పర్యాయపదాలు-27
781.ముత్యము=ఆణే,కువలము,చినుకు,పాణి,ముక్తహిమము,ముక్తా
ఫలము,మౌక్తికము,బూస,సారంగము.
782.మునగచెట్టు=కాక్షీవము,కృష్ణశాలి,ప్రభాంజనము,బహువల్లభము,
శోభాంజనము,శిగువు,తీక్ష్ణగంధకము,అక్ష్మీబము,
ములగచెట్టు,మోచక,బిందుఫలము,ముఖగంధము,
సుమూలము,శోభనకము,స్వాదుగంధి.
783.ముయ్యాకుపొన్న=
అంశుమతి,త్రిగుణ,త్రిపర్ణి,ధృవ,మహాక్లీతకిక,
విదారిగంధ,సాలపర్ణి,సౌమ్య,స్ధిర.
784.ముఱికి=కసటు,కల్మషము,చిలుము,పులు,మలము,మయిల,
మలినము,మాపు,మాలిన్యము.
785.ములక=క్షుద్రవార్తాకి,బృహతి,దాష్ట్రిక,విషద.
786.ములుదోన=కర్కారుకి,రాజపుత్రి,రోమశి,వ్యాళపుత్రిక.
787.ములువెంపలి=చంచల,నలిక,బాణపుంఖి,శరపుంఖి.
788.ములువెలమ=కర్ణిక,కర్ణిరోహణ,కాసతరువు,భూతవల్కలము,
యజ్ఞాoగము,వ్యాఘ్రపాదము,మృదుఫలము,స్వాదు
కంటకము,శ్యామతరువు.
789.ముల్లంగి=కటిమూలము,కురకందకము,గజకంధ,గృన్జనము
,
క్షారకము,బాలేయము,పిండమూలము,మూలకము,
హస్తికందము,హస్తిదంతకము,హరపర్ణము,హిలమోచిక.
790.మువ్వన్నెవిల్లు=ఇంద్రధనుస్సు,కౌశికాయుధము,ధనుష్యము,
కరామృతము,గుణిధనుస్సు,మేఘధనుస్సు,వాయుఫలము.
791.ముసలివాడు=స్ధవిరుడు,వృద్ధుడు,జీనుడు,జీర్ణుడు,జరుడు,దశిమీన్దుడు, ముది,ముదురుడు,ముదుసలి.
792.ముసిడి=పత్రభంగ,
మహాశ్యామము,తిలాభము,వృద్ధవామకము,
వృద్ధకంటకము.
793.మూకుడు=ఉదంచనము,కూర్మపృష్ఠము,ఋజీవము,ఋచీషము,
ఖల్లికవర్ధమానము,దబ్బడము,దబ్బు,బూరెలమూకుడు,
శరావము.
794.మూడు=వహ్ని,రాముడు,శిఖి,అగ్ని,పావకుడు,దహనుడు,అనలము,
శంకరాక్షి,పురి,లోకము,త్రీణి,కాలము,త్రయము,గుణము.
795.మూఢుడు=అజ్ఞుడు,మూర్ఖుడు,యధాజాతుడు,వైధేయుడు,బాలిశుడు,
మందుడు,భేలుడు,అర్భకుడు,పృధగ్జనుడు.
796.మూత్రము=ఉచ్చ,కాల్మడి,ఉత్శము,కల్కము,కాయజలము,నీరుముట్టు,
ప్రస్రావము,మేహము.
797.మృగశిర=ఐందవము,జాబిలిరిక్కి,జింకతలచుక్క,నిశాకరము,మృగము,
సౌమ్యము,హిమదీధితి.
798.మెడ=అఱ్ఱు,కుతుక,కుత్తిక,కుత్తుక,గొంతు,గొంతుక,పీక,ప్రేక,పేకి,
కంఠము,కంధరము,కంధి,కుహరము,కంబువు,గళము,గాత్రము,
గ్రీవము,నిగర్ణము,ప్రగ్రీవము.
799.మెంతి=కుంచిక,మేoధి,మేధిక,వస్తిక.
800.మెయిపాలు=వృత్తాంతము,వార్త,ఉదంతము,ప్రవృత్తి.
801.మెత్తనిది=సుకుమారము,కోమలము,మృదులము,మృదువు.
802.మెఱుపు=శంప,శతహ్రద,విద్యుత్తు,సౌదామిని,చపల,చంచల,తటిత్
హ్రాదిని,ఐరావతి,క్షణప్రభ.
803.మేక=అజ,ఆద్య,క్రియ,ఛాగ,తూబర,రయము,మేషము,విశ్వభేషిజ.
804.మేకు=కొఱ్ఱు,గసిక,చీల,గూటము,ముల్లు,మొల,సీల,శంకువు,శూలము.
805.మేఘము=మొగులు,అంబుదము,అంభోదము,అభ్రము,అంబుభృత్తు,
కజ్జలము,కమలాసనము,క్షరము,ఖచరము,ఖద్యుతము,
ఖద్యోతము,ఖతమాలము,గగనధ్వజము,ఘనము,జలదము,
జలధరము,జలమసి,జలముచము,జీమూతము,తటిత్వతి,
తటిత్వంతము,తోయదము,దర్దురము,దారాధరము,ధూమయోని,
నభము,నభోగజము,నీరదము,పయోధరము,పారణపారణము,
బలాహుకము,ముదిరము,వనదము,వలాహకము,వాతరధము,
వారివాహము,వ్యోమధూమము,స్తనయిత్నువు,గాలినూడు,
జాలుదొడుకు,నీటితాలుకు,నీటిమోసరి,నీరుతాలువు,జేజేఱేని
యరదము,పయిరులుసుఱు,మబ్బు,ముంచుదారి,మొగిలు,
మొయిలు .
806.మేడ=ఉపకారిక,ఉపకార్య,ఉప్పరిగ,పురము,నగరు,రాజసదనము,
సజ,సౌధము.
807.మేడి=అంజూరు,అపుష్ప,ఔదుంబరము,జంతుఫలము,సదాఫలము,
సుప్రతిష్ఠము, స్కంషధలము.
808.మేర=అవధి,ఎల్ల,కర,క్రమము,గడికాష్ఠ,ధారణ,నియమము,ప్రమాణము,
మరియాద,సంధ్య,సంస్ధ,స్ధితి,సీమ.
809.మేరుపర్వతము=మేరువు,సుమేరువు,హేమాద్రి,రత్నసానువు,పసిడి,
సురాలయము,భద్రము,వేలుపుగొండ,గట్టు,జేజేలగట్టు.
810.మేషము=అజము,అతిరోమశము,అమీధురము,అల్పాయువు,ఉరణము,ఉరభ్రము,ఊర్ణము,ఊర్ణాయువు,ఏడకము,ఛగళము,ఛాగము,
తగరము,దేవానాం ప్రియం,పర్ణభోజనము,జాలవాహ్యము,
లంబకర్ణము,శివాప్రియము,అగ్గితత్తడి,ఇరుదలతేజి,ఏడిక,
చింబోతు,తగరు,పొట్టేలు,మేకపోతు,అమీఢ.
No comments:
Post a Comment