Thursday, 15 February 2018

పర్యాయపదాలు -35

                               పర్యాయపదాలు -35
996.సుందరము=చక్కనిది,రుచిరము,చారు,సుషమము,సాధు,
                కాన్తము,మనోహరము,రుచ్యము,మనోజ్ఞము,మంజు,హారి,
                తరుణీయము,శాలి,మనోరమము,తిప్పనైనది,తియ్యనైనది,
                తిన్ననైనది,బాగైనది,విన్నాణమైనది,మానైనది,లె స్సయినది,
                పిన్ననైనది,నలువయినది,చెల్వైనది,ఒనరినయది,సొగసైనది,
              సొంపైనది,కొమరయినది,సింగారమైనది,తోరమైనది,మేలైనది,
               మెచ్చైనది,మురువుగలది,ఒప్పయినది.
997.సూది=సూది,కుట్టుసూది,కంటా(ణి)శము,గుండుసూది,ఆరె,చర్మభేదిక.998.సురపొన్న=పున్నాగము,కేసరము,తుంగము,పురుషము,
                   దేవవల్లభము,నమేరువు.
999.సూర్యుడు= సూరుడు,ఆర్యముడు,ఆదిత్యుడు,ద్వాదశాత్ముడు,
              దివాకరుడు,భాస్కరుడు,ఆహస్కరుడు,బ్రధ్నుడు,ప్రభాకరుడు,
             విభాకరుడు,వివస్వంతుడు,సప్తాశ్వుడు,హరిదశ్వుడు,ఉష్నరశ్మి
              వికర్తనుడు,అర్కుడు,మార్తాండుడు,మిహిరుడు,అరుణుడు,
              పూషణుడు,మిత్రుడు,చిత్రభానుడు,విరోచనుడు,విభావసువు,
          గ్రహపతి,త్విషాంపతి,ఆహర్పతి,భానుడు,సహస్రాంశుడు,తపనుడు,
              సవిత,రవి,కర్మసాక్షి,జగచ్చక్షువు,అంశుమాలి,త్రయీతనువు,
          ప్రద్యోతనుడు,దినమణి,ఖద్యోతనుడు,లోకబాన్ధవుడు,సురోత్తముడు,
            ధామనిదిపద్మినీవల్లభుడు,హరి,తమ్మివాల్గంటిమగడు,పోర్నీల్గెడు
         మొనగాండ్రుపోవుదారి,జగముచుట్టము,జమునయ్య,జగముకన్ను,
            వెన్నునివలకన్ను,ప్రొద్దులోపలరాయుడికాడు,పవలుసేయు,వేలుపు,
      పచ్చగుఱ్ఱాలవజీరుడు,వేడివెలుగు,రేవెల్గుజోడు,జంటారుమేనులసామి,
           చీకటిగొంగ,చదలుమానికము,ప్రాజదువులజెట్టియ,ఏడుగు్ఱ్ఱముల
          తేఱెక్కుజోదు,మువ్వేలుపులయిక్క,మ్రొక్కులదేవర,గాములఱేడు,
            జక్కవల ఱేడు,వేయిచేతులఱేడు,వెలుగులయెకిమీడు,చెయ్వుల
           సాకిరిచాయమగడు, మింటితెరువరి,హేళి.
                  
