పర్యాయపదాలు-19
571.నేరేడు=జంబుకము,జంబువు,జంబూకము,జంబూవలము,
జాంబవము,నదీకాంత,నాదేయి,నీలఫల,రాజఫల,
రాజార్హ,వైరవి,శుకప్రియ,శ్యామల,సుదర్శన,సురభిమిత్ర,
సూక్ష్మఫల,స్వర్ణమాత.
572.నేర్పరి=ప్రవీణుడు,నిపుణుడు,అభిజ్ఞుడు,విజ్ఞుడు,నిష్ణాత,శిక్షితు డు,
వైజ్ఞానికుడు,కృతముఖుడు,కృతి,కుశలుడు,జాణ,దంట,
ప్రోడ,వలతి,వెరవరి.
57౩.నోరు=మూతి,వా-వాయి,ఆననము,ఆస్యము,చర్వణము,
తుండము,ముఖము,లసనము,వక్త్రము,వదనము.
574.న్యాయము=అర్ధము,అభినీతము,ఆభ్రేషము,ఔపయికము,
కల్పము,దేశరూపము,ధర్మము,న్యాయ్యము,యుక్తము,
భజమానము,లభ్యము,సమంజసము,సారము,తగవు.
575.పంక్తి=ఆలి,ఆళి,ఆవలి,ఛట,ఛాయ,ధార,పరంపర,పాళి,ప్రవృత్తి,
ప్రవాహము,బంతి,వరుస.
576.పండుకొను=పన్నుండు,పండు,పవ్వడించు,పరుండు,పవ్వళించు,
అత్తమిల్లు,శయనించు.
577.పండితుడు=విద్వాంసుడు,విపశ్చిత్తు,సూరి,బుధుడు,సుధి, ప్రాజ్ఞుడు,లబ్ధపర్ణుడు,విచక్షణుడు.
578.పంది=ఆఖనికము,ఆఖువు,కిటి,కిరి,కుందారము,కుముఖము,
కోలము,క్రోడము,గృష్టి,ఘృష్టి,ఘోణి,దంష్ట్రి,రోమశము,
సూకరము,స్ధూలనాసము,ఊటమెకము,ఒంటరి,
కొమ్ముకాడు,గుర్గురింత,చప్పరింత,ముట్టెమెకము.
579.పందికొక్కు=మూషి(ష)కము,ఆఖువు,ఉందురము,ఖానకము,గర్తాటము,గ్రుహభూదారము,దీర్ఘదేహి,రోమశము,
కొక్కు,మూసకము.
580.నేస్తము=అంటు,అర్మిలి,అదట,ఇచ్చకము,ఎలమి,కూరిమి,
చెలికారము,నెనరు,నెమ్మిక,నెయ్యము,పేరిమి,
పొత్తు,పొంతము,సంగడము,సంగాతము.
581.పక్షి=ఖగము,విహంగము,విహగము,విహంగమము,విహాయసము,శకుంతము,శకుని,శకునము,ద్విజము,పతత్రము,పత్రి,
పతగము,అండజము,నగౌకసము,వాజి,వికిరము,
విష్కిరము,గరుత్మంతము,నభసంగమము, గువ్వ,
పక్కి,పిట్ట,పులుగు.
582.పగడము=పవడము,మెఱుగురిక్క,గసిరా,అంగారకమణి,
అబ్ధిపల్లవము,గోపీవల్లభము,ప్రవాళము,భౌమరత్నము,
మాహేయము,లతామణి,విద్రుమము,సువలిజము.
583.పగలు=పవలు,దివసము,దినము,ఘస్రము,అహము,వాసరము.
584.పచ్చ=అశ్మగర్భము,గారుడము,మరకతము,రాజనీలము,
రోహిణేయము,శ్రీపర్ణము,హరిన్మణి.
585.పచ్చపెసలు=ముద్గము,మసూరము,హరితశారిబ,హరి(త)
మసకము.
