పర్యాపదాలు-34
967.సత్యము=నిజము,నిక్కువము,నిక్కము,తధ్యము,ఋతము,
యధార్ధము,నిలువారము,యధాతధము.
968.సత్రము=సత్తరువు,లంగరుఖానా,అన్నదానగృహము,ధర్మశాల,
ప్రతిశ్రయము,మండపము.
969.సభ=సమజ్య,పరిషత్తు,గోష్ఠి,సమితి,సంసతి,ఆస్ధాని,ఆస్ధానము,
ఓలగము,కొలువు,సదము,ప్రతిశ్రయము.
970.సమస్తము=విశ్వము,ఆశేషము,నిశ్శేషము,సర్వము,కృత్స్నము,
నిఖిలము,అఖిలము,సమగ్రము,సకలము,అఖండము,
పూర్ణము,సంపూర్ణము,అనూనము,అవికలము,అభిన్నము,
పుష్కలము.
971.సమానము=సమము,తుల్యము,సదృక్షము,సదృశము,అన్యము,
సాధారణము,ఈడు,దినుసు,సాటి,ఎన,దొర,సరి,సరి,సరి,జోడు,
మాద్రి,సవతు,మాదిరి,ఉద్ది,జత,తరము,పురుడు.
972.సమీపము=నికటము,ఆపన్నము,
సన్నికృష్టము,సనీడము,
సదేశము,అభ్యాసము,అభ్యాశము,వసధము,సమర్యాదము,
సవేశము,ఉపకణ్ఠము,అన్తికము,అభ్యర్ణము,అభ్యగ్రము,అభిశము,
దండ చేరువ, దాపు,చెంత,సరస,చెంగట,ఒద్ద,దగ్గర,కురంగట,
అండ,పజ్జ.
973.సము=ముందట,ముందల,ఎదుట,ముంగల,సమక్షము.
974.సముద్రము=అబ్ధి,ఆకూపారము,పారావారము,సరిత్పతి,ఉదన్వంతుడు,
ఉదధి,సింధువు,సరస్వంతుడు,సాగరుడు,ఆర్ణవము,రత్నాకరము,
జలనిధి,యాద:పతి,అపాంపతి,ఆప్పతి,పాద:పతి,పాధోధి,
పాధోనిధి,మున్నీరు,కడలి,సంద్రము.
975.సమూహము=నివహము,వ్యూహము,సందోహము,విసరము,వ్రజము,స్తోమము,నికరము,సంఘాతము,వ్రాతము,వారము,సంచయము,
సముదాయము,సంహతి,సముదయము, బృందము,నికురంబము,
చక్రము,జాలము,బారు,దండు,దళము,తుటుము,గుమి,కూటు, కదంబకము,వితానము,ప్రకరము,చక్రవాళకము,పటలము,కూటువ,పదుపు.
976.
సరస్వతీదేవి=వాగధిదేవత,బ్రాహ్మి,భారతి,భాష,వాక్కు,వాణి,పలుకుల
వెలది,పోత్తముముత్తో,నలువ(రాణి),పడతి,కలుములపై
దలికోడలు.
977.సర్పము=పృదాకువు,భుజగము,భుజంగము,భుజంగమము,విష
ధరము,చక్రి,వ్యాళము,సరీనృపము,కుండలి,గూఢపయి,
చక్షుశ్రవము,కాకోదరము,ఫణి,దర్వీకరము,దీర్ఘపృష్ఠము,
దందశూకము,బిలేశయము,ఉరగము,పన్నగము,భోగి,
జిహ్వగము,పవనాశనము,లేలిహానము, ద్విరసనము,
కంభీనసము,సారంగము,హరి,పాము,నిడుపడు,పడగదారి,
గాలిమేతరి,విషదారి,కానరానికాళ్ళయది,చిలవ,వీనులకంటి,
పుట్టదిట్ట,పుట్టకాపరి,కనువినికి,గ్రుడ్డుకానుపు,చట్టుపురుగు,
తొట్టు,త్రాచు,నిడుదవెన్ను,బుసకొట్టుపురుగు,బొక్కలాడు,
బోరప్రాకుడు,
ముక్కంటిసొమ్ము,రెండునాల్కలుగలాడు,విను
కలికంటి,వెల్చ,సౌదరము,వెన్నునిమడుంగుపాన్పు.
