పర్యాయపదాలు -16
488.దారిద్ర్యము=దౌర్విధ్యము,దైన్యము,దౌగ్గత్యము,ఎద్దడి,పేదరికము,లేమి,నిప్పచ్చరము,నెవ్వ,లేమిడి,సంపద్రాహిత్యము.
489.దాసి=తొత్తు,దాది,ధాత్రి,పరిచారిక,బానిస,బోన(ము)కత్తె,వరవుడు,
సాకుడు,సేవకురాలు.
49౦.దాహము=ఉదన్య,తృష్ణ,తృట్టు,దగ,దూప,వపాస.
491.దిక్కు=దిశ,కకుభము,కాష్ఠ
,ఆశ,హరితము,దెస,కడ,చెరగు.
492.దిరిసెనము=దిరిసనము,కింకిణీఫలము,పాండువు,ప్లవకము,
మృదుపుష్పకము,శిరీషము,శుకదృవు,శుక్లపుష్ప,
శ్యామతీర్ధ.
493.దీపము=దివియ,దివ్వె,దీవె,దివ్వియ,దివ్యము,దిబ్బెము,దీబె, దీపిక,స్నేహాలము,దివిటీ,కజ్జలధ్వజము,గృహమణి,
దోషాతిలకము,జోతి,తిర్లిక,తిత్లిక,తిల్లిక,తిర్విశక,పంజు,
ఇలాయి,కాగడా,దీపయష్టిక.
494.దుఃఖము=పీడ,బాధ,వ్యధ,ఆమనస్యము,ప్రసూతిజము,కష్ట ము,కృఛ్చ్రము,అఖీలము,క్లేశము,అంకము,అఘము,వనట,
బాము,వెలి,వంత,గోడు,వగపు,నొగులు,సేగి,అలమట,
కొందలము.
495.దున్నపోతు=కాసరము,మహిషము,లులాయము,వాహద్విషత్తు, సైరిభము,పోతు,ఎనుపోతు,దుంత,జమునెక్కిరింత.
496.దురదగొండి=దూలగోవెల,తీటకోవెల,ఆత్మగుప్త,ఋషభి,కండూర,
కపికఛ్ఛుక,కరీర,జాంగలి,దూరవిగ్రహ,మర్కటి.
497.దువ్వెన=ఈర్పెన,చిక్కంటి,చిక్కోల,పన్నె,కంకతము,కంకతిక,
కేశమార్జకము,ప్రసాధని.
498.దూడ=లేగ,వత్సము,క్రేవు,పడ్డ,పెయ్య.
499.దేవకాంత=అప్సరస,అచ్చర,దేవతాస్త్రీ,వేల్పుచెలి,వేల్పుమచ్చెకంటి. 50౦.దేవతలు=అమరులు,నిర్జరులు,దేవులు,త్రిదశులు,విబుధులు, సురలు,సుపర్వాణులు,సుమనస్సులు,త్రిదివేశులు,
దివౌకసులు,ఆదితేయులు,దివిషదులు,ఆదిత్యులు,
అస్వప్నులు,అమర్త్యులు,అమృతాంధసులు,బర్హిర్ముఖులు,
క్రతుభుక్కులు,గీర్వాణులు,దానవారులు,బృందారకులు,
దైవతములు,దేవళ్ళు,జేజేలు,వేలుపులు,జన్నంపుదిండ్లు.
501.దేవదారు=శుక్రపాదపము,పారిభద్రకము,భద్రదారు,పీత్
దారు,
పూతిదారు,దారు,పూతికాష్ఠము,ద్రుకిలిమము.