586.పడక=ఔశీరము,తలిమము,తల్పము,పఱపు,పాన్పు,మెత్త,
శయనము,శయ్య,శిరము,సెజ్జ.
587.పడుచుది=యౌవనవతి,జవరాలు,కొమరాలు,జవ్వని.
588.పదునైనది=క్షుతము,ఖర,తీక్ష్ణము,నిశితము,శాతము,కఱకైనది,
చుఱుకైనది,తెగువైనది.
589.పద్మము=తామరపువ్వు,నళినము,అరవిందము,మహోత్పలము,సహస్రపత్రము,కమలము,శతపత్రము,పుండరీకము,
నాళీకము,కుశేశయము,పంకేరుహము,తామరసము,
సారసము,సరసీరుహము,బిసప్రసూనము,తమ్మి,
రాజీవము,పుష్కరము,అమ్భోరుహము,సారంగము,
శ్రీపర్ణము.
590.పనస=కంటకఫలము,ఖపుష్పము,గర్భకంటకము,చంపాలువు,
పర్వయోన,పూతఫలము,ప్రాక్ఫలము,చంపకాలువు,
చంపకోశము,చంపాలము,బృహత్ఫలము,శిఖావరము,
స్నిగ్ధఫలము,స్వర్గభువు.
591.పని=ఆస్పదము,కరజము,కర్మ,కర్మము,కృత్యము,క్రియ,
వ్యాపారము,ఒంజలి,చెయ్వు,చేత,చెయిది,చె(యిద)యము.
592.పల్లు=రదనము,దశనము,దంతము,రదము,కోర.
593.పరాధీనుడు=పరతంత్రుడు,పరవంతుడు,నాధవంతుడు,అధీనుడు, నిఘ్నుడు,ఆయత్తుడు,అస్వచ్ఛoదుడు,గృహ్యకుడు.
594.పరిమళము=సువాసన,వలపు,తావి,కమ్మన,కంపు,సుగంధము,
ఆమోదము,సౌరభము.
595.పరిహాసము=క్రీడ,ద్రవము,నర్మము,పరీహసము,పరిహసనము, ఎగతాళి,గేళి,నవ్వు,పరియాచకము.
596.పరుగు=ద్రవము,భావనము,ప్రధానము,పరువు,వీటి,కదలిక.
597.పర్యాయము=అవసరము,తడవ,తూకు,తూరి,తేప,పరి,పారి,
మరీ,మాఱు,విడుత.
598.పర్వతము=మల,గట్టు,తిప్ప,మెట్టకొండ,గుబ్బలి,మహీధ్రము,
శిఖరి,క్ష్మాభృత్తు,ఆహార్యము,ధరము,అద్రి,గోత్రము,
గిరి,గ్రావము,అచలము,శైలము,శిలోచ్చయము,
మరువుపత్రి,చికురము,ఇలతాలు.
599.పఱుపు=పడక,పాన్పు,మెత్త,సెజ్జ,శయ్య,శయనము,తల్పము,
శయనీయము,సంస్తరము,స్రస్తరము.
6౦౦.పలుకబడినది=ఉక్తము,భాషితము,ఉదితము,జల్పితము,
ఆఖ్యాతము,అభిహితము,లసితము,
601.పల్లేరుచెట్టు=గోక్షురకము,పలంకషము,వనశృంగాటము
,శ్వదంష్ట్ర,
గోకంటకము,ఇక్షుగంధము,స్వాదుకంటకము.
paripurnamaina word ki pariyapadalu kavali
ReplyDeleteపొత్తు..?
ReplyDeletePitta word pariyayapadhalu
ReplyDeleteసువాసన పర్యాయపదములు
ReplyDeletei want
తేలిక పర్యాయ పదాలు
ReplyDeleteఖైదు పర్యాయపదములు
ReplyDeleteబావ లేక బావమరది పర్యాయపదాలు తెలుపండి
ReplyDeleteVaktramu telugu
ReplyDeleteVihangamu pattaya padalu telupandi
ReplyDelete