Wednesday, 14 February 2018

పర్యాయపదాలు-26

                                 పర్యాయపదాలు -26
751.మరువము=కులసౌరభము,కులకము,ఖరపుష్పము,జంబీరము,
                      తిల్ల(క)ము,తిల్వ(క)ము,దలామలము,ప్రస్తపుష్పము,
                      మరువు,మరువకము,శీతలము.
752.మఱుగు=అంతరము,అంతర్ధ,అంతర్ధి,అపవారణము,అపిధానము,
                   ఆచ్ఛాదనము,తిరోధానము,పిధానము,వ్యవధ.
753.మఱ్ఱి చెట్టు=కర్మజము,కాంచనము,క్షీరద్రుమము,క్షీరము,క్షీరి,జటి,
                     ధృవము,నంది,న్యగ్రోధము,పాదరోహము,బహుపాత్తు,
                     బహుపాదము,యక్షావాసము,రక్తపలము,రోహి,వటము,
                      వనస్పతి,విటపి,క్షీరకాష్ఠ,గుటిక.
754.మల్లె=అష్టాపది,ఆస్ఫోట,కుటజ,గంధవతి,గిరిజ,త్రిపుర,నారీష్ట,ప్రమోదని,    భద్రవల్లి,ముక్తబంధన,మల్లిక,రాజపత్రి,వనచంద్రిక,వల్లిక,వార్షికి,
            విటప్రియ,శీత,శ్రీపది,షట్పదప్రియ,సురూప,సులభ,సువర్ష,సౌమ్య,
              హసంతి,మహామేద,జీవని,దేవమణి,వసు చ్ఛిద్ర .
755.మహాదేవుడు=మహేశ్వరుడు,మృడుడు,మృత్యుంజయుడు,మహానటుడు,   మహాకాలుడు,ముక్కంటివేల్పు.
756.మహిషము=లులాయము,వాహద్విషము,కాసరము,సైరిభము,దుంత,   ఎనుబోతు,దున్న,జమునెక్కిరింత.
757.మాంసము=పిశితము,తరసము,పలలము,క్రవ్యము,కుల్యము,ఎఱచి,
                   పొల,పొలను,నంజుడు,ఈరుపు.
758.మాచిపత్రి=కుక్కురము,గ్రంధిపర్ణము,బర్హము,బరపుష్ప,శుకము,   స్ధౌణేయము.
759.మాట=ఉక్తి,గోవు,పలుకు,భారతి,భాషితము,లపనము,లసితము,
              వచనము,వక్తవ్యము,వ్యాహారము,ఇడ,ఇల,ఇర.
760. మాణిక్యము=అరుణోపలము,కురు(బిల్వ-వింద)ము,కూప్యము,
                 తరుణము,పద్మరాగము,రంగమణి,రత్నరాట్టు,రవిరత్నము,
                 లోహితము,లక్ష్మీపుష్పము,శృంగారి,శోణ(ఫల-రత్న)ము,
                శౌగoధికము.
761.మాదీఫలము=అంబుకేశరము,కేసరామ్లము,గంధామ్లము,ఫలపూరము, బీజపూరము,(మాతు)లుంగము,రుచకము,లుంగుషము,
         వనబీజము,శ్వఫలము,సీధురాక్షము,సుకేసరము,సుపూరము,
                 శౌగంధికము.
762.మానేరు=మానెరు,కౌష,కోష్ఠ,చందన,ప్రతానిక,బస్తాంద్రి,తూమెన,శారబ, జ్యోతిష్మతి,ఎక్కుడుదీగ.
763.మామిడి=ఆమ్రము,అంబరీషము,ఆమ్రాతకము,కామవల్లభము,కామ
                     వల్లభము,కామశరము,కామాంగము,కీరేష్టము,కోకిలానం
                    దము,కోకిలావాసము,గంధబంధువు,చామరపుష్పము,
                     చూతము,మాకందము,రసాలము,అంబాళము,అంబష్ఠ,
                    ఆమ్లపాటలము,ఆమ్లాతకము,కపిచూడ,కపిచూతము,
                    కపీతనము,టంకము,బృహద్బీజము,రక్తపుష్పము.
764.మారేడుచెట్టు=బిల్వము,బిలువము,శాండిల్యము,శైలూషము,శ్రీఫలము,శ్రీప్రదము,మాలూరము,శ్రీప్రియము,లక్ష్మీప్రదము,లక్ష్మీప్రియము,
765.మార్గము=ఆయనము,ఋతి,సృతి,పంధ,వర్త్మము,అధ్వము,పదవి,త్రోవ,  దారి,తెన్ను,తెరువు,తెర్వు,వీధి,జాడ,తెరగు,తెరుకువ,రస్తా,
                 నడవ,కంత,క్రంత,సరళి.
766.మార్గస్ధుడు=అధ్వగుడు,అధ్వనీనుడు,అధ్వన్యుడు,ఇత్వరుడు,తెఱువరి,   దారినడచువాడు,పాంధుడు,బాటసారి.
767.మాలవాడు=చండాలుడు,ప్లవుడు,మాతంగుడు,దివాకీర్తి,జవంగముడు, నిషాదుడు,శ్వపచుడు,అంతేవాసి,పుల్కసుడు,అంత్యజుడు,
                  హరిజనుడు.
768.మిడుత=ఆకుపురుగు,దివ్వెయార్పు,మిడత,చీరకము,పతంగము,
                 శలభము.
769.మిధునము=ఆల్మగలజత,జమిలి,జోడు,దోయి,దొందము,ద్వయము,
                   ద్వయి,యమళము,యుగళము,యుగ్మము,యురకము.
770.మినుములు=ధాన్యమాషము,మాషకము,ఉద్దులు.
771.మిరియము=ఊషణము,కోలకము,కృష్ణము,మరీచము,వేల్లజము.
772.మీగాలు=పాదాగ్రము,ప్రపదము.
773.మీజెయి=కరోపరిభాగము,మెడచేయి,మీగయి,వెన్కచేయు.
774.మీనవల్లంకి=మీనవల్లి,వర్తిక,మీన్ముచ్చుపులుగు.
775.ముంగిస=నకులము,కోటీరము,కౌశికము,పింగళము,బభ్రువు,ముంగి,
                వంచకము,సర్పారి,బలి, శుచివక్రము.
776.ముంజేయి=కక్ష,కక్ష్య,కపోణి,కీలము,కూర్పరము,ప్రకోష్టము,
               మణిబంధము,తొట్టికట్టు,మ(డి)నికట్టు,ముంగేలు,ముంజే.
777.ముందు=తొలి,తొల్లి,తొలుత,పూర్వము,ముందర,మును(పు).
778.ముక్కు=ఘ్రాణము,గంధవహ,ఘోణ,నాస,నాసిక,నశ్య,ముకు.
779.ముట్టుత=ఆత్రేయి,ఉదక్య,పుష్పవతి,పుష్పిణి,బహిష్ఠ,ఋతుపతి,
                  మలిన,ముట్టుది,రజస్వల.
780.ముఖము=వక్త్రము,ఆస్యము,వదనము,తుణము,ఆననము,లపనము,  ప్రతీకము,మొగము,మోర,మోము,వాయిమూతి.                        
                     

2 comments:

  1. భారతి పర్యాయ పదాలు ఏవి?

    ReplyDelete