1000.సేన=ధ్వజని వాహిని,పృతన,అనీకిని,చమువు,వరూధిని,బలము,
               సైన్యము,చక్రము,అనీకము,మొన,కటకము,దండు,దళము,
               ధాత్రి,నాగు,వీడు.
1001.సేవ=ఊడిగము,ఊడియము,కొట్నము,కొలువు,చాకిరి,ఉపచారము,
               దాస్యము,పరిచర్య,శుశ్రూష.
1002.సేవకుడు=ఉపాసకుడు,కింకరుడు,కుర్వంతుడు,దాసుడు,పరిచారకుడు,భటుడు,భృత్యుడు,అడియరి,నవుకరు,పనివాడు,కొలువుకాడు,
               గులాము,డింగరీడు,డింగరుడు,బంటు,బంట్రోతు,బానిసీడు,
               లెంక,లేక,వరవు,వరవుడు.
1003.సొత్తు=రొక్కము,పైసా,విడిముడి,సొమ్ము,అర్ధము,ద్రవిణము,ద్రవ్యము,   ధనము,రిక్ధము,వసువు,విత్తము,విభవము,స్వాపతేయము,
                హిరణ్యము.
1004.సొంటి=ఇంద్రభేషజము,ఊ(ఉ)షణము,కందరము,కటుకము,కటు
                 భద్రము,కతూత్కటము,కఫారి,నాగరము,మహౌషధము,
                 విశ్వభేషజము,శుంఠి,ఎండుటల్లము.
1005.సొమ్ము=ఆభరణము,అలంకారము,పరిష్కారము,విభూషణము,
                మణనము,భూషణము,తొడము,రవణము.
1006.సొరకాయ=అలాబువు,అనుగము,పిండఫల,పుష్పఫల,ఆనపకాయ.
1007.సోమరి=అలసుడు,ఆలస్యుడు,అనుషుడు,తుందపరిమృజుడు,
                 మందుడు,శీతకుడు,స్వైరుడు.
1008.స్త్రీ=యోషిత,ఆబల,యోష,నారి,సీమంతిని,వధువు,ప్రతీపదర్శిని,
             వామ,వనిత, మహిళ,అంగన,భీరువు,కామిని,వామలోచన,
             ప్రమద,మానిని,కాంత,లలన,నితంబిని,సుందరి,రమణి,రామ,
             క్రాల్గంటి,పొలతుక,ముద్దియ,మగువ,బాల్గంటి,సుదతి,పడతి,
            మచ్చకంటి,అతివ,యుగ్మలి,ఇంతి,తొయ్యలి,నవల,కలువకంటి,
      నాతి,పూబోణి,చిగురాకుబోడి,పైదలి,మెఱుగుబోణి,ముద్దులగుమ్మ,
        పోన్నికొమ్మ,ప్రోయాలు,ఉవిద,తీగబోడి,చేడియ,ఇంచుబోడి,అన్నువ,
    వెలది,బోణి,బోటి,చాన,తెఱవ,వెలదుక,లేమ,చెలువ,ఎలనాగ,చిలుకల
 కొలికి,తలిరుబోడి,అలరుబోడి,నెలత,పొలతి,నెలతుక,యోషిత్తు,ఆడుది.
1009.స్నేహము=ప్రేమ,ప్రియము,హార్ణము,సాంగత్యము,మైత్రి,నెయ్యము,నెమ్మి,నేస్తము,నేయము,నెయ్యము,నెమ్మి,నెమ్మిక,నేస్తము,పొందు,మాలిమి.
1010.స్వతంత్రుడు=ప్రావృశుడు,స్వచ్ఛన్నుడు,నిరవగ్రహుడు, స్వైరుడు.
1011.స్వర్గము=ఖము,త్రిదివము,త్రిదశాలయము,త్రివిష్టపము,దివము,దివి.
              నాకము,వినుప్రోలు,వేగంటికచ్చేరి,వేల్పుటెంకి.
1012.స్వాతి=కెంపుసనతురిక్క,కరువలిరిక్క,అనిలము.
1013.హంస=శ్వేతగరుత్తు,చక్రాంగన,మానసౌకసము,సర్వతేజి,పాలను
                నీరును వేర్పరచుపులుగు,అంచ,తెలిపిట్ట.
1014.హనుమంతుడు=హనుమానుడు,ఆంజనేయుడు,వాయునందనుడు,
                   వాయుపుత్రుడు,అనుమంతిగాడు,అనుసుడు,మారుతి,
                   పవనతనయుడు,మారుతాత్మజుడు,గాడ్పుచూలి.
1015.హస్త=కయిసాటిచుక్క,అర్క,సవిత.
1016.హిమవత్పర్వతము=హిమవంతము,అద్రిరాజము,చలిమల,వలిమల,
                       దుగ్గికన్నయ్య,వలిదిబ్బ,శీతనగము,ముక్కంటిమామ.
1017.హృదయము=ఎద,ఎడ,ఎడ్డ,డెందము,మది,ఎడద,ఉల్లము,చిత్తము,
                    చేతము,స్వాంతము,మానసము,మనస్సు,ఇచ్ఛ,తలపు.          
                          @@@@@@@@@@@@@@

No comments:

Post a Comment