Monday, 12 February 2018

పర్యాయపదాలు-20


                          పర్యాయపదాలు 20
602.పళ్ళెము=పళ్ళెరము,పళ్యము,కంచము,కందువు,తబుకు,
             పాత్రము,పుటకము,వైదలము,శరావము,శాలాజిరము.
60౩.పశుశాల=కొట్టము,కొట్టాము,దొడ్డి,గోగ్రంధి,గోశాల,గోష్ఠము,
                  గోస్ధానకము.
604.పనుపు=పీత,గౌరము,హరిద్ర,శిష,ఉమ,అళది,హళది,కాంచని.605.పీతాంగము=భద్రశిఖ,మంగళప్రద,రంజని,వరవర్ణిని,వర్ణిని,
                  శర్వరి,సువర్ణ,హరిత,హరిద్రువు.
606.పాదము=అడుగు,అంఘ్రి,చరణము,పదము,మూలము,
                  అంజ,అజ్జ,హజ్జ.
607.పాదచారి=పత్తి,పదగుడు,పదాతి,పద్గుడు,కాల్బంటు.
608. పాపము=పంకము,కిల్బిషము,కల్మషము,కలుషము,
         వృజినము,అఘము,దురితము,దుష్కృతము,ఓఘము,
         దోషము,దోసము,పాప్మము,ఏనస్సు,అంకము,ఆగము.
609.            పాపి=వృశంసుడు,ఘాతుకుడు,క్రూరుడు,పాపుడు.
610.            పారావతము=పావురము,పావురాయి,పారువాయి,పారువ, పార్వము,రక్తము,రైవతకము,లకోరీ,పల్లటీ,కూకీ,ఒడ్డి.
611.పారాణి=ఆలక్తము,లాక్ష, పసుపుపాత.
612.పారిజాతము=పారిజము,నింబతరువు,పారిభద్రము,మందారము.
613.పాలు=అవదోహము,ఊధస్యము,ఔధస్యము,క్షీరము,గోరసము,దుగ్ధము,పయస్సు,పుంసవనము,పేయము,మధువు,
            సుధ,పంకము,పాడి,పాయి,పోసనము,పోసనాలు.
614.పార్వతీదేవి=ఉమ,కాత్యాయిని,గౌరీ,కాళీ,హైమవతి,ఈశ్వరి,
                 శివ,భవాని,రుద్రాణి,శర్వాణి,సర్వమంగళ,అపర్ణ,
                  పార్వతి,దుర్గ,మృడాని,చండిక,అంబిక,ఆర్య,
                 దాక్షాయణి,గిరిజ,మేనకాత్మజ,నారాయణి,ధేనుక,
               భార్గవి,శారద,జయ,గట్లరాయనిపట్టి,ముక్కంటివెలది,
                ఏనుగులగొంగతత్తడినెక్కుదంట,
               సామిసామేనుచేకొన్నచాన.
615.పావురము=కలకంఠము,కలరవము,కపోతము,పారావతము, పారువము,పావురాయి.
616.పిచ్చుక=కలవింకము,చటకము,నీలకంఠం,పిట్ట,పిచుక.
617.పిడక=పిడుక,పిష్టిక,ఉత్పలము,కరీషము,గరిండము,గవారము,గోగ్రంధి,గోహలము,గోమయపిండము.
618.పిడుగు=ఆశని,నిర్ఘాతము,భిత్తిక,వజ్రము,సారంగము,హీరము.
619.పిన్నముల్లంగి=కర్కటము,క్షుద్రమూలకము,గుప్తఫలము,
                చరణామలము,బాలేయము,విప్రము,సంభూతము.
620.పిప్పళ్ళు=ఉపకుల్య,కణ,కోలనామ,చపల,తీక్ష్ణతండుల,శౌండి.621.పిఱికి =తస్నువు,త్రస్తుడు,భీరు(కు)డు,భీలుకుడు,భీరువు,
               కోచ,పంద,వెఱపరి.
622.పిఱుదు=అవ(ఆ)రోహము,కడుకుద్మతికటకము,కటీరకము,కలత్రము,కాంచీపదము,ఘల్లము,జఘనము,నితంబము,
                ప్రోధము,శ్రోణి,మొత్త.

624.పిల్లి=ఓతువు,బిడాలము,మార్జారము,పృషదంశకము,
           ఆఖుభుక్కు,మార్జాలము,చీలి.
625.పిల్లిపెసర=కాక(పర్ణి)ముద్గ,కోశిల,క్షుద్రసహ,మహాసూపపర్ణి,    మార్జాలగoధిక, హ్రస్వ.
626.పిసినిగొట్టువాడు=లోభి,కదర్యుడు,కృపణుడు,క్షుద్రుడు,
  లుబ్ధుడు,కింపచానుడు,మితంపచుడు.
627.పీఠిక=విషయసూచిక,అవతారిక,అనుక్రమణిక,భూమిక,
               విన్నపము,తొలిపలుకు.
628.పుచ్చ=ఉర్వారుకము,కళింగము,ఛత్రారుణి.
629.పుట్టగొడుగు=కుక్కగొడుగు,ఛత్రాకము,భూకవచము,భూమి
                     కవచము.
630.పుట్టుక=ఉత్పత్తి,ఉద్భవము,జననము,జని,జన్మము,జన్యము,  జాతము,ధామము,ప్రసవము,భవము,భావము,
                భూతి,పుట్టువు,బాము.
631.పుట్టుమచ్చ=జటులము,తిలకము,కాలకము,తిలకాలకము,   పిప్లువు,పులుగు.                      

2 comments:

  1. పశువు లేదు

    ReplyDelete
  2. పశువుల కాలి గోరు

    ReplyDelete