారము,గుడిసె,గుడుసు,పల్లి.
269.కుబేరుడు
=త్ర్యంబకసఖుడు,యక్షరాట్టు,మనుష్యధర్ముడు,గుహ్యకేశ్వరుడు,
ధనదుడు,రాజరాజు,ధనాధిపుడు,కిన్నరేశ్వరుడు,వైశ్రవణుడు,
పౌలస్త్యుడు,నరవాహనుడు,యక్షుడు,ఏకపింగుడు,ఐలబిలుడు,
శ్రీదుడు,పుణ్యజనేశ్వరుడు.
27o.కుమారస్వామి
=కార్తికేయుడు,మహాసేనుడు,శరజన్ముడు,షడాననుడు,
పార్వతీనందనుడు,స్కందుడు,సేనాని,అగ్నిభువు,గుహుడు,
బాహులేయుడు,తారకజిత్తు,విశాఖుడు,శిఖివాహనుడు,
షాణ్మాతురుడు,శక్తిధరుడు,కుమారుడు,క్రౌంచదారణుడు,పెనువాపక దినువారువమురౌతు
,గట్టుల యెకిమీన పట్టిపట్టి,ఱెల్లుచూలు,
ఆర్గురుతల్లులకొమరుడు,గాడ్పుసంగడికాని కొడుకు,పుంజుదాలుపు
వేల్పులఱేనిదళవాయి,జంటముమ్మోములదంటవేల్పు,
కొంచగుబ్బలి
వ్రక్కలించినబలిదిట్ట,రెండాఱుచేతులదండి మగడు,
వేలుపులమూకపేరిటివెలదిమగడు,వేల్పుగమికాడు,కొమరుసామి, కందుడు.
,
No comments:
Post a Comment