Thursday, 8 February 2018


                                 పర్యాయపదాలు 12
361.ఘాటిపాక=ఘట్టము,చౌకీ,సుంకరిమెట్టు,పన్నువసూలుచేయుచోటు.
362.చంద్రుడు=హిమాంశువు,చంద్రముడు,ఇందుడు,కుముదబాంధవుడు,విధుడు,సుదాంశుడు,శుభ్రాంశుడు,ఓషధీశుడు,నిశాపతి,
   అబ్జుడు,జైవాతృకుడు,సోముడు,మృగాంకుడు,కళానిధి,
  ద్విజరాజు,శశిధరుడు,నక్షత్రేశుడు,క్షపాకరుడు,జాబిల్లి,
  చలువలరేడు,వెన్నెలరేడు,రేరేడు,రేవెల్గు,చందమామ,
  తమ్ములపగవాడు,కమ్మవిల్తునిమామ,కలువలరేడు,
   పాల్కడలిపట్టి,జక్కవకనువిప్పు,ముక్కంటితలపువ్వు,
     చుక్కలదొర,ప్రోద్దుజోడుకోడె,తపసికన్పాప,బిట్టరిజింక
      దాలుపు,కరివేల్పుడాకన్ను,కడలివెన్న,పంటపైరుల
      యెకిమీడు,జంటదంటచౌకములపాళ్ళ తెలిముద్ద,
      చలివెలుగు,వేలుపులబువ్వ,చీకటివేరువిత్తు,నెల.మొ.
363.చంపుట=ప్రమాపణము,నిబర్హణము,నికారణము,నిశారణము,
             ప్రవాపము,పరాసనము,నిషూదనము,నిహింపనము,
           నిర్వాపణము,సంజ్ఞపనము,నిర్గ్రంధనము,ఆపాసనము,
               నిస్తర్హణము,నిహననము,క్షణనము,పరివర్జనము,
         నిర్వాశనము,నిశసనము,మారణము,ప్రతిఘాతనము,
              ఉద్వాసనము,ప్రమధనము,క్రధనము,ఉజ్జాపనము,
               ఆలంభము,పిఞ్జము,విశిరఘాతము,ఉన్మంధము,
                ఉన్మంధనము,వధము,చక్కాడు,నుగ్గాడు,చదువు,
               పీచమడచు,చంపు,కెడవు,నురుముచేయు,త్రుంచు,
          పరిమార్చు,తెగటార్చు,మన్నిగొను,దునుము,నుడువు.
364.`చక్రవాకము=కోకము,చక్రము,రధాంగము,జక్కవ,బటువు,గువ్వ.
365.చాతకపక్షి=ఘల్లము,దివౌకసము,సోకకము,సారంగము,
                    వానకోయిల.
366.చారుడు=గూఢచారుడు,వేగులవాడు,యధార్హవర్ణుడు,ప్రణిధుడు,  జస్వశుడు,అపసర్పుడు.
367.చావు=అంతము,కాలధర్మము,కాలము,కృతాంతము,నాశము,నిధనము,నిర్వాణము,ప్రళయము,ప్రమీలనము,పంచత్వము,
మరణము,మృత్యువు,మిత్తి,వర్జనము,శూలము,సంస్ధానము,
          హనువు,హింస.
368.చింతపండు=ఆమ్లిక,ఆమ్లక,ఆమ్లామ్లిక,ఆమ్లకము,ఆమ్లదళము,   కృష్ణామ్లము,గురుపత్ర,ఘనచ్ఛాయ,చండము,చారిత్ర,
         చుక్ర,చుక్రము,తింతిడి,తింతిడీక,
369.చిగురు=అంకురము,కిసలయము,పల్లవము,ప్రవాళము,చివురు,  ఇగురు,లేతయాకు.
370.చిటికినవ్రేలు=చిటిక(కె)న,చిట్టివేలు,చిన్నవ్రేలు,చివరవ్రేలు,పిల్లవ్రేలు,  ఊర్మిక,కనిష్ఠ ,కనిష్ఠిక ,కనీని(క).
371.చిట్టీత=చిట్టీడు,ఈదాడు,ఖర్జూరిక.
372.చిట్టెము=కిట్టము,చిట్టము,గిరిజము,మండూరము.
373.చిత్త=చిత్తకార్తె,చిత్ర,ఇంద్రము,త్వాష్ట్రము,ముత్తెపుసవతు.
374.చిత్రమూలము=చిత్రకము,ద్వీపినామకము,వహ్నినామకము.375.చిమ్మట=ఈలపురుగు,చీరి(క),ఝల్లి(క),ఝీరిక,భృంగారి.
376.చిఱ్ఱికూర=గండీరము,ఘోష,ఛిల్లి,జీవాంతకము,తండులీ(య)కము,  తండు(లీయ-లేర)ము,భండి(రము),భండీ(య-ల)ము.
377.చిలుక=కీరము,శుకము,హరి,చదువులపులుగు,పచ్చవిల్తునితేజి,  తొగరుముక్కుపులుగు.
378.చీకటి=అంధకారము,ధ్వాన్తము,తమిస్రము,తిమిరము,తమస్సు,  కాలిక,గహ్వరము,మబ్బు,ఇరులు,చీకువాలు.
379.చీమ=పిపీలిక,పిపీలి,హీర,సన్నగాడు,కపింజిక,ఘ్రుతేళిక,కపిశ,   ఉద్దీపకము,ఉలంకలము,బ్రాహ్మి,వమ్రిక.
380.చీము=పూయము,రసము,రసి(క),తెల్లని పుంటినెత్తురు.
381.చీర=అంతరీయం,ఉపసంవ్యానము,పరిదానము,అంశుకము.
382.చూపుడువ్రేలు=జు(ట్ట-తన)వ్రేలు.తర్జని,ప్రదేశిని.
383.చుంచు=అంజనిక,గంధమూషి,గంధకుండిని,గందాఖువు,చిక్క,చుచుందరి,భుభున్దరీ,కంపెలుక,కల్లెలుక,చుంచెలుక,చుండెలుక,
                 చెంచెలుక.
384.చూచుట=నిర్వర్ణము,నిధ్యానము,దర్శనము,ఆలోకనము,ఈక్షణము,  తిలకించుట,విలోకనము.
385.చెంబు=చేముంత,చీముంత,తంబుగ,గడ్డుకము,శుల్బము,సగ్గెడ.
386.చెక్కిలి=కపోలము,గండము,చెంక,చెంప,చెక్కు,దవడ.
387.చెట్టు=వృక్షము,మహీరుహము,శాముఖీ,పాదపము,తరువు,
               అనోకహము,కుటము,పాలము,పలాశి,ద్రుమము
               ఆగమము,కుజము.
388.చెమట=ఘర్మము,నిదాఘము,స్వేదము.
389.చెఱకు=అంగారిక,అసిపత్రము,ఇక్షువు,కరటము,కర్కశము,
 రసాలము,స్ధూలము,కన్నులమ్రాను,తియ్యమ్రాను,ఇంచు.
390.చెఱసాల=కార,కారాగారము,కారాగృహము,గుప్తి,చెఱ,బంధనము,   బంధనాలయము,ప్రగ్రహము.
391.చెరువు=గుంట,తటాకము,పద్మాకరము,సరస్సు,చెఱువు.
392.చెలికత్తె=ఆళి,గోల,వయస్య,సఖి,చెలిమి(కత్తె)త్తియ,సకి(య).                                                                                                                                  

1 comment:

  1. చీకటి కి మరొక పర్యాయపదం - తామసి

    ReplyDelete