పర్యాయపదాలు-33
944.శిల=పాషాణము,ప్రస్తరము,గ్రావము,ఉపలము,అశ్మము,ఱాయి,
దృషత్తు.
945.శిశువు=పోతము,అర్భకము,డింభకము,పృధుకము,శాబకము,
బిడ్డ,నిసుగు,నిసువు,పిల్ల,పూప,కుఱ్ఱ,బుడత,చిఱుత,పాప,
కూన.
946.శిశ్నము=ఉత్తమాంగము,ఉపస్ధహ,కామలత,కామాంకుశము,
జఘన్యము,ధ్వజము,మేఢ్రము,మేహనము,లాంగలము,
(పుం)లింగము,పుంశ్చిహ్నము,పురుషాంగము,చర్మదండము,
శేఫము,సాధనము,కామ,కోల,చుల్లి,బడ్డు,బుల్ల,మగగుఱి,
లొట్ట(కాయ).
947.శిష్యుడు=చట్టు,బంటు,అంతేవాసి,ఛాత్రుడు,
శైక్షుడు.
948.శుక్రుడు=దైత్యగురువు,కావ్యుడు,ఉశసనుడు,భార్గవుడు,రవి,
భృగువు,అప్సుజుడు,సితుడు.
949.శుభము=శ్వశ్రేయసము,శమ్,శివము,అరిష్టము,రిష్టము,భద్రము,
కళ్యాణము,మంగళము,భావుకము,భవికము,భవ్యము,
కుశలము,క్షేమము,శస్తము,బాగు,లెస్స,మేలు.
950.శుభ్రము=అభ్రకము,తెలుపు,తెల్లనిది,ప్రకాశించునది,నిర్మలము,
నైర్మల్యము,స్వఛ్చము,అఛ్చము,ఒకగ్రహప్రయోగము.
951.శూద్రుడు=
అపరవర్ణుడు,వృషలుడు,జఘన్యుడు,జఘన్యజుడు.
952.శూన్యము=ఆకాశము,అవకాశము,రోదసి,మేఘపధము,మెయిలుదారి,
గగనము,అంతరిక్షము,మరుత్పధము.
953.శివుడు=శంభుడు,శర్వుడు,శంకరుడు,శితికంఠుడు,శ్రీకంఠుడు,సర్వజ్ఞుడు.
954.శ్రమ=అలయిక,బడలిక,అలవు,సేద,వడ,అలసట.
955.శ్రవణము=కరివేల్పురిక్క,తూపురిక్క,మురజిత్తు,వైష్ణవము,శ్రీకాంతము, శ్రీశము,హరి,
956.శ్రేష్ఠవాచకము=శార్దూల,వ్యాఘ్ర,సింహ,శరభ,వృషభ,పుంగవ,వరాహ,
తల్లజ,ఇంద్ర,చంద్ర,తిలక,రత్నాదిశబ్దములు, కన్నాకు,వర,
తలకట్టు,మేలుబంతి.
957.సంచి=ఆసిమి,గోతాము,గోనె,గోణి,జోలె,తిత్తి,పట్టా.
958.సంతుష్ఠుడు=హృష్టుడు,మత్తుడు,తృప్తుడు,ప్రహ్లన్నుడు,ప్రముదితుడు,ప్రీతుడు.
959.సంతోషము=ముదము,ప్రీతి,ప్రమదము,హర్షము,ప్రమోదము,హర్షము, ఆమోదము,సమ్మదము,ఆనందము,శర్మ,శాతము,సుఖము,
హోళీ,కౌతుకము,ఎలమి,వేడుక,నెమ్మి,సంతసము,ఇంపు,
సొంపు,అలరు.
960.సంపద=సిరి,లచ్చి,కలిమి,విభూతి,భూతి,ఐశ్వర్యము,శ్రీ,లక్ష్మి,
భగము,పడతి.
961.సంపంగి=సంపగి,సంప(o)గె,సంపగియ,కాంచనము,చంపకము,
చాంపేయము,పుస్పేందువు,ప్రియసందేశము,శుభగము,
సురభి,స్ధిరపుష్పము,హేమాంగము.
962.
సంశయము=అనుమానము,ఆంతకము,త్రుటి,శంక,ద్వాపరము,
యుతకము,సందియము,సందేహము.
963.సజ్జలు=సర్జము,గంటెలు,
గర్ముత్తు.
964.సజ్జాకారము=క్షారము,శ్రోతఘ్ని,సజ్జిక,సువర్చలసారము.
965.సతతము=సంతతము,ఎపుడు,ఎడపక,ఉడుగక,ఎల్లప్పుడు,నిచ్చ,
నిచ్చలు,సదా,అనవరతము,నిరతము,రతము,అజస్రము,
ఎడతెగనిది.
966.సత్తు=సీసము,కుష్ఠకము,నాగము,బీజము,రోగేష్టము.
No comments:
Post a Comment