Monday, 12 February 2018

పర్యాయపదాలు -17

                                  పర్యాయపదాలు -17
511.ధనము=అర్ధము,ద్రవ్యము,విత్తము,స్వాపతేయము,రిక్ధము,వసవు, హిరణ్యము,పైకము,ద్రవిణము,ద్యుమ్నము,విభవము,
               రుక్ధము,రూక,రొక్కము,విడిముడి,సొమ్ము.
512.ధనిష్ఠ =మద్దెలరూపురిక్క,దాసనము,వసువు,శ్రవిష్ఠ.
513.ధనుస్సు=చాపము,ధనువు,శరాసనము,కోదండము,కార్ముకము, ఇష్వాసము,విల్లు,సింగాణి.
514.ధృతి=ధైర్యము,కొవ్వు,బింకము,చేగ,చేవ,అదటు,గట్టి,దిట్టము, ఉరిది,బిగువు,బెట్టు,బదాయి,బెట్టిదము.
515.ధేనుసమూహము=కదువు,మొదవు,పదువు,మంద.
516.ధ్వని=శబ్దము,నినాదము,నినదము,ధ్వానము,రవము,స్వనము,స్వానము,నిర్ఘోషము,నిర్హ్రాదము,నాదము,నిస్వానము,నిస్వనము,ఆరవము,ఆరావము,సంరావము,విరావము,
రొద,ఉలి(వు),సద్దు,కూత,చప్పుడు,ఆలుకుడు,రవ(ళి),
              ఱంకె,ఱంతు.
517.నక్క=శివ,భూరిమాయువు,గోమాయువు,మృగధూర్తక,సృగాలము,వఞ్చకము,క్రోష్టువు,ఫేతువు,ఫేరవము,జంబుకము.
518.నక్కతోకపొన్న=క్రోష్టువిన్న,దావని,లాంగూలి,సింహపుచ్ఛి .
519.నఖక్షతము=అర్ధచంద్రము,అర్దేoదువు,ఛు రితము,గోటినాటులు,గోరువంకలు,గోటినెలవంకలు,గోటినొక్కులు,గోయిత్తు,చందురుకూనలు,చందురువంకలు,నెలకూనలు,పిఱుదలమీదినఖక్షతములు,ఉత్పలపత్రము,కలువఱేకు.
52౦.నగ=అలంకారము,ఆభరణము,కలాపము,పరిష్కారము,ప్రతిసరము,భాండము,భూషణము,తొడవురవణము,సొమ్ము.
521నట్టువుడు=నట్టుగుడు,నట్టు(వ)కాడు,నట్టువాడు,నటుడు,నర్తకుడు, నాగరకుడు,భారతుడు,శైలాలి,శైలూషుడు.
522.నడుము=అవలగ్నము,కౌను,క్రోధము,మధ్యమము,లేగౌను.
523.నత్తగుల్ల=గుల్ల,క్షుద్రకంబువు,క్షుద్రశంఖము,క్షుల్లకము,జలబింబము, పంకమండూకము,శంఖనఖము,శక్తి.
524.నది=ఆపగ,నిర్ఘరిణి,తరంగిణి,హ్రాదిని,శైవలిని,తటిని,ద్వీపవతి,స్రవంతి,స్రోతస్విని,నిమ్నగ,అధ్వగ,అబ్ధివధువు,తరణి,తలోద,సరిత్తు,సాగరగామిని,వరద,వాక,పదము,ఝురి,హైమవతి,కడలివెలది,కూలంకుష .
525.నమస్కరించు=కేల్మొగుచు,కొలుచు,ఎఱగు,చేమోడ్చు,చేతులుముకుళించు,ప్రణమిల్లు,నమించు,అయిదుపదిచేయు.
526.నమస్కారము=గిడిగిడి,జోత,దండము,జోహారు,మ్రొక్కు,చేమోడ్పు,చెంగనాలు,జేజే,వ్రణతి,ప్రణామము,వందనము,గొబ్బిళ్ళు,జాగిలి,టెంకణము,దీవెనకోల.
527.నరము=నారి,నాడి,ఈనె,తంత్రి,త్రిపుటము,ధమని,శిర,
                 స్నసి,స్నాయువు.
528.నర్మదానది=వామోద్భవ,మేఖల,కన్యక.
529.నలికండ్లపాము=ఉలిక,నల్లిక,నలికీచు,అనికిరి,మిద్ద,మింజి.
530.నలుపు=కృష్ణము,లాసితము,శ్యామము,కాలము,శ్యామలము,మేచకము,కప్ప,కఱ,కఱి,నల్ల.
531.నల్లజీలకఱ్ఱ=కారవి,కాలిక,కృష్ణజీరకము,జ్వరశోధిని,
         పతింబర,పర్ణాశము,పృధ్వి,శూలఘ్న,శోఫకుంచిక,
           సుషవికస్ధూలకణ.
532.నల్లపెసలు=కృష్ణముద్గలములు,వసంతములు.
533.నల్లమందు=అభిని,అఫేనము,ఆహిఫేనము,
                       ఖనఖనరసము,ఉపవిషము.
534.నల్లగగెర=కృష్ణమూలిక,కృష్ణ మల్లిక,కృష్ణార్జకము,
                 కాలమాల,గంధపుష్ప,మూలిక.
535.నల్లగఱిక=అసిత,నీలదూర్వ,శాద్వల, హారిత.
536.నల్లగురిగింజ=కృష్ణ కాంభోజిక,కృష్ణపాకి.
537.నల్లనేలగుమ్మడు=క్షీరేక్షునల్లి,క్షీరశుక్ల,క్షీరవిదారి,
                వల్లీపలాసిక,శ్లేష్మకందక.
538.నల్లమద్ది=ఇనుమద్ది,అజకర్ణకము,పూతిశమనము,
               శ్వేతఘ్నము.
539.నల్లసుగంధిపాల=అనంత ఉత్పలశారిబ,గోపి,చందన,
                  శారిబ,శ్యామ.
540.నల్లావలు=ఆసురి,కృష్ణిక,క్షవము,క్షుతాభిజననము,రాజిక.
           

       

No comments:

Post a Comment