పర్యాయపదాలు-10
301.కోలపొన్న =పృశ్నిపర్ణి,పృధక్పర్ణి,కలశి,క్లీతని,గుహ.
302.కోపము
=క్రోధము,అమర్షము,ఉత్సవము,క్రుధ,ప్రతిఘము,
భౌమము,మత్సరము,మన్యువు,రుట్టు,రోషము,
అలుక,అల్క,కినుక,కిన్క,కణాలు,మోడి.
303.కోయిల
=వనప్రియము,పరభృతము,కోకిలము,సారంగము,అళి,
హరి,వాసంతము,గoధర్వము.
304.కోరిక
=అభిలాష,అర్ధి,అస్ధ,ఇచ్చ,ఇష్టి,ఈహ,కాంక్ష,కామము,
ఛందస్సు,తర్షము,తృటు,దోహదము,ప్రయత్నము,
మనోరధము,రుచి,లిస్స,లాలస,వాంఛ,స్పృహ,కోరికి,
తమి,తివుట.
305.క్రూరుడు
=కఠినుడు,కఠోరుడు,కర్కశుడు,ఘాతుకుడు,ఘారికుడు,
నృశంసుడు,పావుడు,కట్టి,గరాసు,గొఱకు,చెనటి,
తులువ,పిసాళి.
306.కౌగిలి
=పరిరంభము,పరిష్వంగము,సంశ్లేషము,ఉపగూహనము,
పరిరంభణము,అభిషంగము,ఆలింగనము,కవుగిలి.
307.క్రొత్తది
=ప్రత్యగ్రము,అభినవము,నవ్యము,నూతనము,నవము,
నూత్నము,ముగ్ధ,శారదము.
308.క్రొవ్వు
=కావరము,గర్వము,మదము,వప,నస.
309.క్షత్రియుడు
=మూర్ధాభిషిక్తుడు,రాజు,రాజన్యుడు,బాహుజుడు,
విరాట్టు,పార్ధివుడు,క్ష్మాభృత్తు,నృపుడు,భూవుడు,
మహిక్షితుడు,అధీశ్వరుడు,ఒడయుడు,ఏలిక,
ఎకిమీడు,పుడమిఱేడు,ఱేడు,దొర,సామి,రాచకాడు.
310.క్షీరకాకోశి
=క్షీరము,దుగ్ధము,పయస్సు,పాలు,శిశువర్ధనము,
స్తన్యము.
311.ఖడ్గమృగము
=ఖడ్గము,ఖడ్గి,గండకము.
312.ఖర్జూరము
=పేరీదు,ఖరస్కంద,దురారోహ,స్వాదుమస్తక.
313.గంగానది
=భాగీరధి,జాహ్నవి,విష్ణుపది,త్రిపధగ,జహ్నుతనయ,
త్రిప్రోత,భీష్మషువు,త్రిజగత్కల్యాణి,పావని,భద్ర.
314.గంధము
=గంధసారము,మలయజము,భద్రశ్రీ,చందనము,
శ్రీగంధము,తైలపర్ణికము, గోశీర్షము,హరిచందనము,
తిలపర్ణి,పత్రాంగము,కుందనము,రంజనము,
ఎర్రచందనము.
315.గంప
=పెద్దబుట్ట,కండోలము,పిటము,తట్ట.
316.గగుర్పాటు
=కంటకము,పులకము,పులకలు,రోమహర్షణము,
రోమాంచము,గగుర్పొడుపు.
317.గట్టిది
=కర్కశము,కఠినము,క్రూరము,కఠోరము,నిష్ఠురము,
దృఢము,జఠరము,మూర్తిమంతము,మూర్తము,రూక్షము.
318.గట్టివాడు
=ఓపువాడు,ఉపమరి,కఱకరి,కఱుదులాడు,చాలుమానిసి,
జాణ(డు),తీర్పరి,దంట,దిట్ట,నెఱవాది, నేర్పరి,బిరుదు,
వటగ,వటారి,వలతి,వెరవరి.
319.గడ్డి
=అర్జునము,కక్ష,ఘాసము,తృణము,యతసము,కసవు,
గఱిక,తుంగ,పులు,వూరి,పచ్చిక,వెనుతురు,విడవలి,
శష్పము.
320.గబ్బిలము
=అజినపత్ర,జతుక,జతూక,తైలపాయిక,గబ్బిడా(యి),
గబ్బిలాయి,చీకురాయి.
321.గరిటె
=గంటె,మిళ్లి,కంచి,కాష్ఠ ,ఖజ,ఖజము,ఖభాక,చట్టువ(ము),
తం(డు-దు)వు,తరువు,దర్వి.
322.గరుత్మంతుడు
=గరుడుడు,తార్క్ష్యుడు,వైనతేయుడు,ఖగేశ్వరుడు,
నాగాంతకుడు,విష్ణురధము,సుపర్ణుడు,పన్నగాశనుడు,
మరునయ్యతేజి,పులుగులదొర,పాములవేటకాడు,
తూరుపునాడేల్దొర,బువ్వగొన్నలావరి,గరుటామంతుడు,
గరుటి,గరుడి.
323.గఱిక
=అనంత,గరిడాలి,గాలోమి,దూర్వ,భార్గవి,శకులాక్షము,
శతవీర్య,సహస్రవీర్య.
324.గర్భిణి
=అంతర్వత్ని,ఆపన్నసత్య,గుర్వి,గుర్విణి,చీరచిక్కినది,
చూలాలు,ద్విహృదయ.
325.గర్వము=అభిమానము,అమందోన్నతి,ఆరంభము,ఉద్ధతి,
ఉత్సవము,ఔద్ధత్యము,కాండము,ఖరువు,గంధము,
ధ్వజము,మదము,ఆము,గరువము,డంబు,త్రుళ్లు,
మురిపము,మురువు.
326.గవ్వలు
=కపర్దము,గండము,చరము,చరాచరము,ద్యూతబీజము,
పణాస్ధికము,వరాతిక,శ్వేతము.
327.గసగసాలు=ఖసము,ఖసతిలము,ఖస్కసము,గసకము,ఆహిఫేనబీజ
ము.
328.గాడిద
=చక్రీవంతము,బాలేయము,రాసభము,గర్దభము,గార్ధభము,
గాడ్ధ,గాడిదె,గాడ్దె,ఖరము,గాలిగాడు.
329.గింజ
=అస్ధి,బీజము,విత్తనము,విత్తు.భృంభృం
౩౩0.గిండిచెంబు=ఆలుక,ఆలువు,కరక,కర్కరిక,గరి(గ)గె,గలతియ,
గిండి,చషకము,జారి,భృంగారము.
౩౩1.గిన్నె
=కో(శ-ష)ము,కౌసిక,గల్వర్కము,చషకము,పానపాత్రము,
చిప్ప,డ(ద)బ్బుర.
చాకలి
ReplyDelete