Sunday, 11 February 2018

పర్యాయపదాలు 14

                   పర్యాయపదాలు -14
42౩.జూదరి=ధూర్తుడు,ధార్తుడు,అక్షదేవి,కితవుడు,అక్షధూర్తుడు, ద్యూతకృత్తు,జూదగాడు.
424.జ్యేష్ఠ=తాటిరిక్క,వేల్పురాచుక్క,ఐoద్రము.
425.జొన్నలు=జూర్ణము,జోవకము,జోన(నా)ళము,మ్లేఛ్చభోజనము,యావనాలము,మొక్కలు.
426.జ్యోతిష్కుడు=జ్యోస్యుడు,జ్యౌతిషికుడు,దైవజ్ఞుడు,గణకుడు,జ్ఞాని,సాంవత్సరుడు,మౌహూర్తికుడు,కార్తాన్తికుడు,జ్యోతిషుడు.
427.టెక్కెము=కదళీ,కేతువు,జయ,జయంతి,పతాక,వైజయంతి,కేతనము,ధ్వజము,లలామము,శూలము,జెండా,పడగ,సిడెము.
428.టేకు=తేకు,గుమ్ముడు,ఖరఛ్చదము,గృహద్రుమము,తిరకము,త్రిపర్ణి,మహాపత్రము,మహాశాకము,వరదారువు.
429.డేగ=దీపకము,పత్రి,శ్యేనము,సారంగము,జాలె,కణుజు,వేసడము, అణుజు,లగుడు,బైరి.
43౦.తగ(వ)రము=ఉదధీరము,కురూప్యము,తమరకము,కాలానుసార్యము,తమరము,త్రపువు,నాగము,పిచ్చటము,ప్రలంబము,   రంగము,వంగము,సీసము.
431.తండ్రి=తాత,జనకుడు,పిత,అబ్బ,అయ్య,అప్ప,నాయన,పితర,పితరుడు,  గురువు,జన్యుడు.
432.తగిరన=తగిరిస,తంటెము,చక్రమర్దకము,దద్రుఘ్నము,పద్మాటము,ప్రఫున్నాటము.
433.తడిసినది=ఆర్ద్రము,సార్ద్రము,క్లిన్నము,స్తిమితము,తిమిరము,సమున్నము, ఉత్తము,స్తమితము.
434.తమ్ముడు=అనుజుడు,అనుజన్ముడు,కనిష్ఠుడు,తంబు,జఘన్యుడు,సహోదరుడు,సోదరుడు,సూనుడు,యవీయుడు.
435.తరంగము=ఊర్మి,భంగము,వీచి(క),లహరి,అల,కడలు,తెర.
436.తరవాణి=కూటి నీళ్ళు,కాళీ,పుల్లనీళ్ళు,శు(క్ర-క్ల)ము,సారామ్లము.
437.తలగడ=ఆనుడుబిళ్ళ,ఒరగుబిళ్ళ,తలయంపి,తలాటి,తలాడ,తలాపి,తల్లపి,దిండు,బాలీసు,బిల్ల,మెత్త,ఉపధానము,బాలిశము.
438.తల=ఉత్తమాంగము,శిరస్సు,శీర్షము,మూర్ధము,మస్తకము.
439.తలవెండ్రుక=చికురము,కుంతలము,వాలము,కేశము,శిరోరుహము.
440.తల్లి=జనయిత్రి,ప్రసువు,మాత,జనని,అమ్మ,అవ్వ,కన్నది.
441.తాండ్ర=తాడి,అక్షము,కర్షఫలము,భూతావాసము,వంధ్య,విభీతకము.
442.తాంబూలపాత్రము=తాంబూలదాని,తాంబాళము,ఆకుసంబెళ,కుప్పె,కరతిత్తి,పారడము,పాందాను,సంబెళ.
443.తాంబూలము=వీడియము,వక్కలాకులు,విడెము,తమ్ములమ,   వీడెము,వీడ్యము.
444.తాబేలు=అకూపారము,కఛ్చపము,కమఠము,కూర్మము,గుహ్యము, తామేలు,ఢులి,దులి.
445.తాటిచెట్టు=తాలము,తృణరాజము,తాడు.
446.తిను=ఆను,మెస(గు)వు,మెక్కు,కుడుచు,ఆరగించు,కోలు,కతుకు,నమలు,బోసేయు,సాపడు,భుజించు.
447.తిప్పతీగ(గె) =అమృత,ఇందులేఖ,గుడచి,గు(డూ-ళి)చి,చంద్రవల్లరి,ధనుర్లత,మహాగుల్మ,యాగవల్లి,సోమలత,ద్విజప్రియ.
448.తిమింగలము=తిమిరిమ్రింగుచేప,అర్ధశఫరము,దండపాలము.
449.తిరస్కారము=అనాదరము,పరిభవము,పరీభవము,తిరస్క్రియ,రీఢ,అవమానము,అవజ్ఞ,అలహేళనము,అనూర్క్షణము, అనుక్షణము,అనూక్షణము.
45౦.తిరుగు=అడ్డు,క్రాలు,క్రుమ్మరు,చరించు,చెరలాడు,త్రిమ్మరు.
451.తీగ(గె)య=తీగియ,తీవ,తీవె,తివ్వ,లత,లతిక,వల్లరి,వల్లి.
452.తీతు(వ)వు=టిట్టిభము,తిత్తిరము,తిత్తిరి,లకుముకిపిట్ట,అర్ధ పరావతము,  ఖర(కో-క్వా) ణము.
453.తుంగముస్తలు=కుటన్నటము,దాశపురము,వానేయము,పరిపేలవము,ప్లవము,గోపురము,కైవర్తి,ఘనము,జలదము,నాగరము, నాధేయము,దేవి,పిఠరము.
454.తుమ్మ=చండ్ర,వెలితుమ్మ,అరిమేదము,బోధిస్కంధము,లోహితమారకము, విట్ఖదిరము.
455.తుమ్ము=కాశము,క్షపధువు,క్షపము,క్షుతము,క్షుతి.   

4 comments:

  1. తాటి మొలక

    ReplyDelete
  2. పాతకం

    ReplyDelete
  3. తెలుగు పర్యాయపదాలు అన్ని ఒక చోట చేర్చి మంచి పని చేసారు

    ReplyDelete