978.
సన్న్యాసి=భిక్షువు,పరివ్రాట్టు,కర్మంది,పారాశరి,మస్కరి,బోడితపసి,
కానిపుట్టగోచులసామి,ఇల్లుబాసితిరుగు,జడధారి,
యతి,ముని,మౌని.
979.సహదే(వ)వి=చిట్టాముట్టి,ముత్తవపులగము,అతిబల,దేవాసహ,
దండోత్పల,విషమజ్వరనాశిని.
980.సాటి=ఎన,ఉద్ది,కల్పము,జత,జోక,జోడు,తరము,కుల,తుల్యము,దినుసు,దీటు,దొర,ధర్మము,పాటి,పురుడు,పోలిక,ప్రకారము,ప్రతి,మాదిరి,
మాఱు,సమము,సదృక్షము,సదృశము,సమానము,సాధార
981.సాన=ఒఱగల్లు,కరసాన,కటీక,కషము,కషోపలము,టీకము,
నికషము,శాణము,శాణిని.
982.సారంగము=ఇఱ్ఱి,జింక,లేడి,కురంగము.
983.సారధి=నియంత,యంత,ప్రాజిత,సూతుడు,క్షత్త,సవ్యేష్ఠుడు,
దక్దిణస్ధుడు,రధకుటుంబి.
984.సాలెపురుగు=లూత,తంతువాయము,ఊర్ణనాభము,మర్కటము,
అష్టాపదము,దట్టుపురువు.
985.సాలెవాడు=తంతువాయుడు,కువిన్దుడు,నేతగాడు,దేవాంగి.
986.సిందూరము=చెందిరము,నాగజము,రక్తరేణువు,సీమంతమండపము.
987.సింహము=వెడదమోము,మెకము,జడలమెకము,ఏనుగుల
గొంగ,మెకములకొలముసామి, తెల్లడాలుమెకము,తెరనోటిమెకము,
సింగము,బొబ్బమెకము,మృగేంద్రము,పంచాస్యము,పంచాననము,
హర్యక్షము,కేసహరి,కణ్ఠీరవము,గజరిపువు,పింగదృష్టి,మృగాధిపము.
988.సిగ్గు=మందాక్షము,హ్రీ,త్రప,వ్రీడ,లజ్జ,నాన,సిబ్బిలి,పుచ్చటిక,
పుచ్చడీక,బొనుకు,పుయిలోట.
989.సిలాజిత్తు=
అశ్మజతుకము,అగజము,గిరిస్వేదము,గుగ్గులము,
గైరికము,పాషాణజము,పిణ్యాకము,మందరోత్ధము,శిలామలము,
శిలావ్యాధి,శిలాస్వేదము,శైలధాతుజము,శైలనిర్యాసము.
990.సివంగి=తరక్షువు,మృగాదనము,సివ్వగి.
991.సీత=కుమారి,భూమిజ,ధరణిజ,జనకజ,నాగటిచాలుపెరియతివ,
చాలిపేనంటిపూబోడి.
992.సీసా=గాజు(కాయ)బుడ్డికాచపాత్రము,సుంకరి,అనుపరి,కేదరి,
శుల్కహారి,సంకరీడు,సుంకీడు.
993.సుగంధిపాల=మూలభద్ర,మామెన,గోపవల్లి,సుగంధ,శారిబ.
994.సుదర్శనము=చుట్టువాలు,సుడివాలు,వట్రువాలు,బటువువాలు, వేయంచులవాలు,పదినూరంచులవాలు,బల్లువాలు,చక్రము,
చక్రాయుధము,కడిదలుగు,గుడుసుకైదువు,గుడుసువాలు,
చుట్టుగైదువు,బటువుకైదువు,బటువడిదము,బటువుగత్తి,
సుడికత్తి,సుడియడిదము,చుట్టలుగు(ల్గు),అరి,ఆయుధేన్ద్రము.
995.సుద్ద=ఖటి(క)ని,కఠీనిక,ఖడి,ధవళమృత్తిక,పాకశుక్ల,వర్ణిత,శ్వేత(సిత)
ధాతువు.
చాలా ఉపయోగకరమైనవిషయం
ReplyDeleteచాలా ఉపయోగకరమైన ఉన్నది
ReplyDeletelamamam
ReplyDelete9182879329