పర్యాయపదాలు
-25
731.భుజము=బుజము,మూపు,రెట్ట,అఱక(డ),అఱకడము,ఎఱక,అంసము,
కొప్పరము,నితంబము,ప్రగ్రహము,ప్రవేష్టము,వాహము.
732.భుజించుట=మెసవు,మెసగు,ఆరోగిణమొనర్చు,మెక్కు,తిను,కుడుచు,
ఆరగించు,సాపడు, నమలు.
733.భూమి=అచల,అనంత,విశ్వంభర,రస,స్ధిర,ధరిత్రి,ధరణి,క్షోణి,జ్యా,క్షితి,
కాశ్యపి,సర్వంసహ,వసుమతి,వసుధ,ఉర్వి,వసుంధర,గోత్ర,
కు:,పృధివి,పృథ్వి,క్ష్మా,అవని,మేదిని,మహి,విపుల,గహ్వరి,
ధాత్రి,ఇల,కుంభిని,క్షమ,జగతి,రత్నగర్భ,భూతధాత్రి,
అబ్దిమేఖల,పంటవలతి.
734.భోగస్త్రీ=వేశ్య,గణిక,వారస్త్రీ,రూపాజీవ,వాడవదినె,వేల్పుబానిస,
వెల(యాలు),వెలది,వేడ్కగత్తె,బోగముచాన,వెల్లాటకత్తె,పడుపు
చెలి,ఆట(చేడియ)వెలది,గడనకత్తె,భోగిని,నటి,గ్రామణి,బంధుర,
లంజె,రోచెలువ,లయ్య,తొత్తు,ముండ,సాని.
735.భోజనపాత్ర=తట్ట,కంచము,హరివాణము,పళ్ళెరము,తళియ,తెలె.
736.భోజనము=ఆరగిం(త)పు,అరోగిణము,కుడుపు,తింట,తిండి,భాతు,
బుత్తి,బూతి,బోనము,అశనము,ఆహారము,ఖాదనము,
గెరణము,నిఘనము,ప్రాశనము,భుక్తి,భోగము,వేప(న)ము,
లేహ(న)ము.
737.మంగలి=అంతావసాయి,క్షురి,గ్రామణి,దివాకీర్తి,నాపితుడు,ముండి.
738.మంచము=కంక(గ)టి,ఖట్వ(ము),ఖట్విక,పర్య(ల్య)oకము.
739.మంచు=అవశ్యాయము,నీహారము,తుషారము,తుహినము,హిమము,ప్రాలేయము,మహిక,మిహిక,హిమిక,హేమ,ఇరము,ఇగము,వలి.
740.మంత్రి=అమాత్యుడు,ప్రెగడ,ప్రెగ్గడ,నియోగి.
741.మఖ=జన్నపుజుక్క,పిత,పితృభ,పైత్ర,మేఖల.
742.మజ్జిగ=మార్జిక,మోరట,రసాయనము,మోరి,మోరు,తక్రము,చల్ల,
అరిష్టము,కాలశేయము,గోరసము,ఘనరసము,ఘోలము,
ఘోళము,దండాహతము,మధితము,కచ్చరము,కటురము,
స్తన్యజము.
743.మఠము=మటము,ఆశ్రయము,చైత్యము,నిలయము,ప్రవజ్య.
744.మణిశిల=ఉత్తమ,కరీల,కవర,కామదూత,కరవీరక,కల్యాణిక,కునటి,
గోధ,తాలిక,నాగమాత,మనశ్మిల,మనోగుప్త,మనోహ్వ,విగంధ,
సురాగము.
745.మత్తుడు=ఉత్కటుడు,క్షీలుడు,శౌoడుడు.
746.మధ్యవ్రేలు=నిదివివ్రేలు,నడివ్రేలు,కర్ణిక,మధ్యమాంగుళి.
747.మనుష్యుడు=మానుషుడు,మర్త్యుడు,మనుజుడు,మానవుడు,నరుడు, పంచజనుడు,పురుషుడు,పూరుషుడు,జనుడు.
748.మన్మధుడు=మదనుడు,మారుడు,ప్రద్యుమ్నుడు,మీనకేతనుడు,
కందర్పుడు,దర్పకుడు,అనంగుడు,కాముడు,స్మరుడు,
పంచశరుడు,శంబరారి,మనసిజుడు,కుసుమేషువు,
అనన్యజుడు,పుష్పధన్వుడు,రతిపతి,మకరధ్వజుడు,
ఆత్మభువు,శృంగారయోని,శ్రీపుత్రుడు,శూర్పకారాతి,
బ్రహ్మసువు,ఋష్యకేతువు,విశ్వకేతువు,అలరువిల్తుడు,
కన్నుల అలరువిల్తుడు,ఇంచు(ఇగురు)విల్తుడు,ఎల్లప్పుడు
ద్రిమ్మరుతేరుదొర,కన్నుల(కమ్మ)విల్కాడు,కలుములగరిత
బిడ్డ,కోయిలతెగదణి,చక్కనయ్య,చక్కెర(చిగురాకు)విలు
కాడు,చిలుకరవుతు,చెఱకువిల్తుడు,చౌవంచ(తూపుల)
ముల్కులజోదు,తలపుచూలి,తలిరువిల్తుడు,తామరతూపరి,
తావివిల్తుడు,తూడువిల్తుడు,
తియ్య(తుంట)విలుకాడు,
తేటితెగదణి,
తేటియల్లెవాడు,నవవిలుకాడు,నేయ్యపుఱేడు,
నెలయల్లుడు,పంచదారతిండితేజిరవుతు,పచ్చవార్వపుజోదు,
పూవింటి,బేసికైదువ
బేసికైదువజోదు,పువ్విల్తుడు,పూవింటి,
మరుడు,రాచిల్కనెక్కురౌతు,మయిసున్నవజీరు,లచ్చికొడుకు,
వలరాజు,వాలుగడాలు,వెడవింటి,కoతుడు,సొగసుకాడు.
749.మయూరశిఖి=ఈక్షితసహ,కేకిశిఖి,బర్హిపర్ణి,శిఖ.
750.మరణము=పంచత,కాలధర్మము,ప్రళయము,త్యజము,అంతము,
నాశము,మృత్యువు,నిధనము,దీర్ఘనిద్ర,హింస,ప్రమీలనము,
కాలము.
No comments:
Post a Comment