పర్యాయపదాలు 7
211.కడుపు =కుక్షి,గర్భము,ఉదరము,జఠరము,పిచం(డి)డము,
తుందము,డొక్క, బొట్ట,బొజ్జ,బొఱ్ఱ.
212.కణుదురీగ =కందురీగ,గండోలి,గంధోలి,గృహకారి,గంధాలి,భృంగము,
భ్రమరకీటము,వ(ర-రో)లము,భృంగరోలము,వరటము,
విషసూకము,విషశృంగి,శూకకీటము.
213.కత
=కధ,ఆఖ్యాయిక,కధానిక,ఇతిహాసము,ఉదంతము,
గాధ,చరిత(ము),చారిత్ర(ము).
214.కత్తి
=ఖడ్గము,అసి,రిష్టి,కృపాణము,కరవాలము,కౌక్షేయకము,
చంద్రహాసము,రిష్టము,టంకము,వాలు,అలుగు,కైదువు,
అడిదము.
215.కదలింపబడినది
=వేల్లితము,ప్రేంఖితము,ఆధూతము,చలితము,
ఆకంపితము,ధుతము.
216.కదలునది
=చలనము,కంపనము,కంప్రము,లోలము,చలాచలము,
చంచలము,తరళము,పారిప్లవము,పరిప్లవము.
217.కనుపాప=కనీనిక,కామనిక,గోలము,తార(క)ము,సింగినాదము నల్లగ్రుడ్డు,కంటిపాప,పాప.
218.కనుబొమ్మ =ఆవి,కూర్చిక,కోదండము,భ్రూవు,బొమ.
219.కన్నీరు
=అశ్రువు,నేత్రాంబువు,రోదనము,అస్రువు,బాష్పము.
22౦.కన్ను
=కుక్షి,చక్షువు,నేత్రము,నయనము,దర్శనము,
దృక్కు,దృష్టి.
221.కన్య =కన్నె,కుమారి,బాలిక,వధూటి,వృషలి.
222.కపటము
=వ్యాజము,దంభము,కుసృతి,నికృతి,ఉపధి,ఛద్మము,
కైతవము,కుత్సితము,దగా,మోసము,నికృతము,
వంచన,కుచ్చితము,అపదేశము,ద్రోహము,పొర,
కృత్రిమము,ఠవళి,ఠక్కు.
223.కప్ప
=భేకము,మణ్డూరము,వర్షాభువు,శాబూరము,ప్లవము,
దర్దురము,అంజిరము,సారంగము,దాటరి.
224.కప్పము
=పన్ను,కరము,అరి,భాగధేయము,దండము,కానుక,బలి.
225.కమండలువు =కకుంభము,కమండలము,కరకము,కుసుంభము,
చైత్యముఖము,జారీ,బుడ్డిగ,వోలె,కైతట్టు.
226.కరివేము =కాలశాకము,కృష్ణనింబము,కైడర్యము,సురభిఛ్చదము.
227. కఱవు =క్షామము,(అ)వగ్రహము,దుర్భిక్షము,అడిత్రాడు,కాటకము,
నిట్ట.నెవ్వ,
228.కరుణ
=కృప,ఘృణ,అనుకంప,కారుణ్యము,కనికరము,
అనుక్రోశము,అక్కటికము.
229.కర్కాటకము
=కటకము,కులీరము,కర్కి,కర్కిణీ,నిచళి.
23౦.కర్పూరము
=ఘనసారము,చంద్రసంజ్ఞము,హిమవాలుక,సితాభ్రము,
ఘనము,హిమము,సిరము,గంబూర.
231.కలకండ
=ఫాణితము,మధూత్ధ,మాధవి,గుడశర్కర,గుడోద్భవ,
సితోఫల,కండచక్కెర,పటికబెల్లము.
232.కలము
=ఇషీక,కలము,సూచిక,కూర్చిక,వర్ణిక,పేనా,మసిపధము,
లేఖరి,వర్ణికా .
233.కలివె =కరవంది,
క్షీరఫల,ఆమ్లపుష్పఫల.
234.కలువ
=కువల(య)ము,ఉత్పలము,కల్హారము,కలుహారము,
కహ్లారము,తమ్మి,కుముదము,కైవరము,ఇందీవరము,
తొగ,తొవ.
235.కల్ల
=జల్లి,జోకు,టక్కు,టవళి,డబ్బ(ఱ),తటపట,తవళి,తసుకు,
టాటోటు ,నసుకు,,పొల్లు,బురుడు,బూక,బూటకము,
బొల్లు,వట్టి,హుళక్కి,సట.
సూపర్ గా తయారు చేసావు అందరికీ ఉపయోగపడుతున్నాయి
ReplyDeleteఈకాడ జవాబు లేదు సార్ /mam
ReplyDelete