పర్యాయపదాలు 6
181.ఏడుపు
=ఆక్రందనము,అఱపు,కృష్ణము,క్రందనము,
క్రందితము,మొరలిడుట,రుదితము,రోదనము,
వాచరచుట,వాపోవుట.
182.ఏనుగు =దంతి,దంతావళము,ద్విరదము,అనేకపము,
ద్విపము,సింధురము,సామజము,మాతంగము, కుంబి,మరావళము,మతంగము,గజము,నాగము, కుంజరము,వారణము,కరి,ఇభము,స్తంబేరము, పద్మి,పలుదోమ్ములమెకము,ఎక్కుడుమెకము, బలుహజ్జమెకము,చేగాలమెకము,గౌరు,గవురు,
కలభము.
183.ఏరుపిడక =ఏఱునుగ్గు,నుగ్గు,పరట,పిడుక,పంట,క(క)రీషము,
ఎందినపేడకడి.
184.ఏలుకాడు
=స్వామి,ఈశ్వరుడు,పతి,ఈశప,ఆదిభువు,నాయకుడు, ప్రభువు,పరివృఢుడు,పరిబృఢుడు,అధిపుడు.
185.ఐదువరాలు
=పుణ్యస్త్రీ,పేరంటాలు,ముత్తైదువు,సుమంగళి.
186.కంచము
=దడెము,తబుకు,పళ్ళెము,దడ్డము,బట్టె,మల్ల,
సాద,సానిక.
187.ఐరావతము
=అభ్రమాతంగము,అభ్రము,వల్లభము,ఐరావణము,
చౌవంతి,తెల్లయేనుగు.
188.ఒంటె =లొట్టె,లొట్టిపిట్ట,ఉష్ట్రము,క్రమేలకము,మయము, మహంగము,వాసంతము
189.ఒకటి =ఏకము,ఒండు,ఒక్కడు,ఒకడు,ఒక్కండు.
19౦.ఒట్టు
=ఆన,నియమము,ప్రతిజ్ఞ,ప్రతిన,పరిగ్రహము ప్రమాణము,పణము,ప్రత్యయము,బాస, బిరుదు,బాఢము,శపనము,సంగము,సంధ, సంధ్య,సంవిత్తు,సంగరం,శపధము,సత్యము,
సమయము.
191.ఒడ్డు
=రోధము,తటము,తీరము,వప్రము,మర్యాద,
దరి,గట్టు,కూలము.
192.ఒరగల్లు =గీటురాయి,నికషము,శాణము,వేషము.
193.ఓర్పు
=ఓరిమి,ఓర్చుట,క్షమ,క్షాంతి,తాలిమి,తాళిక,
తితిక్ష,సహనము,సైచుట,సైరణ, నిమ్మళము.
194.ఔషధము =భేషజము,భైషజ్యము,వాయువు,యోగము,
మందు.
195.కళాoకుడు
=ఇంద్రుడు,చంద్రుడు,కళానిధి,రాజు,విధువు సుధాoశువు,శశి,సోముడు,యముడు,జముడు.
196.కంచరగాడిద
=కంకరగాడిద,వేసడము,అశ్వఖరజము,అశ్వతరము
ఖరము,గోకర్ణము,ప్రఖరము,మయము.
197.కంచరి
=కాంస్యకారుడు,కామంధమి.
198.కంచు
=కంచము,కాంస్యము,కాంసీయము,తామ్రార్ధము, లోహము,కంసాస్ధి.
199.కంచె
=అలవ,కొరక,కొరన,కొఱకు,కొరను,కంపకోట,కట్టువ, కాడ్రగడ,చెలిక,తడక,తెట్టు(వు),దొడ్డి,బీడు,దశాలి, ప్రాచీనము,వాటము,వెలుగు,వేష్టము.
200.కండు =కసి,కసిమిరి,గురగుర,గులగుల,జిల,తీట తీండ్రము,తీవిరము,దురద,దూల,నస,నవ, కండూతి,కండూయనము,కండూయ.
201.కంతి
=కడింది,గుబ్బ,బుడిపి,బొడప,బొప్పి,ముడత.
202.కంద
=అర్శోఘ్నము,ఆర్శము,ఉల్లువు,ఓల(ల్ల)ము, కంఠీలము,కండూ(ర,ల)ము,కందూరము కాలకచవు,
కుష్ఠహంత,చిత్రదండకము,పీలుకము, దుర్నామారి,మేహనాశము,వజ్రముష్టి,వనకుండలి
వనజము,నూరణము.
203.కంది
=ఆఢవి,కరవీభుజ,కాక్షితాలిక,తువరము,తువరిక, పీతపుష్ప,ప్రగ్రీవ,వృత్తబీజ,సూప్య,స్తుష్య.
204.కంబళి
=ఊర్ణాయువు,కంబళము,కుతపము,రల్లకము.
205.కచోరము
=గంధమూలిక,గంధాళి,గంధాహ్వ,గ్రంధిపర్ణి,
చోరకము,
ద్రావిడము,దుర్లభము,కచ్చురము.
206.కటు(క)రోహిణి =అశోక,కటంభర,కటుంభర,కటువు,చక్రాంగి,
మత్స్యపిత్త, రోహిణి,శకులాదని.
207.కట్టబడినది =బద్ధము,సంధానితము,మూతము,ఉద్ధితము,
సందితము,సితము.
208.కఠినము =కర్కశము,క్రూరము,కఠోరము,దృఢము,మూర్తము.
209.కడవ
=భాండము,పాత్రము,భాజనము,ఆమత్రము,కలశ కరిరము,ఘటము,కుంభము,కర్కము,కుటము,పంటి, కుండ.
21౦.కడిమి =క(కా)దంబము,కర్ణపూరము,దూతఘ్ని,బలిప్రియము, వోఢము,సువాసము,సురభి.
No comments:
Post a Comment