Wednesday, 7 February 2018

పర్యాయపదాలు 9


                                                 పర్యాయపదాలు-9  

271.కుమారుడు =ఆత్మజుడు,తనయుడు,సూనుడు,సుతుడు,పుత్రుడు,
                      కొమరుడు,కొడుకు                                
272.కుమార్తె =ఆత్మజ,కన్య,కూతురు,తనయ,పుత్రి,దుహిత,సుత,సూన.
273.కుమ్మరి =కుంభకారుడు,కులాలుడు,కుంభి,కుండలుచేయువాడు.
274.కులము=వంశము,కొలము,వంగడము,జాతి,అభిజనము,వంగసము.
275.కూలి =కర్మణ్య,విధ,భృత్య,భృతి,భర్మ,వేతనము,భరణ్యము,భరణము,
                మూల్యము,నిర్వేశము,పణము.
276.కృత్తిక =కార్తె,మంగలకత్తిరూపురిక్క,ఆసలము,జ్వలనము,పావకము,
                బహుళ,హుతభుక్కు.
277.కెంపు =తొగరు,తొవరు,కెంజాయ,ఎఱ్ఱ.
278.కేతనము =పతాకము,వైజయంతి,ధ్వజము,సిడెము,టెక్కెము,
                     జెండా,పడగ, డాలు.
279.కేతువు =శిఖి,ధ్వజుడు,దూమ్రుడు,ఉత్పాతుడు,శీరోహీనుడు,
                   ఘోరరూపుడు,చిత్రవర్ణుడు,సుకేతనుడు.
280.కొంగ =కరేటువు,కహ్వము,ధ్వాoక్షము,బంధురము,క్రౌంచము,
                కొక్కరాయి,కొక్కెర,క్రొంచ,కొంచ.
281.కొండగోగు =కొండగోను,కర్ణికారము,ద్రుమోత్పలము,పరివ్యాధము.
282.కొండచిలువ =అజగరము,వాహనము,వోద్రము,శయువు.
283.కొండమల్లె =కుటజము,గిరిమల్లిక,క్షవకము,వత్సము,శక్రము.
284.కొండబెండ =క్రోధన,ఖురస,గో,జిహ్వ,గోగ్రంధిచండ, చర్మచొర,
                      తస్కరి,పిశున,భిండి,ఎద్దునాలిక.
285.కొండఱేడు  =మంచుకొండ,ఉదగద్రి,గిరిశము,తుషారాద్రి,
                       తుహినశైలము,హిమాలయము,హిమాద్రి.
286.కొండముచ్చు =అసితాననము,గోలాం(గు-గూ)లము,నీలకము,
                      కుండగి,కుండంగి,కొండెoగ,కొండముసువ,మసికోతి.
287.కొండెగాడు =కొండీడు,కొండెడు,కొండేలమారి,చాడీగొట్టు,చాడీలమారి.
288.కొడవలి=గడ్డికోయుపనిముట్టు,గిద్ద,దాత్రము,లవిత్రము.
289.కొత్తిమిరి=కొత్తిమెర,ఆవారిక,కుమా-కస్తుంభరి,ఛత్ర,జనప్రియము,
                  ధ్యానాకము,చితున్నకము.
290.కొప్పు =కబరి,కేశవేశము,తురుము,మౌళి,వేసవి,క్రొవ్వెదమాల.
291.కొబ్బరి=కరకాంభము,కూర్చకేసరము,కోశకారము,కౌసికఫలము,
                 ఘటోదకము,జీరనద్రువు,తృణరాజము,నారికేళము,
                 నాళికేరము,నారికేరము,నారికేడము,బాల,మహాప్రాంశువు,
             లాంగలి,వరారోహి,కొబ్బెర,టెంకాయ,తెంకాయ,తేమ్రాను,టేమ్రాను.
292.కొమ్మ =చెట్టుకొమ్మ,ప్రలంబము,మండ,లత,శాఖ,శిఖి,విటపము.
293.కొయ్యగూర =ఛిల్లిక,జీవంతిక,కొయ్యతోటకూర.
294.కొఱ్ఱలు =కంగుకము,కాసరలు,ప్రియoగము,పీతదండులము.
295.కొలది =అలతి,అల్పము,అణువు,ఈషత్తుకళ,కణము,కించిత్తు,
              కృశము,గంధము,చిన్న,జిలుగు,జీలు,తలినము,తనువు,
             తృటి,తోడెము,దభ్రము,నలికము,మాత్ర,రవ,రజము,లవము,
             దేశము,వలిపము,సన్నము,సూక్ష్మము,స్వల్పము.
296.కోడి =చరణాయుధము,కుక్కుటము,తామ్రచూడము,కిరీటి,
              జ్ఞాని,శిఖి,ప్లవము,అజ్జవాలు.
297.కోతి =కపి,ప్లవంగము,శాఖామృగము,హరి,వలీముఖము,మర్కటము,
             వానరము,పింగళము,కీశము,వనోకసము,అడవితిరుగుడు,
             తిమ్మడు,మల్లు.
298.కోజాడు =కుంతాళి,గుడపాకి,తృణపుష్టిక,బహుస్కంధ,మహాతాలి,
                 శరాఫల,శిలాఫల,హింతాళి.
299.కోన =అడవి,అరణ్యము,అరణ్యాని,అటవి,గహ(న)ము,కాననము,
               ద(దా)వము,కాంతారము,తల్కము,వనము.
300.కోలపాల =పాలకూర,మనుబాల,అర్కపుష్పిక,జీవంతి,జీవని,
                    పోటగళమంగళ,పయస్య,శృంగిభేరి,శాకశ్రేష్ఠ .                                                                                 

3 comments:

  1. పర్యాయపదాలు ఒకచోట చేర్చి తెలుగు భాషకూ, తెలుగు ఇష్టపడే ప్రజలకూ చేస్తున్న మీ సేవకు ధన్యవాదాలు

    ReplyDelete
  2. 👌🙏🙏🙏

    ReplyDelete
  3. తనయుడు

    ReplyDelete