Monday, 12 February 2018

పర్యాయపదాలు-18


                                 పర్యాయపదాలు -18
541.నల్లి=ఉత్కణము,ఉద్దండము,కిటిభము,మత్కుణము,మొగిటి,
              రక్తాంగము,నెత్తురుత్రాగుపురుగు,గోడపురుగు.
542.నల్లేరు=నల్లెరు,వజ్రాక్షి,వజ్రవల్లి,శృంఖన,సృగాలకంఠ,కులిశోదర, క్రోష్టఘంటిక.
543.నవ్వు=అలరింత,స్మితము,(ఉప)హసితము,హసవము,హాసము, హాసము,హాస్యము.
544.నాగలి=కుంతలము,గోకిలము,లాంగలము,సీరము,హలము,
               దుక్కివాలు.
545.నాగముస్తె=కుటన్నటము,టంకణము,జీరపర్ణము,దాశపురము,  పరిపేలవము,ప్లవము,ముస్తకము,వన్యము.
546.నాచు=కుంభిక,కావారము,కుంభి,కుంభికము,కుత్వణము,
         కుష్ఠహారి,గాంగేయము,గృష్టి,ఘృష్టి,జంబాలము,జర్జరము,
          జలకేశము,మంజులము,వారాహి,వారిచత్వరము,వారిపర్ణ,
          వారిమూలి,వితున్నము,విష్వక్సేనప్రియ,వ్యవక,శేవలము,
             శైవలము,శైవాలము,నీటిపాచి,తీగపాచి.
547.నాట్యము=తాండవము,నర్తనము,నటనము,నృత్యము,నృత్తము,
                     లాస్యము.
548.నానావర్ణసంకరము=చిత్రము,కిమ్మీరము,కల్మాషము,శబలము,  కర్బురము.
549.నామధేయము=ఆఖ్య,అభిక్య,ఆహ్వయము,అభిధానము,
                     నామము,పేరు.
55౦.నారి=అరి,అల్లెత్రాడు,గొన(య)ము,గుణము,జయా,మౌర్వి,శింజిని.
551.నారింజ=నారంగము,నారదము,నాదేయి,భూమిజంబుక,ఐరావణము,  కంటకి ,ఇరావతము,కిమ్మీరము,కిర్మీరము,గంధపత్రము. గంధాడ్యము,గోధూమము,చక్రాధివాని,గోరక్షము, చోళకి,చోలనము   
552.నాలుగు=అబ్ది,సాగరము,చత్వారి,వనరాశి,యుగము,అంబుధి,   వార్ధి,గతి,జలధి,నీరధి.
553.నావ=నౌక,కప్పలి,కలము,తరండము,తరణి,తరీషము,తారణి,
       తర్తరీకము,పోతము,యానపాత్రము,వహనము,హోడము,
              వహిత్రము.
554.నింద= ఆవరణము,ఆక్షేపము,నిర్వౌదము,నిందనము,
           పరీవాదము,అపవాదము,ఉపక్రోశము,గర్హణము,దూఱు,
             సెగ్గింపు,అపదూఱు,అధిక్షేపము.
555.నిచ్చెన=ఆరోహణము,అధిరోహిణి,తాప,నిశ్శ్రేణి.
556.నిడువు=ఆయతము,ఆయామము,ఆరోహము,దైర్ఘ్యము,
              విస్తృతము,నిడుద,నిడివి,పొడు(గు)వు.
557.నిప్పు=అంటనిజేజే,కప్పుత్రోవరి,కరువలి,విందు,కష్టుత్రోవరి,
              గాలిమాలి,చౌగంటి,తగరురౌతు,తిరుకాళ్ళదేవర,
        దుగమోములయ్య,నీటిచూలి,వేడివేల్పు,వేల్పులమొగము,
             సతనాల్కలజేజే,సెగదేవర.
558.నిద్ర=శయనము,స్వానము,స్వప్నము,సంవేశము,నిదుర,
             నిద్దుర,కునుకు,కూర్కు,కనుమోడ్పు.
559.నిమ్మ=ఐరావతము,పారేవతము,రుద్రాక్షము,రైవతకము,ఈడ, ఎఱ్ఱకిత్తలి,కరుణము,కాకఫలము,క్షుద్రామ్ల,గంభీరము,
        గిలము,జంబిరము,జంబీరము,జంభము,జంభరము,
               జాఫలము,జహువు,దంతసఠము,లకుచము.
560.నిరృతి= రాక్షసుడు,శాణవుడు,క్రవ్యాత్తు,అస్రవుడు,ఆశరుడు,
    రాత్రించరుడు,కర్బురుడు,నికషాత్మజుడు,యాతుధానుడు,
              పుణ్యజనుడు,యాతు,రక్కసి,పొలదిండి,రేద్రిమ్మరీడు,
             సొకుమూకలదణి.
561.నీచము=అధమము,అవమము,అవద్యము,అణకము,అర్వము, ఉక్కితము,కువూయము, కుత్సితము,ఖేటము,
    క్షుల్లకము,గర్హ్యము,జఘంయము,చేలము,న్యక్షము,
                నికృష్టము,ప్రతికృష్టము,యాప్యము,రేఫము.
562.నీరుకోడి=బొల్లికోడి,బుడకోడి,పుల్లగోరక,గుండగి,చిలవ,
                 జలకుక్కటము,పరిప్లవము.
563.నీరుల్లి=ఎఱ్ఱగడ్డ,ఎఱ్ఱయుల్లి,క్రిమిఘ్నము,తీక్ష్ణకందము,నికేతనము, నీచభోజ్యము,పలాండువు,ముఖదూషణము,లోహిత
     కందము,విశ్వగంధము,శూద్రప్రియము,సుకందము.
564.నువ్వులు=తిలలు,ఫలకము,పూతధాన్యము,దలాఢకము,
            సారాలము,సుబంధము,స్నేహఫలము,హేమ్యధాన్యము,
               తెలికలు.
565.నూనె=తిలభవము,తిలరసము,తిల్యము,తైలము,స్నేహము,
                 తలచమురు.
566.నూయి=ప్రహి,అంధువు,ఉదపానము,కూపము,బావి,నుయి,
                 నూయ,చలమ,దొరవు.
567.నెత్తురు=నెత్రు,ఎఱ్ఱ,నల్ల,అంగజము,అసృక్కు,అస్రము,అసృవు,కింకర,కీలాలము,క్షతజము,రక్తము,రుధిరము,రో(లో)  హితము,శోణితము.
568.నెమలి=మయూరము,బర్హిరము,హరి,బర్హి,నీలకoఠము,నమ్మి,భుజంగభుక్కు,సారంగము,శిఖావలము,శిఖికేకి,నెమ్మి,
                మేఘనాదాలాపి,నట్టువపులుగు.
569.నేయి=ఆజ్యము,అమృతము,ఘృతము,జీవనము,బభ్రువు,
              వాజము,నెయ్యి,సర్పి,హవిస్సు,చమురు.
570.నెలయల్లుడు=ఆమనిచెలి,కందుడు,కన్నులవిల్కాడు,చక్కనయ్య,డెందమ్ముచూలి,తలపుమాలి,దుంటవిల్తుడు,నెలివిల్తుడు,
     పచ్చవాహనజోదు,మరుడు,వల(దొర)రాజు,నిరి(వి)
                విల్కాడు,నెడవింటిసొగసరి.       
         
 
    
                          

No comments:

Post a Comment