Wednesday, 14 February 2018

పర్యాయపదాలు 30


                          పర్యాయపదాలు -30
861.లేడి=అజినయోని,ఇఱ్ఱి,కందలి,కురంగము,గోకర్ణము,చమూరువు,
            చీనము,న్యoకువు,పృషతము,ప్రియకము,మృగము,రంకువు,
            రురువు,రోహితము,వాతాయువు,వృజినము,శంబరము,
             సమూరువు,సారంగము,హరిణము.
862.లొద్దుగు= ఘనము,తిరీటము,పిల్వకము,పట్టికాహ్వాయము,
                  లోధ్ర(ము).
863.వంకాయ= వంగ(ము),వార్త, వార్తాకువు,వార్తాకశలాటువు,
               శాకబిల్వకము.
864.వంకరయైనది=అరాళము,వృజినము,జిహ్మము,ఊర్మిమంతము,
                కుంచితము,నతము,ఆవిధ్ధము,కుమలము,భుగ్నము,
                 వేల్లితము,వక్రము,క్షేడము,నెఱి(డొంక)యయినది.
865.వంటవాడు=సూపకారుడు,ఆరాళికుడు,అంధసికుడు,సూదుడు,
              ఔదనికుడు,గుణుడు,పాచకుడు,బానసీడు.
866.వంటిల్లు=బోనపుటిల్లు,వంటకొట్టము,వంటసాల,సువారంపుటిల్లు,
               అట్టశాల,పాకస్ధానము,బానసము,మహానపము,రసవతి.
867.వంశము=సంతతి,గోత్రము,జననము,కులము,అన్వయము,
                వంగడము,వంగసము,అన్వాయము.
868.వచించు=అను,నుడువు,వక్కాణిoచు,ఆడు,చెప్పు,వినుచు,వాక్రుచ్చు,
              పలుకు,భాషించు.                                                                869.వజ్రాయుధము=హ్రాదిని,వజ్రము,కులిశ,భిదురము,పని,శతకోటి,
               దంభోళి,అశని,స్వరువు,గోవు.
870.వడ్రంగి=వడ్లంగి, వడ్లవాడు,రక్ష,త్వష్ట,రధకారుడు,వర్ధకి.
871.వడ్లు=అకృష్టము,తృణధాన్యము,నీవారము,నివ్వరిధాన్యము,పాకి,
             శాలిధాన్యము.
872.వతి=వర్తి,వటి,దశ.
873.వదరుబోతు=ప్రేలరి,జల్పాకుడు,ప్రలాపి,బహుగర్హ్యవాక్కు,వాచాటుడు,
                 వాచాలుడు.
874.వరగోగు=పుండికూర,ఉహ్ట్రాశము,కులకప్రియము,గుడఫలము,
               గుల్మవినాశనము,తీక్ష్ణ ఫలము,పీలుపు,విరేచనఫలము,
               బృహత్పీలువు.
875.వరుణపాశము=నాగపాశము,నాగము,పాపతూపు,పాపరము.
876.వరుణుడు=ప్రచేతసుడు,పాళి,నీటిఱేడు,యాదసంపాతి,ఆస్పతి,
                     ప్రాచేతసుడు,ప్రచేతుడు,పడమటిదొర,వల్లెత్రాడుతాల్పు,
                   నీళ్ళరాయడు,ఏటిబోటిమగలయెకిమీడు,నీటియొడయడు,
            అపాంపతి,మొయిలుఱేడు,మేఘాధిపతి,జడిసామి,మొసలిరౌతు.
878.వర్తకుడు=వైదేహకుడు,సార్ధవాహుడు,వైగముడు,వాణిజుడు,వణిజుడు,
                 పణ్యాజీవుడు,ఆపణికుడు,క్రయవిక్రయకుడు.
879.వలె = ఇట్లు,బలె,పోలె,వంటి,ఉద్ది,ఈడు,తుల,సమానము,జత,సరి,
              తుల్యము,సదృశము,సంకాశము,నీకాశము,నిభము,మిత్రము,
                 బంధువు,చుట్టము.
880.వన=ఉగ్రగంధ,క్షుద్రపత్రి,కర్షణి,గంధోగ్ర,దీపిక,చండక,పులోమ,లోమశ,
             వచ,శతపర్వ,షడ్గ్రంధ,సుపద్మ,స్వరాలువు,హైమవతి.
881.వసా(రా)ర=పంచ(పాక),పంచపాళి,పంచాది.
882.వస్త్రము=పుట్టము,దువ్వలువ,చీరె,చీర,కోక,వలువ,ఆచ్ఛాదనము,
               వాసము,చేలము,వసనము,అంబరము,అంశుకము,కశివువు,
                పటము,గింటెము.
883.వాంతి=ఓకిలింత,కక్కు,డోకు,ఉద్గమము,ప్రచ్ఛర్దిక,వమధువు,
                వమనము,వమి.
884.వాకుడు=కంటకారిక,కంటకిని,క్షుద్రధావని,దుష్టస్పర్శ,నేలములక,
                 బహుపుత్రిక,విదగ్ధి,వ్యాఘ్రి,సింహి.
885.వాన=చిత్తడి,జడి,జల్లి,జల్లు,తొలకరి,దల్లు,ముసురు,సోవ,
             అంబరీషము,ఆసారము,మేఘపుష్పము,వర్షము,వృష్టి.
886.వానపాము=వానపేగు,ఎఱ్ఱ,కించుటకము,కుసురీ,క్షితినాగము,
             గండూపదము,భూనాగము,మహీలత,వరాభువు.
887.వానకోయిల=చాతకము,సారoగము,స్తోకకము.
888.వాము=ఓమము,ఇందులేఖ,కారవి,ఖరాశ్వ,తీవ్ర,తురుష్క,దీప్యము,
              మయూరము,యవని,యూకము,లోచమస్తకము.
889.వాయుదేవుడు=శ్వసనుడు,స్పర్షనుడు,మాతరిశ్వుడు,పృష
              దస్వుడు,గంధవహుడు,గంధవాహుడు,అనిలుడు,ఆశుగుడు,
              సమీరుడు,నభస్వంతుడు,మారుతుడు,మరుత్తు,జగత్ప్రాణుడు,
               సమీరణుడు,వాతుడు,ప్వుడు,పవమానుడు,ప్రభంజనుడు,
              ప్రకంపనుడు,అతిబలుడు,ఝంఝావాతుడు,నీటితాత,గాలి,
             కరువలి,తెమ్మెర,ఈద,వలి,మరుతేరు.
890.విగ్రహము=ప్రతిమానము,ప్రతిబింబము,ప్రతిమ,ప్రతియాతనము,
                ప్రతిచ్ఛాయ,ప్రతికృతి, అర్చ,ప్రతినిధి.

                                    

No comments:

Post a Comment