502.దేవేంద్రుడు=ఇంద్రుడు,మరుత్వంతుడు,మఘవుడు, పాకశాసనుడు,వృద్ధశ్రవసుడు,సునాసీరుడు,పురుహూతసుడు,
పురందరుడు,జిష్ణువు,లేఘర్షభుడు,శక్రుడు,శతమన్యువు,దివస్పతి,సుత్రాముడు,గోత్రభిత్తు,వజ్రి,వాసవుడు,వృత్రహన్త,వాస్తోష్పతి,సురపతి,బలారాతి,శచీపతి,జంభభేది,హరిహయుడు,స్వారాట్టు,నముచిసూదనుడు,సంక్రందనుడు,దుశ్చ్యవనుడు,తురాషాహుడు,మేఘవాహనుడు,ప్రాచీనబర్హి,పృతనాషాట్టు,పులోమజిత్తు,అఖండలుడు,సహస్రాక్షుడు.బిడౌజుడు,
(శబ్దార్ధదీపిక)ఇంతికౌవుజు,చట్టుపల్దెగగట్లకొట్టెడుజెట్టి,నూఱంచులవాలుచే
మించుజోదు,గట్టుదాయ,పారుతపసియింటిపంచకోడి,
ఎక్కుడుమొగుల్
గలప్రొడ,ఒడలిచూపొడయుడు,జేజే,తూరుపు
(దణి)ఱేడు,నిక్కువీనులజక్కినేక్కురౌతు,మబ్బురాతు,మలగొంగ,
తెల్లయేనుగునెక్కితిరిగెడుదొర,తూర్పుమాగాణమేలెడుమణియ
గాడు,జమిలిచౌవంచపదులుజన్నములుచేసినట్టివేలుపు,
వేగన్నులసామి,వేలుపురేడు,సోమాసిపెట్టుజెట్టు,జొట్టితమ్ముడు
గలవేల్పు.(ఆంధ్రనామసంగ్రహము)
503.దేశము=ఆణెము,ఆణియము,కులము,జనపదము,జన్యము,నాడు,
రాజ్యము,రాష్ట్రము,విషయము,సీమ.
504.దొంగ=ఎల్లాపి,ఎతుబరికాడు,తెక్కలికాడు,దొరకోలుసన్నాసి,ముచ్చు,
ఎత్తుబరికాడు,కొల్లకాడు,జాజరకాడు,మిడియనిడువు,
తెరచాటుకాడు,కత్తెరదొంగ,చేవాడికాడు,కన్నగాడు,వల్లడికాడు,
గజిముచ్చు,గరిడిముచ్చు,మునిముచ్చు,కల్లరీడు,తవళి,
దాపరీడు,దోవు(డు)కాడు,మోసరి,గడిదొంగ,చోరుడు,స్తేనుడు,
ఐకాగారికుడు,దస్యుడు,తస్కరుడు,బరి,మచ్చరి,మ్రుచ్చుగోర,
ఘోషకుడు,ప్రతిరోధి,పరాస్కంది,మలిమ్లుచుడు,రేద్రిమ్మరి,
లోవాడికాడు,వల్లడికాడు.
505.దొండ=ఆర్తదళము,ఓష్ఠి,ఓష్ఠోపమఫల,తుండికేరి,తుంబి,బింబి,
బింబిక,రక్తఫల.
506.దొర=ఎకిమీడు,ఆర్యుడు,అధి(పతి)భువు,ఈశ్వరుడు,ఈశిత,
నాధుడు,నాయకుడు,ప్రభువు,భరండుడు,భరణ్యుడు,
భర్త,సేవ్యుడు,స్వామి,పబువు,సామి.
507.దోమ=ఘోషము,ఉద్దంశము,దంతి,మలిమ్లుచము,రణరణము,
మశకము,ఏనికదోమ,తొండపుదోమ,చీకటిఈగ.
508.దోనె=ఉడుపము,క్షుద్రనౌక,ద్రోణి,ప్లవము.
509.దోస=ఉర్వారువు,ఏర్వారువు,కాండారువు,కంటక,కర్కటి,కపిలాక్షి,
కాళిoగి,కోశఫలము,గజదంతఫలము,కృష్ణవల్లి,చిర్భట,
తుందిలఫల,త్రవుసము,త్రికము,పాకలి,పీనస,మానధానిక,
మూత్రలము,వత్సాక్షి,సుచిత్రము.
51౦.ద్రాక్ష=కృష్ణ,గోస్తని,మధురస,మృద్వీక,స్వాధ్వి.
thx
ReplyDeleteLemi
ReplyDelete