Sunday, 11 February 2018

పర్యాయపదాలు -13


393.చెలి(కాడు)=అంటుకాడు,అనుగు,ఉద్దికాడు,చుట్ల(ము),చెలిమరి,చెలువుడు,వంటు(కాడు),ననుపుకాడు,నెచ్చెలి,నెయ్యరి,నెయ్యుడు,నేస్తకాడు,నేస్తి,నేస్తు,పొందుకాడు, పొత్తుకాడు,బోటికాడు,మిత్త,సంగడికాడు,సంగడీడు,
         సంగాడి,సంగాతకాడు,సంగాతి.
394.చెవి=కర్ణము,శబ్దగ్రహము,శ్రోత్రము,శృతి,శ్రవణము,శ్రవస్సు,వీను,   జానుగు.
395.చెవులపిల్లి=కుందేలు,చెవులపోతు,మృదులోమక,లంబకర్ణము,   లోమకర్ణము,శశము,శూలి(క).
396.చేట=సరకులుచెరిగెడిపనిముట్టు,శూ(సూ)ర్పము,ప్రస్ఫోటనము.
397.చేదు=కటువు,కానరు,కషాయము,తిక్తము,వికటగంధము.
398.చేదుబీర=కటు(తిక్త),కోశాతకి,కృతవేదన,క్ష్వేల,జాలిని.
399.చేమంతి=చామంతి,సేమంతిక,సేవంతి,కురంటకము,శతపత్రిక.
400.చేయి=చెయి,చెట్ట,కయి,కై,కేలు,కరము,కులి,పంచశాఖము,
               పాణి,హస్తము.
401.చేప=అండజము,చపలము,ఝుషము,పృధురోమము,మత్స్యము,మీనము,నిసారము,వైపారిణము,తెఱగంటి,మచ్చెము,మీను,(పాఠీనము,శపరి,శాలము,రాజీవము,శకులము,తిమింగలము,
            గంధకము-ఇవి జాతులు)
402.చొంగ=చొల్లు,జొల్లు,లాల,సృణిక,స్యందిని.
403.చొక్కా(య)=చోల(డ)ము,చోలా,చట్ట,అంగరకా,అంగరేకు,అంగి, కబాయి,కమీజు,కుబుసము,జుబ్బ,దుత్తాయి,పేరణము,
            పేరణి,కంచులిక,ని(చు-చో)లము,కూర్పాసకము.
404.జగము=జగతి,జగత్తు,విష్టపము,భువనము,లోకము,ప్రపంచము.
405.జంట=ద్వంద్వము,ద్వయము,యుగళము,యుగము,యుగ్మము,   యురకము,కవ,జోక,దంట.
406.జందియము=జంద్యము,జందెము,జన్నిదము,బ్రహ్మసూత్రము,యజ్ఞోపవీతము,యజ్ఞసూత్రము,ఉపవీతము,పోచ,
                     పవిత్రము.
407.జన్నము=అధ్వరము,ఆహవము,ఇష్టి,ఇజ్యక్రతువు,మఖముమఘము,మేధము,యాగము,వితానము,సప్తతంతువు,
                స్వరువు,వే(లిమి)ల్మి,వ్రేల్మి,హవము.
408.జమ్మి=ఇష్ట,ఈశానము,కంటకి,కేశమధని,జంబు,జయ,దురిత
 దమని,పవిత్ర,పింగా,ప్రియదర్శిని,భద్ర,మాంగల్య,రామకము,
     లక్ష్మి,వళిని,వహ్నిగర్భ, విజయ,శంకర,శమి,శమీరము,
             శాంస,శివ,సక్తుఫల,సత్యవతి,సముద్ర.
409జలగ=అల్గర్ద,అస్రప,జలమక్షిక,జలసూచి,జలాదని,జలాయుక,  జలాసుక,జలిక,జలూక,జలోక, జలోరగ,జలౌక(సము)
             రక్తస,రక్తసందంశిక.
410.జల్లెడ=చాలని,తితఉవుపాటీరము.
411.జవ్వనము=యౌవనము,పరువము,పాయము,ప్రాయము,ఈడు,   ఎల,వయస్సు.
412.జవ్వా(జి)ది=జవా(జి)ది,జవ్వాదు,జదువాయు,గటుమోదము,   గంధరాజము,సంకుమదము,స్నిగ్ధము.
413.జాజికాయ=జాతిజము,జాతిఫలము,జాతిసారము,మదకాండజము,   మద్యుసారము.
414.జాపత్రి=జాజిపత్రి,జాతీకోశము,జాతిపత్రి,సుమనస్సు.
415.జారినది=ప్రస్తము,ధ్వస్తము,భ్రష్టము,స్కన్నము,పన్నము,
                చ్యుతము,గళితము.
416.జిమ్మ=జిహ్వ,కకుత్తు,రసజ్ఞ,రసన,రసాల,నాలుక,నాలిక,నాల్క,   నాలువు.
417.జిల్లేడు=అర్కము,వసుకము,స్ఫోటము,అస్ఫోతము,గణరూపము, వికీరణము,అర్కపర్ణము,మందారము.
418.జీడి=అగ్నిముఖి,అరుష్కరము,భల్లాతకి,వీరవృక్షము.
419.జీడిమామిడి=ముంతమామిడి,అగ్రబీజము,పృధగ్బీజము.
420.జీలకఱ్ఱ=జీలకర,జగణము,జీరకము,అజాజి,మాధవము,మాధ్వీకము,   లఘుకణము,సువహ,సుషేరి,హృద్య.
421.జీలుగు=జిలుగు,బెండు,బొండుబెండు,సితవీర్య,స్వర్గపుష్టి.
422.జువ్వి=కందరాళము,కపీతము,కలాపి,కళింగము,గర్డభాండ      ము,జటి(ల)ము,ప్లక్షము,ప్లవంగము,ప్లవకము,మౌక్ధికము,
     యూపకము,యూపద్రువు,లక్షణము,శీతవీర్యకము.       

No comments:

Post a Comment