Monday, 12 February 2018

పర్యాయపదాలు-23.

                                    పర్యాయపదాలు-23
692.ప్రొయ్యి= అంతిక,అశ్మరత్వము,అశ్వస్తము,అధిశ్రయణి,ఛుల్లి.
693.బండిసిల=అక్షాగ్రకీలము,అక్షకీలము,ఆణి,అణి,ఉద్రధము.
694.బంతి=చెండు,కందుకము,గుడము,గేండుకము,గేందుకము, గేందువు,
              పిండము.
695.బంగారము=స్వర్ణము,సువర్ణము,హిరణ్యము,కనకము,హేమము,
                    హాటకము,తపనీయము,శాతకుమ్భము,గాంగేయము,
                భర్మ,కర్బురము,చామీకరము,జాతరూపము,మహారజితము,
                  కాంచనము,రుక్మము,కార్తస్వరము,జామ్బూనదము,
                   అష్టాపదము,పసిడి,బంగరు,బంగారు,పైడి,పొన్ను,జాళువా,
                   పుత్తడి,కడాని,మేలిమి,కుందము,ఆణి,అపరంజి,ఉదరి,
                   కలధౌతము.
696.బండి=అనస్సు,కణిచి,కుబ్రము,కూవరి,చక్రపాదము,చక్రి,నేత్రము,
                స్యందనము,తేరు,అరదము,గంత్రి,గాడి,శకటము.
697.బండికన్ను=బండికలు,బండికల్లు,చాయమేకు, చిలుక,చీల,జంజిడ,
                   అక్షము,అక్షాగ్రకీలము,అణి,ఆణి,అధిష్ఠానము,అరి,ఉపధి,
                    కుందము,కేశవాయుధము,రధాంగము.
698.బంధువులు=చుట్టాలు,బందువులు,చుట్టలు,విందులు,బందుగులు,
                        చుట్టములు.
699.బకము=కహ్వము,కొక్కరాయి,కొక్కు,కొక్కేరకొంగ,బక్కు,బకోటము,
                  జలపాదము,పరద, బాతు,వగ్గటము.
700.బచ్చలి=ఆయసి,కలంబిక,పోఠకి,మత్స్యకాలి,మడఘ్ని,మోహన,వల్లిక,
                వృంతాక,వృత్తక,వృశ్చికప్రియ,స్తన్న.
701.బదనిక=కామిని,కొమలవల్లిక,పాదపారోహ,వృక్షరుహ,వృక్షాడని.
702.బలదేవుడు=బలభద్రుడు,ప్రలంబఘ్నుడు,అచ్యుతాగ్రజుడు,రాముడు,
              రేవతీరమణుడు,కామపాలుడు,హలాయుధుడు,నీలాంబరుడు,
              రౌహిణేయుడు,తాలాంకుడు,ముసలి,హలి,సంకర్షణుడు,శీరపాణి,
              కాళిందీభేదనుడు,బలుడు,నల్లవలువదాల్పు,తెల్లనిమయిదంట,
               వెన్నదొంగయన్న,దుక్కివాలుదాలువు,తాటిపడగవాడు.
703.బలపము=కరీని,ఖటీక,మృదుకాంతి,శ్వేతజ,పలకపుల్ల.     
                                                                                

No comments:

Post a Comment